
ఫ్లాష్‌మాబ్ అదిరింది
వైభవ్ జ్యూయలర్స్ భాగస్వామ్యంతో ‘సాక్షి’ నిర్వహిస్తున్న 6వ పండగ సంబరాల్లో భాగంగా సోమవారం బీచ్‌రోడ్ నిర్వహించిన ఫ్లాష్‌మాబ్ సందర్శకుల చేత అదరహో అనిపించింది. వీ టీమ్ ఆధ్వర్యంలో డ్యాన్స్‌లు చేస్తూ పండగ సంబరాలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. పండగ సంబరాల్లో పాల్గొంటే ప్రతి రోజు రూ.లక్ష గెలిచే అవకాశం ఉందని సాక్షి యాడ్స్ రీజనల్ మేనేజర్ అరుణ్‌కుమార్ తెలిపారు.
అంతేకాకుండా మరో ఆరు గురు ప్రోత్సాహక బహుమతులు గెలుచుకోవచ్చని, సాక్షి పండగ సంబరాలతో కస్టమర్లకు నిజమైన పండగ అని అన్నారు. కార్యక్రమంలో వీరు మామా తన మాటలతో యువతను ఆకట్టుకున్నారు. – బీచ్‌రోడ్