అంతర్జాతీయ సదస్సుకు నల్లమల వైద్యులు | Nallamala doctors into International Conference | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ సదస్సుకు నల్లమల వైద్యులు

Published Tue, Mar 22 2016 5:36 AM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

అంతర్జాతీయ సదస్సుకు నల్లమల వైద్యులు

అంతర్జాతీయ సదస్సుకు నల్లమల వైద్యులు

 25 నుంచి జైపూర్‌లో సదస్సు
 
 అచ్చంపేట: అంతర్జాతీయ సదస్సుకు నల్లమలకు చెందిన ఇద్దరు డాక్టర్లు ఎంపికయ్యారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కోలో-ప్రాక్టాలజీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే మూడవ అంతర్జాతీయ సదస్సు-2016లో పాల్గొనేందుకు నల్లమల ప్రాంత వైద్యులు డాక్టర్ సీఏ చైతన్య, డాక్టర్ ఎ.ప్రవీణ దంపతులకు నిర్వాహకులు ఆహ్వానం పంపించారు.

ఈ మేరకు వారు ఈ నెల 24న జైపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. మూడు రోజులపాటు జరిగే అంతర్జాతీయ సదస్సులో వైద్యులకు పేగులకు సంబంధించిన వ్యాధులు, ఆధునాతన శస్త్రచికిత్సల పరిజ్ఞానం, కొత్త విజ్ఞానం గురించి అవగాహన కల్పించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement