విజ్ఞాన్ వర్సిటీ, వడ్లమూడిలో 23, 24 తేదీల్లో ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యర్థపదార్థాల మేనేజ్‌మెంట్‌లో ఉపయోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానం’ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు జరగనుంది.
హైదరాబాద్: విజ్ఞాన్ వర్సిటీ, వడ్లమూడిలో 23, 24 తేదీల్లో ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యర్థపదార్థాల మేనేజ్‌మెంట్‌లో ఉపయోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానం’ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు జరగనుంది. దీనిని విజ్ఞాన్ వర్సిటీతోపాటు హాంకాంగ్‌కు చెందిన కాలగరీ యూనివర్సిటీ, హాంకాంగ్ బాప్టిస్ట్స్ వర్సిటీ, వేస్ట్ టు ఎనర్జీ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్-ఇండియా, జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన కేంద్రం (ఎన్‌ఈఈఆర్‌ఈ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని విజ్ఞాన్ వర్సిటీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డెరైక్టర్ వి.మధుసూదనరావు తెలిపారు.
సదస్సుకు వివిధ దేశాల నుంచి శాస్త్రవేత్తలు, టెక్నాలజిస్టులు, విద్యావేత్తలు హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. సదస్సులో.. వ్యర్థపదార్థాల మేనేజ్‌మెంట్, వాతావరణంలో మార్పులు, వ్యర్థపదార్థాల నిర్వహణలో జీఐఎస్.. ఇతర టెక్నాలజీలు వంటి అంశాలపై చర్చించనున్నట్టు తెలి పారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సలహాదారు ఎస్‌ఆర్ రావుతోపాటు నాగ్‌పూర్‌కు చెందిన సీని యర్ శాస్త్రవేత్త సుశీల్‌కుమార్ హాజరవుతున్నారన్నారు.