భాగస్వామ్య సదస్సుకు ముస్తాబు | International Partnership Conference in visakhapatnam | Sakshi
Sakshi News home page

భాగస్వామ్య సదస్సుకు ముస్తాబు

Published Fri, Feb 23 2018 11:39 AM | Last Updated on Fri, Feb 23 2018 11:39 AM

International Partnership Conference in visakhapatnam - Sakshi

విశాఖలో శనివారం నుంచి జరగనున్న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు బీచ్‌రోడ్డులోనిఏపీఐఐసీ మైదానం సిద్ధమవుతోంది. రూ.కోట్ల ఖర్చుతో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

అల్లిపురం(విశాఖ దక్షిణ): సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడుల సదస్సుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వరుసగా మూడో సారి జరుగుతున్న భాగస్వామ్య సదస్సుకు ఇప్పటికే బీచ్‌రోడ్డులో ఏపీఐఐసీ స్థలంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. సమావేశ మందిరం, గెస్ట్‌ హాల్, డైనింగ్‌ హాల్‌ ఇలా అన్ని రకాల హంగులతో సదస్సు ప్రాంగణాన్ని ముస్తాబు చేయడంలో కార్మికులు తలమునకలై ఉన్నారు. దేశ విదేశాల నుంచి అతిథులు నగరానికి రానుండటతో అధికారులంతా వారి సేవకు సిద్ధమవుతున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పెట్టుబడులు ఆకట్టుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నం చేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement