గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధిరేటు పెరిగింది: జైపాల్‌రెడ్డి
హైదరాబాద్, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి రేటు పెరిగిందని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్ నాక్ ఆడిటోరియంలో నిర్మాణ రంగంపై 4 రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ, నిర్మాణ రంగంలో సమస్యలను దేశం అధిగమిస్తుందని తెలిపారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో నిర్మాణ రంగ సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. దేశంలో ఇసుక సమస్య తీవ్రంగా ఉందని, ఇసుక తరలింపు వ్యవహారంలో ఘర్షణలు మాఫియాను తలపిస్తున్నాయని అన్నారు. సహజ వనరులను ఎక్కువగా వినియోగిస్తే పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందన్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి పథకం గ్రామాల్లో ఆర్థికాభివృద్దికి తోడ్పడిందన్నారు. దీన్ని ప్రపంచదేశాలు మెచ్చుకున్నాయన్నారు. మెట్రోరైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి మాట్లాడుతూ నిర్మాణ సంస్థల మధ్య సమన్వయం అవసరమని సూచించారు. మెట్రో ప్రాజెక్టు రాష్ట్రానికి రావడంలో జైపాల్‌రెడ్డి కీలక ప్రాత పోషించారన్నారు. కార్యక్రమంలో ఐసీఐ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌పీ అంచూరీ, అధ్యక్షుడు జోష్‌కురియన్, సైంటిఫిక్‌కమిటీ కన్వీనర్ విజయ్‌కులకర్ణి, యూఎస్‌ఏ వరల్డ్‌కాంగ్రెస్ ప్రతినిధి థామ్ సిండ్రిక్ తదితరులు పాల్గొన్నారు.