Bhupinder Singh
-
#NimratKaur 30 ఏళ్ల కల నెరవేరింది : నటి నిమ్రత్ కౌర్ (ఫొటోలు)
-
హర్యానా ఫలితాలు: ‘ఎన్నికల కమిషన్‌ను కలుస్తాం’
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మరోసారి ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో బీజేపీ 48 స్థానాలో గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 36 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. హర్యానాలో వెలువడిన ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా స్పందించారు. ‘‘ చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చాలా తక్కువ తేడాతో ఓడిపోయారు. హర్యానాలో ఈ ఇవాళ వెలువడిన ఫలితాలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అనేక చోట్ల నుంచి మాకు ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌ను కలుస్తాం.#WATCH | Rohtak, Haryana: Former CM and Congress leader Bhupinder Singh Hooda says, "We have lost many seats by a small margin. We have received complaints from many places and we will meet the Election Commission. The result is surprising for us..." pic.twitter.com/6g7yRa2MlF— ANI (@ANI) October 8, 2024కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరుపై స్పందించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఐక్యంగానే ఉన్నారు. అంతర్గత పోరు.. బీజేపీలోనే చూడొచ్చు. అనిల్ విజ్ ఇంటి నుంచి బయటకు రాలేదు. రామ్ బిలాస్ శర్మకు టికెట్ దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ వంటి ప్రజాస్వామ్య పార్టీలో అభిప్రాయలు ఉంటాయి. కానీ ఆలోచనలో ఎటువంటి తేడా ఉండదు.#WATCH | Rohtak, Haryana: On the question of infighting in the party, Former CM and Congress leader Bhupinder Singh Hooda says, "Congress is united. You can see the BJP, Anil Vij did not come out of his house, Ram Bilas Sharma's ticket was cut. In a democratic party, 'matbhed'… pic.twitter.com/MmSiihs88u— ANI (@ANI) October 8, 2024.. పొత్తు గురించి సమాజ్‌వాదీ పార్టీతో మేము ఎప్పుడూ మాట్లాడలేదు. సీపీఎం పార్టీ మమ్మల్ని అడిగారు. అందుకే వారికి మేము భివానీ అసెంబ్లీ సీటు ఇచ్చాం. మేము ఆమ్ ఆద్మీ పార్టీకి సీట్లు ఇచ్చాం. ఆ పార్టీ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగింది’’ అని అన్నారు. ఇక.. ఎన్నికల ఫలితాల్లో ఆయన గర్హి సంప్లా-కిలోయ్ అసెంబ్లీ స్థానంలో 71,000 మెజార్టీతో సమీప బీజేపీ అభ్యర్థి మంజూపై విజయం సాధించారు. -
చిక్కుల్లో హరియాణా సర్కారు!
రాష్ట్రాల్లో అవకాశం చిక్కినచోటల్లా విపక్ష ప్రభుత్వాలను అస్థిరపరిచి, అధికారాన్ని చేజిక్కించు కోవటం అలవాటైన బీజేపీకి తొలిసారి సంకటస్థితి వచ్చిపడింది. హస్తినకు కూతవేటు దూరంలోవున్న హరియాణాలో ఆ పార్టీ ప్రభుత్వం సమస్యల్లో చిక్కుకుంది. సార్వత్రిక ఎన్నికల వేళ... రోడ్ షోలతో హోరెత్తించాల్సిన సమయంలో బీజేపీకి ఇదేమంత మంచి శకునం కాదు. అసలే ఉత్తరాదిలో బీజేపీ బలహీనపడిందని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. కనుక హరియాణా మాత్రమే కాదు... ఎన్నికలు జరగాల్సిన వేరే రాష్ట్రాల్లో కూడా వోటర్లకు వేరే సంకేతాలు వెళ్తాయి.ఈ నెల 25న ఆ రాష్ట్రంలోని పది లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతుండగా మంగళవారం ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. దాంతో 90 మంది సభ్యులున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. పైకి గంభీరంగా కనబడుతున్నా లోక్‌సభ ఎన్నికల హడావుడిలో తలమునకలైన బీజేపీకి దీంతో ఊపిరాడటం లేదు. ఎంపీలుగా పోటీ చేసేందుకు ఇద్దరు బీజేపీ సభ్యులు రాజీనామా చేయటంతో అసెంబ్లీలో ప్రస్తుతం 88 మంది సభ్యులున్నారు. ప్రభుత్వం సాగాలంటే బీజేపీకి 45 మంది మద్దతు అవసరం కాగా ఇద్దరు ఇండిపెండెంట్లు, హరి యాణా లోక్‌హిత్ పార్టీ సభ్యుడు బీజేపీకి మద్దతునిస్తున్నారు. అంటే బీజేపీ బలం 43కి పడిపోయింది. రెండు నెలల క్రితం బీజేపీ–జేజేపీ కూటమి సర్కారుకు నాయకత్వం వహిస్తున్న ఖట్టర్‌ను తొలగించి ఆయన స్థానంలో బీజేపీ అధిష్టానం నయాబ్‌సింగ్ సైనీని తీసుకొచ్చింది. దాంతోపాటు పదిమంది ఎమ్మెల్యేలున్న జన్నాయక్ జనతాపార్టీ (జేజేపీ)తో తెగతెంపులు చేసుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వున్న పది స్థానాలూ గెల్చుకున్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో జేజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వదల్చుకోలేదు. సహజంగానే అంతవరకూ ఉపముఖ్యమంత్రిగా వున్న జేజేపీ నేతదుష్యంత్ చౌతాలాకు ఇది ఆగ్రహం తెప్పించింది. కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా చలవతోనే ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీ సర్కారుకు మద్దతు ఉపసంహరించు కున్నారన్నది వాస్తవం. అయితే కాంగ్రెస్ గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే మద్దతిస్తామంటున్న జేజేపీ వాస్తవ బలమెంతో చెప్పలేం. ప్రస్తుత బేరసారాల్లో ఆ పార్టీకున్న పదిమంది ఎమ్మెల్యేల్లో ఎందరు మిగులుతారన్నది అనుమానమే. వారిలో నలుగురి మద్దతు తమకే వున్నదని సైనీ చెప్పు కుంటున్నారు. వారిని అనర్హులుగా ప్రకటించాలని జేజేపీ కోరినా అది బీజేపీకే తోడ్పడుతుంది. ఉన్న 88 మందిలో నలుగుర్ని అనర్హులను చేయగానే సభలో సభ్యుల సంఖ్య 84కి పడిపోతుంది. దాంతో 43 మంది మద్దతున్న బీజేపీ ప్రభుత్వం సునాయాసంగా బయటపడుతుంది.లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరెత్తుతుండగా ప్రభుత్వ అస్తిత్వానికే ముప్పు ఏర్పడటం హరి యాణా ప్రజానీకానికి మంచి సంకేతం పంపదు. ఎమ్మెల్యేల బేరసారాలు కళ్లముందు స్పష్టంగా కన బడుతుండగా సుదీర్ఘ క్యూ లైన్లలో ఓపిగ్గా నిలబడి వోటేసేంత ఉత్సాహం ఎందరికుంటుంది? వచ్చే అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఈ కుర్చీలాట మొదలుకావటం వింత. రాష్ట్రంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదనటానికి ఈ సంక్షోభం సంకేతమని కాంగ్రెస్ నాయకుడు హుడా చెబుతున్నారు. నిజానికి జనం అలా అను కోవాలని, లోక్‌సభ ఎన్నికల్లో తమకే పట్టం కట్టా లని ఆయన ఆత్రుత పడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఫిరాయింపులకు ఎవరు పాల్పడినా తప్పే. వేరే రాష్ట్రాల్లో బీజేపీ చేసినప్పుడు విమర్శించిన కాంగ్రెస్ హరియాణాలో అదే పనికి పూనుకోవటం నైతికంగా సరైందేనా? రాష్ట్రపతి పాలన కాంగ్రెస్ ఉద్దేశమని కొందరంటున్నారు. అందుకే మద్దతిస్తా మంటూ జేజేపీ ముందుకొచ్చినా హుడా సాను కూలత చూపలేదని వారి వాదన. లోక్‌సభ ఎన్నికల జంజాటం లేకపోతే కొన్ని గంటల్లోనే బీజేపీ సునాయాసంగా చక్కదిద్దగలిగేది. కేంద్రంలో తాముండగా హరియాణాలో సొంత ప్రభుత్వాన్ని దించి రాష్ట్రపతి పాలనకు బీజేపీ సిద్ధపడటం కల్ల. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టీ హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయపై పడింది. బీజేపీకి లబ్ధి చేకూరేందుకు వీలుగా ప్రస్తుత ఎన్నికలు ముగిసేవరకూ సంక్షోభాన్ని కొనసాగించటం మాత్రం మంచిది కాదు. పాలకపక్షం సత్తాపై సంశయం ఏర్పడినప్పుడు నేరుగా అసెంబ్లీలోనే బలపరీక్షకు సిద్ధపడాలని కోరటం అన్నివిధాలా శ్రేయస్కరం. సంక్షోభాన్ని కొనసాగనిస్తే అనారోగ్యకర పరిణా మాలకు చోటిచ్చినట్టవుతుంది. ప్రభుత్వాల బలాబలాలు చట్టసభల్లో తేలాలి తప్ప రాజ్భవన్లలో కాదని చాన్నాళ్ల క్రితమే సుప్రీంకోర్టు చెప్పింది. ఒకవేళ వెంటనే బలపరీక్ష నిర్వహించటం సాధ్యంకాదనిపిస్తే కొంత వ్యవధి తీసుకోవచ్చు. అయితే ఈలోగా రాష్ట్రపతి పాలన విధించటమే ఉత్తమం. కేంద్రం తీసుకొచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పంజాబ్ రైతులతోపాటు హరియాణా రైతులు కీలక పాత్ర పోషించారు. ఇటీవలి రైతు ఉద్యమంలో కూడా వారి పాత్ర తక్కు వేమీ కాదు. రిజర్వేషన్లు కావాలంటూ 2016లో జాట్లు సాగించిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. అది కులాల మధ్య కుంపట్లు రాజేసింది. మరోపక్క ఉపాధి అవకాశాలు కరువై యువ తలో తీవ్ర నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. ఖట్టర్‌ను సీఎం పదవి నుంచి తొలగించి సైనీని ప్రతిష్టించటం జాట్లకు ఆగ్రహం కలిగించిందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయపు టెత్తుల్లో అధికార, విపక్షాలు రెండూ తలమునకలైతే ఇప్పటికే ఉన్న సమస్యలు రెట్టింపవుతాయి. కనుక ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే కోణంలో కాకుండా సాధ్యమైనంత త్వరగా ఈ రాజకీయ సంక్షోభానికి ముగింపు పలకాలి. -
తెలుగు విలన్ అరెస్ట్.. కాల్పులు జరిపి హత్య చేయడంతో..
ప్రముఖ నటుడు, విలన్ భూపిందర్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన పొలం సరిహద్దులో చెట్లు నరికే విషయంలో వివాదం తలెత్తడంతో అతడు తన రివాల్వర్‌తో విచాక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ యువకుడు అక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఈ ఘటన జరగ్గా భూపిందర్ సింగ్‌తో పాటు అతడి అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెట్ల దగ్గర గొడవ.. వివరాల్లోకి వెళితే.. యూపీలోని కౌన్కేదా ఖాద్రీ గ్రామంలో భూపిందర్ సింగ్ ఫామ్ హౌస్ ఉంది. దీని పక్కనే గుర్దీప్ సింగ్ నివాసం ఉంటున్నాడు. ఇద్దరి స్థలం సరిహద్దులో కొన్ని చెట్లు ఉన్నాయి. ఆదివారం రోజు ఆ చెట్లను తొలగించే క్రమంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆవేశంలో భూపిందర్ సింగ్ లైసెన్స్ పొందిన తన పిస్టోల్‌తో వరుస కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గుర్దీప్ సింగ్, అతడి భార్య మీరాబాయ్, తనయుడు బుటా సింగ్ తీవ్రంగా గాయపడగా మరో తనయుడు గోబింద్ సింగ్ అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఎవరీ భూపిందర్ సింగ్? జై మహాభారత్ సీరియల్‌తో కెరీర్ ఆరంభించాడు భూపిందర్ సింగ్. ఏక్ హసీనా తీ, తేరే షెహర్ మే, మధుబాల- ఏక్ ఇష్క్ ఏక్ జనూన్ వంటి పలు సీరియల్స్‌లో నటించాడు. తెలుగు సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు పోషించాడు. తమ్ముడు, అన్నయ్య, దేవి పుత్రుడు, భలేవాడివి బాసు, విలన్, అంజి, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి చిత్రాలతో తెలుగువారికి దగ్గరయ్యాడు. 