కేటీఆర్‌కు ‘అంతర్జాతీయ’ ఆహ్వానాలు | KTR to International Conference Invitations | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌కు ‘అంతర్జాతీయ’ ఆహ్వానాలు

Published Fri, Apr 14 2017 3:59 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

కేటీఆర్‌కు ‘అంతర్జాతీయ’ ఆహ్వానాలు

కేటీఆర్‌కు ‘అంతర్జాతీయ’ ఆహ్వానాలు

సాక్షి, హైదరాబాద్‌: రెండు అంతర్జాతీయ సదస్సుల్లో ప్రసంగించాల్సిందిగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావుకు ఆహ్వానం అందింది. ది అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 25 వరకు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న శాక్రమెంటో నగరంలో జరిగే సదస్సుల్లో ప్రసంగించాలని కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఉపాధి, ఉద్యోగాలు, పరిశ్రమలు అంశంపై ఈ నెల 18, 19వ తేదీల్లో నిర్వహించే సదస్సుల్లో ప్రసంగించాలని స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీ నుంచి మరో ఆహ్వానం అందింది. ఈ వర్సిటీ నుంచి కేటీఆర్‌ ఆహ్వానం అందుకోవడం ఇది రెండోసారని ఆయన కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement