ఎస్వీయూలో అంతర్జాతీయ సదస్సు | international conference in SV university | Sakshi
Sakshi News home page

ఎస్వీయూలో అంతర్జాతీయ సదస్సు

Published Mon, Jul 24 2017 10:50 AM | Last Updated on Tue, Sep 5 2017 4:47 PM

international conference in SV university

యూనివర్సిటీ క్యాంపస్‌: శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ(ఎస్వీయూ)లోని సెంటర్‌ ఫర్‌ సౌత్‌ ఈస్ట్‌ ఏషియన్‌ అండ్‌ పసిఫిక్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో సోమవారం నుంచి అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ జి. జయచంద్రారెడ్డి తెలిపారు. సౌత్‌ ఏషియన్‌ సీ-ఎమర్జింగ్‌ సినారియో పేరిట నిర్వహించే ఈ సదస్సు మూడు రోజులపాటు జరుగుతుందన్నారు.
 
వైస్‌ చాన్స్‌లర్‌ దామోదరం ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి నీలకంఠన్‌ రవి, ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ వరల్డ్‌ అఫైర్స్‌ మాజీ పీయూష్‌ శ్రీవాస్తవ హాజరవుతారని వివరించారు. ఈ సందర్భంగా నీలకంఠన్‌ రవికి లైఫ్‌ టైం అఛీవ్‌మెంట్‌ అవార్డు ఫర్‌ ఇంటర్నేషనల్‌ అండర్‌స్టాండింగ్‌ను అందజేయనున్నట్లు జయచంద్రారెడ్డి చెప్పారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement