కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సోమవారం బల్విందర్ సింగ్ కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు. గత నెల 22న కరీంనగర్ జిల్లా కేంద్రంలో బల్విందర్ పోలీసుల చేతిలో ఎన్‌కౌంటరయ్యాడు. తల్లిదండ్రులను, రోడ్డు మీద వెళ్తున్న ప్రజలను, పట్టుకోబోయిన పోలీసులను తీవ్రంగా గాయపరచటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ప్రమాదవశాత్తూ బుల్లెట్ చాతీలోకి దూసుకెళ్లటంతో అక్కడికక్కడే మరణించాడు. బల్విందర్ మృతికి కారణమైన సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్ చేసి వారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.