
అభివాదం చేస్తున్న పవన్ కల్యాణ్ , అభిమానుల పడిగాపులు
సాగర్‌నగర్ (విశాఖ తూర్పు): బీచ్ రోడ్డు రుషికొండ సాయిప్రియ రిస్సార్ట్స్‌లో విశ్రాంతి తీసుకుంటున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆదివారం ఎట్టకేలకు బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసి తిరిగి గదిలోకి వెళ్లిపోయారు. పవన్‌కల్యాణ్‌ను చూసేందుకు వందలాది మంది అభిమానులు రిస్సార్ట్స్‌కు చేరుకొని రెండు గంటల పాటు పడిగాపులు కాశారు. గది ఎదురుగా మెట్లపైనే కూర్చోని పవన్ కల్యాణ్‌ను నిరీక్షించారు. ఎట్టకేలకు గంట తర్వాత పవన్ కల్యాణ్ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసి వెంటనే తిరిగి లోపలకు వెళ్లిపోయారు.

అభిమానుల పడిగాపులు
Comments
Please login to add a commentAdd a comment