పోలీస్‌ ఫ్లాష్‌మాబ్‌ వైరల్‌! | Cops Busting Flash Mob At US Mall Turns Into Surprise For Shoppers | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 22 2018 9:29 AM | Last Updated on Sat, Dec 22 2018 11:43 AM

Cops Busting Flash Mob At US Mall Turns Into Surprise For Shoppers - Sakshi

ఫ్లొరిడా : అమెరికా ఫ్లొరిడాలోని ఓ షాపింగ్‌ మాల్‌లో పోలీసులు ఫ్లాష్‌మాబ్‌తో ఔరా అనిపించారు. క్రిస్మస్‌ సందర్భంగా షాపింగ్‌కు వచ్చిన కొందరు.. ఫ్లాష్‌మాబ్‌తో సడెన్‌ సప్రైజ్‌ ఇచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ షాపింగ్‌ పోలీస్‌ అధికారులు ఈ ఫ్లాష్‌మాబ్‌ను అడ్డుకున్నారు. కానీ అందరికీ ట్విస్ట్‌ ఇస్తూ వారు ఆ ఫ్లాష్‌మాబ్‌లో భాగమయ్యారు. వారితో కలిసి చిందేశారు. ఈ ఘటనతో అక్కడున్నవారు సంభ్రమాశ్చర్యానికిలోనయ్యారు.

పోలీసుల డ్యాన్స్‌ చూసి అక్కడున్న వారు పెద్దగా అరుస్తూ.. వారిని అభినందించారు. ఫ్లొరిడాలోని అవెంచురా మాల్‌లో ఇది జరగగా.. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ‘అవెంచురా పోలీసులు  షాపింగ్‌కు వచ్చిన వారి హాలిడే మూవ్‌మెంట్‌ను అందిపుచ్చుకున్నారు’ అని అవెంచురా పోలీస్‌ సోషల్‌మీడియా విభాగం తమ అధికారిక ట్విటర్‌లో ఈ వీడియోను షేర్‌ చేసింది. దీంతో ఇది వైరల్‌ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement