
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే అయిదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనలో కాస్ట్ అకౌంటెంట్లు కీలక పాత్ర పోషించనున్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎంఏఐ) ప్రెసిడెంట్ బల్విందర్ సింగ్ తెలిపారు. ఇదే థీమ్‌తో జనవరి 9 నుంచి 11 దాకా న్యూఢిల్లీలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు బుధవారమిక్కడ విలేకరు లకు ఆయన వివరించారు. దేశ, విదేశాల నుంచి సుమారు 2,000 మంది పైచిలుకు డెలిగేట్స్ దీనికి హాజరు కానున్నట్లు తెలిపారు. మరోవైపు, వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానానికి సంబంధించి 3 ఏళ్లలో 3.5 లక్షల మంది ప్రొఫెషనల్స్‌కు శిక్షణనిచ్చేలా ప్రభుత్వం పథకం ప్రారంభిం చబోతోందని సింగ్ చెప్పారు. ఇందులో సుమారు 1 లక్ష మందికి ఐసీఎంఏఐ శిక్షణ నివ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆరు నెలల పాటు సాగే శిక్షణకు రూ. 3,000 ఫీజు ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment