బీచ్‌రోడ్ ప్రమాదంలో మరో విషాదం
విశాఖపట్న: విశాఖ బీచ్‌రోడ్డులో స్కూల్ బస్సు సృష్టించిన బీభత్సంలో మరో ప్రాణం బలైంది. బీచ్ ప్రమాద ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయవాడ ఏఎస్పీ నందకిషోర్ కుమారుడు దేవగురు(11) బుధవారం మృతిచెందాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో కిషోర్ తండ్రి దూసి ధర్మారావు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కిషోర్ కుమార్తె మంజీర ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బస్సు ప్రమాదం ఎఎస్పీ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
విశాఖలో ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శ్రీ ప్రకాష్ విద్యాసంస్థకు చెందిన బస్సు.. నోవాటెల్ డౌన్ నుంచి వేగంగా దూసుకొచ్చి బీచ్ రోడ్డు గట్టుపై కూర్చొన్న వారిపైకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విజయవాడకు చెందిన దేవరగట్టు పద్మావతి, దేవరగట్టు ప్రసాదరావు, ఒకే కుటుంబానికి చెందిన పైడిపాల వెంకట్, పైడిపాల సునీత, పైడిపాల వేణుగోపాల్, అన్నపూర్ణ గాయపడ్డారు.