
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖపట్నం: పండుగ వేళ విశాఖ బీచ్ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. రుషికొండ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ముగ్గురు యువకులు భీమిలి నుంచి విశాఖ వైపు బీచ్ రోడ్డులో బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో.. ఇద్దరు యువకులు మృతి చెందగా, ఒకరి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను ప్రవీణ్, రాజీవ్‌గా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment