arora
-
ఆప్ సర్ప్రైజ్.. ఎంపీగా కేజ్రీవాల్?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత సైలెంట్ అవుతారని భావించిన మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).. పార్టీ కన్వీనర్ హోదాలో క్రమం తప్పకుండా పార్టీ మీటింగ్‌లకు హాజరవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన రాజ్యసభకు వెళ్లబోతున్నారంటూ ఓ ప్రచారం తెర మీదకు వచ్చింది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం చవిచూసింది. మాజీ సీఎం కేజ్రీవాల్ కూడా ఓడిపోవడంతో ఢిల్లీ రాజకీయాలకు ఆయన శాశ్వతంగా దూరం అవుతారని, అందుకు ‘లిక్కర్ స్కామ్’ అవినీతి మరకే కారణమని విశ్లేషణలు నడిచాయి. ఈ కారణంగానే ప్రతిపక్ష నేతగా అతిషీని ఎంపిక చేశారని కూడా చర్చ జరిగింది. ఈ క్రమంలో..పంజాబ్ లూథియానా వెస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఆప్ ఆశ్చర్యకరరీతిలో అభ్యర్థిని ఎంపిక చేసింది. కిందటి నెలలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి మృతి చెందారు. దీంతో.. రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను ఆ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిగా ఈ ఉదయం ప్రకటించింది ఆప్. సంజీవ్ అరోరా(Sanjeev Arora) 2022లో ఆప్ తరఫున పంజాబ్ రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2028తో ముగియనుంది. దీంతో అరోరాను అసెంబ్లీకి పంపి.. ఆ ఎంపీ సీటును కేజ్రీవాల్‌కు అప్పజెప్పబోతున్నారన్నది ఆ ప్రచార సారాంశం. లూథియానా వెస్ట్ ఉప ఎన్నికకు ఈసీ ఇంకా షెడ్యూల్ ప్రకటించలేదు. అయితే ఆర్నెల్ల లోపు ఎన్నిక నిర్వహించాలన్న నిబంధన ప్రకారం.. జులై 11లోపు ఈ ఉపన్నిక జరిగే అవకాశం ఉంది.అందుకేనా సమీక్షలు!ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. పంజాబ్ ఆప్ కేడర్‌తో కేజ్రీవాల్ వరుసబెట్టి సమావేశాలు జరిపారు. ఒకానొక టైంలో.. భగవంత్ మాన్‌ను తప్పించి కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అవుతారంటూ ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ చర్చల సారాంశం.. బహుశా రాజ్యసభ స్థానం కోసమే అయి ఉంటుందని ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. -
Malaika Arora Dazzles: గోల్డెన్ త్రీ-పీస్ సెట్లో మలైకా అరోరా స్టన్నింగ్ (ఫోటోలు)
-
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. అప్రూవర్‌గా దినేష్ అరోరా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న దినేష్ అరోరా అప్రూవర్‌గా మారిపోయారు. దినేష్ అరోరాను సాక్షిగా పరిగణించాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ఈ క్రమంలో దినేష్ అరోరా వాంగ్మూలం నమోదు చేసింది ధర్మాసనం. ఎవరైనా బెదిరించారా, ఏమైనా ఇబ్బందులకు గురి చేశారా? అని దినేష్ అరోరాను సీబీఐ కోర్టు న్యాయమూర్తి అడిగారు. కేసులో తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేశారు. కీలక నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త దినేష్ అరోరాకు గత వారమే ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ సమయంలో సీబీఐ అభ్యంతరం చెప్పకపోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో దినేష్‌ను సాక్షిగా చూడాలని కోరుతూ సోమవారం సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దర్యాప్తు అధికారులకు దినేష్ సహకరిస్తున్నారని, ఇప్పటికే కీలకమైన సమాచారాన్ని అందించారని కోర్టుకు తెలిపింది. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు ముగ్గురు అరెస్టయ్యారు. అందులో అరోరా ఒకరు. ఈ కేసులో మరో నిందితుడు సమీర్ మహేంద్ర.. రాధా ఇండస్ట్రీస్ ఖాతా నుంచి రూ.కోటి బదిలీ చేసినట్లు సీబీఐ తేల్చింది. రాధా ఇండస్ట్రీస్ దినేష్ అరోరాకి చెందినది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, దినేష్ అరోరా సహా నిందితులపై ఐపీసీ సెక్షన్ 120బీ, 477ఏతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7కింత సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో దినేష్ అరోరా అప్రూవర్‌గా మారినట్లు సీబీఐ ప్రకటించటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇదీ చదవండి: వీళ్లు ఆడవాళ్లా లేక రౌడీలా?.. తప్పతాగి నడిరోడ్డులో యువతిపై దాడి -
సైకిల్ మీద దేశం చుట్టి వస్తే ఎలా ఉంటుంది?
‘లెర్న్ ఫ్రమ్ ది మాసెస్...’ అనే మావో మాట అంకిత్ విన్నాడో లేదో తెలియదుగానీ ఆచరణ లో అలాగే చేశాడు. ‘నువ్వు చదవాలనుకుంటే ఈ ప్రపంచమే ఒక పుస్తకం. నువ్వు నేర్చుకోవాలనుకుంటే ఈ ప్రపంచమే ఒక మహా విశ్వవిద్యాలయం’ అనే మంచి మాట నచ్చి కొత్త బాట పట్టాడు... ప్రపంచం సంగతి సరే, ముందు దేశాన్ని చుట్టిరావాలని, ప్రజల దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవాలనే బలమైన కోరిక జైపూర్ (రాజస్థాన్) కు చెందిన అంకిత్ అరోరాకు కలిగింది. అలా అని విమానం ఎక్కే ఆర్థిక పరిస్థితి తనకు లేదు. ఎదురుగా సైకిల్ కనిపించింది. ‘అవును. సైకిల్ మీద దేశం చుట్టి వస్తే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన వచ్చింది. ‘చాలా కష్టమేమో’ అన్నది తనలోని మరో వెర్షన్. ‘కాలినడకన దేశాలు తిరిగే వాళ్లు ఉన్నారు. సైకిల్‌పై వెళ్లడం అసాధ్యమేమీ కాదు’ అని తనకు తాను చెప్పుకున్నాడు. అతడు బయలుదేరాడు.... నాలుగు సంవత్సరాల పాటు సాగిన తన యాత్రలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో పట్టణాలు, ఎన్నో పల్లెలు చూశాడు. మహారాష్ట్రలో దారుశిల్పాలు, తంజావూరులో ఆదివాసి కళలు, తమిళనాడులో సంగీతవాద్య పరికరాల తయారీ... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఇప్పుడంటే సేంద్రియ వ్యవసాయం గురించి ఘనంగా చెప్పుకుంటున్నాంగానీ, దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో చా...లా ఏళ్ల క్రితమే ఈ ఆదర్శనీయ వ్యవసాయ విధానం అమలులో ఉంది. వాటిని దగ్గరగా గమనించిన అంకిత్ ఇతర ప్రాంతాలకు ప్రయాణమైనప్పుడు, వ్యవసాయక్షేత్రాలకు వెళ్లి ఆ విషయాలను చెప్పేవాడు. ‘మీరు మాత్రం ఇలా ఎందుకు చేయకూడదు’ అనేవాడు. ఉత్తమ వ్యవసాయ విధానాలు, చెట్లు, నీటిసంరక్షణ... ఇలా తాను తెలుసుకున్న ఎన్నో విషయాలను ప్రచారం చేస్తూ వెళ్లాడు. (చదవండి: సేంద్రియ కర్బనమే పంటకు ప్రాణం!) ‘నువ్వు సర్కార్ తరపున వచ్చావా? నీకు జీతం ఎంత ఇస్తారు?’ ఇలాంటి ప్రశ్నలెన్నో అడిగే వాళ్లు రైతులు. ‘లేదు’ అనే మాట వారిని ఆశ్చర్యానికి గురి చేసేది. కళ్లతోనే అభినందించి, ఆదరించి తిండి పెట్టేవారు. కొందరు ఎంతో కొంత డబ్బు చేతిలో పెట్టేవారు. అయితే కొన్ని ప్రాంతాలలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. శ్రీనగర్‌లో తనను దొంగగా అనుమానించారు. మరోచోట స్మగ్లర్ అనుకొని వెంబడించారు. అయితే అది కొద్దిసేపు. నిజం తెలుసుకున్నాక అనుమానించినవారే హృదయపూర్వకంగా అభినందించారు. ప్రఖ్యాత కవి విలియమ్ బట్లర్ ఈట్స్ ‘ది లేక్ అయాల్ ఆఫ్ ఇన్నిస్‌ఫ్రీ’ కవితలో కనిపించే ఆదర్శ, ప్రశాంత, కళాత్మక వ్యవసాయక్షేత్రం ఒకటి ప్రారంభించాలనేది తన కల. బెంగళూరుకు చెందిన శ్రీదేవి, అంకిత్ ఊహలకు రెక్కలు ఇచ్చారు. క్రిష్టగిరి దగ్గర శ్రీదేవి కుటుంబ సహాయ సహకారాలతో ‘ఇన్నిస్ ఫ్రీ’ వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేశాడు. రసాయనాలు ఉపయోగించకుండా కూరగాయలు ఎలా పండించాలి? ఎకో–టాయిలెట్స్ ఎలా నిర్మించుకోవాలి? పశువులకు బలమైన మేత.. ఇలా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఇదొక బడిగా మారింది. (చదవండి: సొరంగంలోకి వెళ్లిన రైలు అదృశ్యం.. ఇప్పటికీ మిస్టరీనే..) తాను తిరగాల్సిన ప్రదేశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అందులో మొదటిది ఈశాన్య ప్రాంతాలు. అక్కడకు వెళ్లాలని, అక్కడ నేర్చుకున్న మంచి విషయాలను ఇతర చోట్ల ప్రచారం చేయాలనుకుంటున్నాడు అంకిత్. అంకితభావం ఉన్నవారి కలలు నెరవేరడానికి అట్టే సమయం పట్టదు కదా! -
అమెరికాలో కాల్పులు... ఐదుగురికి గాయాలు
లాస్ఏంజెల్స్: యూఎస్ కొలరాడాలో అరోరా నగరంలోని సెంట్రల్ హైస్కూల్ సమీపంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు యువకులు గాయపడినట్లు అరోరా పోలీసులు తెలిపారు. అయితే అనుమానితుడు ఎవరు ఆ సమయంలో ఉన్నట్లు కనిపించలేదని అన్నారు. ఈ మేరకు సంఘటన పాఠశాల లోపల జరగలేదని పార్క్ వద్ద జరిగిందన్నారు. (చదవండి: జిమ్‌లో అసభ్య ప్రవర్తన... టిక్‌టాక్ షేర్ చేయడంతో పరార్!!) అంతేకాదు పార్క్‌కి సంబంధించిన సీసీపుటేజ్ కెమరాలను కూడా పరిశీలిస్తున్నట్టుల తెలిపారు. పైగా హైస్కూల్‌కి సంబంధించిన కార్ పార్కింగ్‌లో అత్యవసర వాహనాలు కూడా ఉన్నాయని, ఈ ఘటన జరిగినే వెంటనే అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడినట్లు పోలీసలు చెప్పారు. అయితే కొలరాడో తుపాకీ హింసకు కొత్తేమీ కాదు. పైగా యూఎస్ చరిత్రలో అత్యంత అపఖ్యాతి పాలైన రెండు సాముహిక కాల్పలు ఈ ప్రాంతంలోనే జరిగిన సంగతి తెలిసిందే. (చదవండి: యూకే లివర్‌పూల్ నగరంలో కారు బ్లాస్ట్... ఒకరు మృతి) -
కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే పాజిటివ్ కేసులు భారీగా పెరిగే ప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల్లో 80 శాతానికి పైగా డెల్టా వేరియంట్ (బి.1.617.2) వేనని ఇండియన్ సార్స్–కోవ్–2 జినోమిక్స్ కన్సార్టియం సభ్యుడు డాక్టర్ ఎన్.కె.అరోరా చెప్పారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి డెల్టా వేరియంట్ కారణమని తెలిపారు. మరింత తీవ్రత కలిగిన కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే పాజిటివ్ కేసులు భారీగా పెరిగే ప్రమాదం ఉందన్నారు. డెల్టా కంటే ముందు ఆల్ఫా రకం కరోనా పురుడు పోసుకుంది. ఆల్ఫా కంటే డెల్టాకు 40–60 శాతం వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది. డెల్టా ఇప్పటికే ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. యూకే, అమెరికా, సింగపూర్ తదితర 100కు పైగా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. ఇక డెల్టా ప్లస్ ప్రభావం కూడా భారత్‌లో మొదలయ్యింది. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 55–60 డెల్టా ప్లస్ (ఏవై1. ఏవై.2) వేరియంట్ కేసులు బయటపడ్డాయి. ఈ రకం కరోనా వ్యాప్తి తీరు, తీవ్రత, వ్యాక్సిన్ నిరోధకతపై అధ్యయనం చేస్తున్నట్లు డాక్టర్ అరోరా వెల్లడించారు. డెల్టా వేరియంట్ స్పైక్ ప్రొటీన్‌లో మార్పులు (మ్యుటేషన్స్) జరుగుతున్నాయని, తద్వారా వేగంగా వ్యాప్తి చెందే లక్షణాన్ని సంతరించుకుంటోందని, అంతేకాకుండా మనిషి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ప్రభావం నుంచి తప్పించుకోగలుగుతోందన్నారు. -
హైదరాబాద్ 415
జింఖానా, న్యూస్‌లైన్: కూచ్ బెహర్ అండర్-19 నాకౌట్ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢి ల్లీ జట్టు బౌలర్ రావత్ (6/118) చక్కటి బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. ఢిల్లీలో బుధవారం రెండో రోజు ఓవర్‌నైట్ స్కోరు 306/4తో బరిలోకి దిగిన హైదరాబాద్ 124.4 ఓవర్లలో 415 పరుగులు చేసి ఆలౌటైంది. తనయ్ త్యాగరాజన్ (76) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతరం తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఢిల్లీ ఆట ముగిసే సమయానికి 60 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. అరోర (56) అర్ధ సెంచరీతో అజేయంగా నిలవగా... రంజన్ (40), శర్మ (24 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.