International Conference
-
సింధు లోయ లిపిని పరిష్కరిస్తే 10 లక్షల డాలర్ల నజరానా
చెన్నై: శతాబ్ద కాలానికి పైగా అపరిష్కృతంగా మిగిలి పోయిన సింధు నదీ లోయ నాగరికత కాలం నాటి లిపిని పరిష్కరించిన వారికి 10 లక్షల డాలర్ల బహుమానం అందజేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. సింధూ నాగరికతను వెలుగులో వచ్చి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును ఆదివారం ఆయన చెన్నైలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్..ఒకప్పుడు విలసిల్లిన సింధు లోయ నాగరికతకు చెందిన లిపిని ఇప్పటి వరకు స్పష్టంగా ఎవరూ అర్థం చేసుకో లేకపోయారని పేర్కొన్నారు. లిపిని పరిష్కరించేందుకు ఇప్పటికీ పండితులు ప్రయత్ని స్తూనే ఉన్నారన్నారు. ఈ దిశగా కృషి చేసి, విజయం సాధించిన వ్యక్తులు, సంస్థలకు ప్రోత్సా హంగా 10 లక్షల డాలర్ల బహుమానం అందజేస్తామని ప్రకటించారు. -
Sai Priyanka pagadala: అమ్మలాంటి అన్నదాత కోసం...
తల్లి తన ఆకలి గురించి పట్టించుకోదు. పిల్లల కడుపు నిండిందా లేదా అనేదే ఆమెకు ముఖ్యం. రైతులు కూడా అమ్మలాంటి వారే. అందుకే వారిపై దృష్టి పెట్టింది సాయిప్రియాంక. తాను పండించే పంటల ద్వారా ఎంతోమందికి పోషకాహార శక్తిని అందిస్తున్న రైతు ఆ శక్తికి ఎంత దగ్గరలో ఉన్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు... అనే ఆసక్తితో పరిశోధన బాట పట్టింది. తన పరిశోధన అంశాలను కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో వివరించడానికి సిద్ధం అవుతోంది.సాయిప్రియాంక చదువుకున్నది పట్టణాల్లో అయినా ఆమెకు పల్లెలు అంటేనే ఇష్టం. పల్లెల్లో పచ్చటి పొలాలను చూడడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే వ్యవసాయం గురించి తెలుసుకోవాలనే ఆసక్తికి కారణం అయింది. ఆ ఆసక్తే తనను ‘అగ్రికల్చరల్ సైంటిస్ట్’ను చేసింది.ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఫ్పీఆర్ఐ) అనేది వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం. పోషకాహార లోపానికి సంబంధించి పరిశోధన ఆధారిత పరిష్కారాలను అందించే సంస్థ ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర సంస్థలతో కలిసి ఈ సంస్థ ‘డెలివరింగ్ ఫర్ న్యూట్రిషన్ ఇన్ సౌత్ ఏషియా: కనెక్టింగ్ ది డాట్స్ ఎక్రాస్ సిస్టమ్స్’ అనే అంశంపై కొలంబోలో డిసెంబర్ 3,4,5 తేదీలలో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తోంది. పోషకాహారం దాని ప్రభావిత అంశాల గురించి చర్చించడానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు, విధానకర్తలు, పరిశోధకులను ఏకతాటిపై తీసుకు వస్తోంది.మన దేశం నుంచి ఆరుగురు ప్రతినిధులు ఈ ప్రతిష్ఠాత్మకమైన సదస్సులో పాల్గొనబోతున్నారు. వారిలో సాయి ప్రియాంక ఒకరు. తన పరిశోధనకు సంబంధించిన అంశాలను ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రియాంక వివరించనుంది. ప్రత్యేక గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పస్తాపూర్, అర్జున్ నాయక్ తాండా, బిడకన్నె గ్రామాలకు వ్యవసాయ పరంగా ప్రత్యేకత ఉంది. వీటిని ‘ప్రత్యేక గ్రామాలు’ అనుకోవచ్చు. కొర్రలు, సామలు, ఊదలులాంటి సిరిధాన్యాలతో పాటు సుమారు 20 రకాల ఆకుకూరలు సాగు చేస్తుంటారు అక్కడి రైతులు. రసాయనాలు వినియోగించకుండా సేంద్రియ పంటలను పండిస్తున్నారు. దక్కన్ డవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్)లాంటి సంస్థల ప్రోత్సాహంతో ఈ గ్రామాల్లోని రైతులు పౌష్టికాహారాన్ని ఇచ్చే ప్రత్యేక పంటలు సాగు చేస్తున్నారు.పత్తి, సోయా, చెరుకు లాంటి వాణిజ్య పంటలు సాగు చేసే గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లోని ప్రజలకు పౌష్టికాహారం ఏ మేరకు అందుతోందనే అంశంపై ఎంతోమంది రైతులతో మాట్లాడింది సాయిప్రియ.‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజెస్’ పేరుతో క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేస్తోంది. రైస్, పప్పులులాంటి ఒకేరకమైన ఆహారంతో పాటు ఆకు కూరలు, సిరిధాన్యాలు తీసుకోవడం ద్వారా ఆ మూడు గ్రామాల ప్రజలు మెరుగైన పౌష్టికాహారం పొందగలుగుతున్నారని ఆమె పరిశోధనల్లో తేలింది. ఈ గ్రామాలతో పాటు హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రామాల్లో కూడా పరిశోధనలు చేస్తోంది.ఐఏఆర్ఐలో పీహెచ్డీఖమ్మం పట్టణానికి చెందిన పగడాల సాయి ప్రియాంక పదో తరగతి వరకు ఖమ్మంలో, ఇంటర్ విజయవాడలో చదువుకుంది. తల్లిదండ్రులు రాజరాజేశ్వరి, నర్సింహరావులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ‘డాక్టర్ కావాల్సిందే’ ‘ఇంజనీర్ కావాల్సిందే’లాంటి సగటు తల్లిదండ్రుల ఆలోచనకు దూరంగా కూతురుకి వ్యవసాయ రంగంపై ఉన్న ఆసక్తిని ప్రోత్సహించారు.వ్యవసాయ పరిశోధనపై ఎంతో ఆసక్తి ఉన్న సాయి ప్రియాంక అశ్వారావుపేటలో బీఎస్సీ అగ్రికల్చర్, మేఘాలయలోని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఢిల్లీలోని ఐఏఆర్ఐ (ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో పీహెచ్డీ చేస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్ ‘కృషి విజ్ఞాన కేంద్రం’లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సైంటిస్ట్‌గా పనిచేస్తోంది.‘ఇవి మాత్రమే మనం చేరుకోవాల్సిన గమ్యాలు’ అని యువతరం ఒకే వైపు దృష్టి సారించినప్పుడు ఎన్నో రంగాలు మూగబోతాయి. ఆ రంగాలలో పరిశోధనలు ఉండవు. ప్రగతి ఉండదు. విభిన్న ఆలోచనలు ఉన్న సాయిప్రియాంక లాంటి అమ్మాయిలు తాము కొత్త దారిలో ప్రయాణించడమే కాదు ‘మనం ప్రయాణించడానికి, అన్వేషణ కొనసాగించడానికి ఒకే దారి లేదు. ఎన్నో దారులు ఉన్నాయి’ అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. ఈ కోణంలో సాయిప్రియాంక ‘కృషి’ యువతరంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది.సంతోషంగా ఉంది‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజ్’ అనే ్రపాజెక్ట్పై మూడు ప్రత్యేక గ్రామాల్లో నా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’లాంటి వాటి ఆధారంగా ఈ గ్రామాల్లో ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్‌ను తయారు చేస్తున్నాము. ఇతర గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లో కాస్త మెరుగైన పౌష్టికాహారం అందుతోంది. దక్షిణ ఆసియా దేశాలకు చెందిన సుమారు 600 మంది ప్రతినిధులతో కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అవకాశం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది.– సాయి ప్రియాంక, వ్యవసాయ శాస్త్రవేత్త పాత బాల ప్రసాద్, సాక్షి, సంగారెడ్డి -
భారత్ ఆహార మిగులు దేశంగా మారింది... అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
-
Narendra Modi: ఆహార మిగులు దేశంగా భారత్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ ఆహార మిగులు దేశంగా మారిందని, ప్రపంచ ఆహార, పౌష్టికాహార భద్రతకు పరిష్కారాలను అందించేందుకు కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. భారత ఆర్థిక విధానాలకు వ్యవసాయమే కేంద్ర బిందువని, ఆహార భద్రతకు చిన్న రైతులే అతి పెద్ద బలమని స్పష్టంచేశారు. శనివారం ఢిల్లీలో 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సులో ఆయన మాట్లాడారు. 65 ఏళ్ల క్రితం వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న భారత్ నేడు ఆహార మిగులు దేశంగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. పాలు, పప్పులు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందని, ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పత్తి, చక్కెర, టీ, చేపల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉందని తెలిపారు. ప్రపంచ సంక్షేమానికి భారత్‌ను ’విశ్వ బంధు’గా అభివరి్ణంచారు.ప్రకృతి సాగుతో సానుకూల ఫలితాలు ప్రకృతి వ్యవసాయాన్ని భారీగా ప్రోత్సహించడంతో దేశంలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని మోదీ తెలిపారు. సుస్థిరమైన, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోగల సాగు విధానాలపై ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. పంటల పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. గడిచిన పదేళ్లలో భిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే దాదాపు 1,900 కొత్త వంగడాలను రైతులకు అందజేసినట్లు చెప్పారు. సాంప్రదాయ రకాల కంటే 25 శాతం తక్కువ నీరు అవసరమయ్యే వరి రకాలను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. భారత తృణధాన్యాల బుట్టను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.సాంకేతికత పరిజ్ఞానంతో అనుసంధానం వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో అనుసంధానిస్తున్నామని మోదీ వెల్లడించారు. సోలార్ ఫార్మింగ్ మొదలుకుని ఈ–నామ్ తదితరాలను ఉదాహరించారు. సంప్రదాయ రైతుల నుండి అగ్రికల్చర్ స్టార్టప్‌ల వరకు, సహజ వ్యవసాయం నుండి ఫార్మ్ వ్యవసాయం వరకు వివిధ వ్యవసాయ, అనుబంధ రంగాల ఆధునీకరణ గురించి వివరించారు. పదేళ్లలో 90 లక్షల హెక్టార్లను మైక్రో ఇరిగేషన్ కిందకు తీసుకొచ్చామన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఒక్క క్లిక్‌తో 10 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ చేస్తున్నామన్నారు. పంటల సర్వే కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చామని చెప్పారు. తమ ప్రభుత్వం చేపట్టిన ఆధునిక చర్యలు భారతదేశంలోని రైతులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా ప్రపంచ ఆహార భద్రతను బలోపేతం చేస్తాయన్నారు. అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సుకు 70 దేశాల నుంచి వెయ్యి మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ నెల 7వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. -
ప్రపంచ ఆహార భద్రతకు భారత్ కృషి: ఆర్థికవేత్తల సదస్సులో ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: ప్రపంచ ఆహార భద్రతకు భారత్ కృషి చేస్తోందని.. మన దేశంలో ఆహార నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఢిల్లీలోని అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సమగ్ర వ్యవసాయ విధానంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.ఈ సదస్సులో 75 దేశాల ప్రతినిధులు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చహౌన్ పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్కరణల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు ప్రధాని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక విధానానికి వ్యవసాయమే కేంద్రం అని మిల్లెట్లు, పాలు, పప్పులు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు.2024-25 కేంద్ర బడ్జెట్లో సుస్థిర వ్యవసాయంపై పెద్దఎత్తున దృష్టి సారించామని ప్రధాని తెలిపారు. గత పదేళ్లలో ప్రభుత్వం కొత్త వాతావరణాన్ని తట్టుకోగల వెయ్యి 900 రకాల పంటలను అందించిందని చెప్పారు. భారతదేశం వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తోందని, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద, ఒక్క క్లిక్‌తో పది కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ చేస్తున్నామని ప్రధాని వివరించారు. -
ఏరోనాటికల్ సొసైటీ అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ‘ఏరోస్పేస్ & ఏవియేషన్ ఇన్ 2047’ అంతర్జాతీయ సదస్సు న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో శనివారం ప్రారంభమైంది. నవంబర్ 18, 19 తేదీల్లో రెండు రోజులపాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేశంలో ఏరోస్పేస్ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తూ 75 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాను ఏఈఎస్‌ఐని అభినందించారు. అనంతరం ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి, వివిధ పరిశ్రమల ఉత్పత్తులను సందర్శించి స్టార్టప్‌లతో సంభాషించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకుపోతోందని, సైన్స్‌లో భారతీయ మహిళల పాత్ర పెరుగుతోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. రక్షణ, టూరిజం శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ మాట్లాడుతూ రక్షణ రంగంలో దేశం సాధించిన విజయాలు, భారత ప్రభుత్వం విధాన సంస్కరణలు, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా డీఆర్డీవో చేస్తున్న కృషిని అభినందించారు. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి అతిథులను స్వాగతిస్తూ అధునాతన సామర్థ్యాల సాధనతో దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి అన్ని పరిశోధన, విద్యాసంస్థలు, పరిశ్రమల కృషిని సమన్వయం చేయడంలో ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా పాత్ర గురించి వివరించారు. అలాగే ఇస్రో చైర్మన్ సోమనాథ్, సీఎస్ఐఆర్ డీజీ డాక్టర్ కరైసెల్వి, డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ డాక్టర్ కామత్, ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్, వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, హాల్ చైర్మన్ అనంతకృష్ణన్, పౌర విమానయాన శాఖ సీనియర్ ఆర్థిక సలహాదారు పీయూష్, టాటా సన్స్ ప్రెసిడెంట్ బన్మాలి అగర్వాల్, యూఎస్ఏ జనరల్ అటామిక్స్ సీఈవో డాక్టర్ వివేక్ లాల్ తదితరులు ప్రసంగించారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖులు, నీతి ఆయోగ్ సభ్యులు, భారత ప్రభుత్వ కార్యదర్శులు, వివిధ సంస్థల అధిపతులు, అంతర్జాతీయ నిపుణులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, విద్యార్థులతో సహా 1,500 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపు 200 పరిశ్రమలు, ఎస్ఎంఈలు, 75 పైగా స్టార్టప్‌లు ఎగ్జిబిషన్లో తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. -
హైదరాబాద్‌కు చేరుకున్న అమెరికా వెళ్లిన ఏపీ విద్యార్థులు
-
జీడీపీ వృద్ధిలో ఎంఎస్ఎంఈలది కీలకపాత్ర
సాక్షి, విశాఖపట్నం: జీడీపీలో ఎంఎస్ఎంఈలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కేంద్ర ఎంఎస్ఎంఈ జాయింట్ సెక్రటరీ మెర్సీ ఇపావో తెలిపారు. విశాఖలో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫ్యాప్సీ)షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్‌పై శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆమె మాట్లాడారు. ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక రంగ వృద్ధికి దోహదపడటమే కాక.. ఉపాధికి ముఖ్య వనరులుగా ఉన్నాయని, గ్రామీణ, వెనకబడిన ప్రాంతాల్లో ఆర్థిక, ప్రాంతీయ అసమానతలను కూడా తగ్గిస్తున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి గతి శక్తి పథకంతో ఇవి మరింత బలోపేతమవుతున్నాయని వెల్లడించారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత విస్తరించడానికి తమ మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలు చేపడుతోందని, ఇందులో భాగంగా రుణ పరిధి పెంపు, ఆధునికీకరణకు ప్రోత్సాహం, సాంకేతిక సాయం, మౌలిక సదుపాయాల వృద్ధి, నైపుణ్యాల పెంపుదల, శిక్షణ అవకాశాల మెరుగుదల, మార్కెట్ల విస్తరణ, ఎగుమతుల ధ్రువీకరణ ప్రక్రియను మరింత సరళతరం చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. ఏపీ మారిటైం బోర్డు డెప్యూటీ సీఈవో లెఫ్టినెంట్ కమాండర్ బీఎం రవీంద్రరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి ఎగుమతుల ప్రోత్సాహానికి, మౌలిక సదుపాయాల విస్తృతానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఎగుమతులు, దిగుమతులు పెరగడంలో మారిటైం బోర్డు తోడ్పడుతోందన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న నాలుగు పోర్టుల ద్వారా కొత్తగా పలు పరిశ్రమలు వస్తాయని, ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. శ్రావణ్ షిప్పింగ్ సరీ్వసెస్ లిమిటెడ్ ఎండీ జి.సాంబశివరావు, ఫ్యాప్సీ అధ్యక్షుడు కరుణేంద్ర ఎస్ జాస్తి తదితరులు ప్రసంగించారు. ఫ్యాప్సీ ఉపాధ్యక్షుడు కంకటాల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
హరిత హైడ్రోజన్ వినియోగ విధానాలపై కసరత్తు
న్యూఢిల్లీ: దేశీయంగా హరిత హైడ్రోజన్ వినియోగానికి సంబంధించి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ కార్యదర్శి భూపిందర్ సింగ్ భల్లా తెలిపారు. పరిశ్రమ తగు స్థాయిలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా డిమాండ్‌ను మదింపు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా భల్లా ఈ విషయాలు పేర్కొన్నారు. 2030 నాటికి ప్రతిపాదిత హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో 70 శాతం భాగం ఎగుమతుల కోసం ఉద్దేశించినదై ఉంటుందని ఆయన తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించి భారత్‌ను ప్రపంచ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ఏడాది జనవరిలో కేంద్రం రూ. 19,744 కోట్లతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రణాళికను ఆమోదించింది. మరోవైపు, హరిత హైడ్రోజన్ వినియోగానికి మారే క్రమంలో సిబ్బందికి శిక్షణ కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోందని భల్లా పేర్కొన్నారు. -
కేయూలో మూడు రోజుల నుంచి జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు
కేయూ క్యాంపస్ : మొక్కలలో జన్యుసవరణలతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆస్ట్రేలియా ముర్దోక్ వర్సిటీ సైంటిస్టు ఎంజీకే జోన్స్ అన్నారు. కేయూలోని సేనేట్‌హాల్‌లో నిర్వహిస్తున్న ప్లాంట్ బయోటెక్నాలజీ ‘జీనమ్ ఎడిటింగ్‘ పై నిర్వహిస్తున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో బుధవారం ఆయన ప్రసంగించారు. ‘జీనోమ్ ఎడిటింగ్’ ద్వారా సృష్టించిన నూతన వంగడాలను, పంటలను ఏఏ దేశాలల్లో ఎలా ఉపయోగిస్తున్నారనే అంశంతోపాటు వాటి వినియోగం భవిష్యత్తులో ఎలా ఉంటుందో కూడా వివరించారు. అనంతరం పూణేలోని సావిత్రి బాయి ఫూలే యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీలమిత్ర .. టమాటా మొక్కల అభివృద్ధిలో వివిధ రకాల ఒత్తిళ్లు, కరువు పరిస్థితులను తట్టుకునేలా ఉండే ప్రయోగాలను వివరించారు, ఓయూ ప్రొఫెసర్ కేవీ రావు.. రసం పీల్చే పురుగులు, క్రిమి కీటకాలను తట్టుకునే పత్తి, వరి పంటల గురించి వివరించారు. భారతీయర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సతీశ్ కుమార్.. ట్రాన్స్‌జీన్ టెక్నాలజీ, పరిశోధన గురించి వివరించారు. మలేషియా మలయా యూనివర్సిటీ ప్రొఫెసర్ జెన్నిఫర్ అన్న హరికష్ణ.. జీవసాంకేతిక జన్యుసవరణల పరిశోధనల ద్వారా నిలబడే అరటి మొక్కలను గురించి వివరించారు. బెంగళూర్ టీఎఫ్ఆర్ ఎన్సీబీసీ శాస్త్రవేత్త పీవీ శివప్రసాద్.. ఆహార ఉత్పత్తి పెంచడానికి ఉన్న అవకాశాలు వివరించారు. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రకాశ్ పి కుమార్ మాట్లాడుతూ పంటల అభివృద్ధికి బయో టెక్నాలజీ పరిష్కారమన్నారు. కార్యక్రమంలో కేయూ బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్లు ఎన్ రామస్వామి, ఎ సదానందం, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు రోజారాణి, ఎంవీ రాజం, ప్రశాంత మిశ్రా, కోటా శ్రీనివాస్, కేవీ సరిత, రిటైర్డ్ ప్రొఫెసర్లు చేరాలు, మాధురి, కేయూ బయోటెక్నాలజీ విభాగం అఽధిప తి వెంకటయ్య, ఏవీ రావు, శాసీ్త్ర పాల్గొన్నారు.కాగా, అతిథులు సాంస్కతిక కార్యక్రమాలను వీక్షించారు. ఆకట్టుకున్న పోస్టర్ల ప్రజెంటేషన్స్.. కేయూలో బయోటెక్నాలజీ విభాగం, యూకే అబెర్విసిత్ వెల్స్ యూనివర్సిటీ కొలబరేషన్‌లో ప్లాంట్ బయోటెక్నాలజీ ‘జీనమ్ ఎడిటింగ్’ అనే అంశంపై నిర్వహిస్తున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో పలువురు పరిశోధకులు పోస్టర్లను ప్రజెంటేషన్ చేశారు. జీవసాంకేతిక పరిజ్ఞానంతో నూ తన వంగడాలు తదితర అంశాలపై అక్కడికి వచ్చిన పరిశోధకులు, విద్యార్థులకు తెలిపారు. 25 వరకు పోసర్లు ప్రజెంటేషన్ చేయగా అందులో ప్రతిభ ప్రదర్శించిన వారికి ప్రోత్సాహకంగా ఈనెల 29న ముగింపు సభలో బహుమతులు అందజేస్తారు. నేడు ముగియనున్న కాన్ఫరెన్స్ కేయూలో మూడు రోజుల నుంచి జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు గురువారం సాయంత్రం ముగి యనుంది. ఈముగింపు సదస్సుకు తెలంగాణ ఉన్న త విద్యామండలి చైర్మన్ లింబాద్రి, కేయూ మాజీ వీసీ విద్యావతి, కేయూ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రావు, రాజమండ్రి ఐసీఏఆర్, సీటీఆర్ఐ డైరెక్టర్ శేషుమాధవ్, కేయూ సైన్స్ డీన్ మల్లారెడ్డి, యూజీసీ కోఆర్డినేటర్ మల్లికార్జున్‌రెడ్డి, క్యాంపస్ కళాశాల ప్రిన్సి పాల్ సురేశ్‌లాల్ తదితరులు హాజరవుతారు. -
న్యాయనిపుణుల మధ్య సత్సంబంధాలు అవసరం
సాక్షి, హైదరాబాద్: న్యాయనిపుణుల మధ్య సత్సంబంధాలు అవసరమని, దీనికి పరిధి అంటూ లేదని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) చైర్మన్ ఆదిశ్ సి.అగర్వాల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భేటీలు జరిగినప్పుడే ఒకరి ఆలోచనలు మరొకరికి, ఒక దేశంలోని న్యాయవ్యవస్థ తీరు ఇతరులకు తెలుస్తుందని చెప్పారు. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ న్యాయ నిపుణుల భేటీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీని కోసం తెలంగాణ బార్ అసోసియేషన్‌లో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, హెచ్‌సీఏఏ చైర్మన్ పల్లె నాగేశ్వర్రావుతో శనివారం ఆయన భేటీ అయ్యారు. అనంతరం అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన 50 మంది న్యాయమూర్తులతోపాటు దేశంలోని హైకోర్టుల నుంచి 50 మంది న్యాయమూర్తులు హాజరవుతారన్నారు. ఈ సమావేశాల్లో న్యాయవాదుల భద్రత చట్టంపై చర్చ జరగనుందన్నారు. ఇప్పటికే కర్ణాటక, రాజస్తాన్‌ల్లో ఈ చట్టం అమల్లోకి వచ్చిందని.. త్వరలో తెలంగాణలో కూడా ఇది వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహకారంతోనే సమావేశాలు నడుస్తాయని, సీఎం కేసీఆర్ సహకారం అందిస్తారని ఆశిస్తున్నామని అగర్వాల్ తెలిపారు. న్యాయవాదుల సంక్షేమానికి సీఎం కృషి : న్యాయవాదుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించారని బీఎస్ ప్రసాద్ తెలిపారు. ఈ మొత్తంతో ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహించామని చెప్పారు. అంతర్జాతీయ సమావేశ నిర్వహణకు పలు రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేసినా, తెలంగాణ వేదిక కావడం సంతోషకరమని పల్లె నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏఏ మాజీ చైర్మన్ పొ న్నం అశోక్‌గౌడ్, ఉపాధ్యక్షుడు చెంగల్వ కల్యాణ్‌రావు, కార్యదర్శులు పులి దేవేందర్, కె.ప్రదీప్‌రెడ్డి, కోశాధికారి వెంగల పూర్ణశ్రీ, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ బైరెడ్డి, కార్యవర్గ సభ్యులు నాగులూరి క్రిష్ణకుమార్ గౌడ్, చైతన్య లత తదితరులు పాల్గొన్నారు. -
విశాఖకు అంతర్జాతీయ బ్రాండింగ్
-
జీవ వైవిధ్యానికి గొడుగు
మాంట్రియల్: ఏళ్ల తరబడి జరిగిన చర్చోపచర్చలు, సంప్రదింపులు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చాయి. భూమిపై జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే దిశగా కీలక ముందడుగు పడింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కెనడాలోని మాంట్రియల్లో డిసెంబర్ 7 నుంచి జరుగుతున్న కాప్–15 అంతర్జాతీయ సదస్సులో భారత్‌తో సహా దాదాపు 200 దేశాలు ఈ విషయంలో విభేదాలు వీడి ఒక్కతాటిపైకి వచ్చాయి. కీలకమైన కుమ్నింగ్–మాంట్రియల్ జీవవైవిధ్య ప్రణాళిక (జీబీఎఫ్)కు సోమవారం అంగీకారం తెలిపాయి. ఈ మేరకు ‘‘కున్మింగ్–మాంట్రియల్’ ఒప్పందం ఆమోదముద్ర పొందినట్టు సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న చైనా పర్యావరణ మంత్రి హువాంగ్ రుంక్యూ సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. పారిస్ ఒప్పందం తరహాలోనే పర్యావరణ పరిరక్షణ యత్నాల్లో దీన్నో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా వర్ధమాన దేశాల్లో భూ భాగాలు, సముద్ర జలాలతో పాటు జంతు జాతులను కాలుష్యం, వాతావరణ మార్పుల బారినుంచి పూర్తిస్థాయిలో రక్షించడం ఈ ఒప్పందం లక్ష్యం. అయితే ఇందుకు సమకూర్చాల్సిన ఆర్థిక ప్యాకేజీపై ఎంతోకాలంగా పడ్డ పీటముడి ఎట్టకేలకు వీడింది. ఆ మొత్తాన్ని ఇతోధికంగా పెంచి 2030 కల్లా ఏటా 200 బిలియన్ డాలర్లకు చేర్చాలని నిర్ణయం జరిగింది. 2020లో అంగీకరించిన మొత్తంతో పోలిస్తే ఇది రెట్టింపు! ఈ కీలక అంగీకారం నేపథ్యంలో ఒప్పందానికి మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా మొత్తం 23 లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వాటిని 2030కల్లా సాధించాలన్నది లక్ష్యం. దీన్ని పలు పర్యావరణ సంస్థలు స్వాగతించగా ఆర్థిక, పరిరక్షణపరమైన పలు కీలకాంశాలను పట్టించుకోలేదంటూ పర్యావరణవేత్తలు పెదవి విరుస్తున్నారు. దీన్ని ప్రపంచ ప్రజల విజయంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇంటర్నేషనల్ డైరెక్టర్ జనరల్ మార్కో లాంబెర్టినీ అభివర్ణించారు. అయితే, లక్ష్యసాధనకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక లేకపోవడం ఈ ఒప్పందంలో కీలక లోపమని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ గ్లోబల్ పాలసీ సీనియర్ డైరెక్టర్ లిన్ లీ అన్నారు. 50 ఏళ్లలో భారీ విధ్వంసం జీవ వైవిధ్యానికి గత 50 ఏళ్లలో కనీవినీ ఎగరని స్థాయిలో ముప్పు వాటిల్లింది. చాలా రకాల జీవ జాతులు 1970 నుంచి ఏకంగా 69 శాతం క్షీణించాయని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్–లివింగ్ ప్లానెట్ నివేదిక (ఎల్పీఆర్) పేర్కొంది. పర్యావరణానికి జరుగుతున్న ఈ అపార నష్టానికి అడ్డుకట్ట వేసి జీవ వైవిధ్యాన్ని పెంపొందించేందుకు తాజాగా ఒప్పందమైతే కుదిరింది. కాకపోతే దాని అమలులో దేశాలు ఏ మేరకు చిత్తశుద్ధి కనబరుస్తాయన్నది కీలకం. ఎందుకంటే ఇందుకోసం ఏటా 200 బిలియన్ డాలర్లు వెచ్చించేందుకు ఎట్టకేలకు అంగీకారం కుదిరినా, ఇందులో వర్ధమాన దేశాల అవసరాలు తీర్చేందుకు సంపన్న దేశాలు కేటాయించబోయే వాటా ఎంత వంటి కీలకాంశాలపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఒప్పందం లక్ష్యాలివీ... జీవ వైవిధ్య పరిరక్షణకు 2010లో జపాన్‌లోని నగోయాలో జరిగిన కాప్–10 సదస్సులో దేశాలన్నీ పలు లక్ష్యాలు నిర్దేశించుకున్నాయి. అవి చాలావరకు లక్ష్యాలుగానే మిగిలిపోయాయి. దాంతో మరోసారి అంతర్జాతీయ స్థాయి మేధోమథనం కోసం 2020 అక్టోబర్‌లో చైనాలోని కుమ్నింగ్‌లో తలపెట్టిన కాప్–15 సదస్సు కరోనా వల్ల వాయిదా పడింది. అది తాజాగా రెండు దశల్లో జరిగింది. తొలి భాగం వర్చువల్ పద్ధతిలో ముగియగా మాంట్రియల్లో డిసెంబర్ 7 నుంచి 19 దాకా జరిగిన కీలకమైన రెండో భాగంలో చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా మొత్తం 23 లక్ష్యాలను ప్రపంచ దేశాలు నిర్దేశించుకున్నాయి. వాటిలో ముఖ్యాంశాలు... ► 2030 కల్లా మొత్తం భూభాగం, సాధారణ జలాలు, తీర ప్రాంతాలు, సముద్రాల్లో కనీసం 30 శాతాన్ని పూర్తిస్థాయిలో సంరక్షించి, పరిరక్షించే చర్యలు చేపట్టడం. అపార జీవ వైవిధ్యానికి నిలయమైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడం. ప్రస్తుతం 17 శాతం భూభాగం, కేవలం 10 సముద్ర జలాల్లో మాత్రమే పరిరక్షణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ► జీవ వైవిధ్యపరంగా అపార ప్రాధాన్యమున్న ప్రాంతాల్లో పర్యావరణ నష్టాలను అరికట్టడం ► ఇందుకోసం పేద దేశాలకు చేసే కేటాయింపులను 2025కల్లా ఏటా 20 బిలియన్ డాలర్లకు, 2030 కల్లా 30 బిలియన్ డాలర్లకు పెంచడం. ► ప్రపంచ ఆహార వృథాను సగానికి తగ్గించడం. ► వనరుల విచ్చలవిడి వాడకాన్ని, తద్వారా వ్యర్థాల ఉత్పత్తిని వీలైనంత కట్టడి చేయడం. ► సాగులో పురుగు మందులు, ఇతర అత్యంత ప్రమాదకర రసాయనాల వాడకాన్ని కనీసం సగానికి తగ్గించడం. ► జీవ వైవిధ్యానికి అపారమైన హాని కలిగించే సాగు సబ్సిడీలను 2030 నాటికి ఏటా 500 బిలియన్ డాలర్ల చొప్పున తగ్గించడం. ► జీవ వైవిధ్య సంరక్షణకు దోహదపడే పథకాలు, చర్యలకు ప్రోత్సాహకాలను పెంచడం. ► భారీ, అంతర్జాతీయ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, తమ కార్యకలాపాల వల్ల పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి కలిగే నష్టాన్ని ఎప్పటికప్పుడు పారదర్శకంగా వెల్లడించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవడం. ► ఆ నష్టాలను అవి కనీస స్థాయికి పరిమితం చేసేలా చర్యలు తీసుకోవడం. -
COP 27: కాప్ 27లో కాక!
షెర్మెల్ షేక్ (ఈజిప్ట్): ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ పర్యావరణ సదస్సు కాప్ 27 దేశాల మధ్య ఉద్రిక్తతలకు వేదికగా మారింది. విషయం వాడివేడి చర్చల స్థాయిని దాటి ఏకంగా గొడవల దాకా వెళ్లింది. పలు కీలకాంశాలపై ఏకాభిప్రాయం మృగ్యమైంది. దాంతో శుక్రవారం ముగియాల్సిన ఈ 12 రోజుల సదస్సు శనివారమూ కొనసాగింది. అయినా పలు విషయాలపై పీటముడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఆతిథ్య దేశం ఈజిప్ట్ రూపొందించిన సంప్రదింపుల పత్రం పూర్తిగా నిస్సారమంటూ చాలా దేశాలు పెదవి విరిచాయి. అందులోని పలు అంశాలపై తీవ్ర అసంతృప్తి, అభ్యంతరాలు వెలిబుచ్చాయి. ఇలాగైతే గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమేనంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘1.5 డిగ్రీల లక్ష్యం’తో పాటు యూరోపియన్ యూనియన్ తాజాగా చేసిన చాలా ప్రతిపాదనలను సదరు పత్రంలో బుట్టదాఖలు చేయడంపై యూరప్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఒక దశలో అవి వాకౌట్ చేస్తామని ముక్త కంఠంతో హెచ్చరించే దాకా వెళ్లింది! ఇలాగైతే పత్రంపై యూరప్ దేశాలేవీ సంతకం చేయబోవని ఈయూ కుండబద్దలు కొట్టింది. వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు ప్రమాదకరంగా పెరిగిపోతే భారీగా ముంపు తదితర ముప్పును ఎదుర్కోవాల్సి వచ్చే ద్వీప దేశాల భద్రతను పత్రంలో అసలే పట్టించుకోలేదన్నది మరో అభ్యంతరం. మరోవైపు ఈజిప్ట్ ఈ ఆరోపణలన్నింటినీ ఖండించమే గాక ఆయా దేశాలపై ప్రత్యారోపణలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో సదస్సుకు హాజరైన 40 వేల పై చిలుకు ప్రతినిధుల్లో చాలామంది వెనుదిరుగుతుండటంతో ప్రాంగణమంతా బోసిపోయి కన్పిస్తోంది. మరోవైపు, విచ్చలవిడి పోకడలతో పర్యావరణ విపత్తులకు ప్రధాన కారకులైన సంపన్న దేశాలు వాటివల్ల తీవ్రంగా నష్టపోయిన పేద, వర్ధమాన దేశాలను ఆదుకునేందుకు భారీ పరిహార నిధి ఏర్పాటు చేయాలంటూ భారత్ సహా పలు దేశాలు చేసిన డిమాండ్‌పైనా చివరిదాకా ప్రతిష్టంభనే కొనసాగింది. ఎట్టకేలకు నిధి ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడినట్టు మధ్యవర్తులు శనివారం సాయంత్రం ప్రకటించారు. అయితే దానిపైనా ఏకాభిప్రాయం ఇంకా కుదరాల్సే ఉంది! ఇందుకోసం ఏటా ఏకంగా 100 బిలియన్ డాలర్లు వెచ్చస్తామంటూ 2009లో చేసిన వాగ్దానాన్ని సంపన్న దేశాలు ఇప్పటికీ నిలుపుకోకపోవడం గమనార్హం. మరోవైపు, ‘‘శిలాజ ఇంధనాల వాడకాన్ని వీలైనంత త్వరలో పూర్తిగా నిలిపేయాలన్నది గత సదస్సులోనే చేసిన ఏకగ్రీవ తీర్మానం. కానీ ఇప్పటికీ వాటి వాడకం పెరిగిపోతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. నిజానికి శిలాజ ఇంధన పరిశ్రమే సదస్సులో ప్రతి చర్చాంశాన్నీ తన కనుసన్నల్లో నియంత్రిస్తోంది’’ అంటూ వర్ధమాన దేశాలు ఆరోపణలు దుమ్మెత్తి పోస్తున్నాయి. -
మైనింగ్‌కు ప్రభుత్వ మద్దతు కావాలి
కోల్‌కతా: దేశాభివృద్ధికి మైనింగ్ కీలకమని, ఈ రంగానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరమని పరిశ్రమకు చెందిన ప్రముఖులు పేర్కొన్నారు. జీడీపీని ఎన్నో రెట్లు వృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రస్తావించారు. ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు, నియంత్రణపరమైన వెసులుబాటు కల్పించాలని, కీలకమైన ఖనిజాల మైనింగ్‌పై నియంత్రణలు తొలగించాలని మైనింగ్‌కు సంబంధించి సీఐఐ జాతీయ కమిటీ చైర్మన్, వేదాంత గ్రూపు సీఈవో సునీల్ దుగ్గల్ కోరారు. కోల్‌కతాలో జరిగిన అంతర్జాతీయ మైనింగ్ సదస్సు, 2022లో భాగంగా ఆయన మాట్లాడారు. వెలికితీతకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు కావాలని, అప్పుడే ఈ రంగంలో నూతన తరం కంపెనీలను ఆకర్షించొచ్చని సూచించారు. అలాగే, మైనింగ్‌కు సంబంధించి పర్యావరణ, అటవీ అనుమతులకు ఓ కాల పరి మితి ఉండాలన్నారు. భూ సమీకరణ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లోహాలు, ఖనిజాల వెలికితీత తక్కువగా ఉండడంతో, 2021లో వీటి దిగుమతుల కోసం 86 బిలియన్ డాలర్లను వెచ్చించాల్సి వచ్చిందని చెబుతూ.. ఇది 2030 నాటికి 280 బిలియిన్ డాలర్లకు పెరుగుతుందని హెచ్చరించారు. భారత్ వృద్ధి చెందాల్సి ఉందంటూ, వృద్ధికి మైనింగ్ కీలకమని ఇదే కార్యక్రమలో పాల్గొన్న కోల్ ఇండియా చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ పేర్కొన్నారు. జీడీపీలో మైనింగ్ వాటా ప్రస్తుతం 2–2.5 శాతంగా ఉంటే, 2030 నాటికి 5 శాతానికి చేర్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని గుర్తు చేశారు. స్థిరమైన ఉత్పాదకత, యాంత్రీకరణ, డిజిటైజేషన్ అవసరాన్ని ప్రస్తావించారు. మొబైల్, బ్యాటరీ, సోలార్ కోసం అవసరమైన కీలక ఖనిజాల మైనింగ్ సమయంలో కాలుష్యం విడుదలను తగ్గించడం కీలకమని బీఈఎంఎల్ చైర్మన్, ఎండీ అమిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధికి ఖనిజాలు కీలకమని ఎన్ఎండీసీ చైర్మన్ సుమిత్‌దేబ్ పేర్కొన్నారు. -
భారత సంప్రదాయ ఔషధాలపై అంతర్జాతీయ సదస్సు..
హరిద్వార్: పతంజలి రిసెర్చ్ ఫౌండేషన్ అండ్ పతంజలి యూనివర్సిటీ హరిద్వార్‌లో ‘భారతీయ సంప్రదాయ ఔషధాలు: ఆధునికీకరణ’ అన్న అంశంపై ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. సొసైటీ ఫర్ కన్జర్వేషన్ అండ్ రిసెర్చ్ డెవలప్మెంట్ ఆఫ్ మెడికల్ ప్లాంట్, న్యూఢిల్లీ అలాగే నాబార్డ్, డెహ్రాడూన్ భాగస్వామ్యంతో జరిగిన ఈ సదస్సులో వైద్య రంగంలో నిపుణులు, మేధావులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఆయుర్వేదంలో నిష్ణాతులు ఆచార్య శ్రీ బాలకృష్ణ జీ 50వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఒక ఆవిష్కరణ కార్యక్రమంలో యోగా గురు రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ తదితరులు. -
బెంగళూరులో స్టార్టప్స్ అంతర్జాతీయ సదస్సు
బెంగళూరు: స్టార్టప్ సంస్థలకు సంబంధించిన తొలి అంతర్జాతీయ సదస్సు.. ఇండియా గ్లోబల్ ఇన్నోవేషన్ కనెక్ట్ (ఐజీఐసీ) బెంగళూరులో గురువారం ప్రారంభమవుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును కర్ణాటక డిజిటల్ ఎకానమీ మిషన్ భాగస్వామ్యంతో అడ్వైజరీ సంస్థ స్మాద్యా అండ్ స్మాద్యా నిర్వహిస్తోంది. కాటమారన్ వెంచర్స్, టాటా డిజిటల్ తదితర సంస్థలు స్పాన్సర్ చేస్తున్నాయి. తొలి ఐజీఐసీ సదస్సులో భారత్‌తో పాటు సింగపూర్, ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్, అమెరికా, జపాన్, కొరియా, జర్మనీ తదితర దేశాల నుండి 80 మంది పైగా వక్తలు పాల్గొంటున్నారు. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్ సాఫో మొదలైన వారు వీరిలో ఉన్నారు. ఇందులో 22 సెషన్లు ఉంటాయి. ఔత్సాహిక వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు, టాప్ వెంచర్ క్యాపిటలిస్టులకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చాగోష్టులు ఉంటాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ కాన్ఫరెన్స్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా నవకల్పనల సూచీలో 2016లో 66వ స్థానంలో నిల్చిన భారత్ ప్రస్తుతం 46వ ర్యాంకుకు ఎగబాకిందని, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థగా మారిందని స్మాద్యా అండ్ స్మాద్యా అడ్వైజరీ ప్రెసిడెంట్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం మాజీ ఎండీ క్లాడ్ స్మాద్యా తెలిపారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ఐజీఐసీ.. భారత అంకుర సంస్థల సామర్థ్యాలు, ఆవిష్కరణల గురించి ప్రపంచానికి చాటి చెప్పేందుకు మంచి వేదిక కాగలదని ఆయన పేర్కొన్నారు. -
వైద్యులు పరిశోధనలపై దృష్టి సారించాలి
తిరుపతి తుడా: అంతర్జాతీయ సదస్సులో జరిగే చర్చలు సమాజానికి మేలుకలిగేలా ఉండాలని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల ఆవరణలోని ప్రేమసాగర్‌రెడ్డి భవనంలో ఎస్వీ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఐ.ఎం.ఎ. సహకారంతో ‘న్యూరో సైన్సెస్’పై నిర్వహించిన 15వ అంతర్జాతీయ సదస్సును ఆదివారం ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు, పరిశోధకులు, ప్రాక్టీస్ చేసే న్యూరాలజిస్టులు, వర్థమాన విద్యార్థులు తమ పరిశోధన ఫలితాలను ప్రపంచ నిపుణులతో పంచుకోవాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లకు అంతర్జాతీయ వేదికను ఎంచుకోవడం వల్ల వారిలో కొత్త ఆలోచనలను ప్రేరేపించవచ్చని చెప్పారు. న్యూరాలజీ స్పెక్ట్రమ్ అంతటా న్యూరోలాజికల్ సమస్యలతో జీవిస్తున్న వారి జీవితాలను మెరుగుపరచడం, మానసిక ఆరోగ్య శాస్త్రవేత్తలు, అభ్యాసకుల వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవడంతో పాటు పరస్పరం ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రపంచ ఆరోగ్యానికి కొత్త సాంకేతికత అప్లికేషన్లు, డయాగ్నస్టిక్ టెక్నిక్‌ల అభివృద్ధికి కొత్త శాస్త్రీయ విధానాలు ఎంతైనా అవసరమని చెప్పారు. వైద్యులు పరిశోధనలపై దృష్టిసారించాలని కోరారు. సుమారు 1,500 మంది వైద్యులు పాల్గొంటున్న ఈ సదస్సులో మనదేశం నుంచి 12 మంది వక్తలు, విదేశాల నుంచి ఏడుగురు అంతర్జాతీయ ప్రసిద్ధ వక్తలు తమ వైద్య వృత్తిలోని జ్ఞానాన్ని అందించడం సంతోషించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. తిరుపతి నుంచి నిర్వాహక కమిటీ చైర్మన్, ఐఎంఏ ఎస్వీఎంసీ ప్రెసిడెంట్ డాక్టర్ రాయపు రమేష్, జనరల్ సెక్రటరీ డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ సతీష్ పాల్గొన్నారు. ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సహజానంద్ ప్రసాద్‌సింగ్, ఏపీడీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ బి.వెంగమ్మ, డాక్టర్ థామస్ మాథ్యూ, డాక్టర్ అతుల్ గోఝల్, తదితరులు వర్చువల్‌గా పాల్గొన్నారు. -
రూ.1,000 కోట్లతో స్టార్టప్ సీడ్ ఫండ్
న్యూఢిల్లీ: వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వచ్చే స్టార్టప్‌లకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కేంద్రం మరో విడత ప్రత్యేక నిధిని ప్రకటించింది. రూ.1,000 కోట్లతో ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్’ను ఏర్పాటు చేస్తున్నట్టు.. ప్రధాని నరేంద్ర మోదీ ‘స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సు’ ప్రారంభం సందర్భంగా వెల్లడించారు. 2016లో మోదీ సర్కారు స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సును ఆరంభించగా.. ఇది ఈ ఏడాదితో ఐదో వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. స్టార్టప్‌ల వృద్ధితో ఎన్నో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, ప్రజల జీవితాల ఉన్నతికి తోడ్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘‘స్టార్టప్‌లకు నిధులు అందించేందుకు రూ.1,000 కోట్లతో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నాము. ఇది నూతన స్టార్టప్‌ల ఏర్పాటుకు, వాటి వృద్ధికి సాయపడుతుంది’’ అని మోదీ ప్రకటించారు. ఈ ఫండ్ ఆఫ్ ఫండ్ పథకాన్ని స్టార్టప్‌లకు మూలధన నిధులు అందించేందుకు వినియోగించనున్నట్టు చెప్పారు. ఇకపై స్టార్టప్‌ల రుణ సమీకరణకూ మద్దతు ఉంటుందని ప్రకటించారు. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ (సదుపాయాలు)గా ఉందని తెలియజేస్తూ.. వినూత్నమైన టెక్నాలజీలు, ఆలోచనల తో వచ్చి, పెద్ద సంస్థలుగా అవతరించేందుకు ఇది తోడ్పడుతుందని చెప్పారు. -
శ్రీలంక అంతర్జాతీయ సదస్సుకు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ శ్రీలంక ఆధ్వర్యంలో ఈ నెల 30న జరిగే అంతర్జాతీయ వర్చువల్ సదస్సు లో ప్రసంగించాల్సిందిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు ఆహ్వానం అందింది. కరోనా వైరస్ నేపథ్యంలో ‘కోవిడ్–19 రీ షేప్ సౌత్ ఏషియా ఫ్యూచర్’అనే అంశంపై కేటీఆర్ ప్రసంగిస్తారు. సుమారు వంద దేశాల్లో 45 మిలియన్ల మంది సభ్యులు ఉన్న ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ పలు అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో సదస్సులు నిర్వహిస్తుంది. ఈ నెల 30న జరిగే వర్చువల్ సదస్సులో ఆ సంస్థ చైర్మన్ పాల్ పోల్మన్, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్, సోషల్ కమిషన్ ఫర్ ఏషియా పసిఫిక్ ముఖ్య కార్యదర్శి డాక్టర్ అర్మిడ సల్సియా అలిస్‌జబానాతో పాటు శ్రీలంక మాజీ మంత్రి రాణిల్ విక్రమ సింఘే పాల్గొంటారు. -
'న్యాయ వ్యవస్థతోనే అన్ని సమస్యలు పరిష్కారం'
సాక్షి, ఢిల్లీ : రెండు రోజల పాటు ఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ న్యాయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని, నిరంతర అధ్యయనంతోనే కొత్త విషయాలు తెలుసుకోవచ్చన్నారు. న్యాయవ్యవస్థ ద్వారానే సమస్యలు సులభంగా పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయని తెలిపారు. నేడు 130 కోట్ల మంది భారతీయులు తమ సమస్యలను న్యాయవ్యవస్థల ద్వారానే పరిష్కరించుకుంటున్నారని వెల్లడించారు. ఇటీవలే న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించిదన్నారు. ఈ సందర్భంగా తలాక్, మహిళలకు 26 వారాల ప్రసూతి సెలవులు,దివ్యాంగ హక్కులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అందరూ ప్రశంసించారన్నారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు న్యాయ వ్యవస్థ సముచిత న్యాయం కల్పించిదని కొనియాడారు. (కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది: ఉద్ధవ్ ఠాక్రే) ప్రస్తుతం డేటా భద్రత, సైబర్ క్రైమ్ వంటి నేరాలు పెరిగిపోతూ న్యాయవ్యవస్థకు సవాలుగా నిలిచిందని పేర్కొన్నారు. వీటిని పరిష్కరించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఉగ్రవాదం, సైబర్ క్రైహ్ అనేవి ప్రస్తుతం ప్రధాన సమస్యలుగా ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. కొత్త ఆలోచనలతో న్యాయ వ్యవస్థ ముందుకు రావాలని, సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి పని చేస్తే బాగుంటుందని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే, ఇతర కేంద్ర మంత్రులు,పలువురు సుప్రీంకోర్టు జడ్జిలు, న్యాయవాదులు, వివిధ దేశాల న్యాయనిపుణులు హాజరయ్యారు. -
ఉగ్ర సంస్థలకు పాక్ స్వర్గధామం కాబోదు
ఇస్లామాబాద్: ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఇప్పుడు స్వర్గధామం కాదని దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టంచేశారు. అఫ్గానిస్తాన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ అఫ్గానిస్తాన్‌లో శాంతినెలకొనాలని పాకిస్తాన్ కోరుకుంటోందని, పొరుగు దేశంలో అస్థిరత ఉండాలని ఎలా కోరుకుంటామని పేర్కొన్నారు. అంతర్జాతీయ మనీలాండరింగ్ నిరోధక సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పారిస్‌లో కీలక సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఇమ్రాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అడ్డుకునేందుకు పాక్ చర్యలు తీసుకోవట్లేదన్న ఆరోపణలతో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంపై ఈ సమావేశం జరగనుంది. భారత్ విధానాలతో సంక్షోభం భారత్‌లో ప్రస్తుతమున్న పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం తగిన చర్యలు తీసుకోక పోతే పాకిస్తాన్ శరణార్థుల రూపంలో మరో సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ‘హద్దుమీరిన జాతీయవాద సిద్ధాంతం వినాశనానికి దారితీస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. భారత్ తలచుకుంటే పాకిస్తాన్‌ను 11 రోజుల్లో నాశనం చేయగలదు అని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. -
నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి
సాక్షి, హైదరాబాద్: సాంప్రదాయ వ్యర్థాల నిర్వహణ పద్ధతులను ఉపయోగించుకుని ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా వాడుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. నీటి వ్యర్థాల నిర్వహణలో ప్రజల ఆలోచనా విధానం మారాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. నీటి వ్యర్థాల నిర్వహణపై హైదరాబాద్‌లోని ఓ హోటల్లో నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను గవర్నర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నీటి వ్యర్థాల నిర్వహణ సమస్యల పరిష్కారానికి ఒక నిర్ధిష్టమైన కార్యాచరణను రూపొందించాలని సూచించారు. కార్యాచరణ ప్రణాళికపై చర్చించడానికి రాజ్‌భవన్‌కు రావాలని విదేశీయులతో పాటు బారత ప్రతినిధి బృందాన్ని గవర్నర్ ఆహ్వానించారు. నీటి వ్యర్థాల శుద్ధికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ముంబైలో ప్రతి రోజూ 210 కోట్ల లీటర్ల నీటి వ్యర్థాలు వెలువడుతున్నాయని, వాటి వల్ల వేలాది హెక్టార్లలో పంటలు పండటం లేదని చెప్పారు. భారత్‌లోని కాస్మోపాలిటన్ నగరాల్లో 3,600 కోట్ల లీటర్ల నీటి వ్యర్థాలు వెలువడుతున్నాయని తెలిపారు. చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులు కలుషితం కావడంతో 30–90 హెక్టార్ల సాగుభూమి ప్రమాదంలో పడుతోందని గణాంకాలు చెబుతున్నాయని వివరించారు. నీటి వ్యర్థాల నిర్వహణపై తెలంగాణ పర్యావరణ పరిరక్షణ శిక్షణ, అధ్యయన సంస్థ, చికాగో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం శుభపరిణామమని అన్నారు. గవర్నర్ చేతుల మీదుగా వాటర్ మేనేజ్మెంట్ సావనీర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో «థాయ్‌లాండ్ ప్రతినిధి థానెట్, అమెరికా నుంచి కోన్లి ఎగ్గెట్, చికాగో ఎండబ్ల్యూఆర్డీ కమిషనర్ ప్రాంక్ అవీలా తదితరులు పాల్గొన్నారు. కల్యాణానికి రండి... యాదగిరిగుట్ట: ఈ నెల 26వ తేదీనుంచి ప్రారంభమయ్యే యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 4వ తేదీన నిర్వహించే శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణ వేడుకకు రావాలని కోరుతూ సోమవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆలయ ఈఓ గీతారెడ్డి, ప్రధాన అర్చకుడు నల్లంధీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు కలసి ఆహ్వానపత్రిక అందజేశారు. -
వ్యాజ్యాలకు ముందే మధ్యవర్తిత్వం
న్యూఢిల్లీ: వ్యాజ్యం దాఖలు కంటే ముందే మధ్యవర్తిత్వం జరిగేలా ‘తప్పనిసరి మధ్యవర్తిత్వ చట్టం’ తీసుకురావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే చెప్పారు. ‘ప్రపంచీకరణలో మధ్యవర్తిత్వ పాత్ర’ అన్న అంశంపై శనివారం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సదస్సు మూడవ ఎడిషన్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. వ్యాజ్యం దాఖలుకు ముందే మధ్యవర్తిత్వం జరిగితే కోర్టు తీర్పుల నాణ్యత పెరుగుతుందని, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గుతుందని చెప్పారు. మధ్యవర్తిత్వానికి సంబంధించిన ‘ఆర్బిట్రరీ బార్’ భారత్‌లో తయారు చేయడం క్లిష్టమైన ప్రక్రియ అని, దీనికి అనుభవంతో పాటు విషయ పరిజ్ఞానం కలిగిన లాయర్లు అవసరమవుతారని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యం, కామర్స్, ఇన్వెస్ట్మెంట్ వంటి వాటిలో మధ్యవర్తిత్వం మౌలిక అంశమని పేర్కొన్నారు. సరిహద్దులు దాటి వాణిజ్యం జరుగుతున్న ఈ రోజుల్లో మధ్యవర్తిత్వం అత్యవసరమని తెలిపారు. మధ్యవర్తిత్వం కంటే రాజీ కుదర్చడం ఇంకా ఉత్తమమైనదని చెప్పారు. వాణిజ్య న్యాయస్థాన కోర్టుల చట్టం కూడా మధ్యవర్తిత్వం గురించి, సెటిల్మెంట్ గురించి చెప్పిందన్నారు. -
ఫిబ్రవరిలో అనాథల అంతర్జాతీయ సదస్సు
సాక్షి, హైదరాబాద్: అనాథల అంతర్జాతీయ సదస్సును ఫిబ్రవరి 8, 9 తేదీల్లో నాగోల్ సమీపంలోని జె–కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నట్లు ఫోర్స్ (ఫోర్స్ ఫర్ ఆర్షన్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్) అధ్యక్షుడు గాదె ఇన్నయ్య తెలిపారు. శనివారం బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య సదస్సు వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లా డుతూ అనాథల హక్కుల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. వీరికి రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని, ఉచిత విద్యతో పాటు ఉపాధి కలి్పంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కోరారు. అనంతరం గాదె ఇన్నయ్య మాట్లాడుతూ ఈ సదస్సుకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, టి.నందగోపాల్, రాంకోటి పాల్గొన్నారు. -
రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో ఏపీకి ఉజ్వల భవిత
సాక్షి, హైదరాబాద్ : రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో ఏపీకి మంచి భవిష్యత్తు ఉందని హైదరాబాద్‌లో అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్ అన్నారు. రెండు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న అమెరికా భారత్ రక్షణ సంబంధాల అంతర్జాతీయ సదస్సులో భాగంగా ఢిల్లీ రాయబార కార్యాలయ అధికారి కెప్టెన్ డేనియల్ ఇ ఫిలియన్, ఏపీ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల విశాఖపట్నంలో అమెరికా, భారత్ త్రివిధ సైనిక దళాలు ప్రదర్శించిన సైనిక విన్యాసాలు రక్షణ రంగంలో ఏపీ సామర్థ్యానికి అద్దం పట్టాయన్నారు. ఏపీ, తెలంగాణలతో అత్యున్నత రక్షణ సాంకేతిక సహకార బంధం ఏర్పరుచుకునేందుకు పలు అమెరికన్ కంపెనీలు ఆసక్తితో ఉన్నాయన్నారు. భౌగోళికంగా చూస్తే.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అనేక అనుకూలతలున్నాయని తెలిపారు. అమెరికా విద్యాసంస్థల్లో చదివే భారతీయ విద్యార్థులను ప్రోత్సహించేందుకు వీసాల జారీని కొనసాగించడంతో పాటు, భవిష్యత్తులో వాటి సంఖ్యను కూడా పెంచుతామని చెప్పారు. తాజాగా అమెరికా, భారత్ నడుమ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఒప్పందానికి రెండు దేశాలు తుది రూపునిచ్చినట్టు తెలిపారు. దీని మూలంగా రెండు దేశాల రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య కీలకమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బదిలీతో పాటు.. భాగస్వామ్య ఒప్పందాలకు మార్గం సుగమం చేస్తుందని రీఫ్‌మన్ వెల్లడించారు. ఇంగ్లిష్‌మీడియం నిర్ణయం భేష్ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనను తప్పనిసరిచేస్తూ ఏపీ ప్రభుత్వం చట్టం చేయడాన్ని రీఫ్‌మన్ స్వాగతించారు. అంతర్జాతీయంగా సాంకేతికత, ఇతర అంశాల్లో ఇంగ్లిష్‌కు అత్యంత ప్రాధాన్యం ఉందని, విద్యార్థులకు బాల్యం నుంచి ఇంగ్లిష్‌ను నేర్పించడం ద్వారా వివిధ అంశాల్లో ప్రావీణ్యం సాధించేందుకు ఉపయోగపడుతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఏపీ వాటాను పెంచుతాం సాక్షి, హైదరాబాద్: భారత ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ వాటాను రానున్న రెండేళ్లలో మూడింతలు పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఎనిమిది రాష్ట్రాల జాబితాలో ఏపీ కూడా ఉందన్నారు. హైదరాబాద్‌లో రెండు రోజులుగా జరుగుతున్న భారత్, అమెరికా రక్షణ సంబంధాల అంతర్జాతీయ సదస్సులో గురువారం ఆయన ప్రసంగించారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను పురోభివృద్ధి బాటలో నడిపేందుకు రూపొందిస్తున్న రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే రంగాలు, అంశాలను గుర్తించినట్టు తెలిపారు. రక్షణ రంగానికి సంబంధించి రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న డిఫెన్స్ కారిడార్లు రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించామన్నారు. భారతీయ సైనిక బలగాలు, నౌకదళంతో ఏపీ ఇప్పటికే పలు ఒప్పందాలు కుదుర్చుకుందని, రామాయపట్నం పోర్టులో నేవీ బేస్, దొనకొండలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఏర్పాటు తదితరాలను గౌతంరెడ్డి ఉదహరించారు. సబ్‌మెరైన్, ఎయిర్‌క్రాఫ్ట్ బేస్, ఆఫ్‌షోర్ రిజర్వు తదితరాలతో ఇప్పటికే విశాఖ పారిశ్రామిక, సైనిక కేంద్రంగా ఉందన్నారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో హిందూ మహాసముద్రంలో దేశ తూర్పు తీరం కీలక పాత్ర పోషించనుందని.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ (డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్)ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అమెరికా, భారత్ మధ్య జరుగుతున్న రక్షణ ఒప్పందాల నేపథ్యంలో ఏపీకి చెందిన కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు ‘సప్లయ్ చెయిన్ మేనేజ్మెంట్’లో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి ఇప్పటికే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్(ఓఈఎం) సంస్థలతో సంప్రదింపులు జరుపుతూ ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. ఏపీ రూపొందించే పారిశ్రామిక విధానంలో డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి ప్రాధాన్యమిస్తూ డిఫెన్స్ క్లస్టర్ల ఏర్పాటు ద్వారా ఓఈఎంలకు ఉత్పత్తి సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఈ రంగంలో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తామని గౌతంరెడ్డి వెల్లడించారు. మానవ రహిత విమానాల(యూఏవీ) కోసం ప్రత్యేక పాలసీ సిద్ధం చేస్తున్నామన్నారు. ఎక్కువ ఉద్యోగాలు, పెట్టుబడులతో రాష్ట్రానికి సహకరించాల్సిందిగా వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో విశాఖ కేంద్రంగా ఆర్థిక విప్లవం వస్తుందని గౌతంరెడ్డి వెల్లడించారు. మాట్లాడుతున్న మంత్రి మేకపాటి గౌతంరెడ్డి. చిత్రంలో రీఫ్‌మన్ -
జనవరిలో అంతర్జాతీయ సదస్సు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే అయిదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనలో కాస్ట్ అకౌంటెంట్లు కీలక పాత్ర పోషించనున్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎంఏఐ) ప్రెసిడెంట్ బల్విందర్ సింగ్ తెలిపారు. ఇదే థీమ్‌తో జనవరి 9 నుంచి 11 దాకా న్యూఢిల్లీలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు బుధవారమిక్కడ విలేకరు లకు ఆయన వివరించారు. దేశ, విదేశాల నుంచి సుమారు 2,000 మంది పైచిలుకు డెలిగేట్స్ దీనికి హాజరు కానున్నట్లు తెలిపారు. మరోవైపు, వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానానికి సంబంధించి 3 ఏళ్లలో 3.5 లక్షల మంది ప్రొఫెషనల్స్‌కు శిక్షణనిచ్చేలా ప్రభుత్వం పథకం ప్రారంభిం చబోతోందని సింగ్ చెప్పారు. ఇందులో సుమారు 1 లక్ష మందికి ఐసీఎంఏఐ శిక్షణ నివ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆరు నెలల పాటు సాగే శిక్షణకు రూ. 3,000 ఫీజు ఉంటుందని తెలిపారు. -
పెట్రో కెమికల్స్ అంతర్జాతీయ సదస్సులో పాల్గొననున్న మంత్రి మేకపాటి
-
పెట్టుబడులకు ఏపీ అనుకూలం
సాక్షి, విశాఖపట్నం: విభజన చట్టంలోని హామీ మేరకు ఏపీలో దుగరాజపట్నం, రామయ్యపట్నంలలో పోర్టుల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి నివేదిక కోరామని..రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రెండింటిలో ఒక చోట జాతీయ పోర్టు నిర్మాణం చేపడతామని కేంద్ర నౌకాయాన శాఖా మంత్రి మన్షూక్ మాండవియా తెలిపారు. బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఏడు దేశాలతో పోర్టుల అభివృద్ధిపై రెండు రోజుల బిమ్స్ టెక్ అంతర్జాతీయ సదస్సు విశాఖ లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి మన్షూక్ మాండవియా మాట్లాడుతూ.. బిమ్స్ టెక్ లో భారతదేశం పాత్ర అత్యంత కీలకమైందని...ఏడు దేశాల మధ్య పోర్టుల అభివృద్ధి, ఎగుమతులలో సహాయ సహకారాలపై చర్చించి పరస్పర అంగీకార నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బంగ్లాదేశ్-ఇండియా మధ్య పరస్పర ఒప్పందాల కారణంగా నేరుగా ఎగుమతులకి అవకాశం ఏర్పడిందని వివరించారు. క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి ఫిబ్రవరిలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించబోతున్నామని చెప్పారు. ఐఐటి ఖరగ్‌పూర్ లో పోర్టుల అభివృద్ధి పై వెయ్యి కోట్లతో అత్యాధునిక పరీక్షల సాంకేతిక ల్యాబరేటరీ ఏర్పాటు చేశామన్నారు. సాగర్మాల యోజన లో రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 73 ప్రాజెక్ట్ ల అభివృద్ధి చేపడుతున్నామన్నారు. పెట్టుబడులకు ఏపీ అనువైన రాష్ట్రం.. పెట్టుబడులకి ఆంధ్రప్రదేశ్ అనువైన రాష్ట్రమని...తమ ప్రభుత్వం పెట్టుబడుదారులకి సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు మంజూరు చేస్తామని ఏపీ మంత్రులు గౌతమ్ రెడ్డి, అవంతి శ్రీనివాస్ లు తెలిపారు. విశాఖ నగరం పర్యాటకంగా...ఆర్థికంగా పెట్టుబడులకి అవకాశమన్నారు. ఈ సదస్సులో భాగంగా పోర్టుల అభివృద్ధి, ఉత్పత్తి పెంపు, పెట్టుబడి అవకాశాలు, స్వేచ్ఛా వాణిజ్య అభివృద్ధి, టూరిజం అభివృద్ధి, సెక్యూరిటీ,సేఫ్టీ కి సంబంధించిన అంశాలపై ఏడు దేశాల ప్రతినిధులు చర్చించారు. బంగాళాఖాతం అనుకుని ఉన్న దేశాల మధ్య బహుళ రంగాలు, సాంకేతిక, ఆర్థిక క రంగాల సమన్వయంపై ఈ సదస్సు చర్చకు వేదికగా మారింది. 1997 లో బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్ లు సభ్య దేశాలుగా బిమ్స్ టెక్ ప్రారంభమైంది. బిమ్స్ టెక్ ప్రారంభమైన 32 సంవత్సరాల తర్వాత తొలిసారి విశాఖ పోర్టు ఇందుకు ఆతిథ్య మిస్తోంది. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ రామ్మోహనరావు, ఏడు దేశాల ప్రతినిధులు, ప్రైవేట్ పోర్టుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
యువతను విస్మరిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: ‘మన దేశం యంగ్ ఇండియా అని గర్వంగా చెప్పుకుంటున్నప్పటికీ.. భారత్‌లో యువత సమస్యలను అర్థం చేసుకోవడంలో ఎంపీ లు, విధాన రూపకర్తలు విఫలమయ్యారు. ఈ పరిస్థి తి మారి యువత రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొనాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తెలం గాణ జాగృతి అంతర్జాతీయ యువ సదస్సు (టీజేఐ వైసీ)లో వక్తలు అభిప్రాయపడ్డారు. హైటెక్‌సిటీ నోవాటెల్ హోటల్లో శనివారం ‘వాక్ ద టాక్ ఆన్ యూత్ డెవలప్మెంట్’ పేరుతో జరిగిన చర్చాగోష్టిలో.. నిజామాబాద్ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కవిత (టీఆర్ఎస్), హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం), అసోం ఎంపీ గౌరవ్ గొగోయ్లతోపాటు బ్రిటన్‌లోని లేబర్ పార్టీ ఎంపీ సీమా మల్హోత్రా పాల్గొన్నారు. భారత్‌లో మధ్యవయస్కు లు, అంతకన్నా పెద్ద వయసున్న వారే ఎక్కువ సంఖ్యలో పార్లమెంటుకు ఎంపికవుతున్నందునే.. యువత సమస్యలను అర్థం చేసుకోవడం లేదని సీని యర్ జర్నలిస్టు శేఖర్ గుప్తా అన్నారు. దీన్ని ఒవైసీ సమర్థిస్తూ.. పార్లమెంటులో ఎంపీల వయసుకు సబంధించిన గణాంకాలను వెల్లడించారు. ప్రస్తుత లోక్‌సభలో ఎంపీల సగటు వయసు 55ఏళ్లుగా ఉందని.. 40ఏళ్లు, అంతకంటే తక్కువ వయసున్న వారు 13% కంటే తక్కువగా ఉన్నారని ఒవైసీ వివరించారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుండటం, గత కొన్నేళ్లలోనే ఐటీ రంగంలో లక్షల ఉద్యోగాలు తగ్గిపోవడం వంటివన్నీ దేశ పార్లమెంటరీ వ్యవస్థలో లోపాన్ని ఎత్తిచూపుతున్నాయన్నారు. ఈ పరిస్థితి మారి యువతకు రాజకీయరంగంలో మరిన్ని అవకాశాలు కల్పించాలని ఒవైసీ ఆకాంక్షించారు. బ్రిటన్ ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. యూకేలో యువత సమస్యలు భారత్‌తో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. మానసిక సమస్యలు, ఆత్మహత్యలపై అక్కడ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని.. ప్రభుత్వాలు కూడా ఈ అంశాలపై దృష్టిపెట్టి పరిష్కారిస్తున్నాయని వివరించారు. దేశమంతా ఒక్కటేనని గుర్తిస్తే.. జనాభా నియంత్రణ పథకాలు సమర్థవంతంగా అమలుచేసిన దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర నిధుల్లో వాటా తక్కువగా ఉండటంపై కవిత మాట్లాడారు. ఈ విషయంలో దేశమంతా ఒక్కటేనని అందరూ గుర్తించాలని.. రాష్ట్రాలకు కేంద్ర నిధుల పంపిణీ విధానంలో మార్పులు చేయడం ద్వారా ఈ సమస్య ను అధిగమించవచ్చని ఆమె పేర్కొన్నారు. పేదరి కం, ఉపాధి కల్పన వంటి చాలా అంశాలు అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు ఒకే తీరుగా ఉంటాయని.. ఈ అంశాలకు సంబంధించి జనాభా ప్రాతిపదికన నిధు ల పంపిణీ చేయడం తప్పేమీ కాదన్నారు. అయితే.. మిగిలిన అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహించేందుకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరంపైనా చర్చ జరగాలని ఆమె పేర్కొన్నారు. అసోం ఎంపీ గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక సరళీకరణలకు పాతికేళ్లు దాటినా.. ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి మాత్రం రెండు దశాబ్దాలు వెనుకబడే ఉందన్నారు. ఇందుకు కారణాలేమైనా.. దీని ప్రభావం మాత్రం యువతపై స్పష్టంగా కనబడుతోందన్నారు. తండ్రు లు రాజకీయాల్లో ఉండటం తమకు కొంతవరకు కలి సొచ్చినా.. దీర్ఘకాలం ఈ రంగంలో కొనసాగేందుకు మాత్రం కష్టపడాల్సిందేనని గౌరవ్, అసదుద్దీన్, కవిత స్పష్టం చేశారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే: ఒవైసీ ఎవరెన్ని చెప్పినా కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని ఒవైసీ పేర్కొన్నారు. కశ్మీర్ ప్రజలు, యువకులు భారతీయులే అనడంలో సందేహించాల్సిన అవసరం లేదన్నారు. అయితే.. కశ్మీర్ సమస్య పరిష్కరించేందుకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘కశ్మీర్ లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటూ అందరూ ప్రకటనలు చేస్తారు. తీరా పరిస్థితులు చక్కబడగానే కశ్మీర్లో చేయాల్సిన అభివృద్ధిని మరిచి పోతున్నారు’అంటూ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేశారు. ఈ వివాదంపై కేంద్రానికి ఓ స్థిరమైన విధానం లేదని.. నాలుగున్నరేళ్లలో కశ్మీరీ పండిట్ల కోసం గానీ.. అక్కడి యువత కోసం గానీ.. మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఒవైసీ ఆరోపించారు. ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం అక్కడి యువతలో ఉందన్నారు. అయితే కశ్మీర్ సమస్య సినిమాల్లాగా యుద్ధం చేసి పరిష్కరించేది కాదని.. ఇరువర్గాల్లో ఒకరు రాజనీతిజ్ఞతతో వ్యవహరించాలని అన్నారు. -
యువతతోనే అద్భుతాలు
సాక్షి, హైదరాబాద్: సరైనమార్గనిర్దేశనం ద్వారా యువతతో అద్భుతాలు సృష్టించొచ్చని గాంధేయవాది, పద్మభూషణ్ అన్నా హజారే సూచించారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం, దేశమే మీకుటుంబం అన్న భావనతో యువత పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలా నమ్మి ఆచరిస్తున్న ఫలితంగానే ఒకప్పుడు కరువు కాటకాలకు నిలయమైన రాలేగావ్ సిద్ధీ ఈ రోజు పచ్చదనంతో కళకళలాడుతోందని చెప్పారు. తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైన ‘తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువ నేతృత్వ సదస్సు’కు అన్నా హజారే ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సదస్సుకు 110 దేశాల నుంచి 550 మంది యువ ప్రతినిధులు హాజరు కాగా, సుస్థిరాభివృద్ధికి, సృజనాత్మకతలకు గాంధేయ మార్గం అన్న ఇతివృత్తంపై ఈ సదస్సులో చర్చోపచర్చలు ఉంటాయి. సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా హజారే మాట్లాడుతూ.. యువత గ్రామాలకు సేవ చేయడం మొదలుపెడితే మనదేశం అమెరికా, రష్యాలను అధిగమించి ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందన్నారు. ఏదో సాధించాలన్న తపన యువతలో ఉన్నప్పటికీ తగిన మార్గనిర్దేశనం లేకపోవడంతో కొంతమంది పెడదారి పడుతున్నారన్నారు. ఒక లక్ష్యంతో ప్రణాళికబద్ధంగా కృషి చేసి యువత తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవాలని పిలుపునిచ్చారు. గాంధీ రచనలతో మార్పు.. యువకుడిగా ఉన్నప్పుడు ఈ జీవితం ఎందుకు? అన్న ప్రశ్న తనకూ వచ్చిందని..పాతికేళ్ల వయసులో ఢిల్లీ రైల్వే స్టేషన్లో గాంధీజీ రచనలతో ఏర్పడిన పరిచయం తన జీవితాన్ని మార్చేసిందని హజారే గుర్తు చేసుకున్నారు. మానవ జీవిత పరమార్థం సేవేనని నిర్ణయించుకుని స్వగ్రామమైన రాలేగావ్సిద్ధీతో కొత్త ప్రస్థానం మొదలుపెట్టానని వివరించారు. తిండికి గతిలేని స్థితి నుంచి రోజుకు 150 ట్రక్కుల కూరగాయలు ఎగుమతి చేసే స్థితికి రాలేగావ్సిద్ధీ చేరుకుందన్నారు. ప్రకృతిని కాపాడుకుంటూనే రాలేగావ్‌సిద్ధీని అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని..అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయడం తగదని హితవు పలికారు. పెళ్లి విషయంలో తనను అనుకరించాల్సిన అవసరం లేదని అన్నా హజారే చలోక్తి విసిరారు. ‘‘పెళ్లి చేసుకోండి. పిల్లల్ని కనండి. అలాగని అదే మీ కుటుంబం అనుకోవద్ద’’ని చెప్పారు. అభివృద్ధి, అవినీతి రెండు ఒకే నాణేనికి రెండు పార్శా్వలని, అవినీతి అంతానికి తాను చేసిన ఉద్యమం ఫలితంగా సమాచార హక్కు చట్టం వచ్చిందని గుర్తు చేశారు. యువతకు తగిన విధానాలు అవసరం: కవిత యువతకు, సమాజ శ్రేయస్సుకు, సమస్యల పరిష్కారానికి మనదేశంతో పాటుగా ఇతర దేశాల్లోనూ తగిన విధానాలు లేవని ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో పేదరికం, ఆకలి నిర్మూలన, వాతావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన గాలి వంటివి అనేకం ఉన్నాయన్నారు. ఈ సమస్యలన్నీ మనుషులుగా మనం సృష్టించినవేనన్నారు. ప్రతీరోజూ 22 వేల మం ది పిల్లలు బాల్యంలోనే తనువు చాలిస్తుండటం, 80 కోట్ల మంది ఆకలితో నిద్రపోతుండటం, గాలి కాలుష్యం తనను ఎంతో కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువశక్తి సాయంతో ఈ సమస్యలకు పరిష్కారాలు కనుక్కునేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత ఈ సమస్యలను సరి కొత్త దృక్కోణంతో చూడగలదని.. అదే స్థాయి లో పరిష్కారాలు కూడా చూపగలదన్నారు. సుస్థిర అభివృద్ధికి నమూనాగా నిలిచి న రాలేగావ్‌సిద్ధీని నేటికీ వందలాది మంది సందర్శిస్తున్నారంటే అది అన్నా హజారే కృషి ఫలితమేనన్నా రు. తమ హక్కులను సాధించుకునేందుకు.. సమస్యల పరిష్కారానికి ప్రపంచవ్యాప్తంగా యువత ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా వేసిన తొలి అడుగుగా యువ నేతృత్వ సదస్సును పరిగణించాలన్నారు. -
ఉచిత విద్యుత్ సరికాదు..
సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ లాంటి హామీల కంటే నిరంతర విద్యుత్ ఇవ్వడం ప్రయోజనకరమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) సంస్థ హైదరాబాద్‌లో ‘క్లీన్ అండ్ సేఫ్ న్యూక్లియర్ పవర్ జనరేషన్’ అంశంపై తలపెట్టిన మూడ్రోజుల అంతర్జాతీయ సదస్సును వెంకయ్యనాయుడు బుధవారం ప్రారంభించి ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతర విద్యుదుత్పత్తిపై కాకుండా, ఉచిత విద్యుత్ మీద దృష్టి పెడుతున్నాయని, అది మంచిది కాదన్నారు. నాణ్యమైన, నిరంతర విద్యుత్‌తోనే ప్రజలకు మేలు అని వెంకయ్య అన్నారు. అభివృద్ధికి విద్యుత్ అవసరం దేశంలో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోం దని వెంకయ్య తెలిపారు. వేగంగా సాగుతున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ దృష్ట్యా స్థిరమైన అభివృద్ధి సాధించేందుకు, సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరముందన్నారు. ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించేందుకు, అంతర్జాతీయ సమాజం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు అణుశక్తిని పెంచుకోవాలన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువ ఖర్చుతో లభించే అణుశక్తిని సమర్థమైన శక్తి వనరుగా ఉపయోగించుకోవాలని చెప్పారు. ప్రస్తుతం అణుశక్తి కర్మాగారాలు చౌకగా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. కూడంకులం అణువిద్యుత్ యూనిట్–1 ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్ ధర యూనిట్‌కి రూ.3 ఉంటుందని తెలిపారు. భారత్‌లో అణుశక్తి అభివృద్ధిలో డాక్టర్ హోమి జే బాబా కృషి ఎంతో ఉందన్నారు. ఆయన నిర్దేశించిన విధానంలో దేశం బలమైన 3 దశల అణు విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తూ అద్భుతమైన పురోగతి సాధించిందని, తక్కువ ధర లో స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. ప్రజా ఉద్యమంగా స్వచ్ఛ భారత్.. ప్రస్తుతం దేశంలో స్వచ్ఛభారత్ ప్రభుత్వ కార్యక్రమం స్థాయి నుంచి ప్రజా ఉద్యమంగా మారిందని వెంకయ్య చెప్పారు. ఈ విషయంలో ప్రజలకు మరింత అవగాహనను పెంపొందిచడంలో శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు కృషి చేయాలని సూచించారు. ఆరోగ్యవంతమైన భారత్ ఆర్థికంగానూ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దేశంలో పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీర్ఘకాలంలో మనమంతా ప్రకృతితో ఆడుకున్నామని, ఇప్పుడు ప్రకృతి మనతో ఆడుకుంటోందన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోవటం మనందరి బాధ్యతని అన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారత ప్రభుత్వ మాజీ ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారు ఆర్.చిదంబరం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అధ్యక్షుడు శిశిర్ కుమార్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి అంతర్జాతీయ కాన్ఫరెన్స్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం, ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యూకేషన్ అసోసియేషన్ సంయుక్తంగా శని, ఆదివారాల్లో నిర్వహించే అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ‘ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు డిస్టెన్స్ ఎడ్యూకేషన్ హయ్యర్ ఎడ్యూకేషన్ ఫోకస్ ఆన్ అండర్ సర్వ్డ్ కమ్యూనిటీస్ అండ్ అన్కవర్డ్ రీజియన్స్’ అనే అంశంపై నిర్వహించనున్నారు. దేశంలోని వివిధ యూనివర్సిటీల నుంచి, సింగపూర్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర చోట్ల నుంచి 108 పరిశోధన పత్రాలను సమర్పించేందుకు ప్రతినిధులు హాజరు కానున్నారు. ఉన్నత విద్యకు దూరమైన వారికి దూరవిద్య అనేది ఓ వరం. దూరవిద్య ద్వారా వివిధ ఉన్నత విద్యా కోర్సులు అందిస్తున్నాయి. అయితే ఆయా కోర్సులను మారుమూల ప్రాంతాల వారికి కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎలాంటి మార్పులు తీసుకురావాలనే అంశాలపై ఈ కాన్ఫరెన్స్‌లో చర్చించనున్నారు. దూరవిద్య ప్రస్తుతం అందిస్తున్న కోర్సులు, వాటి సిలబస్, ఆన్లైన్ కోర్సులు తదితర అంశాలపై చర్చిస్తారు. ఉదయం 11 గంటలకు కేయూ సెనేట్హాల్లో జరిగే అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ప్రారంభ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ వర్సిటీ వీసీ ఆచార్య కె.నాగేశ్వర్రావు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆచార్య కె.సీతారామారావు, ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యూకేషన్ అసోసియేషన్ (ఐడియా) అధ్యక్షుడు ఆచార్య కె.మురళీమనోహర్, జనరల్ సెక్రటరీ ఆచార్య రోమేష్వర్మ, దూరవిద్యకేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ దినేష్‌కుమార్ ఈకాన్ఫరెన్స్కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, కన్వీనర్‌గా దూరవిద్యా కేంద్రం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ టి.శ్రీనివాస్‌రావు వ్యవహరిస్తున్నారు. మొదటి ప్లీనరీ సమావేశంలో ముంబై విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ హరిచందన్ భారతదేశంలో దూరవిద్య పాత్రపై, రెండో ప్లీనరీ సమావేశంలో ఇగ్నో ప్రొఫెసర్ ఆర్.సత్యనారాయణ ప్రసంగిస్తారు. ఆచార్య రామ్‌రెడ్డి మెమోరియల్ లెక్చర్‌ను కేయూ మాజీవీసీ ఆచార్య ఎన్.లింగమూర్తి ప్రసంగిస్తారు. ఈనెల 12న ఈ కాన్ఫరెన్స్‌లో భాగంగా దూరవిద్యకు సంబంధించిన వివిధ యూనివర్సిటీల దూరవిద్య డైరెక్టర్లతో సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు. ఆదివారం సాయంత్రం ముగింపు సమావేశంలో మధ్యప్రదేశ్‌లోని బోజ్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీంద్రా ఆర్ కనహార్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. కేయూ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్ పాల్గొంటారు. కాగా అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఏర్పాట్లపై శుక్రవారం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ దినేష్‌కుమార్, ఐడియా అధ్యక్షుడు ప్రొఫెసర్ మురళీమనోహర్, ఇతర అధ్యాపకులు సమావేశమై చర్చించారు. సదస్సులో సమర్పించిన పరిశోధన పత్రాలను రాబోయే రోజుల్లో పుస్తకరూపంలోకి తీసుకొస్తామని, సదస్సులో చర్చించిన అంశాలు, సూచనలను భారత దూరవిద్య మండలికి నివేదిస్తామని దూరవిద్యాకేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ దినేష్‌కుమార్ తెలిపారు. -
నగరంలో అంతర్జాతీయ బ్లాక్‌చైన్ కాంగ్రెస్: జయేశ్
సాక్షి, హైదరాబాద్: మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు నగరం వేదిక కానుంది. తొలి అంతర్జాతీ య బ్లాక్‌చైన్ కాంగ్రెస్‌కు హైదరాబాద్ గోవాతో కలసి ఆతిథ్యం ఇవ్వనుంది. నీతి ఆయోగ్, తెలంగాణ, గోవా రాష్ట్రాల ప్రభుత్వాలు, న్యూక్లియస్ విజన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఆగస్టు 3, 4 తేదీల్లో నగరంలోని హెచ్ఐసీసీ కాంప్లెక్స్‌లో, 5న గోవాలో ఈ సదస్సును నిర్వహించనున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ గురువారం ఇక్కడ వెల్లడించారు. ఈ సదస్సుకు వచ్చే ఐటీ పరిశ్రమలు, స్టార్టప్‌ల యజమానులతో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తారని పేర్కొన్నారు. ఐటీ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నా యని వార్తలొస్తున్నాయని, అదే సమయంలో బ్లాక్‌చైన్ లాంటి కొత్త టెక్నాలజీలు కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నాయని జయేశ్ తెలిపారు. విద్యార్థులు ఇలాంటి కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని ఆరేడు విభాగాల్లో బ్లాక్‌చైన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ వినియోగాన్ని ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. భూ రికార్డుల నిర్వహణకు బ్లాక్‌చైన్ పరిజ్ఞానం ఎంతో ఉపయోగకరమన్నారు. బిట్ కాయిన్ అనే క్రిప్టో కరెన్సీ క్రయవిక్రయాలకు సంబంధించిన లావాదేవీలను అత్యంత సురక్షితంగా భద్రపరిచేందుకు ‘ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ ప్రూఫ్ లెడ్జర్’గా బ్లాక్‌చైన్ సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యూక్లియస్ విజన్ సీఈవో అభిషేక్ పిట్టి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ!
సాక్షి, హైదరాబాద్: మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. వరల్డ్ డిజైన్ అసెంబ్లీ నిర్వహణకు వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూడీఓ) మన నగరాన్ని ఎంపిక చేసినట్లు ప్రకటించింది. అక్టోబర్ 2019లో ఈ ద్వైవార్షిక సదస్సు నిర్వహిస్తామని కెనడా కేంద్రంగా పనిచేస్తున్న డబ్ల్యూడీఓ పేర్కొంది. ఇండస్ట్రియల్ డిజైన్ రంగంలో 60 ఏళ్లుగా కృషిచేస్తున్న ఈ సంస్థ తన 31వ అంతర్జాతీయ సదస్సు నిర్వహణ కోసం హైదరాబాద్‌ను ఎంపిక చేయడం గర్వకారణమని రాష్ట్ర పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ‘హ్యూమనైజింగ్ డిజైన్’ అనే ఇతివృత్తంతో 5 రోజులు నిర్వహించే సదస్సుకు ఇండియా డిజైన్ ఫోరం(ఐడీఎఫ్) భాగస్వా మ్యం వహించనుంది. మనుషుల అవసరాలు, ఆలోచనలు, మనస్తత్వాన్ని గ్రహించి వారికి అవసరమైన సేవలందించగల సాఫ్ట్వేర్, పారిశ్రామిక ఉత్పత్తులను సృష్టించాలనే లక్ష్యంతో వస్తు డిజైన్లను రూపొందించడాన్ని హ్యూమనైజింగ్ డిజైన్ అంటారు. మానవ జీవన ప్రమాణాలను పెంచడంలో వస్తు నమూనాల ప్రాముఖ్యాన్ని తెలిపేలా ఈ సదస్సులో ప్రదర్శనలు, చర్చాగోష్టిలు నిర్వహించనున్నారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాల సాధనలో పారిశ్రామిక డిజైన్ల రూపకల్పన కీలకమని నిరూపించడానికి అవసరమైన వనరులు, అవకాశాలను హైదరాబాద్ కలిగి ఉందని, అందుకే ఎంపిక చేశామని డబ్ల్యూడీఓ అధ్యక్షురాలు లూసా బొచ్చిట్టో పేర్కొన్నారు. డిజైన్ల రూపకల్పన రంగం సహకారంతో ప్రగతి శీల, సమ్మిళిత నగరాల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం, స్థానిక ఇండియా డిజైన్ ఫోరంతో కలసి పని చేయడం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ, ప్రతినిధులకు ఆతిథ్యం ఇచ్చేందుకున్న మౌలిక సదుపాయాలు, స్థానికంగా డిజైన్ల రూపకల్పన రంగం సాధించిన పురోగతి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్‌ను ఎంపిక చేశామని డబ్ల్యూడీఓ ప్రకటించింది. హైదరాబాద్‌లో నిర్వహించనున్న సదస్సు తేదీలు త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. -
పీయూలో అంతర్జాతీయ సదస్సు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఆగస్టు 7,8,9వ తేదీల్లో ‘కెమిస్ట్రీ ఫర్ సస్టెయినబుల్ ఫ్యూచర్’ అనే అంశంపై అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహించను న్నట్లు పీయూ వైస్‌చాన్స్‌లర్ రాజరత్నం అన్నారు. పాలమూరు యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌లో మంగళవారం సదస్సుకు సంబంధించిన బ్రోచర్ విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సదస్సుల్లో ఫిజిక్స్ భవిష్యత్ తరాలకు అందించే సేవలపై విస్తృతమైన చర్చ ఉంటుందని, ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాల నుంచి సుప్రసిద్ధ అధ్యాపకులు, శాస్త్రవేత్తలు హాజరవుతారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్స్, అధ్యాపకులు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలన్నారు. ఫిజిక్సు సబ్జెక్టులో అనువజ్ఞను అందించే విషయాలను అర్థం చేసుకునేందుకు మంచి అవకాశమన్నారు. పీయూలో అంర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయడం మొదటి సారని, పూర్తి స్థాయిలో విజయవంతంగా నిర్వహించడానికి అందరు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్, పాండురంగారెడ్డి, కన్వీనర్ మూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రకిరణ్, అధికారులు మధుసూధన్‌రెడ్డి, సీఓఈ గిరిజ, మనోజ, శ్రీధర్, రామ్మోహన్, ఆయేషాహస్మీ, ఉపేందర్, రవి, మాలతి తదితరులు పాల్గొన్నారు. -
‘ఇంధనం అందరికీ అందాలి’
సాక్షి, న్యూఢిల్లీ : హేతుబద్ధమైన ధరల్లో ఇంధనం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. కృత్రిమంగా ధరలను పెంచడం స్వయం వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించారు. చమురు దిగ్గజాలు ఒపెక్ అధిపతి, సౌదీ చమురు మంత్రి ఖలీద్ అల్ ఫలీ సమక్షంలో అంతర్జాతీయ ఇంధన వేదిక (ఐఈఎఫ్)ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. చమురు వినియోగ దేశాల్లో ఇంధన వినియోగం పెరిగితే చమురు ఉత్పాదకులకు మేలు చేకూరుతుందన్నారు. పేదలకు సైతం అందుబాటులో ఉండేలా ఇంధన వనరులు భారత్‌కు అవసరమని ఆకాంక్షించారు. అందుబాటు ధరలతో పాటు సురక్షిత, నిలకడతో కూడిన ఇంధన సరఫరాలు కీలకమన్నారు. భారత్ తక్కువ ద్రవ్బోల్బణంతో అధిక వృద్ధిని సాధిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ఇంధన వినియోగం నాన్ ఒపెక్ దేశాల్లో భారీగా ఉందని, రానున్న ఐదేళ్లలో భారత్ ఇంధన డిమాండ్‌కు కీలక మార్కెట్‌గా ఎదుగుతుందని అన్నారు. -
భాగస్వామ్య సదస్సుకు ముస్తాబు
విశాఖలో శనివారం నుంచి జరగనున్న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు బీచ్‌రోడ్డులోనిఏపీఐఐసీ మైదానం సిద్ధమవుతోంది. రూ.కోట్ల ఖర్చుతో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అల్లిపురం(విశాఖ దక్షిణ): సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల సదస్సుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వరుసగా మూడో సారి జరుగుతున్న భాగస్వామ్య సదస్సుకు ఇప్పటికే బీచ్‌రోడ్డులో ఏపీఐఐసీ స్థలంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. సమావేశ మందిరం, గెస్ట్ హాల్, డైనింగ్ హాల్ ఇలా అన్ని రకాల హంగులతో సదస్సు ప్రాంగణాన్ని ముస్తాబు చేయడంలో కార్మికులు తలమునకలై ఉన్నారు. దేశ విదేశాల నుంచి అతిథులు నగరానికి రానుండటతో అధికారులంతా వారి సేవకు సిద్ధమవుతున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పెట్టుబడులు ఆకట్టుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నం చేయనుంది. -
అంతర్జాతీయ వేదికపై ట్రిపుల్ఐటీ విద్యార్థిని
రాయదుర్గం: బ్యాంకాక్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ట్రిపుల్ఐటీ–హైదరాబాద్ విద్యార్థిని సౌమ్య రావత్ పరిశోధనాత్మక పత్ర సమర్పణ చేశారు. ఇటీవల బ్యాంకాక్‌లో నిర్వహించిన 24వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మల్టీమీడియా మోడలింగ్ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ‘ఫైండ్ మీ ఏ స్కై: ఏ డేటా డ్రివెన్ మెథడ్ ఫర్ కలర్ కన్సిస్టెడ్ స్కై సెర్చ్ అండ్ రీప్లేస్మెంట్’ అంశంపై పత్ర సమర్పణ చేసి ప్రశంసలు అందుకుకున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థినికి ఈ అవకాశం రావడం విశేషమని అధ్యాపకులు అభినందించారు. -
సిటీలో మరో ప్రతిష్టాత్మక సదస్సు
సాక్షి, హైదరాబాద్: మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదికకానుంది. ఈ నెల 27 నుంచి 31 వరకు అంతర్జాతీయ కణ జీవశాస్త్ర సదస్సు(ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ సెల్ బయాలజీ) జరగనుంది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) ఆధ్వర్యంలో షామీర్‌పేట్‌లోని లియోనియా రిసార్ట్‌లో ఈ సదస్సు జరగనుంది. జీవ వైజ్ఞానిక శాస్త్రంలో మూడు అగ్రగామి సంస్థలైన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ సెల్ బయాలజీ (ఐఎఫ్‌సీబీ), ఏషియన్ పసిఫిక్ ఆర్గనైజేషన్ ఫర్ సెల్ బయాలజీ (ఏపీఓసీబీ), ఇండియన్ సొసైటీ ఫర్ సెల్ బయాలజీ (ఐఎస్‌సీబీ)లు తొలిసారిగా ఒకే వేదికను పంచుకోనుండటం విశేషం. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ సెల్ బయాలజీ సంస్థ తొలిసారిగా అంతర్జాతీయ కణ జీవ శాస్త్ర సదస్సులో పాల్గొంటోంది. 30 దేశాల నుంచి 300 సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు, 1,400 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు సదస్సుకు రానున్నారు. ప్రీ కాంగ్రెస్ సెషన్, 8–9 ప్లీనరీ సెషన్లు, 20 టాపికల్ సెషన్లు జరగనుండగా, 150 మంది వక్తలు ప్రసంగించనున్నారు. ఎన్నో దేశాలు పోటీ పడినా.. ఏషియన్ పసిఫిక్ ఆర్గనైజేషన్ ఫర్ సెల్ బయాలజీ నాలుగేళ్ల కింద సింగపూర్‌లో సమావేశమై ఈ సదస్సును భారత్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. నాలుగేళ్ల కోసారి నిర్వహించే ఈ సదస్సును దక్కించు కోవడానికి ఎన్నో దేశాలు పోటీపడగా, తొలిసారిగా భారత్‌కు అవకాశం లభించింది. ఈ సదస్సు నిర్వహించే అవకాశం ఒక్క దేశానికి సగటున 40 ఏళ్లలో ఒకేసారి దక్కుతుంది. గత మూడు దశాబ్దాలుగా కణ జీవశాస్త్ర రంగ పరిశోధనల్లో భారత్ కృషితో సదస్సు నిర్వహణకు అవకాశం లభించిందని ఇండియన్ సొసైటీ ఫర్ సెల్ బయాలజీ డైరెక్టర్ సత్యజీత్ మేయర్ పేర్కొన్నారు. కణ జీవ శాస్త్రంలో విద్యా ర్థులకు అపార అవకాశాలున్నాయని, హైద రాబాద్, గుంటూరులో జాతీయ, అంతర్జా తీయ శాస్త్రవేత్తలతో విద్యార్థులకు ఉప న్యాసం ఇప్పించనున్నామని తెలిపారు. మార్టిన్ ఉపన్యాసంతో ప్రారంభం.. అమెరికాకు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మార్టిన్ చాల్ఫీ ప్రారంభోపన్యాసంతో 27న మధ్యాహ్నం 2 గంటలకు సదస్సు ప్రారంభమవుతుంది. కేంద్రం, తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు, బయోటెక్ పరిశ్రమలు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. కణ జీవశాస్త్రంలో కొత్త ఆవిష్కరణల నుంచి ఔషద ఉత్పత్తుల అభివృద్ధికి ప్రోత్సాహమందించాలనే లక్ష్యంతో జరిగే ఈ సమావేశంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాస్త్ర సహాయ మంత్రి సుజనా చౌదరి పాల్గొంటారు. సదస్సు ముగింపు రోజు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.సీసీఎంబీ శాస్త్రవేత్తలు వి.రాధ, మధుసూదన్‌రావు, చడ్రక్లతో కలసి సంస్థ డైరెక్టర్ గురువారం సదస్సు వివరాలను వెల్లడించారు. మూలకణాలు, కణజాల నిర్మాణం, క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ పద్ధతులు, ఆరోగ్య, వ్యాధి నిర్ధారక పరీక్షల్లో కణ జీవశాస్త్ర ఉపయోగాలు వంటి అంశాలను చర్చించనున్నట్లు తెలిపారు. -
మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
సాక్షి, విశాఖపట్నం: మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించి రాయితీలిస్తామని, సకాలంలో అనుమతులిస్తున్నామని చెప్పారు. విశాఖలో భారత మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య(అలీప్), దక్షిణాసియా మహిళాభివృద్ధి సంస్థ, ఏపీ ప్రభుత్వం కలిసి మూడు రోజులపాటు నిర్వహించే అంతర్జాతీయ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సును ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ఐటీ రంగంలోనూ, ఉత్పాదకతలోనూ పురుషుల కంటే మహిళలే అధికంగా పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. విశాఖ జిల్లా గిడిజాల వద్ద 50 ఎకరాల్లో అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపార సాంకేతిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటవుతుందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహంలో భాగంగా రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం ఎతెలిపారు. విశాఖలో ఇప్పటికే రెండు సీఐఐ భాగస్వామ్య సదస్సులు నిర్వహించామని, మూడవది వచ్చే నెలలో జరుగుతుందని, ఈ సదస్సులో మహిళా పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఇప్పటిదాకా రూ.30,47,801 కోట్ల విలువైన 1900 ఒప్పందాలు చేసుకున్నామని, వీటి ద్వారా 30 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని వివరించారు. ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలులోకి తెచ్చేందుకు సార్క్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యుటీవో) సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సార్క్ సెక్రటరీ జనరల్ అంజాద్ హుస్సేన్ బిసియల్ మాట్లాడుతూ ఈ సదస్సు వల్ల సార్క్ సభ్య దేశాల్లో మహిళా సాధికారిత మరింత వృద్ధి చెందుతుందన్నారు. అలీప్ అధ్యక్షురాలు కె.రమాదేవి మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహకానికి, పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు తమ సమాఖ్య కృషి చేస్తోందన్నారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అమర్నాథ్రెడ్డి, కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రత్యేక కార్యదర్శి బినయ్‌కుమార్, డబ్ల్యూటీవో ఈడీ రత్నాకర్ అధికారి, పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షురాలు జ్యోతిరావు, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, సార్క్ ఎనిమిది దేశాల మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. టెక్నాలజీ హబ్ ఏర్పాటుకు ఎంఓయూ విశాఖ జిల్లా గిడిజాలలో అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపార, సాంకేతిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు భారత మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య, దక్షిణాసియా మహిళాభివృద్ధి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వంల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి సమక్షంలో మంత్రి అమర్నాథ్రెడ్డి, దక్షిణాసియా మహిళా అభివృద్ధి సంస్థ అధ్యక్షురాలు పరిమళా ఆచార్య రిజాల్, అలీప్ అధ్యక్షురాలు కె.రమాదేవిలు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. -
అంతర్జాతీయ సదస్సుకు గిరిజన విద్యార్థి
వరంగల్ రూరల్, కొడకండ్ల(పాలకుర్తి): మలేషియాలో ఈనెల 19 నుంచి 22 వరకు జరుగనున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు జనగామ జిల్లా కొడకండ్ల మండలం లక్ష్మక్కపెల్లి శివారు లాలుతండాకు చెందిన యువ పరిశోధక విద్యార్థి వాంకుడోత్ నరేందర్‌పవార్‌కు ఆహ్వానం లభించింది. క్యేన్సర్ వ్యాధి, జటిలమైన సోయాసిస్ చర్మ వ్యాధులకు జన్యు స్థాయిలో ఔషధ మొక్కలపై ఆయన చేసిన పరిశోధనలు, ప్రచురించిన పరిశోధక పత్రాలతో పాటు పరిశోధనలో చూపిస్తున్న ప్రతిభను గుర్తించిన ఇన్నోవేటివ్ సింటిఫిక్ రీసెర్చ్ ఫ్రొఫెషనల్ మలేషియా సంస్థ వారు మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానించారు. కాగా, నరేందర్ పవార్ అంతర్జాతీయ సదస్సుకు ఎంపిక కావడంపై తండావాసులు అభినందించారు. -
ఎస్వీయూలో అంతర్జాతీయ సదస్సు
యూనివర్సిటీ క్యాంపస్: శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ(ఎస్వీయూ)లోని సెంటర్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ అండ్ పసిఫిక్ స్టడీస్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి. జయచంద్రారెడ్డి తెలిపారు. సౌత్ ఏషియన్ సీ-ఎమర్జింగ్ సినారియో పేరిట నిర్వహించే ఈ సదస్సు మూడు రోజులపాటు జరుగుతుందన్నారు. వైస్ చాన్స్‌లర్ దామోదరం ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి నీలకంఠన్ రవి, ఇండియన్ కౌన్సిల్ ఫర్ వరల్డ్ అఫైర్స్ మాజీ పీయూష్ శ్రీవాస్తవ హాజరవుతారని వివరించారు. ఈ సందర్భంగా నీలకంఠన్ రవికి లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డు ఫర్ ఇంటర్నేషనల్ అండర్‌స్టాండింగ్‌ను అందజేయనున్నట్లు జయచంద్రారెడ్డి చెప్పారు. -
కేటీఆర్‌కు ‘అంతర్జాతీయ’ ఆహ్వానాలు
సాక్షి, హైదరాబాద్: రెండు అంతర్జాతీయ సదస్సుల్లో ప్రసంగించాల్సిందిగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావుకు ఆహ్వానం అందింది. ది అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 25 వరకు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న శాక్రమెంటో నగరంలో జరిగే సదస్సుల్లో ప్రసంగించాలని కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఉపాధి, ఉద్యోగాలు, పరిశ్రమలు అంశంపై ఈ నెల 18, 19వ తేదీల్లో నిర్వహించే సదస్సుల్లో ప్రసంగించాలని స్టాన్ఫోర్డ్ వర్సిటీ నుంచి మరో ఆహ్వానం అందింది. ఈ వర్సిటీ నుంచి కేటీఆర్ ఆహ్వానం అందుకోవడం ఇది రెండోసారని ఆయన కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
మనీలా అంతర్జాతీయ సదస్సుకు చాడ
సాక్షి, హైదరాబాద్: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరుగనున్న అంతర్జాతీయ సదస్సుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరుకానున్నారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు తెలంగాణ నుంచి చాడతోపాటు కె.యాదవరెడ్డి (టీఆర్ఎస్), ఎంఆర్జీ వినోద్‌రెడ్డి (టీపీసీసీ) హాజరవుతున్నట్లు సమాచారం. వీరితోపాటు సీపీఎం నుంచి మాజీ ఎంపీ నీలోత్పల్‌బసు హాజరుకానున్నారు. ఆల్ ఇండియా పీపుల్స్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ (అయిప్సో) ప్రతినిధి బృందంలో సభ్యులుగా వీరు గురువారం రాత్రి ఇక్కడి నుంచి మనీలా బయలుదేరనున్నారు. క్యూబాపై ఆర్థిక, వాణిజ్య తదితర ఆంక్షలను అమెరికా, ఇతర దేశాలు విధించడాన్ని నిరసిస్తూ ఆ దేశానికి సంఘీభావంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. -
చట్టాలు మారాలి
⇒ మారుతున్న మానవ బంధాలతో కొత్త సమస్యలు ⇒ సరోగసీపై స్పష్టమైన చట్టం అవసరం ⇒ అంతర్జాతీయ సదస్సులో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు సాక్షి, అమరావతి: మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు మారకపోవడంతో తీర్పులు వెల్లడించడానికి ఇబ్బందిగా మారు తోందని సుప్రీం, హైకోర్టు జడ్జిలు అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలు, మారుతున్న మానవ సంబం ధాలతో కొత్త కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని, వీటికి అనుగుణంగా మన చట్టాలు కూడా మారాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ అభిప్రాయపడ్డారు. విజయవాడలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో రెండో రోజు వాణిజ్య లావాదేవీలు, ఆర్బిట్రేషన్, మాట్రి మోని యల్, పిల్లల హక్కులు, ఆస్తి తగాదాలు తదితర అంశాలపై మేధోమథనం జరిగింది. ఈ సందర్భంగా లోకూర్ మాట్లాడుతూ... సహజీవనం, సరోగసీ, ఎన్నారై విడాకులకు చెందిన సరైన చట్టాలు లేకపోవడం సమస్య జఠిలంగా మారుతోందని తెలిపారు. ఈ విషయాలపై కొత్త చట్టాలను తీసుకురా వడంపై చట్టసభలు దృష్టిసారించాలన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ చాలా వ్యయంతో కూడుకున్నది కావడంతో దేశీయంగా ఈ అంశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. సరోగసీ విధానానికి అంతర్జాతీయంగా ఇండియా ప్రధాన కేంద్రంగా మారుతోందని, దీంతో న్యాయపరంగా అనేక వివాదాలు తలెత్తుతు న్నాయని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి ఆందోళన వ్యక్తంచేశారు. మనదేశంలో కూడా సరోగసీ విధానానికి సంబంధించి స్పష్టమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. మెడ్–ఆర్బ్‌తో అవకాశాలు అనేకం ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దాన్ని కోర్టుల వరకు రాకుండానే మీడియేటర్ (మధ్యవర్తి) ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రాధాన్యత ను ఇస్తున్నారని సుప్రీం కోర్టు మాజీ జడ్జి ఆర్.వి.రవీంద్రన్ చెప్పారు. ఇందులో ఒకరు ఓడిపోవడం మరొకరు గెలవడం ఉండదని, ఇద్దరి సమస్యను మీడియేటర్ పరిష్కరిస్తార న్నారు. ఒకవేళ ఈ సమస్యను మీడియేటర్ పరిష్కరించకపోతే అప్పుడు ఆ కేసు ఆర్బిట్రేటర్ వద్దకు చేరుతుందన్నారు. దీన్ని న్యాయ భాషలో మెడ్–ఆర్బ్‌గా వ్యవహరిస్తు న్నట్లు తెలిపారు. మెడ్–ఆర్బ్‌లో అవకాశాలు పెరుగుతుండటంతో న్యాయవాదులు దీనిపై దృష్టిసారించాలని సూచించారు. నూతన రాజధాని అమరావతి ఆర్బిట్రేషన్‌కు కేంద్రంగా ఎదుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జి ఎన్.వి.రమణతో పాటు రిటైర్జ్ జడ్జిలు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
న్యాయమూర్తులకు ప్రత్యేక విందు
కృష్ణా తీరాన.. పున్నమి ఘాట్‌లో ఏర్పాటు ⇒ విందు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన సీఎం ⇒ జడ్జిల కంటే ముందు వచ్చి చివరన వెళ్లిన చంద్రబాబు సాక్షి, అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయమూర్తులకు శుక్రవారం రాత్రి విజయవాడ పున్నమి ఘాట్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి నగరానికి వచ్చిన సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఈ విందుకు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విందు ఏర్పాట్లను ఘనంగా చేశారు. న్యాయమూర్తుల కంటే చాలా ముందే ఆయన పున్నమి ఘాట్‌కు చేరుకున్నారు. విందు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఆహార పదార్థాల నుంచి సాంస్కృతిక కార్యక్రమాల వరకు.. అన్నింటి నిర్వహణపై అధికారులకు ఆదేశాలిస్తూ హడావుడి చేశారు. పున్నమి ఘాట్‌కు చేరుకున్న న్యాయమూర్తులకు చంద్రబాబు సాదర స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. న్యాయమూర్తులు పున్నమిఘాట్లో దాదాపు రెండు గంటలకుపైగా గడిపారు. విందు అనంతరం న్యాయమూర్తులను చంద్రబాబు ఘనంగా సన్మానించారు. భారీ బందోబస్తు... ఫొటోలు తీయకుండా జాగ్రత్తలు న్యాయమూర్తులకు విందు ఏర్పాటు చేసిన పున్నమి ఘాట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే సాధారణ సందర్శకులతోపాటు ఎవరినీ ఘాట్ పరిసరాలకు అనుమతించలేదు. శివరాత్రి సందర్భంగా కృష్ణా నదిలో స్నానం చేసేందుకు వచ్చిన భక్తులను సైతం వెనక్కు పంపించారు. విందు నిర్వహించిన ఘాట్ వద్ద ఉన్న పర్యాటక శాఖ పున్నమి గెస్ట్‌హౌస్ ఉద్యోగులను కూడా ఆ ప్రాంతంలోకి అనుమతించకపోవడం గమనార్హం. ఎంపిక చేసిన కొద్ది మంది ఉద్యోగులకు ప్రత్యేకంగా పాసులు ఇచ్చారు. విందు నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ఒక ప్రైవేట్ హోటల్ నుంచి తీసుకొచ్చారు. విందు ఫొటోలు బయటకు రాకుండా, విందు నిర్వహణ సిబ్బంది వద్ద సెల్ఫోన్లు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం అధికార కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను ప్రభుత్వం సాధారణంగా విడుదల చేస్తుంది. పేరు ప్రఖ్యాతులున్న న్యాయమూర్తులకు సీఎం స్వయంగా విందు ఏర్పాటు చేస్తే.. కార్యక్రమం గురించి మీడియాకు ప్రభుత్వం కనీస సమాచారం, ఫొటోలు కూడా ఇవ్వకపోడం గమనార్హం. సీఎం నివాసంలో గురువారం రాత్రి విందు విజయవాడలో శుక్రవారం ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి న్యాయమూర్తులు గురువారమే నగరానికి చేరుకున్నారు. గురువారం రాత్రి న్యాయమూర్తులకు ముఖ్యమంత్రి ఉండవల్లిలోని తన అధికార నివాసంలో విందు ఇచ్చిన విషయం విదితమే. -
అద్భుత ‘ఆదిమ’ చిత్రాల నెలవు తెలంగాణ
పురావస్తు శాఖ ప్రత్యేకాధికారి రంగాచార్యులు సాక్షి, హైదరాబాద్: ఆదిమ మానవులు గీసిన అద్భుత వర్ణచిత్రాలకు తెలంగాణ నెలవని పురావస్తు శాఖ ప్రత్యేకాధికారి రంగాచార్యులు అన్నారు. అలాంటి చిత్రాలున్న ఎన్నో ప్రాంతాలను గత మూడు దశాబ్దాల్లో సహచర ఉద్యోగులతో కలసి వెలుగులోకి తేవడం తన జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు. తెలంగాణ రాతి వర్ణ చిత్రాలపై అంతర్జాతీయ పురావస్తు సదస్సులో ఆయన పత్రాలు సమర్పించారు. యునెస్కో గుర్తింపు పొందిన భీంబెట్కా కంటే వరంగల్ సమీపంలోని పాండవుల గుట్ట గొప్పదన్నారు. వచ్చే సదస్సు నాటికి వంద ‘ఆదిమ’ ప్రాంతాలు రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో ఆదిమ మానవుల వర్ణచి త్రాలున్న 26 ప్రాంతాలనే గుర్తించగా, తదనంతరం తనవంటి వారు వాటిని 66కు చేర్చారు. వచ్చే అంతర్జాతీయ సదస్సు నాటికి ఈ సంఖ్య 100కు చేరవచ్చు. – ద్యావనపల్లి సత్యనారాయణ, పురావస్తు పరిశోధకుడు సదస్సు నిర్వహణ భేష్... సదస్సును గొప్పగా నిర్వహించారంటూ ప్రతినిధులు అభినంది స్తున్నారు. ముఖ్యంగా విదేశీ ప్రతినిధుల నుంచి ప్రత్యేక అభినంద నలు వచ్చాయి. – రాములు నాయక్, పురావస్తు శాఖ సహాయ సంచాలకుడు నాణేలూ చరిత్ర చెబుతాయి: డాక్టర్ రాజారెడ్డి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో లభించిన పురాతన నాణేలు చరిత్రకు సంబంధించి కొత్త పాఠాలు చెబుతున్నాయని నాణేల సేకరణలో అపూర్వ అనుభవమున్న డాక్టర్ రాజారెడ్డి పేర్కొన్నారు. 3.5 లక్షల నాణేలతో హైదరాబాద్ స్టేట్ మ్యూజియం ప్రపంచంలోనే గొప్ప నాణేల మ్యూజియంగా వర్ధిల్లుతోందన్నారు. హైదరాబాద్‌పై ప్రత్యేకాభిమానం చూపే 92 ఏళ్ల జగదీశ్‌మిట్టల్ నడవలేని స్థితిలో ఉండి కూడా సదస్సులో పాల్గొని పలు సూచనలు చేశారు. వచ్చే ఏడాది వరంగల్‌లో సదస్సు పురావస్తు శాఖ నిర్వహించిన తొలి అంతర్జాతీయ సదస్సు విజయవంతం కావడంతో ఇకపై వీటిని ఏటా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి సదస్సు రెండు రోజులు జరగ్గా, ఇకపై మూడు రోజల పాటు నిర్వహించనున్నారు. 2018 జనవరి 18– 20 మధ్య వరంగల్‌లో సదస్సు జరపాలని నిర్ణయించారు. చివరి రోజు ప్రధాన పర్యాటక, పురావస్తు ప్రాంతాల్లో క్షేత్ర పర్యటనలు జరపాలని నిర్ణయించినట్టు పురావస్తు శాఖ సంచాలకురాలు విశాలాచ్చి తెలిపారు. -
‘మేకిన్ ఇండియా’లో దేశీ టెక్నాలజీలకే పెద్దపీట
- రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి - ఐఐసీటీలో సిరామిక్స్‌పై అంతర్జాతీయ సదస్సు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం ఉద్దేశం విదేశీ కంపెనీలను ఇక్కడకు రప్పించడం కాదని... కొత్త కొత్త ఆలోచనలతో వస్తు, సేవలను ఇక్కడే రూపొందించి ప్రపంచానికి ఎగుమతి చేయడమని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు, క్షిపణి, వ్యూహాత్మక వ్యవస్థల చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే చాలా అంశాల్లో ఇప్పటికీ విదేశీ దిగుమతులపై ఆధారపడి ఉన్నామని, ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరమెంతైనా ఉందని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ‘సిరామిక్స్, గాజు రంగాల్లో కొత్త ఆవిష్కరణలు’ అన్న అంశంపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు సతీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశీయ పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. మనమే తయారు చేసుకోవాలి... దేశంలోని ఏ ఫ్యాక్టరీకి వెళ్లినా జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్న యంత్రాలు కనిపిస్తున్నాయని.. బదులుగా మనమే వాటిని తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో తొలి ప్రాధాన్యం దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీకేనన్నది గుర్తించాలని చెప్పారు. రక్షణ రంగంలో సిరామిక్స్ పాత్ర ఎంతో కీలకమని, అద్భుతమైన లక్షణాలు కలిగిన సిరామిక్స్ లేకుంటే క్షిపణుల్లో వాడే కీలకమైన పరికరాల తయారీ చాలా కష్టమయ్యేదని పేర్కొన్నారు. కానీ ఈ రంగంలో ఇప్పటికీ ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటున్నామని, వాటిని అవసరమైన ఉత్పత్తులుగా మార్చే విషయంలో, తయారీ యంత్రాల విషయంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ఇక్కడి కంపెనీలకే ప్రాధాన్యం కొత్త టెక్నాలజీలు, పదార్థాల విషయంలో కేంద్రం దేశీ కంపెనీలకే ప్రాధాన్యమిస్తుందని సతీశ్‌రెడ్డి చెప్పారు. టెండర్లలో కనిష్ట ధర కోట్ చేసిన కంపెనీలకు కాకుండా.. ఆయా టెక్నాలజీలు దేశీయంగానే అభివృద్ధి చేసి ఉంటే, ధర ఎక్కువైనా ఆ టెక్నాలజీనే, పదార్థాన్నే వాడతామని తెలిపారు. దేశంలోని అన్ని రకాల పదార్థాలను సమర్థంగా వినియోగిం చుకునేందుకు వీలుగా కేంద్రం సరికొత్త విధానాన్ని సిద్ధం చేస్తోందన్నారు. డాక్టర్ బలదేవ్‌రాజ్ ఆధ్వర్యంలోని కమిటీ ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సిద్ధం చేసిన ఈ ముసాయిదాను మరో నెలలో ప్రభుత్వానికి సమర్పించనుందని తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిరామిక్ టెక్నాలజీస్, ఆలిండియా పాటరీ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూమెటీరియల్స్లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి వచ్చిన దాదాపు 500 మంది పాల్గొంటున్నారు. -
అంతర్జాతీయ వైద్యసదస్సుకు మండపేట యువతి
రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని నార్త్ - వెస్ట్రన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎండీ చేస్తున్న తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన యువతి జాస్తి స్వాతిప్రియ అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైంది. గుండె సంబంధిత వ్యాధులపై ఈ నెల 25వ తేదీన స్వీడన్లో జరిగే సదస్సులో వర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించనుంది. మండపేటకు చెందిన జాస్తి శ్రీనివాసరావు, విజయలక్ష్మి దంపతుల కుమార్తె స్వాతిప్రియ 10వ తరగతి వరకూ మండపేటలోను, ఇంటర్ విజయవాడలోని ప్రైవేటు కళాశాలలోను చదువుకుంది. యూరోపియన్ హార్ట్ అసోసియేషన్ అండ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ వైద్య సదస్సులో యూనివర్సిటీ నుంచి పాల్గొనే అవకాశం స్వాతిప్రియకు లభించింది. 25వ తేదీన స్వీడన్లో జరిగే సదస్సులో ఆమె ప్రసంగించనున్నారు. అంతర్జాతీయ సదస్సుకు తాను ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని స్వాతిప్రియ తెలిపారు. ఆదివారం ఆమె రష్యా నుంచి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడి సదస్సుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. -
అంతర్జాతీయ సదస్సుకు నల్లమల వైద్యులు
25 నుంచి జైపూర్‌లో సదస్సు అచ్చంపేట: అంతర్జాతీయ సదస్సుకు నల్లమలకు చెందిన ఇద్దరు డాక్టర్లు ఎంపికయ్యారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కోలో-ప్రాక్టాలజీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే మూడవ అంతర్జాతీయ సదస్సు-2016లో పాల్గొనేందుకు నల్లమల ప్రాంత వైద్యులు డాక్టర్ సీఏ చైతన్య, డాక్టర్ ఎ.ప్రవీణ దంపతులకు నిర్వాహకులు ఆహ్వానం పంపించారు. ఈ మేరకు వారు ఈ నెల 24న జైపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. మూడు రోజులపాటు జరిగే అంతర్జాతీయ సదస్సులో వైద్యులకు పేగులకు సంబంధించిన వ్యాధులు, ఆధునాతన శస్త్రచికిత్సల పరిజ్ఞానం, కొత్త విజ్ఞానం గురించి అవగాహన కల్పించనున్నారు. -
కన్వెన్షన్ సెంటర్ గా ‘కళాభారతి’
♦ సాంస్కృతిక కార్యక్రమాలు ♦ సదస్సుల నిర్వహణకు అనుగుణంగా ఉండాలి ♦ అధికారులకు సీఎం ఆదేశం ♦ ముఖ్యమంత్రి, సీఎస్, స్పీకర్, మండలి చైర్మన్లకు కొత్త నివాసాలు ♦ ఐఏఎస్ అధికారులకు అధునాతన క్వార్టర్ల నిర్మాణం ♦ డిజైన్ల ఖరారుకు సీఎస్ సారథ్యంలో ఆరుగురితో కమిటీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ సదస్సులకు వేదికగా మారిన హైదరాబాద్‌లో భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో ప్రతిరోజు ఎన్నో సమావేశాలు జరుగుతున్నాయని, అందుకు తగ్గట్లుగా హెచ్ఐసీసీ తరహాలో మరో పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇందిరాపార్కు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో కళాభారతి కల్చరల్ సెంటర్‌ను నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సభలు, సమావేశాలు, సదస్సుల నిర్వహణకు అనుగుణంగా ఈ కళాభారతి నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కళాభారతిని కన్వెన్షన్ సెంటర్ కమ్ కల్చరల్ సెంటర్‌గా తీర్చిదిద్దాలన్నారు. వరుసగా జరుగుతున్న బడ్జెట్ సమీక్షల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఆర్అండ్బీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నగరంలో చేపట్టనున్న పలు కొత్త నిర్మాణాల అంశం చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ముఖ్య అధికారులు, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్‌కు అధికారిక నివాసాలు నిర్మించాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అఖిల భారత సర్వీస్ అధికారులకు కూడా అధునాతన క్వార్టర్లు కట్టాలని అధికారులకు చెప్పారు. ఈ నిర్మాణాలకు స్థలం, డిజైన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ప్రకటించారు. సీఎస్‌తోపాటు ఆర్అండ్బీ కార్యదర్శి, సీఎంవో ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఐఅండ్‌పీఆర్ కార్యదర్శి, ఆర్‌అండ్‌బీకి చెందిన ఇద్దరు ఈఎన్సీలు ఇందులో సభ్యులుగా ఉంటారు. సీఎం కొత్త అధికారిక నివాసం నిర్మాణానికి సంబంధించి గ తేడాది నుంచి ఆర్అండ్బీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం బేగంపేటలో ఉన్న సీఎం నివాసం వెనుక ఉన్న పాత ఐఏఎస్ క్వార్టర్లను కూల్చివేసి, అదే స్థలంలో కొత్త నివాసం నిర్మించాలనే ప్రతిపాదనలున్నాయి. -
బహుముఖ సహకారంతోనే దేశాభివృద్ధి
భారత మాజీ రాయబారి శ్రీనివాసన్ యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): దేశాల మధ్య పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని భారత మాజీ రాయబారి టీపీ శ్రీనివాసన్ పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీయూలోని సీప్‌స్టడీస్ విభాగంలో సోమవారం అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈసదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసన్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలో చిన్న, మధ్య తరగతి దేశాలు తమ ఆర్థిక, రాజకీయ, వ్యూహాత్మక అసవరాల కోసం బహుముఖ సహకారం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వుందన్నారు. భారతదేశం ఇంకా పలుదేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుందన్నారు. ఈ సంబంధాలు ఇంకా మెరుగుపడాల్సి వుందన్నారు. ఎస్వీయూ రెక్టార్ ఎం.భాస్కర్ మాట్లాడుతూ 21వ శతాబ్దంలో సమాచార, సాంకేతిక రంగాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రపంచ దేశాల మధ్య అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో సంబంధాలు బలపడటానికి దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా సౌత్ ఈస్ట్ ఏషియన్ పసిఫిక్ స్టడీస్ ప్రచురించిన పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కరించారు. శ్రీనివాసన్‌కు జీవితసాఫల్య పురస్కారం భారత రాయబారిగా శ్రీనివాసన్ చేసిన సేవలకు గుర్తింపుగా సీప్ స్టడీస్ ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం అందజేసింది. ఈకార్యక్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ వరల్డ్ ఎఫైర్స్ డెప్యూటీ డెరైక్టర్ అజనీష్కుమార్, వియత్నాంకు చెందిన ప్రొఫెసర్ సువాన్ బింగ్, సీప్‌స్టడీస్ డెరైక్టర్ జి.జయచంద్రారెడ్డి, మాజీ డెరైక్టర్లు రాజారెడ్డి, లక్ష్మణశెట్టి, యాగమరెడ్డి, రవీంద్రనాధరెడ్డి, అధ్యాపకులు ప్రయాగ, విజయకుమార్, రమేష్‌బాబు పాల్గొన్నారు. -
మీ పాపాన్నిమా రైతులెందుకు మోయాలి?
వాతావరణ కాలుష్యం అభివృద్ధి చెందిన దేశాల చలువే స్పష్టం చేసిన వ్యవసాయ రంగ నిపుణులు ‘పర్యావరణ మార్పులు, ఆహార బాధ్యత- నైతిక ధోరణులు’పై అంతర్జాతీయ సదస్సు సాక్షి, హైదరాబాద్: ‘అభివృద్ధి చెందిన దేశాలు చేస్తున్న వాతావరణ కాలుష్యానికి పేద, వర్ధమాన దేశాల చిన్న, సన్నకారు, మధ్యతరహా రైతులు ఎందుకు బలికావాలి? పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నందుకు పారిశ్రామికాభివృద్ధి చెందిన దేశాలు భరాయించాల్సిన వ్యయాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల రైతులెందుకు మోయాలి. ఇది నైతికత కాదు. ప్రపంచం నుంచి ఆకలి బాధను తరిమికొట్టేందుకు 2030 వరకు ప్రతి ఏటా 105 బిలియన్ డాలర్ల మొత్తాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయంపై ఖర్చు పెడతామన్న మాటకు అభివృద్ధి చెందిన దేశాలు కట్టుబడాలి’ అని పలువురు వ్యవసాయ రంగ నిపుణులు స్పష్టం చేశారు. ‘పర్యావరణ మార్పులు, ఆహార భద్రత- నైతిక ధోరణులు’ అనే అంశంపై మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సు గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అగ్రి బయోటెక్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు యూరోప్, అమెరికా, ఆసియా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రారంభ కార్యక్రమంలో ప్రపంచ ఆహార అవార్డు గ్రహీత, సన్హాక్ శాంతి బహుమతి విజేత డాక్టర్ ఎంవీ గుప్తా, ప్రొఫెసర్ మత్తియాస్ కైసర్ (నార్వే), ప్రొఫెసర్ థియో వాన్ డీ శాండీ (నెదర్లాండ్స్), ప్రొఫెసర్ ఇ.హరిబాబు (హైదరాబాద్ యూనివర్శిటీ మాజీ వీసీ), ప్రొఫెసర్ జి.పక్కిరెడ్డి తదితరులు ప్రసంగించారు. ప్రపంచంలో ఆర్థిక అసమానతలు, ఆహార అలవాట్లు, ఆహార దుబారా, నైతికత, 2030 నాటికి ప్రపంచం నుంచి ఆకలి, దారిద్య్రాన్ని పారదోలడం వంటి అంశాలపై వక్తలు ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకుపోతున్నా ఆకలి, పేదరికమనే రెండు ప్రధాన సవాళ్లకు పరిష్కారం కనుగొనడంలో వెనుకబడి ఉందని ఎంవీ గుప్తా పేర్కొన్నారు. వీటికి పరిష్కారం కనుగొనకపోతే ప్రపంచం అశాంతిని, అంతర్యుద్ధాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. బహుళజాతి సంస్థలు తమ సామాజిక, కార్పొరేట్ బాధ్యతను విస్మరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు పేదరికం, మరో వైపు అధిక బరువు... సహజ వనరులను అవసరాలకు మించి వినియోగిస్తున్న తీరుతో ప్రపంచంలో అసమానతలు పెరిగాయని, ఫలితంగా కొందరు తిండికి అల్లాడుతుంటే మరోవైపు అధిక బరువు(ఒబేసిటీ)తో బాధ పడుతున్నారని నార్వేలో బెర్జన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాత్తియాస్ కైసర్ చెప్పారు. వాతావరణ మార్పులకు, ఆహార భద్రతకు పరస్పర సంబంధం ఉందని నెదర్లాండ్స్‌కు చెందిన థియో వాన్ డీ శాండీ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మెజారిటీ ప్రజలు మెట్ట వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారని, వాళ్లకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. శుక్ర, శనివారాల్లో కూడా సదస్సు కొనసాగుతుందని ప్రొఫెసర్ పక్కిరెడ్డి తెలిపారు. -
కళకళ...
-
అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైన గురుకుల పాఠశాల విద్యార్థులు
కర్నూలు (శ్రీశైలం ప్రాజెక్టు) : ఏపీ గిరిజన గురుకుల ప్రతిభా పాఠశాల విద్యార్థులు అమెరికా హార్వర్డ్ యూనివర్శిటీ, ఐక్యరాజ్యసమితి సంయుక్తంగా నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైనట్లు ఐటీడీఏ పీఓ ఈసా రవీంద్రబాబు తెలిపారు. ఈ సదస్సు హైదరాబాద్‌లో ఈ నెల 13 నుంచి 16 వ తేదీ వరకు జరుగనుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న తాటి వెంకటలక్ష్మి, భూమని చెంచులక్ష్మి, యాకసిరి శివకుమార్, చేవూరి నాగరాజులు సదస్సులో పాల్గొంటున్నారని చెప్పారు. ఈ సదస్సుకు దేశ,విదేశాల నుంచి నిపుణులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొని విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన, అటవీ సంరక్షణలపై చర్చలు జరుపుతారని చెప్పారు. -
ఇంధన పొదుపునకు విదేశీ సహకారం
పారిస్ సదస్సు వివరాలు వెల్లడించిన చంద్రశేఖర్ రెడ్డి సాక్షి, హైదరాబాద్ : ఇంధన పొదుపు చర్యలను ముందుకు తీసుకెళ్ళేందుకు తమ అనుభవాన్ని అందించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు సుముఖత వ్యక్తం చేశాయని రాష్ట్ర ఇంధన పొదుపు మిషన్ ముఖ్య అధికారి ఏ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇంధన పొదుపుపై విశాఖపట్టణంలో మరో ఆరు నెలల్లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. పారిస్‌లో ఈ నెల 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ అంతర్జాతీయ ఇంధన సదస్సు జరిగింది. అమెరికాసహా 29 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రం తరపున చంద్రశేఖర్ రెడ్డి సదస్సుకు హాజరయ్యారు. సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలను గురువారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఇంధనశాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌కు వివరించారు. ఇంధన పొదుపు దిశగా రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై పలు దేశాలు ఆసక్తి కనబరచాయని, ఇదే రీతిలో ముందుకెళ్తే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారని చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. స్టార్ రేటింగ్ విద్యుత్ ఉపకరణాల వాడకం అనుసరణీయమని పలు దేశాల ప్రతినిధులు సూచించినట్టు తెలిపారు. -
మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధించాలి
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విజయవాడ : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఆర్థికంగా సుసంపన్నులు కా వాలని, అందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. మహాత్మాగాంధీ రోడ్డులోని హోటల్ గేట్‌వేలో శనివారం ఎమర్జింగ్ గ్లోబల్ బిజినెస్‌లో ఎంటర్ ప్రెనియర్స్‌కు ఉన్న అవకాశాలపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెనియర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (అలీప్) ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మహిళా పారిశ్రామిక వేత్తలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. గ్రామీణ మహిళలు వృత్తి నైపుణ్యాలను పెంచుకుని అక్కడే చిన్న పరిశ్రమలను స్థాపించాలని ఆయన సూచించారు. నేడు యువత గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు ఆగాలంటే గ్రామాల్లో ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. అమ్మాయి పుడితే చిరునవ్వుతో స్వాగతించాలని, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను అబ్బాయిలకంటే అమ్మాయిలే బాగా చూసుకుంటారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన అలీప్ అధ్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ అలీప్ ఆధ్వర్యంలో మహిళలకు చేతివృత్తుల్లో నైపుణ్యాలను పెంపొం దించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ఒక పాలసీని రూపొందించాలని కోరారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దే అనురాధ, అలీప్ సెక్రటరీ పద్మజాప్రభాకర్, సీఎస్ రామలక్ష్మి, డాక్టర్ హెచ్.పురుషోత్తం పాల్గొన్నారు. అనంతరం వివిధ అంశాలపై పలువురు నిపుణులు ప్రసంగించారు. -
చైనా డిగ్రీలకు భారత్‌లో గుర్తింపుపై చర్చలు
బీజింగ్: భారతదేశ డిగ్రీలకు చైనాలో, చైనా డిగ్రీలకు భారత్‌లో గుర్తింపునిచ్చే దిశగా ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, చైనా మంత్రి యాంగ్ గురియన్‌తో ఈ విషయంపై కీలక చర్చలు జరిపారు. అలాగే, ఉన్నత విద్యలో సహకారాన్ని పెంపొందించుకునే దిశగా.. ఇరుదేశాల ఉన్నత విద్యా సంస్థలతో ఒక కన్సార్షియంను ఏర్పాటు చేయాలనే విషయంపై కూడా వారు చర్చించారు. 4 రోజుల పర్యటనకు గానూ ఇరానీ చైనా వెళ్లిన విషయం తెలిసిందే. చైనా ప్రభుత్వం, యునెస్కో సంయుక్తంగా నిర్వహించిన ‘2015 తరువాత విద్యారంగం’ అనే అంశపై శనివారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆమె పాల్గొన్నారు. చైనా మంత్రి యాంగ్ గురియన్‌తో చర్చల సందర్భంగా.. ఉపాధ్యాయుల శిక్షణలో పరస్పర సహకారంపై ఒక ఒప్పందానికి వచ్చారు. దాదాపు 13 వేల మంది భారతీయ విద్యార్థులు ప్రస్తుతం చైనాలో చదువుకుంటున్నారు. వారిలో అత్యధికులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. -
మిశ్రధాతువుల కేంద్రంగా హైదరాబాద్!
డీఆర్డీవో డీజీ అవినాశ్ చందర్ రీయిన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్స్‌పై అంతర్జాతీయ సదస్సు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: రక్షణ, విమానయాన రంగాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ రానున్న కాలంలో మిశ్రధాతువుల (కాంపోజిట్స్) తయారీలోనూ కీలకపాత్ర పోషించనుందని డీఆర్డీవో డెరైక్టర్ జనరల్, రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ అవినాశ్ చందర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని హైటెక్స్ కేంద్రంలో రీయిన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్స్‌పై ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు (ఐసీఈఆర్‌పీ)లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మిశ్రధాతువుల వాడకం ద్వారా ఖర్చు తగ్గడమే కాకుండా అనేక ఇతర ప్రయోజనాలు ఉంటాయన్నారు. రైలు బోగీల్లో ఇప్పటికీ లోహాలను అధికంగా వాడుతున్నారని, మిశ్రధాతువుల వాడకంతో ఎక్కువ ప్రయాణికులను తీసుకెళ్లవచ్చన్నారు. అగ్ని క్షిపణుల్లో 90 శాతం వరకూ వీటినే వాడామన్నారు.. వచ్చే పదేళ్లలో లక్ష మంది మిశ్రధాతు నిపుణులు అవసరం కావచ్చునని ఆయన అంచనా వేశారు. అంతకుముందు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పారిశ్రామికంగా రాష్ట్రం త్వరగా ఎదిగేందుకు తమ ప్రభుత్వం అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. టీఎస్ఐపాస్ ద్వారా న్యాయ, పరిపాలన అనుమతులను వేగంగా ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మిశ్రధాతువుల రంగానికి ప్రోత్సాహమిచ్చేందుకు హైదరాబాద్‌లో 100 ఎకరాల్లో పారి శ్రామికవాడను ఏర్పాటు చేస్తున్నామని తెలి పారు. కార్యక్రమంలో ఓవెన్స్ కార్నింగ్ వైస్ ప్రెసిడెంట్ మార్సియాస్ సండ్రీ, ఎఫ్ఆర్పీ ఇన్స్టిట్యూట్ చైర్మన్ సుభాష్ విట్టల్‌దాస్‌లు పాల్గొన్నారు. -
యోగా, ప్రకృతి వైద్యంపై అంతర్జాతీయ సదస్సు
కర్ణాటక రాష్ట్రంలోని ఉజిరేలో.. డిసెంబర్ 12 నుంచి 14 వరకు... సాక్షి, హైదరాబాద్: యోగా, ప్రకృతి వైద్య శాస్త్రాలపై డిసెంబర్ 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని ఉజిరేలో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు సదస్సు నిర్వహణ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంత్శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 0825236188, 9743605658, 9483004400 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. -
నెహ్రూ విధానాలను వక్రీకరిస్తున్నారు
లౌకికత్వం లేకుండా దేశానికి అస్తిత్వం లేదు: సోనియా నెహ్రూ విధానాలను తక్కువగా చూపే ప్రయత్నం జరుగుతోంది న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మనకు వారసత్వంగా అందించిన లౌకికత్వం (సెక్యులరిజం) వంటి విధానాలు ఇప్పుడు తప్పుడు వ్యక్తీకరణకు, వక్రీకరణకు గురవుతున్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. సెక్యులరిజం లేకుండా భారతదేశానికి అస్తిత్వం లేదన్నారు. నెహ్రూ 125వ జయంతి సందర్భంగా ఢిల్లీలో సోమవారం నెహ్రూ స్మారక అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీని, ఇతర బీజేపీ నేతలను ఆహ్వానించకుండా నిర్వహిస్తున్న ఈ సదస్సు సాక్షిగా సోనియా బీజేపీ, సంఘ్‌పరివార్ పేర్లు ప్రస్తావించకుండా కాషా య శక్తులపై మండిపడ్డారు. ఎన్డీఏయేతర పార్టీలకు చేరువ కావడానికి కాంగ్రెస్ వినియోగించుకుంటున్న ఈ సదస్సుకు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, సీపీఎం నుంచి ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరి, జేడీఎస్ చీఫ్ దేవెగౌడ, జేడీయూ అధ్యక్షడు శరద్‌యాదవ్, సీపీఐ నుంచి డి.రాజా, ఎన్సీపీ ప్రధానకార్యదర్శి డి.పి.త్రిపా ఠి, ఆర్జేడీ నేత జైప్రకాశ్ నారాయణ్ యాదవ్‌తో పాటు అఫ్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, ఘనా నుంచి జాన్ కుఫోర్, నైజీరియా నుంచి ఒబాసాంజో, నేపాల్ మాజీ ప్రధాని మాధవ్, పాకిస్థాన్ హక్కుల కార్యకర్త ఆస్మా జహంగీర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభం అనంతరం సోనియాగాంధీ ప్రసంగించారు. ‘నెహ్రూ జీవితాన్ని, ఆయన చేసిన కృషిని తక్కువచేసే ప్రయత్నం కొద్దిరోజులుగా జరుగుతోంది. ఆయన విధానాలు తప్పుడు వ్యక్తీకరణకు గురవుతున్నాయి. అందు లో నెహ్రూ నమ్మి, పాటించిన లౌకకవాదం కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కుంటోంది. మత విషయాల్లో తటస్థంగా ఉండే రాజ్యం, అన్ని మతాలకు సమాన గౌరవం నెహ్రూ లౌకికవాద భావనకు కీలకం. లౌకికత్వం లేకుండా భారత్గాని, భారతీయతగాని లేవు. ఇది ఒక లక్ష్యం కంటే గొప్పది. ఎంతో విభిన్న పరిస్థితులున్న మన దేశానికి అది ఎంతో అత్యవసరం.’ అని ఆమె పేర్కొన్నారు. వేర్వేరు సంస్కృతులు, మతాలు, భాషలు, ప్రాంతీయతలు ఉన్న మన దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి పార్లమెంటరీప్రజాస్వామ్యం, లౌకిక రాజ్యం దోహదపడతాయని నెహ్రూ విశ్వసించారని.. ఇదే సరైన విధానమని నిరూపణ అయిందన్నారు. సరైన మార్గంలో ఓటమి ఎదురైనా సరే.. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి నుంచి బయటపడలేకపోతున్న నేపథ్యంలో.. సోనియా నెహ్రూను ఉటంకిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజాస్వామ్యంలో గెలిచినవారు దానిని తలకు ఎక్కించుకోవాల్సిన అవసరం లేదని, ఓడినవారు చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని నెహ్రూ చెప్పేవారు. గెలిచామా? ఓడామా? అన్న ఫలితం కంటే.. అందుకు అనుసరించిన మార్గమే ముఖ్యమని.. తప్పుడు మార్గంలో గెలిచే బదులు, సరైన మార్గంలో వెళ్లి ఓడిపోవడమే నయమని నెహ్రూ చెప్పేవారు.’’ అని ఆమె పేర్కొన్నారు. రాజకీయాల్లోకి మతం ప్రవేశిస్తే వచ్చే పరిణామాలను గురించి నెహ్రూ ముందుగానే హెచ్చరించారన్నారు. నెహ్రూ తన విధానాలతో అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి హీరోగా మారారన్నారు. నెహ్రూ విధానాలు ఆచరణీయమని హమీద్ కర్జాయ్ సహా పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఈ సదస్సు మంగళవారం సాయంత్రం ముగియనుంది. క్షీణిస్తున్న అదృష్టానికి నిదర్శనం: బీజేపీ నెహ్రూ స్మారక సదస్సుకు ఆహ్వానితుల జాబితాను చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని అధికార బీజేపీ ఎద్దేవా చేసింది. నెహ్రూ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించినవారిని ఆ సదస్సుకు ఆహ్వానించడం.. క్షీణిస్తున్న కాంగ్రెస్ పార్టీ అదృష్టానికి చిహ్నంగా కనబడుతోందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించారు. నెహ్రూ విధానాలను వ్యతిరేకించిన వామపక్షాలను, రాంమనోహర్ లోహి యా అనుచరులను ఈ సదస్సుకు ఆహ్వానించ డం ఏమిటన్నారు. కాగా.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకొనేందుకే కాంగ్రెస్, లెఫ్ట్ లతో వేదిక పంచుకున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఒక అంతర్జాతీయ సదస్సులో కాంగ్రెస్, తృణమూల్‌తో వేదిక పంచుకోవడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్కరత్ పేర్కొన్నారు. -
సీనియర్ కాంగ్రెస్ నేతల డుమ్మా!
న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాని, దివంగత జవహర్ లాల్ నెహ్రూ 125వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా రెండు రోజులు నిర్వహిస్తున్న ఈ సదస్సులో ఆ పార్టీ సీనియర్ నేతలు చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, కమలనాధ్, కపిల్ సిబాల్ కనిపించలేదు. కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు కూడా హాజరుకాలేదు. జైరామ్ రమేష్ విదేశాలకు వెళ్లారు. ఏకే ఆంటోనీ అనారోగ్య కారణంగా హాజరుకాలేదు. ఈరోజు సదస్సుకు ఎన్డీయేతర పార్టీల నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జై, ఘనైనా అధ్యక్షుడు జాన్ కుఫూర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, మాజీ ప్రధాని దేవగౌడ, సీపీఐ నేత సీతారామ్ ఏచూరి, రాజా, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, టిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు. అంతేగాక కాంగ్రెస్ ఆహ్వానం మేరకు దాదాపు 50 దేశాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. -
ఇంతింతై...బస్తీల గొంతై!
- ‘మెట్రో’ సదస్సులో ప్రసంగించే అవకాశం - మురికివాడల సమస్యలపై గళమెత్తనున్న చిన్నోడు బంజారాహిల్స్: ఫిలింనగర్ మురికివాడల్లోని బసవ తారక నగర్ బస్తీలో నివసిస్తున్న ఆ కుర్రాడి ఇంటికి వెళ్లాలంటే రోడ్డు లేదు. మంచినీటి పైప్లే ఆ ఇంటికి వెళ్లే మెట్లు. ఇంటి నుంచి కిందికి వస్తే రోడ్లపై పారుతున్న మురుగునీరు... మూతలులేని మ్యాన్‌హోళ్లు... పొంగి పొర్లుతున్న డ్రైనేజీ పైపులు, కుప్పలుగా పేరుకుపోయిన చెత్తాచెదారం కనిపిస్తాయి. వారానికో మారు మంచినీటి సరఫరా, వెలగని వీధి దీపాలు, విద్యుత్ సమస్య షరా మామాలే... అలాంటి బస్తీకి చెందిన చిన్నోడికి మెట్రోపొలిస్ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించే అరుదైన అవకాశం లభించింది. ఆ చిన్నోడి పేరు కొక్కెన రాజ్‌కుమార్ (13). రాజధానిలోని బస్తీలలో, మురికివాడల్లో నివసించే చిన్నారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చూసి... అక్కడి ప్రజలతో మాట్లాడి, ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి... తన ప్రసంగంతో ఆకట్టుకున్న రాజ్‌కుమార్... సోమవారం నుంచి నగరంలో జరుగనున్న మెట్రోపొలిస్ సదస్సులో 1920 మంది విదేశీ ప్రతినిధుల ముందు ప్రసంగించనున్నాడు. ఈ బాలుడు స్థానికంగా ఉన్న లీడ్ గ్రామర్ హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపురం గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ తండ్రి కె.శేఖరయ్య కూలీ కాగా, తల్లి సరోజని గృహిణి. స్థానికంగా దివ్యదిశ, బాలరక్ష, హమారా బచ్పన్ స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న 60 గ్రూప్‌లలో రాజ్‌కుమార్ ఓ గ్రూప్‌నకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో రాజ్‌కుమార్ ప్రతిభను నిర్వాహకులు గుర్తించారు. వెంటనే నగరంలోని బస్తీలలోని చిన్నారుల సమస్యలను తెలుసుకునేందుకు బస్తీ బాట పట్టించారు. తనకు అప్పగించిన పనిని రాజ్‌కుమార్ నిద్రాహారాలు మాని పూర్తి చేశాడు. తాను నివసిస్తున్న బస్తీలోనే కొకొల్లలుగా ఉన్న సమస్యలను ఏకరువు పెట్టాడు. బస్తీల్లో సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ప్రజలు పడుతున్న పాట్లను ఆధారాలతో చూపించాడు. ప్రపంచం దృష్టికి తీసుకువెళతా.. దేశ విదేశాలకు చెందిన వందలాది మంది ప్రతినిధుల ముందు మాట్లాడే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది. వాయిస్ ఆఫ్ చిల్డ్రన్ అంశంలో భాగంగా ‘నేల -కలుషితమౌతున్న ఖాళీ స్థలాలు’ అనే అంశంపై ప్రసంగించబోతున్నాను. ఇందు కోసం హైదరాబాద్‌లోని చాలా బస్తీలు తిరిగాను. ఎక్కడా గ్రౌండ్లు లేవు. ఖాళీ స్థలాలు మురికి కూపాలుగా మారుతున్నాయి. పిల్లలకు ఆడుకునే అవకాశం దక్కడం లేదు. హైదరాబాద్‌లోని మురికివాడల్లో నివసించే పిల్లల తరఫున ఆ సమస్యలను ప్రపంచం దృష్టికి తీసుకువెళతా. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటా. - రాజ్ కుమార్ -
జగతి మెచ్చేలా.. జనం నచ్చేలా!
- మెట్రోపొలిస్ సదస్సుకు ఏర్పాట్లు పూర్తి - నగరం ముస్తాబు - ఆకట్టుకునేలా స్వాగత తోరణాలు - అతిథులకు పూర్తి స్థాయి భద్రత సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికవుతోంది. దీని కోసం నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సోమవారం నుంచి జరిగే మెట్రోపొలిస్ సదస్సు కోసం రహదారులు కొత్తరూపు సంతరించుకున్నాయి. వేదికకు వెళ్లే దారి పొడవునా వెలసిన స్వాగత తోరణాలు అతిథులను రా..రామ్మని ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతున్నాయి. అతిథులను ఆకర్షించేందుకు అవసరమైన ఏ ర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం తల మునకలవుతోంది. ఇలాంటి సదస్సులు కొత్త కాకపోయినా... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొట్ట తొలిగా నిర్వహిస్తున్న అతి పెద్ద కార్యక్రమం కావడంతో ప్రభుత్వ, అధికార వర్గాలు దీన్ని సవాలుగా తీసుకున్నాయి. ప్రజలు కూడా ఈ సదస్సు నిర్వహణ తీరుపై ఆసక్తి కనబరుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలనే లక్ష్యంతో తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో అన్ని వర్గాల అధికారులు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన 125 కి.మీ.ల పరిధిలో రహదారుల అభివృద్ధి, పచ్చదనం పెంపు తదితర కార్యక్రమాలు పూర్తి చేశారు. రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా... నగరం గొప్పదనాన్ని గుర్తించేలా అతిథులకు విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విమానాశ్రయం నుంచి అతిథులు తమకు కేటాయించిన హోటళ్లకు వెళ్లేంతవరకు వారిని సురక్షితంగా చేర్చేందుకు దాదాపు 130 మంది పోలీసులను ప్రత్యేకంగా నియమించారు. అతిథులతో మెలగాల్సిన తీరుపై వారికి శిక్షణ నిచ్చారు. ఏర్పాట్ల వివరాలను శనివారం హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. అతిథులు పర్యటించే మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండాజంక్షన్ల అభివృద్ధి పనులు చేసినట్టు వారు చెప్పారు. మెట్రో రైలు మార్గాల్లోనూ ట్రాఫిక్ చిక్కులు ఎదురవకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సదస్సుకు వచ్చే ప్రతినిధులు విమానాశ్రయంలో.. హోటళ్ల వద్ద క్యూలలో వేచి ఉండకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరిం చారు. ఈ నెల 6నుంచి 10వ తేదీ వరకు స దస్సు జరుగనున్న సంగతి తెలిసిందే. ప్రధాన సదస్సును 7న సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని వారు చెప్పారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయు డు, తదితరులు పాల్గొంటారని వెల్లడించారు. -
చదువు తన కోసం, జ్ఞానం ప్రపంచం కోసం!
ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ గురించి అధ్యయనం చేస్తున్న ఎంతోమంది అంతర్జాతీయ సదస్సులలో మాట్లాడే అవకాశం కోసం ప్రయత్నిస్తారు. కానీ ఆ అవకాశం అంకుర్‌కు వరసగా రావడమే కాదు... ఇతడి సలహాలు, సూచనలపై మంచి చర్చ కూడా జరుగుతోంది. ఇది స్పీడు యుగం. రిటైర్మెంట్ వరకు సాధించలేనిది కూడా మూడునాలుగేళ్లలో సాధించగలిగిన సత్తా నేటి తరం సొంతం. అంతేకాదు, అనుకున్న ఆలోచనను అమలు చేసేయగలిగిన ‘రిస్కీ బిహేవియర్’ ఈ తరంలో బాగా ఎక్కువ. 21 ఏళ్లకే అసాధారణమైన అంశాల్లో అనూహ్యంగా దూసుకెళ్తున్న ఈ కుర్రాడి దూకుడు చూడండి! చదువు అనేది మనిషికి అవగాహనను పెంచాలి... విజ్ఞానవంతుడిని చేయాలి... ఆ విజ్ఞానం సమస్యలను పరిష్కరించాలి... బాధ్యతలను నెరవేర్చాలి. అయితే ఈ ప్రపంచంలో చాలా మంది చదువుకున్న విజ్ఞానవంతులే. కానీ వారిలో అత్యధికులకు చదువుకు తగ్గ ఉపాధిని ఎంచుకోవడమే ఇష్టం. అలాంటి వారిలో ఒకరిగా మిగలకుండా ప్రత్యేకంగా నిలిచాడు అంకుర్ ఠాకూరియా. వాతావరణ మార్పులు, వాటి వల్ల తలెత్తున్న సమస్యల గురించి అధ్యయనం చేస్తూ... పిన్న వయసులో ప్రపంచదేశాలకు ఈ విషయంలో దిశానిర్దేశం చేస్తున్నాడు అంకుర్! అంకుర్.. న్యూఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుతున్నాడు. ఈ ఏడాదితో గ్రాడ్యుయేషన్ పూర్తవుతుంది. మరి పేరున్న ఆ విద్యాసంస్థలో చదువు పూర్తి చేశాడు కాబట్టి... మంచి ఉద్యోగం వస్తుంది.. పెద్ద జీతం లభిస్తుంది. సాధారణంగా ఎవరైనా అయితే ఆలోచించే తీరిది. అయితే అంకుర్ మాత్రం ఇప్పటికే చదువుతున్న విద్యాసంస్థ కన్నా, వ్యక్తిగతంగా ఎంతో పేరు తెచ్చుకొన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గాంచాడు. సాదాసీదాగా బతకడం మీద పెద్దగా ఇష్టంలేని అంకుర్ ఏదైనా సామాజిక సేవా సంస్థతో కలిసి పనిచేయాలని భావించాడు. ఆ ఉద్దేశంతో 17 యేళ్ల వయసులోనే కాలిఫోర్నియా నుంచి పనిచేసే ‘ఫౌండేషన్ ఫర్ ఎ డ్రగ్ ఫ్రీ వరల్డ్’కు భారత్‌లో వలంటీర్ అయ్యాడు. చిన్న వయసులోనే అంకుర్ ఆలోచనలు ఆ ఫౌండేషన్ వాళ్లను ఆకట్టుకొన్నాయి. అంకుర్ ప్రతి విషయంపై అవగాహన పెంచుకుంటూ ఉంటాడు. ఆ సంస్థలో వలంటీర్‌గా తొలిసారి నిర్వహించిన భారీ ర్యాలీలో ఐదువేల మందిని ఉద్దేశించి ప్రసంగించడంతో అంకుర్‌కు తనమీద కాన్ఫిడెన్స్ వచ్చిందట. ఈ కార్యక్రమంలో అంకుర్ ప్రతిభను చూసి మరికొంతమంది కూడా అతడిపై నమ్మకాన్ని పెంచుకొన్నారు. జీ 20 నుంచి ఆహ్వానం సామాజిక సమస్యల గురించి ‘జీ 20’ సమావేశంలో జరిగిన చర్చ సమయంలో అంకుర్ ప్రస్తావన వచ్చింది. ఈ భారతీయ యువకుడిని, వలంటీర్‌గా అతడి శక్తి యుక్తులను ఉపయోగించుకోవచ్చని... అతడిని యువతకు ప్రతినిధిగా భావించవచ్చని జీ20 జాబితాలోని దేశాల ప్రముఖులు అభిప్రాయపడ్డారు. 2011 లో ఐక్యరాజ్య సమితి సమావేశంలో అంకుర్ యువ ప్రతినిధిగా నియమితుడయ్యాడు. అక్కడ నుంచి జీ 20 దేశాల తరపున వివిధ సామాజిక సమస్యల గురించి స్పందించే సామాజిక కార్యకర్తగా గుర్తింపు సంపాదించుకొన్నాడు. డ్రగ్స్ నివారణతో మొదలుపెట్టి... ఇప్పుడు వాతావరణ మార్పులు, పర్యవ సానంగా తలెత్తే సమస్యల గురించి అవగాహన నింపడానికి ఈ యువకుడు ప్రయత్నిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా అనేక సదస్సులకు హాజరవుతున్నాడు. మార్పు తీసుకురాగల శక్తి ఉన్న వ్యక్తులను ప్రభావితం చేసే ప్రసంగాలు చేస్తున్నాడు. అంతేకాదు, వాతావరణ మార్పులు, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న అంశాల గురించి చర్చించే ‘వరల్డ్ బిజినెస్ డైలాగ్’ సదస్సులో వరసగా 2012, 2013 సంవత్సరాల్లో ప్రసంగించే అవకాశాన్ని సంపాదించుకొన్నాడు.ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతున్న సమస్యల గురించి తన ఆలోచనా విధానంతో అంకుర్ గొప్పవాడయ్యాడు. తనకు ఈ గుర్తింపు రావడంతో తల్లిదండ్రుల, తోబుట్టువుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని అంకుర్ చెబుతాడు. ఈ ఏడాదితో చదువు పూర్తి కాగానే ఏం చేద్దామనుకొంటున్నావు?అని అంకుర్‌ని అడిగితే... మంచి ఉద్యోగం చేస్తూనే, సామాజిక సేవాకార్యకర్తగా కొనసాగాలని నిర్ణయించుకొన్నానని అంటున్నాడు. వలంటీర్‌గా తన సమ్మోహక శక్తిని ఈ ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి ఉపయోగిస్తానని చెబుతున్నాడు. అంతేకాదు క్యాంపస్రైటింగ్.కామ్ (http://campuswriting.com/) ద్వారా యువత కోసం ఓ బ్లాగును వెబ్సైట్ రేంజ్లో నిర్వహిస్తున్నాడు. -
25న కలెక్టర్ సింగపూర్ పయనం
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఈనెల 25 నుంచి సెప్టెంబర్ 2 వరకూ సింగపూర్‌లో ‘సెవెన్త్ లీడర్స్ ఇన్ గవర్నెన్స్ ప్రోగ్రామ్’ పేరుతో నిర్వహించే అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్ సిద్ధార్థజైన్ పాల్గొననున్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కీలక భూమిక పోషించే ప్రతినిధులతో ఈనెల 25 నుంచి సింగపూర్‌లో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా సిద్ధార్థజైన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్.కృష్ణారావు ఎంపిక చేశారు. సింగపూర్ సదస్సులో పాల్గొనడానికి ఈ నెల 24న కలెక్టర్ చెన్నైకి చేరుకోనున్నారు. అక్కడి నుంచి సింగపూర్‌కు వెళ్లి.. సదస్సు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 4న జిల్లాకు చేరుకుంటారని అధికారవర్గాలు వెల్లడించాయి. -
నేనే నియంతనైతే ఒకటో తరగతిలోనే ‘గీత’
సుప్రీంకోర్టు జస్టిస్ ఎ.ఆర్. దవే వ్యాఖ్య అహ్మదాబాద్: భారతీయులంతా పాతకాలంనాటి సంప్రదాయాలను తిరిగి పాటించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఆర్. దవే సూచించారు. పిల్లలకు చిన్న వయసు నుంచే భగవద్గీత, మహాభారతాన్ని నేర్పించాలన్నారు. ఒకవేళ తానే నియంతను అయ్యుండుంటే విద్యార్థులకు ఒకటో తరగతిలోనే మహాభారతం, భగవద్గీతను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టే వాడినని వ్యాఖ్యానించారు. జీవితాన్ని ఎలా అనుభవించాలో నేర్చుకోవాల్సినది ఆ మార్గంలోనేనన్నారు. శనివారం అహ్మదాబాద్‌లో జరిగిన ‘ప్రపంచీకరణ కాలంలో సమకాలీన అంశాలు, మానవహక్కులకు సవాళ్ల’పై అంతర్జాతీయ సదస్సులో దవే పాల్గొన్నారు. మంచి ఎక్కడున్నా సరే దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో గురుశిష్య సంస్కృతి పోయిందని...అదే ఉండి ఉంటే సమాజం ఎదుర్కొంటున్న హింస, ఉగ్రవాదం వంటి సమస్యలు ఉండేవి కావన్నారు. -
ఇంప్లాంట్ దంత వైద్యంపై అంతర్జాతీయ సదస్సు
సాక్షి, హైదరాబాద్: నగరంలో తొలిసారిగా ఇంప్లాంట్ దంతవైద్యంపై 3వ అంతర్జాతీయు సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం పద్మశ్రీ అవార్డు గ్రహీత, వలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సెన్సైస్ న్యూఢిల్లీ డెరైక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ వుహేష్వర్మ లాంఛనంగా ప్రారంభించారు. భారత్‌తోపాటు జర్మనీ, దక్షిణ ఆఫ్రికా,స్పెరుున్, కెనడా, ఇటలీ దేశాల నుంచి 750 వుంది ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యూరు. -
ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పదిశాతం జలాలు తాగునీటికే
రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ సలహాదారు విద్యాసాగర్‌రావు ముగిసిన రెండురోజుల ‘ఐవా’ అంతర్జాతీయ సదస్సు సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించనున్న సాగునీటి ప్రాజెక్టుల్లో పదిశాతం జలాలను గ్రామీణ, పట్టణ తాగునీటి అవసరాలకు విధిగా కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆర్.విద్యాసాగర్‌రావు అన్నారు. ఇండియన్ వాటర్‌వర్క్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘పట్టణాల్లో మెరుగైన తాగునీటి సరఫరా..ఉత్తమ పద్ధతులు’ అన్న అంశంపై బేగంపేట్‌లోని ఓ హోటల్లో జరిగిన రెండురోజుల అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో శుక్రవారం ఆయన కీలకోపన్యాసం చేశారు. హైదరాబాద్ నగరానికి ఆయా జలాశయాల నుంచి తరలిస్తున్న నీటి పంపింగ్‌కు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేక ఫీడర్ల ఏర్పాటుపైనా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అమెరికా,జపాన్ దేశాలతోపాటు ఐవా అధ్యక్షుడు పీజీ శాస్త్రి, ప్రతినిధులు బి.చంద్రశేఖర్, వి.జంబుల్‌రెడ్డి, జలమండలి ఈఎన్సీ ఎం.సత్యనారాయణ, డెరైక్టర్ జి.రామేశ్వర్రావు పాల్గొన్నారు. అంతర్జాతీయ సదస్సు తీర్మానాలివే ప్రతి సాగునీటి ప్రాజెక్టులో పదిశాతం నీటి వాటాను గ్రామీణ,పట్టణాల తాగునీటి అవసరాలకు కేటాయించాలి, నగరాల్లో 24 గంటలపాటు కొరత లేకుండా నీటిని సరఫరా చేయాలి. నీటి వృథాను అరికట్టాలి, ఉపయోగించిన నీటిని పునఃశుద్ధి(రీసైక్లింగ్)చేసి తిరిగి వినియోగించే విధానాలపై దృష్టిసారించాలి,తాగునీటిని అందిస్తున్న జలాశయాలను పదికాలాల పాటు పరిరక్షించాలి, తాగునీటి జలాశయాలు కాలుష్యం,కబ్జాల బారిన పడకుండా కాపాడాలి, తాగునీటిని పొదుపుగా వాడడంపై ప్రజల్లో విస్తృత అవగాహనకల్పించాలి, పట్టణ ప్రణాళికలో నీటి సరఫరాకు అధిక ప్రాధాన్యం కల్పించాలి, వర్షపునీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టాలి, భూగర్భజలాల పెంపునకు ప్రభుత్వం,ప్రజలు కృషిచేయాలి. -
తెలుగును విశ్వవ్యాప్తం చేద్దాం
అధికార భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ కర్నూలు, న్యూస్‌లైన్: గ్లోబలీకరణను సానుకూలంగా ఉపయోగించుకుని తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేయాలని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కర్నూలులో రెండు రోజులపాటు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన ముఖ్య ప్రసంగం చేస్తూ తెలుగు భాషపై తెలుగు పాలకులకు, నేతలకు మమకారం తగ్గడంతోనే రాష్ట్రం విభజన జరిగిందన్నారు. గ్లోబలీకరణతో దేశంలోని అన్ని మాతృభాషలు ప్రమాదపుటంచుల్లో పడిపోయాయన్నారు. మారిషస్‌లో తెలుగు ప్రజలు ఇప్పటికీ మన సంస్కృతీ సంప్రదాయాలను పాటించడం అభినందనీయమన్నారు. అనంతరం మారిషస్ ఆంధ్ర లలిత కళా సమితి అధ్యక్షులు సంజీవ నర్సింహ అప్పడు కర్నూలు మట్టిని తమ దేశానికి తీసుకెళ్లి మారిషస్ మట్టితో కలిపి ఆరడుగుల తెలుగుతల్లి విగ్రహాన్ని నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో చైనా, నైజీరియా, ఇరాన్, పోలండ్ తదితర దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. -
సాంస్కృతికం
-
భవిష్యత్తు ఫ్యాషన్ రంగానిదే
ఐఐఎం కొజికోడ్ డెరైక్టర్ దెబాషిష్ ఛటర్జీ నిఫ్ట్‌లో ‘రిఫ్లెక్షన్-14’ సదస్సు ప్రారంభం మాదాపూర్, న్యూస్‌లైన్: ఫ్యాషన్ రంగానికి ప్రాధాన్యం పెరుగుతోందని, యేటా మూడువేల మంది ఫ్యాషన్ డిజైనర్లు నిఫ్ట్ ద్వారా బయటకు వస్తున్నారని ఐఐఎం కొజికోడ్ డెరైక్టర్ దెబాషిష్ ఛటర్జీ అన్నారు. మాదాపూర్ నిఫ్ట్ ఆడిటోరియంలో గురువారం ‘రిఫ్లెక్షన్స్-14’ పేరిట అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దెబాషిష్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సదస్సులో భావితరాలకు ఏ విధమైన డిజైన్స్ అందించాలి, రిటైల్, మేనేజ్మెంట్ అంశాలపై చర్చించనున్నామన్నారు. నిఫ్ట్ డెరైక్టర్ ప్రేమ్‌కుమార్ గేర మాట్లాడుతూ నేటి తరం ఫ్యాషన్ రంగంపై మక్కువ చూపుపుతున్నారని, ఈ రంగంలో చేరేవారి సంఖ్య యేటా పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. అనంతరం విద్యార్థులు తమ ఫ్యాషన్ మెళకువలను సంక్రాంతి ముగ్గులకు జోడించి ప్రాంగణాన్ని రంగవల్లులతో అలంకరించారు. -
క్లీన్ తాండూరు!
తాండూరు, న్యూస్‌లైన్: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు తాండూరు మున్సిపాలిటీ ఎంపికైంది. జనవరి 28, 29, 30 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం రాజేం ద్రనగర్లోని ఆచార్య ఎన్జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 185 మున్సిపాలిటీల్లోంచి 10 మున్సిపాలిటీలు ఈ కాన్ఫరెన్స్‌కు ఎంపికయ్యాయి. ఇం దులో తాండూరు మున్సిపాలిటీ ఒకటి. ఈ కాన్ఫరెన్స్‌లో దేశంలోని ఇతర రాష్ట్రాల మున్సిపాలిటీలతోపాటు జపాన్, మలేషియా తదితర విదేశీ ప్రతినిధులు పాల్గొంటారు. గత ఏడాది కాలంగా తాండూరు మున్సిపాలిటీలో ఇంటింటికీ చెత్త సేకరణ, పొడి చెత్త, తడి చెత్త వేర్వేరుగా చేసి మున్సిపల్ వాహనంలో వేయడం, ప్లాస్టిక్ కవర్ల నిషేధం, కంపోస్టు యార్డు అభివృద్ధి, నైట్ స్వీపింగ్ తదితర పారిశుద్ధ్యం కార్యక్రమాలపై మున్సిపల్ కమిషనర్ రమణాచారి, అధికారుల బృందం పట్టణ వాసులకు అవగాహన కల్పిస్తోంది. రోడ్ల పక్కన చెత్తను పడేయడం, ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దని వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థల యజమానులు, డ్వాక్రా సంఘాల మహిళలు, హోటళ్ల నిర్వాహకులు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ తాండూరును ‘క్లీన్‌సిటీ’గా మార్చేందుకు కమిషనర్ కృషి చేస్తున్నారు. తాండూరులో పారిశుద్ధ్యం మెరుగుకు చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించేందుకు ఎంతోమంది ఇతర జిల్లాల మున్సిపల్ అధికారులు ఇక్కడికి వచ్చారు. ప్లాస్టిక్ కవర్ల వాడకం, చెత్తను రోడ్లపక్కన పడేయడం వల్ల కలిగే అనర్థాలపై నిత్యం మున్సిపల్ వాహనంలో లౌడ్‌స్పీకర్ల ద్వారా అనౌన్స్మెంట్ చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రజలను ప్రోత్సహించడంతోపాటు మరుగుదొడ్ల పైప్‌లకు కవర్లు బిగించడం తదితర కార్యక్రమాలనూ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై నిర్వహించనున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు తాండూరు మున్సిపాలిటీ ఎంపికైంది. తాండూరును సందర్శించిన సర్వే బృందం సాలిడ్ వేస్ట్మేనేజ్మెంట్పై తాండూరు మున్సిపాలిటీలో అమలు చేస్తున్న కార్యక్రమాలను అంతర్జాతీయ కాన్పరెన్స్‌లో ప్రదర్శించేందుకు సర్వే బృందం మంగళవారం తాండూరును సందర్శించింది. మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఇంజినీర్ సత్యనారాయణ, వ్యాపారులు, పారిశుద్ధ్యం సిబ్బంది నుంచి వివరాలు సేకరించింది. అందరి సహకారంతోనే.. మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపారులు, విద్యార్థులు, మహిళలతోపాటు మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తున్నాం. అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. - రమణాచారి, తాండూరు మున్సిపల్ కమిషనర్ -
గ్రామీణుల చెంతకు నైపుణ్యం
=రీమ్యాప్ చైర్మన్ కేసీ రెడ్డి =న్యాక్‌లో ప్రారంభమైన స్కిల్స్-2013 అంతర్జాతీయ సదస్సు సాక్షి, సిటీబ్యూరో: ‘‘గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాలను, వారి జీవనోపాధిని మెరుగు పరిచేందుకు నైపుణ్యాల ఆవశ్యకత ఎంతో ఉంది. వృత్తిపరమైన నైపుణ్యాల కోసం ఎంతోమంది పట్టణాలకు వలస వస్తున్నారు. అలాకాకుండా.. నైపుణ్యాలను వారి చెంతకు చేరుస్తూ.. దేశ నిర్మాణం కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని’’అని రాజీవ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ మిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్(రీమ్యాప్) చైర్మన్ కె.సి.రెడ్డి పిలుపునిచ్చారు. ‘లైఫ్ స్కిల్స్ అండ్ లైవ్లీ హుడ్ స్కిల్స్-చాలెంజెస్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్’అంశంపై రూరల్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ (రీడ్స్) ఏర్పాటు చేసిన మూడు రోజుల ‘స్కిల్స్-2013’అంతర్జాతీయ సదస్సు గురువారం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్)లో ప్రారంభమైంది. సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సేవా సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అమెరికా.. తదితర దేశాలకు చెం దిన ప్రతినిధులు పెద ్ద సంఖ్యలో హాజరయ్యారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కె.సి.రెడ్డి మాట్లాడుతూ.. మరో పదేళ్లలో భారత దేశం ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తి వంతమైన దేశంగా మారనుందన్నారు. దేశ జనాభాలో యువత శాతం అధికంగా ఉండడమే కారణమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులకు డిమాండ్ పెరిగిందని, ఈ దిశగా దేశంలోనూ, రాష్ట్రంలోనూ అన్ని వర్గాల ప్రజల్లో స్కిల్స్‌ను పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృ షి చేస్తున్నాయన్నారు. దేశ నిర్మాణంలో ప్రభుత్వంతో పాటు సేవా సంస్థలు, పరిశ్రమలు భాగస్వాములు కావాలన్నా రు. ఇండస్ట్రీ ఆశిస్తున్న మేరకు వివిధ స్థాయిల్లో యువతకు రాజీవ్ యువకిరణాల కార్యక్రమం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణను అందిస్తున్నామన్నారు. నైపుణ్యాలను పెంపొందించి వారికి మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. ప్రజల జీవితాలను, జీవనోపాధిని పెంపొందించడంలో ఎదురవుతున్న సవాళ్లు అంశంపై రీడ్స్ సంస్థ అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. సదస్సు ద్వా రా ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లకు మేథావులు సరైన పరిష్కార మార్గాలు అన్వేషించాలని కోరారు. రీడ్స్ సంస్థ చైర్మన్ విక్రమ్ మాట్లాడు తూ.. కేంద్ర ప్రభుత్వం దశాబ్దాకాలం గా విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వలన ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో గణనీయమైన ప్రగతి కనిపిస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే స్కిల్ డెవలప్మెంట్పై కూడా ఆయా వర్గాలకు అవగాహన పెరిగిందని చెప్పారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజల్లో నైపుణ్యాలను పెంపొందించే దిశగా రీడ్స్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆయన పే ర్కొన్నారు. అనంతరం నిర్వహించిన సెషన్లో.. స్కిల్లింగ్ 500 మిలియన్ అంశం పై వక్తల ఉపన్యాసాలను సభికులను ఆకట్టుకున్నాయి. ‘స్కిల్ ట్రైనింగ్ ఫర్ ఎంపవర్మెంట్ ఏ స్టడీ ఆన్ విమెన్ ఇన్ అగ్రికల్చర్’ అంశంపై విద్యావేత్త డాక్టర్ జయా ఇందిరేశన్,‘స్కిల్ డెవలప్మెంట్- సీఎస్ఆర్ ఇనిషియేటివ్స్’ అంశంపై అమృతా యూనివర్సిటీ ప్రొఫెసర్ భవానీ, ‘ఎవాల్యుయేషన్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ అర్బన్ పూర్’ ఆంశంపై సీఐఎస్సీ డీన్ ప్రొఫెసర్ రమణ ఉపన్యసించారు. కార్యక్రమంలో కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్ చందర్ శర్మ, ఆస్ట్రేలియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషనర్ కెయిలీ బెల్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ మాజీ డెరైక్టర్ ప్రొఫెసర్ ముఖోపాధ్యాయ్, ఎన్ఎస్డీసీ ప్రిన్సిపాల్ రాజన్ చౌదరి, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ శశిభూషణ్ కుమార్, ప్రొఫెసర్ సదానంద,రవిరెడ్డి పాల్గొన్నారు. -
పోటీతత్వం పెంచుకోవాలి: మన్మోహన్సింగ్
ప్రభుత్వరంగ సంస్థలకు ప్రధాని సూచన న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలకు పాలనాపరంగా మరింత స్వయంప్రతిపత్తి కల్పించి, అధికారిక నియంత్రణ నుంచి స్వేచ్ఛ కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ప్రభుత్వరంగ సంస్థలు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల మధ్య పోటీ తత్వం, ముందున్న సవాళ్లు అన్న అంశంపై గురువారమిక్కడ ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని ప్రసంగించారు. ప్రైవేటు సంస్థలకు దీటుగా ప్రభుత్వరంగ సంస్థలు తయారుకావాలని, పోటీ వాతావరణం లేకపోవడం వల్ల సామాన్యుడికే నష్టం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. ‘ఒక సంస్థను ప్రభుత్వం నిర్వహించడం అంటే దానర్థం దాన్ని పోటీతత్వానికి దూరంగా ఉంచడం కాదు. ప్రైవేటు సంస్థలతో ప్రభుత్వరంగ సంస్థలు పోటీ పడాలి. భవిష్యత్తుల్లో రాబోయే ప్రభుత్వాలు ఇందుకు దోహదపడే విధానాలకే పెద్దపీట వేస్తాయి’ అని ఆయన అన్నారు. -
రైతు సద(తు)స్సు
సాక్షి, నెల్లూరు: ఈ నెల 4, 5, 6, 7 తేదీల్లో హైదరాబాద్‌లో తలపెట్టిన అంతర్జాతీయ సదస్సు తడిసిన దీపావళి టపాసులా తుస్సుమంది. అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది మంది రైతులకు సదస్సులో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్న అధికారుల మాటలు నీటిమూటలయ్యాయి. తొలు త సదస్సుకు ఆహ్వానం అందు కున్న రైతులను కాదని జిల్లాకు ఒక్కరికి మాత్రమే పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. ఈ విషయాన్ని సదస్సు ప్రారంభానికి ఒక్కరోజు ముందు సంబంధిత అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు. మిగిలిన రైతులు హైదరాబాద్ వచ్చినా స్టాల్స్‌కు పరిమితం కావాల్సిందేనని తేల్చారు. పై పెచ్చు సదస్సుకు హాజరయ్యే ఒక్కో రైతు రూ.5000 చొప్పున రుసుం చెల్లించాలని నిబంధనలు పెట్టడం విశేషం. ఏడాదిగా సదస్సుపై రాష్ట్రంలో విస్తృత ప్రచారం చేశారు. దీంతో ఈ ప్రపంచ రైతుసదస్సుపై రైతులు ఆశలు పెంచుకున్నారు. సదస్సు ఉపయోగకరంగా ఉంటుం దని భావించి తప్పక హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. తీరా ఇప్పుడు అక్కర్లేదంటూ అధికారులు ప్రకటించడంతో రైతులు నివ్వెర పోయారు. రైతులకు అవగాహన కల్పించనప్పుడు ప్రపంచ స్థాయి సదస్సు అని ప్రచారం చేయడం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ వ్యాపార సంస్థల కోసమే సదస్సు అని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. రైతు సదస్సుకు జిల్లా నుంచి 80 మంది రైతులను తీసుకెళ్లేందుకు అధికారులు నిర్ణయించారు. సదస్సులో పాల్గొనే రైతులకు ఐడీ కార్డులు సైతం సిద్ధం చేశారు. ఆరో తేదీన జిల్లా రైతులకు సదస్సు ఉంటుందని ప్రకటించడంతో ఐదో తేదీ రాత్రి హైదరాబాద్‌కు బయల్దేరాల్సి ఉంది. తీరా బయల్దేరే ముందు కేవలం ఒకే ఒక్క రైతుకు మాత్రమే సదస్సులో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామని ,మిగిలిన రైతులందరూ కేవలం అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలలకు పరిమితం కావాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పారు. రైతులను అనుమతించనప్పుడు ఆర్భాటంగా ప్రపంచ స్థాయి రైతుసదస్సు జరపడం ఎందుకని జిల్లా రైతుసంఘాల సమాఖ్య నేత కోటిరెడ్డి ప్రశ్నించారు. -
గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధిరేటు పెరిగింది: జైపాల్‌రెడ్డి
హైదరాబాద్, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి రేటు పెరిగిందని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్ నాక్ ఆడిటోరియంలో నిర్మాణ రంగంపై 4 రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ, నిర్మాణ రంగంలో సమస్యలను దేశం అధిగమిస్తుందని తెలిపారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో నిర్మాణ రంగ సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. దేశంలో ఇసుక సమస్య తీవ్రంగా ఉందని, ఇసుక తరలింపు వ్యవహారంలో ఘర్షణలు మాఫియాను తలపిస్తున్నాయని అన్నారు. సహజ వనరులను ఎక్కువగా వినియోగిస్తే పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం గ్రామాల్లో ఆర్థికాభివృద్దికి తోడ్పడిందన్నారు. దీన్ని ప్రపంచదేశాలు మెచ్చుకున్నాయన్నారు. మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ నిర్మాణ సంస్థల మధ్య సమన్వయం అవసరమని సూచించారు. మెట్రో ప్రాజెక్టు రాష్ట్రానికి రావడంలో జైపాల్‌రెడ్డి కీలక ప్రాత పోషించారన్నారు. కార్యక్రమంలో ఐసీఐ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్పీ అంచూరీ, అధ్యక్షుడు జోష్కురియన్, సైంటిఫిక్కమిటీ కన్వీనర్ విజయ్కులకర్ణి, యూఎస్ఏ వరల్డ్‌కాంగ్రెస్ ప్రతినిధి థామ్ సిండ్రిక్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం
మహబూబాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : స్వచ్ఛంద, సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఎన్నారై వాసవీ అసోసియేషన్ అంతర్జాతీయ కమిటీ మహబూబాబాద్‌కు చెందిన వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్(మల్టీపుల) మాలె యోగీశ్వర్రావుకు ఆహ్వానం పంపింది. ఎన్నారై వాసవీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటాలో జరిగే ‘గ్లోబల్ ఇంటర్నేషనల్ ఎన్నారై వీఏ కన్వెన్షన్-2013 అంతర్జాతీయ సదస్సు’కు ఆయన వెళ్లనున్నారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు అట్లాంటాలో సదస్సు జరగనుంది. కాగా, అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు అవకాశం రా వడం పట్ల యోగీశ్వర్రావు సంతో షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ ఆహ్వానం తనకెంతో దోహదపడుతుందని తెలిపారు. -
విజ్ఞాన్ వర్సిటీలో అంతర్జాతీయ సదస్సు
హైదరాబాద్: విజ్ఞాన్ వర్సిటీ, వడ్లమూడిలో 23, 24 తేదీల్లో ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యర్థపదార్థాల మేనేజ్మెంట్లో ఉపయోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానం’ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు జరగనుంది. దీనిని విజ్ఞాన్ వర్సిటీతోపాటు హాంకాంగ్‌కు చెందిన కాలగరీ యూనివర్సిటీ, హాంకాంగ్ బాప్టిస్ట్స్ వర్సిటీ, వేస్ట్ టు ఎనర్జీ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్-ఇండియా, జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన కేంద్రం (ఎన్ఈఈఆర్ఈ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని విజ్ఞాన్ వర్సిటీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డెరైక్టర్ వి.మధుసూదనరావు తెలిపారు. సదస్సుకు వివిధ దేశాల నుంచి శాస్త్రవేత్తలు, టెక్నాలజిస్టులు, విద్యావేత్తలు హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. సదస్సులో.. వ్యర్థపదార్థాల మేనేజ్మెంట్, వాతావరణంలో మార్పులు, వ్యర్థపదార్థాల నిర్వహణలో జీఐఎస్.. ఇతర టెక్నాలజీలు వంటి అంశాలపై చర్చించనున్నట్టు తెలి పారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సలహాదారు ఎస్ఆర్ రావుతోపాటు నాగ్‌పూర్‌కు చెందిన సీని యర్ శాస్త్రవేత్త సుశీల్‌కుమార్ హాజరవుతున్నారన్నారు.