balwinder singh
-
ఆరు రోజుల్లోనే ఘర్ వాపసీ
చండీగఢ్: కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆరురోజుల్లోనే ఎమ్మెల్యే బల్వీందర్ సింగ్ లడీ మనసు మార్చుకున్నారు. తిరిగి సొంతగూటికి చేరారు. శ్రీ హరగోవింద్పూర్ ఎమ్మెల్యే అయిన బల్వీందర్ గత ఏడాది డిసెంబరు 28న కాషాయతీర్థం పుచ్చుకున్నారు. తెరవెనుక ఏం జరిగిందో తెలియదుగానీ జనవరి 2న తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. -
శౌర్యచక్ర అవార్డు గ్రహీత బల్విందర్ కాల్చివేత
చండీగఢ్: శౌర్యచక్ర అవార్డు గ్రహీత బల్విందర్ సింగ్ (62)ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు ఆయనపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో ఆయన అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లోని తారన్ తరణ్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. రాష్ట్రంలో ఖలిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడిన ఆయనపై గతంలోకూడా అనేకసార్లు ఉగ్రవాదులు ఎటాక్ చేశారని పోలీసులు తెలిపారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక సంవత్సరం క్రితం రాష్ట్ర ప్రభుత్వం బల్విందర్ భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబం మొత్తం ఉగ్రవాదుల హిట్ జాబితాలో ఉందని బల్విందర్ సింగ్ సోదరుడు రంజిత్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించిన బల్విందర్ సింగ్ కు 1993లో రక్షణ మంత్రిత్వ శాఖ శౌర్యచక్ర పురస్కారం లభించింది. అంతర్జాతీయ మీడియాను కూడా ఆయన ధైర్యసాహసాలు ఆకట్టుకున్నాయి. ప్రధానంగా నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ తోపాటు అనేక డాక్యుమెంటరీలు ఆయనపై రూపొందాయి. -
జనవరిలో అంతర్జాతీయ సదస్సు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే అయిదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనలో కాస్ట్ అకౌంటెంట్లు కీలక పాత్ర పోషించనున్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎంఏఐ) ప్రెసిడెంట్ బల్విందర్ సింగ్ తెలిపారు. ఇదే థీమ్‌తో జనవరి 9 నుంచి 11 దాకా న్యూఢిల్లీలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు బుధవారమిక్కడ విలేకరు లకు ఆయన వివరించారు. దేశ, విదేశాల నుంచి సుమారు 2,000 మంది పైచిలుకు డెలిగేట్స్ దీనికి హాజరు కానున్నట్లు తెలిపారు. మరోవైపు, వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానానికి సంబంధించి 3 ఏళ్లలో 3.5 లక్షల మంది ప్రొఫెషనల్స్‌కు శిక్షణనిచ్చేలా ప్రభుత్వం పథకం ప్రారంభిం చబోతోందని సింగ్ చెప్పారు. ఇందులో సుమారు 1 లక్ష మందికి ఐసీఎంఏఐ శిక్షణ నివ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆరు నెలల పాటు సాగే శిక్షణకు రూ. 3,000 ఫీజు ఉంటుందని తెలిపారు. -
భారత్‌పై ఉగ్రదాడికి కుట్ర.. అమెరికాలో ఎన్నారైకి 15 ఏళ్ల జైలు
భారతదేశం మీద ఉగ్రదాడి చేసేందుకు కుట్ర పన్నిన నేరం రుజువు కావడంతో అమెరికాలో ఉంటున్న ఓ ఎన్నారైకి అక్కడి కోర్టు 15 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఖలిస్థాన్ ఉద్యమంలో భాగంగా ఓ భారత ప్రభుత్వాధికారిని చంపేందుకు కూడా అతడు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. దాంతో బల్వీందర్ సింగ్ (42) అనే ఎన్నారైకి అమెరికా జిల్లా జడ్జి లారీ హిక్స్ 180 నెలల జైలు శిక్ష విధించారు. ఉగ్రవాదులకు కేవలం మద్దతు ఇవ్వడం, కుట్ర పన్నడమే కాక.. వాళ్లకు కావల్సిన వనరులను కూడా ఇతడు సమకూర్చినట్లు తేలింది. రెనో ప్రాంతానికి చెందిన బల్వీందర్ సింగ్ రెండు ఉగ్రవాద గ్రూపులలో సభ్యుడని, భారత ప్రభుత్వాన్ని వణికించేందుకు, అక్కడి అమాయక ప్రజలను హతమార్చేందుకు కావల్సిన సామగ్రిని ఇతడు వాళ్లకు అందించాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇతడికి బల్జీత్ సింగ్, ఝాజీ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. అమెరికాలో శాశ్వత నివాస హోదా ఉంది. 2013 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ నెలల మధ్య ఇతడు ఖలిస్థాన్ ఉగ్రవాదులకు ఉగ్రవాద దాడులు చేయడానికి కావల్సిన సామగ్రి అందించాడని చెబుతున్నారు. కాలిఫోర్నియా జైల్లో ఉన్న మరో కుట్రదారుడిని కలిసేందుకు ఇతడు తరచు రెనో నుంచి కాలిఫోర్నియా వెళ్లేవాడన్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు భారతదేశానికి వెళ్లి, అక్కడ ఒక భారత ప్రభుత్వాధికారిని చంపడంతో పాటు ఉగ్రవాద దాడులు కూడా చేయాలని 2013 అక్టోబర్‌లో వీళ్లిద్దరూ నిర్ణయించుకున్నారు. 2013 నవంబర్ నెలలో బల్వీందర్ సింగ్ రెండు నైట్ విజన్ గాగుల్స్, ఒక ల్యాప్‌టాప్ కొని తన సహచరుడికి ఇచ్చాడు. అతడు శాన్ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్ వెళ్లేందుకు డిసెంబర్లో ప్రయత్నించాడు గానీ.. అమెరికా అధికారులు విమానాశ్రయంలోనే పట్టుకున్నారు. అతడిని విచారించగా బల్వీందర్ విషయం తెలిసింది. -
భారతదేశ ద్రోహికి అమెరికాలో శిక్ష
రెనో: భారతీయుడై ఉండి అమెరికాలో శాశ్వత పౌరసత్వం పొందిన ఓ సిక్కు వ్యక్తి అమెరికాలో కటకటాల పాలయ్యాడు. అతడు భారత్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు సహాయపడ్డాడని అక్కడి జిల్లా కోర్టు నిర్ధారించడంతో దాదాపు 15 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించనున్నాడు. బల్వీందర్ సింగ్ అనే వ్యక్తి అమెరికాలో స్థిరపడ్డాడు. ఇతడిది వాస్తవానికి పంజాబ్. ఖలిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపి పంజాబ్‌లో పేలుళ్లకు పాల్పడే కుట్రతోపాటు భారత అధికారులను హత్య చేసేందుకు ప్రణాళికలు రచించాడు. అందుకు కావాల్సిన సామాగ్రిని కూడా అతడే పంపిణీ చేశాడు. తమ ప్రణాళిక అమలుకు సంబంధించి ఫోన్ ద్వారా మాట్లాడాడు. అయితే, కొన్నాళ్లుగా అతడి చర్యలను గమనించిన అమెరికా అధికారులు.. 2013 డిసెంబర్లో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడం మొదలుపెట్టారు. దానికి సంబంధించి చివరి వాదోపవాదాలు మంగళవారం కోర్టు ముందుకు రాగా అతడు నేరానికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. కనీసం 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ‘భారత్ వంటి విదేశాల్లో ఉగ్రవాద దాడులతో హింసకు పాల్పడేందుకు, జన జీవితాన్ని చెదరగొట్టేందుకు బల్వీందర్ సింగ్ సహాయపడ్డాడు’ అని ఈ సందర్భంగా జడ్జీ స్పష్టం చేశారు. -
బల్విందర్ సింగ్ కుటుంబసభ్యుల ధర్నా
కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సోమవారం బల్విందర్ సింగ్ కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు. గత నెల 22న కరీంనగర్ జిల్లా కేంద్రంలో బల్విందర్ పోలీసుల చేతిలో ఎన్‌కౌంటరయ్యాడు. తల్లిదండ్రులను, రోడ్డు మీద వెళ్తున్న ప్రజలను, పట్టుకోబోయిన పోలీసులను తీవ్రంగా గాయపరచటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ప్రమాదవశాత్తూ బుల్లెట్ చాతీలోకి దూసుకెళ్లటంతో అక్కడికక్కడే మరణించాడు. బల్విందర్ మృతికి కారణమైన సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేసి వారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.