న్యూఢిల్లీ: దేశీయంగా హరిత హైడ్రోజన్ వినియోగానికి సంబంధించి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ కార్యదర్శి భూపిందర్ సింగ్ భల్లా తెలిపారు. పరిశ్రమ తగు స్థాయిలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా డిమాండ్‌ను మదింపు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా భల్లా ఈ విషయాలు పేర్కొన్నారు.
2030 నాటికి ప్రతిపాదిత హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో 70 శాతం భాగం ఎగుమతుల కోసం ఉద్దేశించినదై ఉంటుందని ఆయన తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించి భారత్‌ను ప్రపంచ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ఏడాది జనవరిలో కేంద్రం రూ. 19,744 కోట్లతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రణాళికను ఆమోదించింది. మరోవైపు, హరిత హైడ్రోజన్ వినియోగానికి మారే క్రమంలో సిబ్బందికి శిక్షణ కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోందని భల్లా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment