అంతర్జాతీయ సదస్సుకు నల్లమల వైద్యులు
25 నుంచి జైపూర్లో సదస్సు
అచ్చంపేట: అంతర్జాతీయ సదస్సుకు నల్లమలకు చెందిన ఇద్దరు డాక్టర్లు ఎంపికయ్యారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు రాజస్తాన్ రాజధాని జైపూర్లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కోలో-ప్రాక్టాలజీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే మూడవ అంతర్జాతీయ సదస్సు-2016లో పాల్గొనేందుకు నల్లమల ప్రాంత వైద్యులు డాక్టర్ సీఏ చైతన్య, డాక్టర్ ఎ.ప్రవీణ దంపతులకు నిర్వాహకులు ఆహ్వానం పంపించారు.
ఈ మేరకు వారు ఈ నెల 24న జైపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. మూడు రోజులపాటు జరిగే అంతర్జాతీయ సదస్సులో వైద్యులకు పేగులకు సంబంధించిన వ్యాధులు, ఆధునాతన శస్త్రచికిత్సల పరిజ్ఞానం, కొత్త విజ్ఞానం గురించి అవగాహన కల్పించనున్నారు.