భవిష్యత్తు ఫ్యాషన్ రంగానిదే | Said the future of fashion | Sakshi
Sakshi News home page

భవిష్యత్తు ఫ్యాషన్ రంగానిదే

Published Fri, Jan 10 2014 3:44 AM | Last Updated on Mon, Oct 1 2018 1:16 PM

Said the future of fashion

  •      ఐఐఎం కొజికోడ్ డెరైక్టర్ దెబాషిష్ ఛటర్జీ
  •      నిఫ్ట్‌లో ‘రిఫ్లెక్షన్-14’ సదస్సు ప్రారంభం
  •  
    మాదాపూర్, న్యూస్‌లైన్: ఫ్యాషన్ రంగానికి ప్రాధాన్యం పెరుగుతోందని, యేటా మూడువేల మంది ఫ్యాషన్ డిజైనర్లు నిఫ్ట్ ద్వారా బయటకు వస్తున్నారని ఐఐఎం కొజికోడ్ డెరైక్టర్ దెబాషిష్ ఛటర్జీ అన్నారు. మాదాపూర్ నిఫ్ట్ ఆడిటోరియంలో గురువారం ‘రిఫ్లెక్షన్స్-14’ పేరిట అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దెబాషిష్ హాజరయ్యారు.

    ఆయన మాట్లాడుతూ.. సదస్సులో భావితరాలకు ఏ విధమైన డిజైన్స్ అందించాలి, రిటైల్, మేనేజ్‌మెంట్ అంశాలపై చర్చించనున్నామన్నారు. నిఫ్ట్ డెరైక్టర్ ప్రేమ్‌కుమార్ గేర మాట్లాడుతూ నేటి తరం ఫ్యాషన్ రంగంపై మక్కువ చూపుపుతున్నారని, ఈ రంగంలో చేరేవారి సంఖ్య యేటా పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. అనంతరం విద్యార్థులు తమ ఫ్యాషన్ మెళకువలను సంక్రాంతి ముగ్గులకు జోడించి ప్రాంగణాన్ని రంగవల్లులతో అలంకరించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement