Visakhapatnam: Supreme Court Lawyer Without Insanity on Beach Road - Sakshi
Sakshi News home page

బీచ్‌రోడ్‌లో మతిస్థిమితం లేకుండా సుప్రీంకోర్టు న్యాయవాది

Published Sat, Dec 25 2021 7:02 AM | Last Updated on Sat, Dec 25 2021 1:06 PM

Supreme Court Lawyer Without Insanity on Visakhapatnam Beach Road - Sakshi

సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌లో ఆమె వివరాలు  

సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణ): ‘డూ యూ నో.. ఐయామ్‌ ఏన్‌ అడ్వకేట్‌ ’అంటూ బీచ్‌రోడ్‌లో కొంతకాలంగా  మతిస్థిమితం లేని ఓ మహిళ అందరినీ పలకరిస్తూ కనిపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న టీఎస్సార్‌ కాంప్లెక్‌లోని నిరాశ్రయుల వసతిగృహం మేనేజర్‌ జ్యోతిర్మయి గురువారం సాయంత్రం వరకు ఆమె కోసం వెతికారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో బీచ్‌రోడ్డులోని బీట్‌ కానిస్టేబుళ్లకు ఆమె వివరాలు తెలియజేసి.. ఆచూకీ తెలిసిన వెంటనే తమకు చెప్పాలని కోరారు.

శుక్రవారం ఉదయం ఆమెను గుర్తించిన పోలీసులు.. వసతి గృహానికి సమాచారం ఇచ్చారు. బీచ్‌రోడ్‌లో మతిస్థిమితం లేని ఆ మహిళ టీ తాగుతుండగా మేనేజర్‌ మాటామాట కలిపారు. దీంతో ఆమె ‘డూ యూ నో.. ఐయామ్‌ ఏన్‌ అడ్వకేట్‌’అంటూ సెక్షన్లు చకచకా చెప్పటం మొదలు పెట్టింది. అలా నెమ్మదిగా ఆమెను ఆటో ఎక్కించి.. టీఎస్సార్‌ కాంప్లెక్స్‌లోని మహిళల నిరాశ్రయ వసతి గృహానికి తీసుకువచ్చారు. ఆమెకు సపర్యలు చేసి దుస్తులు అందజేశారు. ఆహారం పెట్టి ఆశ్రయం కల్పించారు.

మతిస్థిమితం లేని మహిళ ఆళ్ల రమాదేవి

ఆమె వద్ద ఉన్న గుర్తింపు కార్డు ద్వారా ఆమె పేరు ఆళ్ల రమాదేవి, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ డైరెక్టరీలో నమోదు అయినట్లుగా తెలుసుకున్నారు. బార్‌ అసోసియేషన్‌ నంబర్‌ ఎ–00380, బార్‌ కౌన్సిల్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌ డబ్ల్యూబీ/345/1995, బ్లాక్‌ నంబర్‌ 55, సౌత్‌ గణేష్‌నగర్‌ పి.ఒ అండ్‌ పీఎస్, శంకర్‌పూర్, ఢిల్లీ–110092, ఫోన్‌ నంబర్లు: 98117 36864, 98736 32929 ఉన్నాయని గుర్తించారు. ఆమె అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. రక్షణ కల్పించారు. ఆమెను మానసిక ఆస్పత్రిలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జ్యోతిర్మయి తెలిపారు. 

చదవండి: (Omicron Effect: నూతన సంవత్సర వేడుకలు రద్దు!) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement