బీచ్‌రోడ్‌ ప్రమాదంలో మరో విషాదం | visakha beach road accident, asp kishore daughter died | Sakshi
Sakshi News home page

బీచ్‌రోడ్‌ ప్రమాదంలో మరో విషాదం

Published Wed, May 3 2017 9:37 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

బీచ్‌రోడ్‌ ప్రమాదంలో మరో విషాదం - Sakshi

బీచ్‌రోడ్‌ ప్రమాదంలో మరో విషాదం

విశాఖపట్న: విశాఖ బీచ్‌రోడ్డులో స్కూల్‌ బస్సు సృష్టించిన బీభత్సంలో మరో ప్రాణం బలైంది. బీచ్‌ ప్రమాద ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయవాడ ఏఎస్పీ నందకిషోర్‌ కుమారుడు దేవగురు(11) బుధవారం మృతిచెందాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో కిషోర్‌ తండ్రి దూసి ధర్మారావు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కిషోర్‌ కుమార్తె మంజీర ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బస్సు ప్రమాదం ఎఎస్పీ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

విశాఖలో ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శ్రీ ప్రకాష్‌ విద్యాసంస్థకు చెందిన బస్సు.. నోవాటెల్‌ డౌన్‌ నుంచి వేగంగా దూసుకొచ్చి బీచ్‌ రోడ్డు గట్టుపై కూర్చొన్న వారిపైకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విజయవాడకు చెందిన దేవరగట్టు పద్మావతి, దేవరగట్టు ప్రసాదరావు, ఒకే కుటుంబానికి చెందిన పైడిపాల వెంకట్, పైడిపాల సునీత, పైడిపాల వేణుగోపాల్, అన్నపూర్ణ గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement