beach road
-
విశాఖ బీచ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం
సాక్షి,విశాఖ : విశాఖ బీచ్ రోడ్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న డైనో పార్క్ రెస్టోకేఫ్లో మంటలు చెలరేగాయి. మంటల దాటికి రెస్టారెంట్ కాలిబూడిదైంది. దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. జీవీఎంసీ నుంచి స్థలాన్ని లీజ్‌కు తీసుకొని డైనో పార్క్ రెస్టోకేఫ్ను నిర్వాహిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
మిలాన్ రిహార్సల్స్ అదుర్స్
బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): భారీ యుద్ధ నౌకలు... స్పీడు బోట్లు.. ఫైటర్ జెట్స్... యుద్ధ విమానాల విన్యాసాలతో విశాఖ తీరం యుద్ధక్షేత్రాన్ని తలపించింది. మిలాన్–2024లో భాగంగా విశాఖపట్నం బీచ్ రోడ్డులో మంగళవారం నిర్వహించిన ఫైనల్ రిహార్సల్స్ అద్భుతంగా సాగాయి. భారీ యుద్ధ నౌకలు, స్పీడ్ బోట్లు, ఫైటర్ జెట్స్, యుద్ధ విమానాలు తీరంలో తమ ప్రతిభను ప్రదర్శించాయి. ఇందులో భాగంగా హెలికాప్టర్ ద్వారా ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించటం, తీవ్రవాదుల దాడులను ఎదుర్కొవడం వంటి అంశాలను ప్రదర్శించారు. అనంతరం మిగ్, హక్స్, ఫైటర్ జెట్స్ తీరంలో బాంబులను వెదజల్లుతూ అబ్బురపరిచాయి. అదే సమయంలో ఆకాశం నుంచి ఆరుగురు సైనికులు జాతీయ పతాకం, నేవీ పతాకం పట్టుకుని పారాచూట్ ద్వారా కిందికి దిగారు. వారు ఒక బహుమతిని ముఖ్య అతిథికి అందజేశారు. నేవీ స్కూల్ విద్యార్థుల నృత్య ప్రదర్శన, జాతీయ గీతాల ప్రదర్శనలు అలరించాయి. అనంతరం దేశ రక్షణ బలగాలు, రాష్ట్ర రక్షణ బలగాలు, విదేశీ నేవీ బలగాలు, రాష్ట్ర సంప్రదాయ కూచిపూడి, థింసా, కోయ నృత్యాలు, సంక్షేమ పథకాల నమూనాలతో భారీ పరేడ్ నిర్వహించారు. ఈ నెల 22వ తేదీన తుది పరేడ్‌ను నిర్వహించనున్నారు. కాగా, పరేడ్ ఫైనల్ రిహార్సల్స్ చూసేందుకు విశాఖ నగర వాసులు పెద్ద సంఖ్యలో తీరానికి చేరుకున్నారు. ఆర్కే బీచ్ నుంచి కురుసుర మ్యూజియం వరకు ఏర్పాటు చేసిన గ్యాలరీలు సందర్శకులతో కిటకిటలాడాయి. ఈ రిహార్సల్స్‌ను చూసేందుకు నేవీ సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు. -
జనం లేరా..? వెయిట్ చేయండి..
సాక్షి, విశాఖపట్నం: ‘ఏందయ్యా ఇది.. ముందే చెప్పాను కదా.. అయినా జనాల్ని తీసుకురాలేకపోయారా.? త్వరగా బీచ్ రోడ్ నింపండి. అప్పుడే చెప్పండి.. బయటికి వస్తాను...‘ పార్టీ నాయకులపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గరం గరమయ్యారు. ఇండియా విజన్–2047 కార్యక్రమం పేరుతో మరో మోసపూరిత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు చంద్రబాబు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి పాదయాత్రగా ప్రారంభం కావాలి. కానీ.. నోవాటెల్ లో బసచేసిన చంద్రబాబు.. అక్కడకి జనం రాలేదని తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నాయకుల్ని పిలిచి.. జన సమీకరణకు ఇంకా ఎంతసేపు టైం కావాలని అసహనం వ్యక్తం చేశారు. జనం నిండిన తర్వాతే వస్తానని చెప్పడంతో నేతలు హడావుడిగా పార్టీ శ్రేణులతో రోడ్డు నింపారు. అనంతరం తాపీగా బయటికి వచ్చిన బాబు.. గంటన్నర ఆలస్యంగా పాదయాత్ర మొదలు పెట్టారు. సందర్శకులకు ఇబ్బందులు స్వాతంత్య్ర దినోత్సవం రోజున సందర్శకులు భారీగా బీచ్‌కు వచ్చారు. అయితే.. చంద్రబాబు కార్యక్రమం కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 తర్వాత యథావిధిగా రాకపోకలు సాగిస్తామని పోలీసులు పర్యాటకులకు సర్ధి చెప్పారు. కానీ చంద్రబాబు ఆలస్యంగా మొదలు పెట్టడంతో సందర్శకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సెలవు రోజున ఇలా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలేంటంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లా.. ఫొటోలకు ఎరేంజ్ చెయ్... పాదయాత్రగా వెళ్తున్న బాబుతో ఫొటోలు దిగేందుకు స్థానికులెవ్వరూ రాకపోవడంతో ఆయన విస్తుపోయారు. వెంటనే స్థానిక నేత పల్లా శ్రీనివాసరావుని పిలిపించి.. పాదయాత్ర చప్పగా సాగుతోందనీ.. విభిన్న వర్గాల వారు వచ్చి ఫొటోలు తీసుకునేలా ఎరేంజ్ చేయాలని హుకుం జారీ చేశారు. వెంటనే పల్లాతో పాటు ఇతర నాయకులు అదే పనిలో నిమగ్నమయ్యారు. ఒక లాయర్, ముస్లిం మహిళ, స్టూడెంట్.. ఇలా ఒక్కొక్కర్ని పిలిపించి చంద్రబాబుతో ఫొటోలు దిగేలా చేసి.. పక్కకు తోసేశారు. మరో మోసపూరిత డాక్యుమెంటా.? ప్రతిసారీ విజనరీ పేరుతో హడావుడి చేసే చంద్రబాబు.. ఈ ఎన్నికల ముందు కూడా అదే పల్లవి అందుకున్నారు. గతంలో విజన్–2020 పేరుతో జనాల్ని మభ్యపెట్టిన బాబు.. ఇప్పుడు విజన్–2047 పేరుతో డాక్యుమెంట్ విడుదల చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన బాబు... తన వద్ద సలహాదారులుగా వ్యవహరించిన వారితో కలిసి.. బాబు చైర్మన్‌గా గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్(జీఎఫ్ఎస్టీ) పేరుతో సంస్థ ప్రారంభించారు. సదరు సంస్థ రూపొందించిన డాక్యుమెంటే ఇది. ఈ కార్యక్రమానికి వచ్చిన కొందరు విద్యావేత్తలు, నాయకులు చంద్రబాబు హడావుడి చూసి నవ్వుకున్నారు. కొందరైతే.. 2020 అయిపోయింది.. ఇప్పుడు 2047 పేరుతో హడావుడా అంటూ గుసగుసలాడుకున్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏపీని అభివృద్ధి చేయలేకపోయారు కానీ.. ఇప్పుడు ఇండియా విజన్ అని చెప్పడం విడ్డూరమంటూ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా.. డాక్యుమెంట్‌పై సలహాలు, సందేహాలు అడిగేందుకు టీడీపీ నేతలే ప్రత్యేకంగా కొందర్ని ఎంపిక చేసుకున్నారు. వారికి ఏ ప్రశ్నలడగాలో ముందుగానే స్క్రిప్ట్ ఇచ్చేశారు. ప్రజలకు అనుమానం రాకుండా ప్రశ్నలడిగేవారిని అక్కడక్కడా కూర్చోబెట్టడం కొసమెరుపు. చంద్రబాబు తన ప్రసంగం ఆద్యంతం చర్వితచరణంగానే సాగింది. సమైక్యాంధ్రగా ఉన్నప్పుడే విశాఖని ఆర్థిక నగరంగా చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. హుద్ హుద్ గురించి చెబుతున్నప్పుడు జనం కూడా ఎన్నిసార్లు ఇది చెబుతారంటూ అసహనం వ్యక్తం చేశారు. -
స్నేహితులతో సరదాగా బీచ్‌కు.. ఎంతో ఇష్టంగా కొనుకున్న కొత్త బైకే..
సాక్షి, విశాఖపట్నం: బీచ్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎంతో ఇష్టంగా కొనుక్కొన్న బైక్‌పై సరదాగా డ్రైవ్ చేసి ప్రాణాలు కోల్పోయాడు. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం, కుంతుర్ల గ్రామానికి చెందిన పూటి గిరి ప్రసాద్ నాయుడు(19) పాడేరులో మదర్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. స్నేహితుడు జె.జగదీష్‌తో కలసి బైక్‌పై బుధవారం విశాఖలో బంధువులు ఇంటికి వచ్చాడు. అదే రోజు సాయంత్రం ఇంటి నుంచి స్నేహితుడితో కలసి బైక్‌పై నగరం చూడడానికి బయలుదేరాడు. రాత్రయినా ఇంటికి చేరకుండా తిరిగారు. ఈ క్రమంలో రాత్రి 11 గంటలు దాటిన తర్వాత బీచ్‌రోడ్డులో తెన్నేటి పార్కు నుంచి సాగర్‌నగర్ వైపు వెళ్తుండగా సీతకొండ చివరి మలుపు వద్ద కుక్క అడ్డు రావడంతో బైక్ డివైడర్, దానిపై ఉన్న ఎలక్ట్రికల్ పోల్‌ను ఢీకొంది. దీంతో కిందపడిన గిరిప్రసాద్ తలకు తీవ్రగాయమై సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. వెనుక కూర్చొన్న అతని స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఆరిలోవ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. స్వల్ప గాయాలైన స్నేహితుడిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు. గురువారం పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని ఆ యువకుడి కుటుంబ సభ్యులకు అçప్పగించారు. మృతుడి అక్క పి.ఐశ్వర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా గిరి తండ్రి మత్సలింగం నాయుడు ఉపాధ్యాయుడు. అమ్మ, అక్క ఉన్నారు. ఎంతో ఇష్టంగా ఇటీవల కొనుక్కొన్న కొత్త బైకే కుమారుడి ప్రాణాలు తీసిందంటూ మృతుడి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆ బైక్‌పై సరదాగా విశాఖ వచ్చి, ప్రాణాలు తీసుకున్నాడంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. చదవండి: భీమిలి బీచ్‌లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు -
Vizag: ఇక బంద్! రోడ్డు రోలర్‌తో తొక్కించి సైలెన్సర్ల ధ్వంసం
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): నగరంలో శబ్ధ కాలుష్యం, వాయు కాలుష్యానికి కారణమవుతున్న 631 లౌడ్ సైలెన్సర్లను ధ్వంసం చేయించామని నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. బీచ్‌రోడ్డులోని పోలీస్ మెస్ ఆవరణలో ఆదివారం రోడ్డు రోలర్‌తో సైలెన్సర్లను ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాహనదారులు మోడిఫైడ్ సైలెన్సర్లను వాడరాదని కోరారు. బీచ్‌రోడ్డులో యువకులు బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. దీంతో స్పెషల్ డ్రైవ్ ద్వారా ఏడు వాహనాలను, 12 మంది యువకులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. బీచ్‌రోడ్డులో బైక్ రేసింగ్‌లు పాల్పడే యువకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా వుండి తమ కుమారులపై నిఘా వుంచాలని సూచించారు. హెల్మెట్ లేకుండా బైక్‌లు నడుపుతూ ప్రమాదాలకు గురై ఇటీవల చాలా మంది ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మట్ ధరించాలని సూచించారు. మద్యపానం చేసి వాహనాలు నడపరాదని ఆయన కోరారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడేవారితో కోర్టు ఆదేశాలతో కమ్యూనిటీ సర్వీస్ చేయిస్తున్నామని గుర్తు చేశారు. ఆయా జంక్షన్లలో వీరిచేత ప్లకార్డుల సాయంతో ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు నగరంలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో 205 మందితో కమ్యూనిటీ సర్వీస్ చేయించామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏడీసీపీ ఆరిబుల్లా, ట్రాఫిక్ ఏసీపీ – 1 కుమారస్వామి, ట్రాఫిక్ ఏసీపీ – 2 శరత్‌కుమార్, ఈస్ట్ ట్రాఫిక్ సీఐ ఏవీ లీలారావు, ఎస్ఐ అసిరితాత, తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: విశాఖలో ఇగ్లూ థియేటర్ ఎక్కడ ఉందో తెలుసా?) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భళా.. చాంగుభళా..
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): గిరిజనుల సంప్రదాయ నృత్యప్రదర్శనతో వేదిక మురిసింది. 14 రాష్ట్రాలకు చెందిన 17 బృందాలు ఒక చోట చేరి ఇస్తున్న ప్రదర్శనలు సందర్శకుల మది దోస్తున్నాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగిన జాతీయ నృత్య ప్రదర్శనలో రెండో రోజు తొమ్మిది రాష్ట్రాలకు చెందిన బృందాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. ముందుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బృందం కొమ్మ కోయ డ్యాన్స్ ప్రదర్శించింది. చండీఘర్ బృందం మిసన్ హర్న డ్యాన్స్, కేరళ నుంచి మళపుళయ అత్తమ్ నృత్యం, మణిపూర్ నుంచి జౌ లేయ్ కోన్ నృత్యం, మధ్యప్రదేశ్ నుంచి గుడుం బాజా డ్యాన్స్, ఒడిశా నుంచి బిర్లి డ్యాన్స్, తెలంగాణ నుంచి గోండు జాతి డ్యాన్స్, గుజరాత్ బృందం భిల్ డ్యాన్స్, గోవా బృందం కుంభి డ్యాన్సులు ప్రదర్శించాయి. ప్రత్యేక ఆకర్షణగా గోండు నృత్యం తెలంగాణకు చెందిన గోండు జాతి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. వారి వస్త్రధారణతో పాటు జీవనవిధానాన్ని ప్రతిబింబించిన నృత్యం ఆహూతులను అలరించింది. నేటితో ముగియనున్న ఫెస్టివల్ మూడో రోజుల పాటు సాగిన నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ ఆదివారంతో ముగియనుంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు సాగే వేడుకల్లో 9 రాష్ట్రాలకు చెందన బృందాలు నృత్యాలను ప్రదర్శించనున్నాయి. పోర్టు ట్రస్ట్ ప్రత్యేక బహుమతులు ఈ ఫెస్టివల్ ద్వారా మొదటి, రెండు, మూడు స్థానాలకు మాత్రమే బహుమతులను అందజేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన విశాఖ పోర్టు ట్రస్ట్ ఛైర్మన్ రామ్మోహన్ రావు పోర్టు ట్రస్ట్ తరపున నాలుగు కన్సొలేషన్ బహుమతులను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రూ.25 వేలు చొప్పున నాలుగు రాష్ట్రాలకు అందిస్తామని ఆయన ప్రకటించారు. వారి సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ ఈ కానుక అందిస్తున్నామన్నారు. -
అలల సవ్వడిని ఆస్వాదిస్తూ వేడి వేడి బిర్యానీ.. బస్సుపై కూర్చుని తింటే!
బీచ్‌రోడ్డు (విశాఖతూర్పు): సాగరతీరం.. ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది.. రోజూ చూస్తున్నా ఏదో తెలియని అనుభూతి.. అలల సవ్వడి పలకరిస్తాయి. చిరుగాలులు మనసును ఆహ్లాదపరుస్తాయి. అందుకే విశాఖ బీచ్ ఎనలేని ఖ్యాతి సొంతం చేసుకుంది. అటువంటి సాగరతీరంలో అలల సవ్వడి వింటూ.. ఎగసి పడే కెరటాలను చూస్తూ..చల్లగాలి ఆహ్లాదాన్ని మజా చేస్తూ మరో వైపు లైవ్ మ్యూజిక్ హమ్ చేస్తూ వేడి వేడి బిర్యానీ తింటే.. నూరూరించే పిజ్జా ఆరగిస్తే.. జింహ్వచాపల్యానికి ఇంతకంటే ఇంకేం కావాలి. ఇప్పుడు అటువంటి రెస్టారెంట్ నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చాడు ఓ యువకడు. నగరవాసుల టేస్ట్‌ను పట్టుకున్న వెంకట నాగచంద్ర (చందు).. కొత్త ఆలోచనలకు ఎప్పుడూ సిటి జనలు ఆదరస్తారన్న నమ్మకంతో ఓసియన్ ఎడ్జ్ పేరుతో మొబైల్ రూఫ్‌టాప్ డైనింగ్ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దాడు. బస్సు టాప్‌పై కూర్చుని సముద్ర అందాలను వీక్షిస్తూ ఇష్టమైన ఆహారాన్ని తీంటుంటే వావ్ అనాల్సిందే.. ఒక్క సారైనా చూడడానికైనా వెళ్లాల్సిందే. చదవండి👉🏾 తిరుపతి, అరకుకు స్పెషల్ టూర్స్ సరికొత్త అనుభూతి.. రూఫ్‌టాప్‌పై కూర్చుని సముద్రం అలల చూస్తూ తింటుంటే ఏదో తెలియని సరికొత్త అనుభూతి పొందుతున్నట్టు ఉంది. పాత కాలం గోలిసోడ తాగుతూ ఫిష్ ఫ్రై తింటుంటే చాలా అద్భుతంగా ఉంది. –దుర్గాప్రసాద్, ఆహార ప్రియుడు వైజాగ్‌లో మొదటిసారిగా.. యూరప్ దేశాలకే పరిమితమైన ఈ రెస్టారెంట్ విశాఖ నగరంలో మొదటి మొబైల్ రూఫ్‌టాప్ రెస్టారెంట్‌ను ఏర్పటు చేశాడు. ఈ రెస్టారెంట్ ఇప్పటికే అనేక పార్టీలకు వేదికైంది. ఈ రెస్టారెంట్‌ను సాగతీరంలోనే కాకుండా ఆహార ప్రియుల ఆసక్తి మేరకు వారి చెప్పిన ప్రాంతంలో కూడా ఏర్పాటు చేస్తారు. బస్సుపైన డైనింగ్ చేస్తూ నగర వాసులు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. మరిన్ని ఇటువంటి రెస్టారెంట్లు నగరంలో ఏర్పాట చేయాలని చందు భావిస్తున్నాడు. చదవండి👉🏻 ముడతలు, బ్లాక్ హెడ్స్‌కు చెక్.. ఈ డివైజ్ ధర రూ. 2,830 గోలి సోడ నుంచి పిజ్జా వరకు మొబైల్ రూఫ్‌టాప్ రెస్టారెంట్లో అన్ని రకాల ఆహారం పదార్థాలు లభిస్తున్నాయి. పాతతరం గోలి సోడ నుంచి కొత్త తరం పిజ్జా, బిర్యానీ, బర్గర్లు వరకు అనేక వంటకాలు అందుబాటులో ఉన్నాయి. లైవ్ మ్యూజిక్ యూరప్‌లో చూసి.. నగరంలో తన మార్కు చూపించాలని చందుకు ఎప్పుడూ ఉండేది. వినూత్నమైన ఆలోచనలతో ముందుకు సాగేవాడు. అలాంటి సమయంలో ఫ్యామిలీతో యూరప్ వెళ్లినప్పుడు ఎక్కువగా ఇంటువంటి మొబైల్ రూఫ్‌టాప్ డైనింగ్ రెస్టారెంట్లను చూశాడు. అబ్బా భలే ఉందే...మన విశాఖలో ఇలా పెడితే బ్రహ్మాండంగా ఉంటుందని నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా విశాఖ పర్యాటకపరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. మొబైల్ రూఫ్‌టాప్ డైనింగ్ రెస్టారెంట్ కచ్చితంగా క్లిక్ అవుతుందని భావించాడు. ఆలోచన రావడమే తరువు అన్నట్టు అన్ని ఎర్పాట్లు చేసుకుని జీవీఎంసీ అనుమతులను పొంది ఆరు నెలల క్రితం వైఎంసీఏ వద్ద ఈ ఓసియన్ ఎడ్జ్ మొబైల్ రూఫ్‌టాప్ డైనింగ్ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. నగర యువత ఇప్పుడు ఈ రెస్టారెంట్ కొత అనుభూతిని పొందుతున్నారు. ఈ రెస్టారెంట్ ద్వారా 12 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు చందు. చదవండి👉 అధరహో...సిరులు కురుపిస్తున్న చింత ఆహార ప్రియులతో కిటకిటాలడుతున్న రూప్‌టాప్ డైనింగ్ ప్రభుత్వం సహకరిస్తే ఫ్లైట్ రెస్టారెంట్ ఏర్పాటు ఎప్పుడు వినూత్నంగా ఏదైన చేయాలనేది నా ఆలోచన. అందులో భాగంగానే ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశా. నగర వాసులు ఆదరణ చాలా బాగుంది. ఆహార ప్రియుల కోరిక, ఆసక్తి మేరకు ప్రజల వద్దకే మా రెస్టారెంట్‌ను తీసుకొని వెళ్లడం జరుగుంది. ప్రస్తుతం ఫ్లైట్ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలనేది నా లక్ష్యం దీనికి ప్రభుత్వం సహకరించాలి. ఇప్పటికే ఫ్లైట్ రెస్టారెంట్ ఏర్పాటుకు కావాల్సిన అన్ని సిద్ధం చేసుకున్నా. కానీ దాన్ని సరైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలి. అందుకు ప్రభుత్వం స్థలం కేటాయిస్తే రెస్టారెంట్ ఏర్పాటు చేసి పర్యటకులను ఆకర్షించవచ్చు. –నాగచంద్ర (చందు), ఓసియన్ ఎడ్జి రెస్టారెంట్ -
ఫొటోషూట్లకు కేరాఫ్ అడ్రస్ బీచ్‌రోడ్డు
-
కాళ్లలో లేదు చలనం ఆశల్లో ఉంది జీవనం
19 ఏళ్లు..ఉత్సాహం ఉరకలెత్తే వయస్సు..ఎగసే అలల్లా జీవితంపై ఎన్నో ఆశలు..ఆకాంక్షలు..ఈ చురుకైన యువకుడ్ని చూసి విధికి కన్నుకుట్టింది. 2009లో జరిగిన ప్రమాదంలో నడవలేని స్థితికి చేరుకున్నాడు. కుటుంబంలో నిశ్శబ్ధ వాతావరణం..ఎదిగిన తమ బిడ్డ ఇలా దివ్యాంగుడిగా మారిపోవడం తల్లిదండ్రులు జీర్జించుకోలేకపోయారు. ఏడ్చీ ఏడ్చీ కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. అయితే ఆ యువకుడు కుంగిపోలేదు. సంద్రంలో అలలే స్ఫూర్తిగా తీసుకున్నాడా యువకుడు. జీవితంలో అవిటితనం ఓ చిన్న సమస్యే..అంతకు మించి జిందగీలో చాలా ఉందని భావించాడు. సూర్యుడు ఉదయిస్తాడు... అస్తమిస్తాడు... అస్తమించినంతమాత్రాన ఓడిపోయినట్టు కాదు...ఈ రవివర్మ కూడా అంతే...ఉదయించే సమయంలో విధి ఓటమి పాల్జేస్తే... నడవలేని స్థితిలో రవి ఆ విధిపై విజయం సాధించాడు. ర్యాప్ అనే ఫౌండేషన్ స్థాపించి ఎందరో దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు...ఆ విజేతే మన సీతమ్మధారకు చెందిన రవివర్మ. సాక్షి, బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ప్రమాదానికి ముందు రవివర్మకు పర్యాటక ప్రాంతాలు వీక్షించడమంటే చాలా ఇష్టం. అయితే నడవలేని స్థితిలో ఉన్న రవి దాదాపు చాలా రోజులు యాత్రలకు వెళ్లలేకపోయాడు. తరువాత తనకుతాను స్ఫూర్తి నింపుకున్నాడు. ఇది కాదు జీవితం...లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్...దానిని ఆస్వాదించాలనుకున్నాడు. తన పనులు తాను చేసుకునేస్థాయిలో వచ్చాడు. వీలు చైర్లోనే నగరంలో తనకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లేవాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా యాత్రకు శ్రీకారం చుట్టాడు. కారుకు ప్రత్యేక మార్పులు చేయించాడు. తనుకు అనుకూలంగా కారును డిజైన్ చేయించుకున్నాడు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించేందుకు విశాఖ నుంచి సోమవారం బయలుదేరాడు. వెలుగు రేఖ వెతకాలి జీవితంలో ఓటమి ఎదురైందని చీకట్లో కూర్చుంటే వెలుగే కనిపించదు..మనసులో కుంగిబాటు అనే కర్టెన్ తీసేయాలి..అప్పుడు ఎంతటి బాధనైనా... అంగవైకల్యమైనా మనల్ని ఏమీ చేయలేదని తెలుస్తుంది. నా జీవితమే ఇందుకు ఓ ఉదాహారణ. కుంగిపోయి కూర్చుంటే నేనీరోజు దేశవ్యాప్తంగా యాత్ర చేసే స్థాయికి చేరుకునేవాడ్ని కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు కామన్..వాటిని అధిగమిస్తే విజేతగా నిలవవచ్చు. వంద రోజులకు పైగా దేశవ్యాప్త యాత్రలో వేల మంది దివ్యాంగులను కలిసి వారికి మనోధైర్యం నింపాలన్నదే నా లక్ష్యం. – రవి వర్మ ఇటువంటి యాత్రలంటే ఇష్టం రవి వర్మకు ప్రమాదం జరగక ముందు నుంచి ఇంటువంటి యాత్రలు చేయడం ఇష్టం. ప్రమాదం జరిగిన తరువాత మేమంతా ధైర్యం కోల్పోయాం. రవివర్మ మాత్రం ధైర్యం తెచ్చుకొని తన సాధారణ జీవితం గడిపేలే ప్రయత్నించేవాడు. ఇప్పుడు ఇన్ని రోజులు కారు యాత్రకు వెళ్తూ అందరిలో స్ఫూర్తి నింపాలనుకోవడం చాలా గర్వంగా ఉంది. – తల్లి రాజేశ్వరి, సోదరి పూజిత. సాహసయాత్ర ప్రారంభం వీలుచైర్ కారు ద్వారా 24 వేల కిలోమీటర్లు యాత్ర చేస్తున్న రవివర్మ అందరికీ స్ఫూర్తి అని ఎంపీ ఎంవీవీ సత్యరాయణ అన్నారు. యాత్రను ఆయన సోమవారం బీచ్‌రోడ్డులో జెండా ఊపి ప్రారంభించారు. సాధారణ వ్యక్తికి సైతం 24 వేల కిలోమీటర్లు కారు యాత్ర చేయటం చాలా కష్టం. అటువంటిది రవివర్మ చేయడం నిజంగా సాహసమే. యాత్రలో ఎటువంటి ఇబ్బందుల లేకుండా విజవంతంగా పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్ రాజు, నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, జీవీ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: విశాఖలో ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం!) -
బీచ్‌రోడ్‌లో మతిస్థిమితం లేకుండా సుప్రీంకోర్టు న్యాయవాది
సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణ): ‘డూ యూ నో.. ఐయామ్ ఏన్ అడ్వకేట్ ’అంటూ బీచ్‌రోడ్‌లో కొంతకాలంగా మతిస్థిమితం లేని ఓ మహిళ అందరినీ పలకరిస్తూ కనిపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న టీఎస్సార్ కాంప్లెక్‌లోని నిరాశ్రయుల వసతిగృహం మేనేజర్ జ్యోతిర్మయి గురువారం సాయంత్రం వరకు ఆమె కోసం వెతికారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో బీచ్‌రోడ్డులోని బీట్ కానిస్టేబుళ్లకు ఆమె వివరాలు తెలియజేసి.. ఆచూకీ తెలిసిన వెంటనే తమకు చెప్పాలని కోరారు. శుక్రవారం ఉదయం ఆమెను గుర్తించిన పోలీసులు.. వసతి గృహానికి సమాచారం ఇచ్చారు. బీచ్‌రోడ్‌లో మతిస్థిమితం లేని ఆ మహిళ టీ తాగుతుండగా మేనేజర్ మాటామాట కలిపారు. దీంతో ఆమె ‘డూ యూ నో.. ఐయామ్ ఏన్ అడ్వకేట్’అంటూ సెక్షన్లు చకచకా చెప్పటం మొదలు పెట్టింది. అలా నెమ్మదిగా ఆమెను ఆటో ఎక్కించి.. టీఎస్సార్ కాంప్లెక్స్‌లోని మహిళల నిరాశ్రయ వసతి గృహానికి తీసుకువచ్చారు. ఆమెకు సపర్యలు చేసి దుస్తులు అందజేశారు. ఆహారం పెట్టి ఆశ్రయం కల్పించారు. మతిస్థిమితం లేని మహిళ ఆళ్ల రమాదేవి ఆమె వద్ద ఉన్న గుర్తింపు కార్డు ద్వారా ఆమె పేరు ఆళ్ల రమాదేవి, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ డైరెక్టరీలో నమోదు అయినట్లుగా తెలుసుకున్నారు. బార్ అసోసియేషన్ నంబర్ ఎ–00380, బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ నంబర్ డబ్ల్యూబీ/345/1995, బ్లాక్ నంబర్ 55, సౌత్ గణేష్‌నగర్ పి.ఒ అండ్ పీఎస్, శంకర్పూర్, ఢిల్లీ–110092, ఫోన్ నంబర్లు: 98117 36864, 98736 32929 ఉన్నాయని గుర్తించారు. ఆమె అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. రక్షణ కల్పించారు. ఆమెను మానసిక ఆస్పత్రిలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జ్యోతిర్మయి తెలిపారు. చదవండి: (Omicron Effect: నూతన సంవత్సర వేడుకలు రద్దు!) -
విశాఖ బీచ్ రోడ్ లో 22వ కార్గిల్ విజయ్ దినోత్సవం
-
అద్భుతాభిషేకం!
-
బీచ్ రోడ్డును ముంచెత్తిన వర్షపు నీరు
సాక్షి, విశాఖపట్నం : నగరంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాదాపు గంటపాటు కుండపోత వర్షం కురవడంతో బీచ్ రోడ్డులో మోకాలు లోతు వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విశాఖలో దాదాపు 8 సెం.మీ మేర వర్షం కురిసినట్టుగా తెలుస్తోంది. అయితే నగరంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లులు పడ్డాయి. మరోవైపు విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో భారీ వర్షం కురిసినట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
విశాఖలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు?
సాక్షి, మహారాణిపేట (విశాఖ దక్షిణం): ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విశాఖలో జరిగే అవకాశాలున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15న వేడుకలు ఎక్కడ నిర్వహించాలన్న దానిపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఆరా తీసినట్లు తెలిసింది. 2015లో గత టీడీపీ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవాన్ని విశాఖ బీచ్ రోడ్డులో నిర్వహించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సీఎంవో ఆరా తీయడంతో అధికార యంత్రాగం అప్రమత్తమైంది. స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు అనువైన ప్రాంతాల కోసం అన్వేషణ చేస్తున్నారు. ఆర్కే బీచ్ రోడ్డు లేదా ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కలెక్టర్ వినయ్‌చంద్ వివిధ శాఖల అధికారులతో చర్చించారు. ఈ ప్రాంతాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. అయితే విశాఖలో ఎక్కడ నిర్వహించాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. -
‘బొమ్మ’.. బొరుసు..!
నాణేనికి బొమ్మా బొరుసు ఉన్నట్లుగానే..బీచ్‌రోడ్‌లో విగ్రహాల ఏర్పాటు.. తొలగింపు వ్యవహారంలోనూ రెండు పార్శా్వలు ఉన్నాయి.. భిన్నమైన వాదనలూ వినిపిస్తున్నాయి.ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే.. దాదాపు ఏడు నెలల క్రితం రాత్రికి రాత్రే హడావుడిగా విగ్రహాలు ఏర్పాటు చేయడం..దానిపై రచ్చ జరగడం.. వివాదం న్యాయస్థానం మెట్లెక్కడం.. హైకోర్టు హెచ్చరికలు.. అయినా ఇన్నాళ్లూ జీవీఎంసీ మౌనముద్ర.. చివరికి కోర్టు ధిక్కరణ నోటీసుల వరకు రావడం.. ఇలా ఆది నుంచి ఈ బొమ్మల కథ వివాదాలమయంగానే కొనసాగింది.ఎట్టకేలకు హైకోర్టు అక్షింతలతోనే విగ్రహాలు తొలగించినా.. అదీ అర్ధరాత్రే పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేయడంతో విగ్రహాల కథ ముగిసిందనిపిస్తోంది.కానీ.. దాని వెనుకా రాజకీయమే నడిచిందనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ బొమ్మల కథ కంచికి చేరిందా?.. కొత్త రూపంలో మళ్లీ తెరపైకి వస్తుందా??.. అన్నదే ఆసక్తికరం. విశాఖసిటీ : బీచ్‌రోడ్డులో ముగ్గురు ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు రాజకీయంగా రచ్చకు దారితీసింది. కొన్ని సంస్థలు ఆర్కే బీచ్‌లో గత నవంబర్ 30న రాత్రి ఉన్నపళంగా దివంగత దాసరి నారాయణరావు, దివంగత అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాలను ఏర్పాటు చేశాయి. జీవీఎంసీ పరిధిలో ఎక్కడైనా విగ్రహం ఏర్పాటు చెయ్యాలంటే సంబంధిత జోన్ కార్యాలయంలోముందుగా దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే జీవీఎంసీ స్టాట్యూ కమిటీ ఛైర్మన్కైనా దరఖాస్తు చేసుకోవాలి. వారి నుంచి అనుమతి వస్తేనే విగ్రహం ఏర్పాటు చెయ్యాలి. నగరంలో కొన్ని చోట్ల మహనీయుల విగ్రహాల ఏర్పాటు దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. కానీ బీచ్‌రోడ్డులో మాత్రం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రాత్రికి రాత్రే దిమ్మలు నిర్మించేసి.. విగ్రహాలు ఏర్పాటు చేసేశారు. వీటిని సాక్షాత్తు మంత్రి గంటా శ్రీనివాసరావే ప్రారంభించారు. హైకోర్టు ఆగ్రహం ఈ వ్యవహారం టౌన్ ప్లానింగ్ సిబ్బందికి తెలీకుండా ఎలా జరుగుతుందంటూ అప్పట్లో జీవీఎంసీ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేయడం.. దానికి తోడు అడ్డగోలుగా విగ్రహాలు ఏర్పాటుపై సామాజిక ఉద్యమకారుడు బొలిశెట్టి సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించడంతో రచ్చ మొదలైంది. పూర్తిస్థాయి విచారణ తర్వాత పిల్ నం.19/2019ను హైకోర్టు స్వీకరించింది. అసలు విగ్రహాలు ఎందుకు ఏర్పాటు చేశారు.? ఎవరి అనుమతితో ఏర్పాటు చేశారు? ఇంత తతంగం జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదని హైకోర్టు ప్రశ్నిస్తూ జీవీఎంసీకి నోటీసులు జారీ చేసింది. రెండు నెలలు గడిచినా వాటిని తొలగించకపోవడంతో బొలిశెట్టి మరోసారి హైకోర్టు మెట్లెక్కారు. కార్పొరేషన్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీతో పాటు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జోన్–2 కమిషనర్ నల్లనయ్య, అక్కినేని కళాసాగర్ అధ్యక్షుడు పొన్నాడ మోహనరావులకు నోటీసులు జారీ చేసింది. వీరిని ప్రతివాదులుగా చేర్చుతూ వాదనలు వినిపించేందుకు రెండు వారాల గడువు విధించింది. వాదనలు వినిపించాలని స్పష్టం చేసింది. అయినా.. స్పందన లేకపోవడంతో కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. నోటీసుల జారీతో కదలిక కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ కావడంతో జోన్–2 టౌన్ ప్లానింగ్ అధికారులు ఉలిక్కిపడ్డారు. విగ్రహాల వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందనే ఆందోళనతో వాటిని తొలగించేందుకు సిద్ధపడ్డారు. పగటి పూట అయితే అవాంతరాలు ఎదురవుతాయని, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో సోమవారం అర్థరాత్రి పోలీస్ బందోబస్తు నడుమ విగ్రహాల్ని తొలగించేశారు. దిమ్మలను జేసీబీలతో తొలగిస్తున్న సిబ్బంది కేసు పెండింగ్‌లో ఉంది మరోవైపు ఈ కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. గత నెలలో కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ కావడంతో విగ్రహాల తొలగింపునకు జీవీఎంసీ సిద్ధమైంది. వేసవి సెలవులు పూర్తయిన తర్వాత కేసు విచారణకు రానున్న నేపథ్యంలో ముందుగానే మేల్కొన్న జీవీఎంసీ అధికారులు విగ్రహాల్ని తొలగించేశారు. ఇన్ని రోజులూ దీనిపై స్పందించని టౌన్‌ప్లానింగ్ అధికారులు రాత్రికి రాత్రే ఎందుకీ నిర్ణయం తీసుకున్నారన్నదానిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే ఈ వ్యవహారం నడిచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలను తూచ తప్పకుండా అమలు చేశారంటూ పలువురు విమర్శిస్తున్నారు. కాగా విగ్రహాలను హఠాత్తుగా రాత్రికి రాత్రి తొలగించడంపై జోన్–2 ఏసీపీ నాయుడు సమాధానం దాటవేస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న కారణంగా.. విషయాలు చెప్పకూడదని వ్యాఖ్యానించారు. -
నాన్న మాట.. బంగారు బాట..
విశాఖ సిటీ: వృత్తి అమ్మలాంటిది.. అన్నం పెడుతుంది.. పది మందికి ఉపాధి కల్పించేది వ్యాపారమే అనే సిద్ధాంతం నాన్న చెబుతుంటే విన్న మంచుకొండ శ్రీవైష్ణవి ఆలోచనలు చిన్నతనం నుంచే వ్యాపారం వైపు సాగాయి. ఓవైపు చదువుతూ.. మరోవైపు.. వాణిజ్య రంగంలో రాణించాలన్న ఆమె ఆలోచనలకు నాన్న అప్పలరాజు శ్రీరంగ పెట్టుబడి అందించారు. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతూ.. ఎనిమిది నెలల క్రితం తన సొంత ఆలోచనలతో బొటిక్ ప్రారంభించింది. తన కుటుంబం బ్రాండ్ నేమ్ ఎంవీఎస్ పేరు కలగలిసేలా ఎంవీఎస్ 92.5 సిల్వర్ బొటిక్ పేరుతో బీచ్‌రోడ్డులో తన స్టార్టప్‌ను ప్రారంభించింది. రెగ్యులర్ జ్యుయలరీ షాపుల్లో సిల్వర్ ఆభరణాలు దొరికినా.. అంతకుమించిన వెరైటీలు, అందరికీ అందుబాటులో ఉండే ధరలతో తన కలల వ్యాపారాన్ని ప్రారంభించిన శ్రీవైష్ణవి.. రెండు నెలల్లోనే ఫేమస్ అయిపోయింది. అమ్మాయిల అభిరుచికి అనుగుణంగానూ, భిన్నమైన కుటుంబ సభ్యుల ఆలోచనలను అందుకునేలా వెరైటీలు దొరికే బొటిక్‌గా దూసుకుపోతోంది. అంతే కాదు.. నగరంలో సరైన ఉపాధి లేని స్వర్ణకారులకు ఆసరాగా నిలుస్తోంది. -
‘అర్ధరాత్రి’ విగ్రహాలపై హైకోర్టు నోటీసులు
విశాఖసిటీ: ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే బీచ్ రోడ్డులో రాత్రికి రాత్రి విగ్రహాలు ఏర్పాటు చేయడం.. ఆపై వాటిని ఆవిష్కరించడంపై పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయగా హైకోర్టు విచారణకు స్వీకరించింది. గతేడాది నవంబర్ 30వ తేదీన రాత్రికి రాత్రే దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాల్ని ఏర్పాటు చేసి వాటిని ఆవిష్కరించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే విగ్రహాలు ఏర్పాటు చెయ్యడంపై జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాధ్యులకు వెంటనే నోటీసులు జారీ చెయ్యాలని జోన్–2 అధికారులను ఆదేశించారు. దీంతో డిసెంబర్ 1వ తేదీన జోన్–2 కమిషనర్ నల్లనయ్య విగ్రహాలు ఏర్పాటు చేసి వారికి నోటీసులు జారీ చేశారు. రెండు నెలలు గడుస్తున్నా వాటిని తొలగించలేదు. అయితే దీనిపై బొలిశెట్టి సత్యనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) వేశారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత పిల్ నం.19/2019ను హైకోర్టు శుక్రవారం స్వీకరించింది. పిల్‌ను పూర్తిగా పరిశీలించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీతో పాటు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జోన్–2 కమిషనర్ నల్లనయ్య, అక్కినేని కళాసాగర్ అధ్యక్షుడు పొన్నాడ మోహనరావుకి నోటీసులు జారీ చేసింది. వీరిని ప్రతివాదులుగా చేర్చుతూ వాదనలు వినిపించేందుకు రెండు వారాల గడువు విధించింది. వాదనలు వినిపించాలని స్పష్టం చేసింది.దీనిపై పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని బీచ్‌రోడ్డులో ఏర్పాటు చేసేందుకు 2017 ఆగస్ట్‌లో యునైటెడ్ దళిత్ ఫ్రంట్ దరఖాస్తు చేసుకుంటే.. ఇంత వరకూ పట్టించుకోకపోవడం గర్హనీయమన్నారు. కానీ ఇలా రాత్రికి రాత్రే మూడు విగ్రహాలు పెట్టినా కలెక్టర్, కమిషనర్ ఏమీ చెయ్యకుండా విడిచిపెట్టడాన్ని సహించలేకే పిల్ వేశానని తెలిపారు. విగ్రహాలు ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదనీ, నిబంధనలకు విరుద్ధంగా వాటిని ఏర్పాటు చెయ్యడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. -
బీచ్‌రోడ్డులో ఇసుక లారీ బీభత్సం
విశాఖపట్నం , అల్లిపురం(విశాఖ దక్షిణ): బీచ్‌రోడ్డు నోవాటల్ డౌన్లో ఇసుకలారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుకుని జీవీఎంసీ గోడను ధ్వంసం చేసి సమీపంలోని చిన్నపిల్లల పార్కు వరకు దూసుకుపోయింది. వేకువజామున కావడంతో జనసంచారం లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. మహారాణిపేట పోలీసులు, లారీ డ్రైవర్ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం... పంజాబ్ లారీ శ్రీకాకుళం నుంచి విశాఖలో ఫిషింగ్ హార్బర్‌కు ఇసుకలోడుతో వస్తుంది. గురువారం వేకువజామున 4గంటల సమయంలో జిల్లా కోర్టు రోడ్డు నుంచి పందిమెట్ట మీదుగా నోవాటల్ డౌన్ దిగుతుంది. ఆ సమయంలో ఒక్కసారిగా లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ రాంబాబు లారీని అదుపు చేయలేక ఎదురుగా గల ఫుట్‌పాత్‌ను ఢీకొని, సందర్శకులు కూర్చునే గోడను ఢీకొట్టడంతో అవతల రోడ్డులోకి ఒరిగిపోయింది. దీంతో లారీ ముందు చక్రాలు, సాసీ విరిగిపోవడంతో అక్కడ కూలబడిపోయింది. లారీ ప్రమాదానికి గురైన సమయంలో డ్రైవర్‌తో పాటు క్లీనర్, ముగ్గురు కూలీలు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. వేకువజామున 4గంటల సమయంలో కావడంతో అంతగా జనసంచారం లేకపోవడంతో ప్రమాదతీవ్రత తగ్గింది. గతంలో ఇక్కడే 2016లో స్కూల్‌బస్సు ఒకటి డౌన్లో బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన నగరవాసులు మరిచిపోక ముందే మరో ప్రమాదం అదే ప్రదేశంలో చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. -
ఆ హోటల్‌కు అక్రమాలే పునాది
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం.. పత్రికల్లో వార్తలు వచ్చినా, అధికారుల చర్యలు చేపట్టినా.. కొద్దిరోజులు పనులు ఆపేసినట్లు నటించి.. దృష్టి మళ్లించడం.. అందరూ దాన్ని మర్చిపోగానే మళ్లీ అక్రమ నిర్మాణాలు కొనసాగించడం సాధారణ తంతుగా మారిపోయింది..బీచ్‌రోడ్డులో సాగర్‌నగర్ సమీపంలో ప్రస్తుతం చకచకా సాగుతున్న ఒక హోటల్ నిర్మాణమే దీనికి నిదర్శనం. సముద్రతీరానికి సమీపంలో కొన్ని మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని సీఆర్‌జెడ్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దానికి విరుద్ధంగా సాగరతీరాన్ని ఆనుకొనే హోటల్ నిర్మాణానికి ఎలా అనుమతించారో.. లేక అనుమతి తెచ్చుకున్నామని నిర్వాహకులు మభ్యపెడుతున్నారో తెలియదుగానీ.. రెండేళ్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ తంతు జరుగుతోంది. అధికారులు హెచ్చరించినప్పుడు కొద్దిరోజులు నిర్మాణం నిలిపివేయడం.. మళ్లీ ప్రారంభించడం.. ఇదీ వరస.. అలా మొత్తానికి నిర్మాణాన్ని దాదా పు పూర్తి చేసేశారు. దీనికోసం ప్రభుత్వం నిర్మించిన ఫుట్‌పాత్‌ను, డివైడర్లను ఇష్టారాజ్యంగా తొలిగించేసినా పట్టించుకునేవారు లేరు. అక్రమ నిర్మాణాన్ని కూల్చేయాల న్న ధ్యాస కూడా అధికారులకు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరిలోవ(విశాఖ తూర్పు): సామాన్యుడు కష్టపడి చిన్న ఇల్లు నిర్మించుకుంటే.. మెట్లు కాలువ మీదకు వచ్చేశాయని.. శ్లాబ్ రోడ్డువైపు బయటకు వచ్చేసిందని హడావుడి చేసి.. కూల్చేసే టౌన్ ప్లానింగ్ అధికారులు సముద్రుడి సాక్షిగా.. తామే ఇచ్చిన నోటీసులను సైతం ఖాతరు చేయకుండా కోస్టల్ రెగ్యులేషన్ జోన్(సీఆర్‌జెడ్) నిబంధనలకుపాతరేస్తున్న బడా నిర్మాణదారుల పట్ల మాత్రం ఉపేక్ష వహిస్తున్నారు. ఫలితంగా సాగర్‌నగర్ వద్ద సముద్ర తీరానికి దాదాపు ఆనుకొని ఓ హోటల్ నిర్మాణం దర్జాగా సాగిపోతోంది. జీవీఎంసీ, రెవె న్యూ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చినా.. ఇప్పుడు కళ్లు మూసుకున్నారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు దీనివైపు కన్నెత్తి చూడటం లేదు. జోడుగుళ్లుపాలెం నుంచి రుషికొండ వరకు బీచ్‌రోడ్డు ఆనుకొని సీఆర్‌జెడ్ నిబంధనలు వర్తిస్తాయి. ఈ రోడ్డు నుంచి సముద్రం వైపు ఎలాంటి కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టకూడదు. పూర్తికావచ్చిన నిర్మాణాలు ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ హోటల్ నిర్మాణం పక్కాగా జరిగిపోతోంది. ఇందులో శ్లాబుతో రెండు గదులు నిర్మించారు. పలుచోట్ల కాంక్రీట్ ఫ్లోర్లు వేశారు. సిమెంట్ పలకలు అమర్చి హోటల్ లోపలికి మార్గాలు కూడా నిర్మించేశారు. సాగరతీరంలో చెక్కలతో తాత్కాలిక దాబాల నిర్మాణానికి వీఎంఆర్డీఏ అనుమతి ఇస్తోంది. బీచ్‌రోడ్డులో అటువంటి కొన్ని ఉన్నాయి. ఈ హోటల్ కూడా గతంలో అదేమాదిరిగా కంటెయినర్ హోటల్‌గా ఏర్పాటు చేశారు. చెక్కలు, రేకులతో గది మాదిరిగా ఏర్పాటుచేసి నిర్వహించారు. ప్రస్తుతం దాన్ని విస్తరించి నిబంధనలకు సమాధి కట్టారు. ఆ పునాదులపైనే పక్కా కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. రెండేళ్ల క్రితం నుంచే.. రెండేళ్ల కిందటే నుంచే ఈ హోటల్ విస్తరణకు నిర్వాహకులు సన్నాహాలు చేపట్టారు. అప్పటి రూరల్ తహసీల్దారు లాలం సుధాకర్‌నాయుడు అటవీశాఖ, రెవెన్యూ స్థలంలో నిర్మాణం చేపట్టకూడదంటూ పనులు నిలిపేశారు. దాంతో కొన్నాళ్లు నిలిపేసిన పనులను కొద్ది రోజుల క్రితం మళ్లీ ప్రారంభించి చకచకా కొనసాగిస్తున్నారు. ఇటీవల ఒకటో జోన్ టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించగా.. రెండు రోజుల పాటు పనులు నిలిపేసి మళ్లీ కొనసాగిస్తున్నారు. ఈసారి మాత్రం అధికారులు అటువైపు చూడటంలేదు. అంతా ఇష్టారాజ్యమే.. బీచ్ రోడ్డు పక్కన పాదచారుల కోసం నిర్మించిన ఫుట్‌పాత్‌ను కూడా హోటల్ యజమానులు వదల్లేదు. హోటల్ ముందు అడుగు ఎత్తులో ఉన్న ఫుట్‌పాత్‌ను రెండుచోట్ల తవ్వేశారు. హోటల్‌కు కస్టమర్లు రావడానికి మార్గం కోసం ఓ చోట, వాహనాల పార్కింగ్ కోసం మరోచోట తొలగించేశారు. అంతే కాకుండా బీచ్‌రోడ్డు రెండు లైన్ల మధ్య ఉన్న డివైడర్‌ను సైతం తొలగించేశారు. పూలమొక్కలు నాటిన డివైడర్‌ను తొలగించి ఇనుప గేటు ఏర్పాటు చేశారు. నగరం నుంచి వచ్చేవారు దీనికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలు పార్క్ చేసి.. రోడ్డుదాటి రావడానికి వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రోడ్డులో ఎక్కడపడితే అక్కడ పాదచారులు క్రాస్ చేయకూడదు. దాన్ని ఉల్లంఘిస్తున్న ట్రాపిక్ పోలీసులు దీనిపై దృష్టిపెట్టడం లేదు. నోటీసులు ఇచ్చాం సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం ఇక్కడ నిర్మాణం చేపట్టకూడదు. దాన్ని ఉల్లంఘించి నిర్మాణం చేపట్టిన నిర్వాహకులకు ఇటీవలే నోటీసులు ఇచ్చాం. దాంతో కొన్నాళ్లు పనులు నిలిపేశారు. ఆ హోటల్ నిర్వాహకులు వీఎంఆర్డీఏ అధికారుల నుంచి హోటల్ నిర్మాణానికి అనుమతి తెచ్చుకొన్నట్లుంది. ఫుట్‌పాత్, డివైడర్లు తవ్వేసిన అంశంపై వీఎంఆర్డీఏ అధికారులే స్పందించాలి. – వెంకటేశ్వరరావు, ఏసీపీ,ఒకటో జోన్, జీవీఎంసీ -
విశాఖ బీచ్ రోడ్డులో ప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, విశాఖపట్నం: పండుగ వేళ విశాఖ బీచ్ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. రుషికొండ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ముగ్గురు యువకులు భీమిలి నుంచి విశాఖ వైపు బీచ్ రోడ్డులో బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో.. ఇద్దరు యువకులు మృతి చెందగా, ఒకరి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను ప్రవీణ్, రాజీవ్‌గా గుర్తించారు. -
బైక్ రేసర్లపై కొరడా
విశాఖ క్రైం: నగర పరిధిలోని బీచ్‌రోడ్‌లో బైక్ రేసర్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా ఆదేశాల మేరకు శనివారం రాత్రి ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. భీమిలి, ఎంవీపీ, పీఎంపాలెం, వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, ఆరిలోవ పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీ నిర్వహించి 100 బైక్‌లను సీజ్ చేశారు. ఇందులో 13 బైక్‌లను మైనర్లు నడిపినట్టు గుర్తించారు. కొంత మంది మైనర్లు బైక్‌లు వదిలి వెళ్లిపోయారు. పోలీస్ బ్యారెక్స్‌లో ఆదివారం సీజ్ చేసిన బైక్‌లను ప్రదర్శనలో పెట్టి , రేసులో పాల్గొన్న యువకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ పకీరప్ప మాట్లాడారు. ఎవరైనా ద్విచక్ర వాహనాలను అతివేగంగా, సైలెన్సర్లు తీసి అధిక శబ్ధంతో నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాల పై విన్యాసాలు చేయడం, రేసింగ్‌లు పూర్తిగా నిషేధమన్నారు. ప్రత్యేక తనిఖీల్లో ట్రాఫిక్ నిబం ధనలను ఉల్లంఘించి నడిపిన 100 బైక్‌లను సీజ్ చేశామని, వాహనచోదకులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతూ రెండో సారి పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సీసీ కెమెరాలు, స్పీడ్ గన్ల ద్వారా బైక్‌రేసర్లను గుర్తిస్తామన్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా బైక్ రేసర్ల సమాచారం వచ్చిందని, నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని అన్నారు. పట్టుబడిన వారిలో ఇంటర్మీడియెట్ విద్యార్థి ఉన్నాడని, అతనిపై రెండు క్రిమినల్ కేసులు ఉన్నట్టు గుర్తించామన్నారు. వాహనాలు తల్లిదండ్రుల పేరు మీద ఉంటే.. వారికి జరిమానా విధిస్తామన్నారు. సీజ్ చేసిన బైక్‌లను డంపింగ్ యార్డుకు పంపిస్తున్నట్లు తెలిపారు. నగరంలో జీవీఎంసీ ఆధ్వర్యంలో 508, మెట్రిక్ సంస్థ ద్వారా 1,648 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని తెలిపారు. సమావేశంలో ట్రాఫిక్ ఏసీపీ కింజరాపు ప్రభాకర్, నాగేశ్వరరావు, సీఐలు శ్రీనివాస్, ఈశ్వరరావు, లక్ష్మణమూర్తి, సింహచలం, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. -
పవన్ కల్యాణ్ బయటకొచ్చారు..!
సాగర్‌నగర్ (విశాఖ తూర్పు): బీచ్ రోడ్డు రుషికొండ సాయిప్రియ రిస్సార్ట్స్‌లో విశ్రాంతి తీసుకుంటున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆదివారం ఎట్టకేలకు బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసి తిరిగి గదిలోకి వెళ్లిపోయారు. పవన్‌కల్యాణ్‌ను చూసేందుకు వందలాది మంది అభిమానులు రిస్సార్ట్స్కు చేరుకొని రెండు గంటల పాటు పడిగాపులు కాశారు. గది ఎదురుగా మెట్లపైనే కూర్చోని పవన్ కల్యాణ్‌ను నిరీక్షించారు. ఎట్టకేలకు గంట తర్వాత పవన్ కల్యాణ్ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసి వెంటనే తిరిగి లోపలకు వెళ్లిపోయారు. -
భాగస్వామ్య సదస్సుకు ముస్తాబు
విశాఖలో శనివారం నుంచి జరగనున్న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు బీచ్‌రోడ్డులోనిఏపీఐఐసీ మైదానం సిద్ధమవుతోంది. రూ.కోట్ల ఖర్చుతో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అల్లిపురం(విశాఖ దక్షిణ): సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల సదస్సుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వరుసగా మూడో సారి జరుగుతున్న భాగస్వామ్య సదస్సుకు ఇప్పటికే బీచ్‌రోడ్డులో ఏపీఐఐసీ స్థలంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. సమావేశ మందిరం, గెస్ట్ హాల్, డైనింగ్ హాల్ ఇలా అన్ని రకాల హంగులతో సదస్సు ప్రాంగణాన్ని ముస్తాబు చేయడంలో కార్మికులు తలమునకలై ఉన్నారు. దేశ విదేశాల నుంచి అతిథులు నగరానికి రానుండటతో అధికారులంతా వారి సేవకు సిద్ధమవుతున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పెట్టుబడులు ఆకట్టుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నం చేయనుంది. -
సాగరంలో ఓడ.. తీరంలో దేశివాళీ జాడ
బీచ్‌రోడ్డు సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన నాటు పడవ నడపుతున్న నావికుడి ఆకృతికి రంగులద్దుతున్న సమయంలో వెనకాల నీలి సముద్రంలో తేలియాడుతున్న నౌక దృశ్యం ఇలా ఆవిష్కృతమైంది.– ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
విశాఖ బీచ్ రోడ్లో మరో మ్యూజియం