
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ శ్రీలంక ఆధ్వర్యంలో ఈ నెల 30న జరిగే అంతర్జాతీయ వర్చువల్ సదస్సు లో ప్రసంగించాల్సిందిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు ఆహ్వానం అందింది. కరోనా వైరస్ నేపథ్యంలో ‘కోవిడ్–19 రీ షేప్ సౌత్ ఏషియా ఫ్యూచర్’అనే అంశంపై కేటీఆర్ ప్రసంగిస్తారు. సుమారు వంద దేశాల్లో 45 మిలియన్ల మంది సభ్యులు ఉన్న ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ పలు అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో సదస్సులు నిర్వహిస్తుంది. ఈ నెల 30న జరిగే వర్చువల్ సదస్సులో ఆ సంస్థ చైర్మన్ పాల్ పోల్‌మన్, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్, సోషల్ కమిషన్ ఫర్ ఏషియా పసిఫిక్ ముఖ్య కార్యదర్శి డాక్టర్ అర్మిడ సల్సియా అలిస్‌జబానాతో పాటు శ్రీలంక మాజీ మంత్రి రాణిల్ విక్రమ సింఘే పాల్గొంటారు.