
చండీగఢ్: కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆరురోజుల్లోనే ఎమ్మెల్యే బల్వీందర్ సింగ్ లడీ మనసు మార్చుకున్నారు. తిరిగి సొంతగూటికి చేరారు. శ్రీ హరగోవింద్‌పూర్ ఎమ్మెల్యే అయిన బల్వీందర్ గత ఏడాది డిసెంబరు 28న కాషాయతీర్థం పుచ్చుకున్నారు. తెరవెనుక ఏం జరిగిందో తెలియదుగానీ జనవరి 2న తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.