Flash mob
-
నగరం ఓటెత్తాలని..
జీహెచ్ఎంసీ సిబ్బంది బస్తీలు, కాలనీల్లోని ఇళ్లకు వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి మీకు ఓటుందా అని అడిగి.. ఒకవేళ ఓటు ఉంటే.. తప్పకుండా ఓటేయాలంటూ పోలింగ్ కేంద్రం వైపు అడుగులేసేలా వారిని ఒప్పిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని జీవీకే వన్‌మాల్‌లో ఇటీవల ఓ ఫ్లాష్‌మాబ్‌లో భాగంగా మోడరన్, శాస్త్రీయ నృత్యాలూ ప్రదర్శించారు. ఎందుకిదంతా అని చూస్తే ‘నా ఓటు–నా హక్కు’ నినాదాలతో ప్లకార్డులు పట్టుకొని కనిపించారు. జీహెచ్ఎంసీలోని సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల సభ్యులు, రిసోర్స్‌పర్సన్స్ వారి పిల్లలతో నిర్వహించిన ఈ కార్యక్రమం మాల్‌కు వచ్చిన వారిని ఆకట్టుకుంది. ఓటుపై ఆలోచనలో పడేసింది. పరమపద సోపానం (వైకుంఠపాళి) ఆటలో స్వర్గానికి చేరుకునేందుకు మెట్లెక్కించే నిచ్చెనలు, పాతాళానికి పడిపోయేలా మింగేసే పాములు ఉండటం తెలిసిందే. ఆ ఆటలో ఎప్పుడు పాము మింగుతుందో, ఎప్పుడు నిచ్చెన ఎక్కుతామో తెలియదు కానీ.. ప్రజాస్వామ్యానికి కీలకమైన ఓటును సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం భవిష్యత్ అంధకారమవుతుంది అని చెబుతూ ఏ పనులు చేస్తే నిచ్చెన ఎక్కవచ్చో, ఏవి చేస్తే పాతాళానికి పడిపోతారో తెలియజేసేలా ఖైరతాబాద్ సర్కిల్లో పరమపద సోపానం ఆటతోనూ అవగాహన కల్పించారు.సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్షరాస్యతశాతం ఎక్కువగా ఉన్నా.. ఎన్నికలకు సంబంధించి నిరక్షరాస్యులుగా వ్యవహరిస్తూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం లేదు. తమ భవిష్యత్‌కు తగిన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఎన్నికల అక్షరాస్యులుగానూ మలిచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 287 ఎన్నికల అక్షరాస్యత క్లబ్‌లు ఏర్పాటు చేశారు. ఈ క్లబ్‌ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కూలీనాలీ చేసుకునే ప్రజలు, ప్రైవేట్ వ్యాపారాలు సాగిస్తున్న వారితోపాటు ఉద్యోగుల్లో సైతం ఇదే వైఖరి ఉంది. అందుకే వారికి కూడా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులతో 158 ఓటర్ అవేర్నెస్ ఫోరమ్స్ ఏర్పాటు చేసి వివిధ కార్యాలయాల్లో అవగాహన కల్పిస్తున్నారు. వీటితోపాటు 584 పోలింగ్ బూత్‌ల పరిధిలో అవేర్నెస్ గ్రూపులు ఏర్పాటు చేశారు. తమ బూత్ పరిధిలోని వారిని పోలింగ్ కేంద్రాల దాకా అడుగేసేలా చేయడం ఈ గ్రూపుల పని. ‘వాక్ టు పోలింగ్ స్టేషన్’ పేరిట కార్యక్రమాలు చేపడుతూ పోలింగ్ శాతం పెరిగేందుకు పనిచేస్తున్నాయి.ఇంకా ఏం చేస్తున్నారంటే.. 18 ఏళ్లలోపు విద్యార్థులకు పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులందజేస్తున్నారు. ఓటరు చైతన్యం కోసం రూపొందించే వీడియోల్లో ఉత్తమమైన పది వీడియోలకు రివార్డులివ్వనున్నారు. బూత్‌లెవెల్ అధికారులు తమ బూత్‌లో పోలింగ్‌శాతాన్ని గతంలో కంటే పదిశాతం పెంచితే రూ. 5 వేలు రివార్డుగా ఇచ్చే యోచనలో ఉన్నారు. ఆదివారం నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 5కే రన్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో తాము ఓటు వేస్తామంటూ ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. ప్రజలు గుమికూడే ప్రాంతాల్లో పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. డిజిటల్ బోర్డులపై ఎన్నికల సమాచారం తెలియజేస్తున్నారు. ఓటరు అవగాహనకు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను ఎక్స్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్లోనూ ఎన్నికలకు సంబంధించిన సమాచారం పొందుపరుస్తున్నారు. వారానికోమారు ఓటు వేయాల్సిందిగా సూచిస్తూ ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద నగరంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయ్లెట్ల వద్ద ఓటరు అవగాహన బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇంటింటి నుంచి చెత్త సేకరించే స్వచ్ఛఆటోల మైకుల ద్వారానూ ప్రచారానికి సిద్ధమయ్యారు.ఇప్పటి వరకు..» స్వీప్(సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కింద నా ఓటు హక్కును వినియోగించుకుంటాను అనే ప్రతిజ్ఞతో ప్రసాద్స్ ఐమాక్స్‌లో, కొన్ని పార్కుల్లో భారీ తెరలపై సంతకాల సేకరణ చేపట్టారు. » జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులతో, పాతబస్తీలోని మక్కా మసీదులోనూ ఓటర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. » ఓటు వేస్తాననే సంకల్ప పత్రాలను విద్యార్థులకు అందజేస్తూవాటిపై వారి తల్లిదండ్రులు సంతకాలు చేశాక తిరిగి తీసుకుంటున్నారు. ఇప్పటివరకు అలా దాదాపు రెండు లక్షల సంకల్ప పత్రాలు సేకరించారు. » ఓటుహక్కు గురించి బస్తీల్లో, కాలనీల్లో క్విజ్లు, మెహందీలు, రంగోలి వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులందజేస్తూ ఆసక్తి కల్పిస్తున్నారు. » ఒక ఆదివారం హెరిటేజ్ వాక్ నిర్వహించిన సందర్భంగా దారుల్షిఫా నుంచి ఉస్మానియా ఆస్పత్రిలోని చింతచెట్టు వరకు ఓటు హక్కుకు సంబంధించిన బ్యానర్లు, పోస్టర్ల స్టాండ్లు ఏర్పాటు చేశారు. » పార్కులు, బస్స్టేషన్లు, గోడలపై రాతల ద్వారానూ, రేషన్‌షాపులు, సిటిజె¯న్ సర్వీస్ సెంటర్లు, కూరగాయల మార్కెట్లు తదితర ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. » ఓట్’ అనే అక్షరాల్లా కనిపించేలా విద్యార్థులతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.ఎన్నికల దాకా..ఎన్నికలు జరిగేంత వరకు ఇలా వివిధ ప్రాంతాల్లో, వివిధ రూపాల్లో స్వీప్ కార్య క్రమాలు నిర్వహించనున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ తెలిపారు. బొటానికల్ గార్డెన్ వద్ద ఇప్పటికే నిర్వహించిన 2కే రన్లో సీఈఓ వికాస్‌రాజ్, తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లాష్ లూటీ...
ఫిలడెల్ఫీయా: నిత్యం నిఘా నీడన ఉండే అమెరికాలో దొంగల ముఠా పేట్రేగిపోయింది. చూడ్డానికి.. షాపింగ్‌మాల్స్‌లో ఫ్లాష్‌మాబ్ పేరిట డ్యాన్స్‌లు, అవగాహన కార్యక్రమాలు చేసే బృందంలా కనిపిస్తూ ఒక్కసారిగా దుకాణాలపై తెగబడి అందిన కాడికి దోచేశారు. అమెరికాలోని ఫిలడెల్ఫీయా నగరం ఈ చోరీల ఘటనకు వేదికైంది. ఒక్కటి కాదు చాలా స్టోర్స్‌లో టీనేజర్లు ఇలా ఒకే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారు. మంగళవారం రోజు జరిగిన ఈ చోరీల తాలూకు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అత్యంత ఖరీదైన ఐఫోన్లుసహా యాపిల్ కంపెనీకి చెందిన పలు ఎల్రక్టానిక్ ఉపకరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. మాస్‌్కలు, హూడీలు ధరించిన దాదాపు 100కుపైగా టీనేజర్లు యాపిల్ స్టోర్, ఫూట్లాకర్, లూలూలెమెన్ స్టోర్లలో చొరబడి బ్యాగుల నిండా వస్తువులను తీసుకెళ్లారు. విషయం తెల్సుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను విశ్లేíÙంచి 20 మందికిపైగా టీనేజర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కొన్ని ఆయుధాలనూ స్వాదీనం చేసుకున్నారు. అయితే, వస్తువును దొంగిలించినా వాడుకోలేని(యాంటీ–థెఫ్ట్) ఫీచర్ ఉన్న కొన్ని యాపిల్ సంస్థ వస్తువులను దొంగలు అక్కడే వదిలేసివెళ్లారని ఫాక్స్ న్యూస్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. గత నెలలో డ్రైవర్ ఎడ్డీ ఐరీజెర్రీని ఫిలడెల్ఫీయా పోలీస్ అధికారి కాల్చిచంపిన కేసులో రిటెన్హౌజ్ స్క్వేర్ వద్ద శాంతియుత ర్యాలీ జరిగిన కొద్దిసేపటికే అక్కడా ఇలా రిటైల్స్టోర్పై దాడి జరిగింది. అయితే ఆ నిరసనకారులతో ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని ఫిలడెల్ఫీయా పోలీసులు స్పష్టంచేశారు. -
ఆకట్టుకున్న ఎన్సీసీ విద్యార్థుల.. ఫ్లాష్ మాబ్..!
వరంగల్: వరంగల్‌లోని ఎంజీఎం, హనుమకొండలోని అంబేడ్కర్ జంక్షన్లలో శుక్రవారం నిర్వహించిన ఫ్లాష్‌మాబ్ ఆకట్టుకుంది. ఇండియన్ స్వచ్ఛతా లీగ్ 2.0 కార్యక్రమంలో భాగంగా ‘జాయిన్ ది ఫైట్ ఫర్ గార్బేజ్ ఫ్రీ సిటీస్’ అంశంపై ఫ్లాష్‌మాబ్ కొనసాగింది. జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమానికి చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ, ఎంజీఎం ఒకేషనల్, ఎల్బీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు ర్యాలీగా తరలివచ్చి నృత్యాలు చేశారు. ఈసందర్భంగా కార్పొరేషన్ సీఎంహెచ్ఓ రాజేశ్ మాట్లాడుతూ.. ఈనెల 17న మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఫ్లాష్ మాబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఈఈ సంజయ్, సూపరింటెండెంట్ దేవేందర్, ఎస్ఐలు శ్యాంరాజ్, వెంకన్న, గొల్కొండ శ్రీను, భీమయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులతో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన మహిళా కలెక్టర్.. వీడియో వైరల్!
సోషల్ మీడియా వాడకం పెరగడంతో ప్రపంచ నలుమూలల జరిగేవి క్షణంలో నెట్టింట దర్శనమిస్తున్నాయి. అందులో కొన్ని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో కొందరు సామాన్యులు సెలబ్రిటీలుగా మారడం కూడా మనం బోలెడు చూశాం. అందుకే ఎక్కడ ఏం జరిగినా వాటిని వీడియోలు చిత్రీకరించడం ఆ వెంటనే నెట్టింట షేర్ చేయడం షరా మామూలుగా మారింది. తాజాగా ఓ జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. చదవండి: సింహాలతో సెల్ఫీ.. అట్లుంటది మనతోని! ఓ నెటిజన్ ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ వీడియోలో.. కేరళలోని పాతానంతిట్ట జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి దివ్య ఎస్ అయ్యర్‌ని చూడవచ్చు. మహాత్మా గాంధీ యూనివర్శిటీ ఆర్ట్ ఫెస్టివల్ నేపధ్యంలో ఆ జిల్లా స్టేడియంలో కళాశాల విద్యార్థులు ఫ్లాష్ మాబ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతుండగా కొందరు విద్యార్థులు తమతో పాటు డ్యాన్స్ చేయమని ఆమెను కోరారు. దీంతో విద్యార్థులతో పాటు కలెక్టర్ జాయిన్ అయ్యారు. విద్యార్థులతో కలిసి పుల్ జోష్‌తో ఆమె కూడా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. -
కరోనా రోగుల డాన్స్!
-
క్రిస్మస్ సందర్భంగా షాపింగ్‌కు వచ్చి...
-
పోలీస్ ఫ్లాష్‌మాబ్ వైరల్!
ఫ్లొరిడా : అమెరికా ఫ్లొరిడాలోని ఓ షాపింగ్ మాల్లో పోలీసులు ఫ్లాష్‌మాబ్‌తో ఔరా అనిపించారు. క్రిస్మస్ సందర్భంగా షాపింగ్‌కు వచ్చిన కొందరు.. ఫ్లాష్‌మాబ్‌తో సడెన్ సప్రైజ్ ఇచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ షాపింగ్ పోలీస్ అధికారులు ఈ ఫ్లాష్‌మాబ్‌ను అడ్డుకున్నారు. కానీ అందరికీ ట్విస్ట్ ఇస్తూ వారు ఆ ఫ్లాష్‌మాబ్‌లో భాగమయ్యారు. వారితో కలిసి చిందేశారు. ఈ ఘటనతో అక్కడున్నవారు సంభ్రమాశ్చర్యానికిలోనయ్యారు. పోలీసుల డ్యాన్స్ చూసి అక్కడున్న వారు పెద్దగా అరుస్తూ.. వారిని అభినందించారు. ఫ్లొరిడాలోని అవెంచురా మాల్లో ఇది జరగగా.. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘అవెంచురా పోలీసులు షాపింగ్‌కు వచ్చిన వారి హాలిడే మూవ్‌మెంట్‌ను అందిపుచ్చుకున్నారు’ అని అవెంచురా పోలీస్ సోషల్‌మీడియా విభాగం తమ అధికారిక ట్విటర్లో ఈ వీడియోను షేర్ చేసింది. దీంతో ఇది వైరల్ అయింది. -
నాంపల్లిలో ఆకట్టుకున్న డాక్టర్ల ఫ్లాష్‌మాబ్
-
ఫ్లాష్‌మాబ్ అదిరింది
వైభవ్ జ్యూయలర్స్ భాగస్వామ్యంతో ‘సాక్షి’ నిర్వహిస్తున్న 6వ పండగ సంబరాల్లో భాగంగా సోమవారం బీచ్‌రోడ్ నిర్వహించిన ఫ్లాష్‌మాబ్ సందర్శకుల చేత అదరహో అనిపించింది. వీ టీమ్ ఆధ్వర్యంలో డ్యాన్స్‌లు చేస్తూ పండగ సంబరాలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. పండగ సంబరాల్లో పాల్గొంటే ప్రతి రోజు రూ.లక్ష గెలిచే అవకాశం ఉందని సాక్షి యాడ్స్ రీజనల్ మేనేజర్ అరుణ్‌కుమార్ తెలిపారు. అంతేకాకుండా మరో ఆరు గురు ప్రోత్సాహక బహుమతులు గెలుచుకోవచ్చని, సాక్షి పండగ సంబరాలతో కస్టమర్లకు నిజమైన పండగ అని అన్నారు. కార్యక్రమంలో వీరు మామా తన మాటలతో యువతను ఆకట్టుకున్నారు. – బీచ్‌రోడ్ -
వైజాగ్ సాక్షి పండగ సంబరాలో ఫ్లాష్ మాబ్
-
అదిరే.. ఫ్లాష్‌మాబ్
గుంటూరు (అరండల్‌పేట): ప్రపంచ ఫార్మసీ దినోత్సవం సందర్బంగా సిమ్స్ ఫార్మసీ కళాశాల విద్యార్థులు శనివారం స్థానిక బందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియం ఎదుట, నాజ్ సెంటర్ కూడలి వద్ద ఫ్లాష్‌మాబ్, లఘు నాటికలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.మనోహర్‌బాబు మాట్లాడుతూ రోగికి వచ్చిన జబ్బును వైద్యులు గుర్తిస్తారని, అయితే ఆ జబ్బుకు ఫార్మసిస్ట్ మాత్రమే మందు తయారుచేయగలరన్నారు. ఈ మందులపై సమాజంలో చాలామందికి అవగాహన తక్కువుగా ఉందన్నారు. రోగికి వచ్చిన జబ్బులో వైద్యుల ప్రాముఖ్యత కన్నా ఫార్మసిస్ట్ ప్రాముఖ్యతే అధికమన్నారు. ఒక మందు తయారీలో ఫార్మసిస్ట్ కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల పాటు కష్టపడాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్‌మాబ్, లఘు నాటికలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. -
అలరించిన ప్లాష్‌మాబ్
నెల్లూరు(అర్బన్): బ్రెస్ట్ క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన(ప్లాష్‌మాబ్) ఆకట్టుకుంది. తొలిసారిగా శనివారం నెల్లూరులోని ఎంబీజీ మాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అందరూ ఆసక్తిగా తిలకించారు. అందరినీ ఆకర్షించేలా పింక్ టీషర్టులు ధరించిన యువతులు నృత్యాలు చేస్తూ అవగాహన కల్పించారు. నారాయణ మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల సహకారంతో భార్గవ హెల్త్‌ప్లస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వ్యాధిపై అవగాహన ఏర్పరచుకోవడం ద్వారా తగు వైద్యం పొంది బ్రెస్ట్ క్యాన్సర్‌ను పూర్తిగా నివారించవచ్చని రెడ్‌క్రాస్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధికారి డాక్టర్ లక్ష్మి పేర్కొన్నారు. తన సోదరి ఇదే వ్యాధితో బాధపడుతూ మృతిచెందిందని, మరొకరు అలాంటి బాధ పడకూడదనే ఉద్దేశంతో కొన్నేళ్లుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని భార్గవ హెల్త్‌ప్లస్ సీఈఓ ఎ.చంద్రశేఖరరెడ్డి చెప్పారు. కార్యక్రమంలో నారాయణ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్‌సతీష్, కిమ్స్(బొల్లినేని) ఈడీ గిరినాయుడు, ఎంజీ బ్రదర్స్ ఎండీ గంగాధర్, డీజిఎం రవికుమార్, శాఖవరపు వేణుగోపాల్,దేవరకొండ శ్రీనివాసులు, భాస్కర్‌నాయుడు, మహావీర్‌జైన్ పాల్గొన్నారు. -
30న ఫ్లాష్‌మాబ్
నెల్లూరు(అర్బన్): బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు గానూ ఈ నెల 30వ తేదీన ఎంజీబీ మాల్లో ఫ్లాష్ మాబ్‌ను నిర్వహించనున్నట్లు భార్గవ్ హెల్త్‌ప్లస్ అధినేత చంద్రశేఖర్‌రెడ్డి, నారాయణ ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ వినయ్‌కుమార్ తెలిపారు. ఫ్లాష్ మాబ్‌కు సంబంధించిన పోస్టర్లను నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. అక్టోబర్‌లో పింక్ రిబ్బన్ వాక్‌ను నిర్వహించనున్నామని చెప్పారు. 25 వేల మందితో నిర్వహించేందుకు భార్గవ్ హెల్త్ ప్లస్ ప్రణాళికను సిద్ధం చేస్తోందని చెప్పారు. ఎంజీబీ మాల్ డీజీఎం రవికిరణ్, నీరూస్ ఫ్రాంచైజ్ యజమాని నిఖిల్‌రెడ్డి, ఈవీఎస్ నాయుడు, భాస్కర్‌నాయుడు, కళాశాల ప్రిన్సిపల్ జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
పిల్లో ఫైట్ డే సెలబ్రేషన్స్
-
కొట్టుకుంటూ.. పిల్లో ఫైట్ డే సెలబ్రేషన్స్
టొరంటో: దిండ్లతో గ్రూపులు గ్రూపులుగా వచ్చి ఒకరిని ఒకరు చితకొట్టుకున్నారు. ఏడవ అంతర్జాతీయ పిల్లో ఫైట్ డే సందర్భంగా దిండ్లతో ఈ విధంగా కొట్టుకున్నారు. కెనడాలోని టొరంటోలో అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో వచ్చిన యువతీ యువకులు ఎవరు కనబడితే వారిని ఇష్టమోచ్చినట్టు కొడుతూ ఈ ఫైట్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. అంతర్జాతీయ పిల్లో ఫైట్ డేను లండన్‌లాంటి నగరాలతో పాటూ ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా నగరాల్లో జరుపుకున్నారు. -
రోడ్డుపై కూతురిని అలా చూసి ఒక్కటిచ్చింది..
అది కేరళలోని కన్నూరు నగరంలో పయ్యనూరు బస్టాండ్ ప్రాంతం. కొంతమంది కాలేజీ విద్యార్థులు కలసి అక్కడికి వచ్చారు. అందరూ కలసి హుషారుగా డాన్స్ (ఫ్లాష్ మాబ్) చేస్తున్నారు. అక్కడున్న జనం గుమిగూడి వారిని ఆసక్తిగా చూస్తున్నారు. ఆ ప్రాంతంలో సందడి నెలకొనడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇంతలో ఓ మహిళ అక్కడికి వచ్చింది. విద్యార్థుల గ్రూపులోని ఓ అమ్మాయిని చూడగానే ఆగ్రహం చెందింది. వెంటనే వేగంగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి లాగి చెంపదెబ్బ కొట్టింది. దీంతో అక్కడున్న విద్యార్థులతో పాటు వారి డాన్స్‌ను చూస్తున్నవారందరూ షాక్ తిన్నారు. తక్షణం అక్కడ నుంచి రావాలంటూ ఆమె తిట్టింది. అక్కడున్న వారు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె కోపం చల్లారలేదు. మహిళ కొట్టిన అమ్మాయి ఎవరో కాదు. ఆమె కూతురు! సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ కూతురును ఎందుకు కొట్టిందనే విషయంపై సోషల్ మీడియాలో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఫ్లాష్ మాబ్‌తో తన కూతురు పాల్గొనడం ఇష్టంలేకనే అలా ప్రవర్తించిందన్నది ఓ వాదన కాగా, ట్రాఫిక్ అంతరాయం కలిగించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారన్న కోపంతో కూతురును కొట్టిందనేది మరో వాదన. -
విద్యార్ధులతో కలిసి 'పద్మ' ప్లాష్మబ్
-
విశాఖలో ఆకట్టుకున్న ఫ్లాష్‌మాబ్
-
ప్లాష్‌మాబ్‌తో సీపీఎం మహాసభల ప్రచారం
-
మంజీరా మాల్లో ప్లాష్‌మాబ్
-
నెక్లెస్‌రోడ్డులో ఆకట్టుకున్న ఫ్లాష్‌మాబ్