2010లో సోచ్ లో అనే హిందీ సినిమాలో చివరిసారిగా కనిపించాడు. ఆ తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు. చదవండి: విజయ్ సినిమాలో ఛాన్స్.. నో చెప్పిన హీరోయిన్! -
హరిత హైడ్రోజన్ వినియోగ విధానాలపై కసరత్తు
న్యూఢిల్లీ: దేశీయంగా హరిత హైడ్రోజన్ వినియోగానికి సంబంధించి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ కార్యదర్శి భూపిందర్ సింగ్ భల్లా తెలిపారు. పరిశ్రమ తగు స్థాయిలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా డిమాండ్‌ను మదింపు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా భల్లా ఈ విషయాలు పేర్కొన్నారు. 2030 నాటికి ప్రతిపాదిత హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో 70 శాతం భాగం ఎగుమతుల కోసం ఉద్దేశించినదై ఉంటుందని ఆయన తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించి భారత్‌ను ప్రపంచ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ఏడాది జనవరిలో కేంద్రం రూ. 19,744 కోట్లతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రణాళికను ఆమోదించింది. మరోవైపు, హరిత హైడ్రోజన్ వినియోగానికి మారే క్రమంలో సిబ్బందికి శిక్షణ కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోందని భల్లా పేర్కొన్నారు. -
దిగ్గజ గాయకుడు భూపీందర్ సింగ్ కన్నుమూత
ముంబై: ఐదు దశాబ్దాలపాటు తన గాత్రంతో అలరించిన గజల్ గాయకుడు భూపీందర్ సింగ్(82) ఇక లేరు. సోమవారం రాత్రి ఆయన కన్నుమూశారు. కోలన్ కేన్సర్, కోవిడ్ అనంతర సమస్యలతో ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మోహమ్మద్ రఫీ, ఆర్డీ బర్మాన్, మదన్ మోహన్, లతా మంగేష్కర్, గుల్జర్లకు సమకాలీకుడు ఈయన. ఆయన భార్య ప్రముఖ గాయకురాలు మిథాలీ సింగ్. ధరమ్‌కాంటా చిత్రంలోని ధునియా ఛూటే.. యార్ నా ఛూటే, సితారా చిత్రంలో ‘థోడీ సీ జమీన్ థోడా ఆస్మాన్’ పాటలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. నామ్ గుమ్ జాయేగా, దిల్ థూండ్తా హై.. మరిచిపోలేని క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. యూరిన్ ఇన్ఫెక్షన్తో పది రోజుల కిందట ఆస్పత్రిలో చేరిన భూపీందర్కు.. ఆ తర్వాత కొవిడ్ 19 పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే కోలన్ క్యాన్సర్, కొవిడ్ ఎఫెక్ట్‌తో ఆయన సోమవారం రాత్రి 8గం. ప్రాంతంలో మరణించారని వైద్యులు తెలిపారు. భూపీందర్‌సింగ్ ఢిల్లీ ఆల్ ఇండియా రేడియోలో సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు మదన్ మోహన్ దృష్టిలో పడి సినిమా అవకాశాలు అందుకున్నారు. 1964లో చేతన్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన హఖీఖాత్ ఆయన తొలి చిత్రం. అయితే ఆయన సోలో ట్రాక్ మాత్రం రెండేళ్ల తర్వాత ఆఖ్రీ ఖాట్ చిత్రంలోనే(రుత్ జవాన్ జవాన్ రాత్ మెహర్బాన్...) పాడారు. 1980లో సినిమాలకు మెల్లిగా దూరం అవుతూ వచ్చిన ఆయన.. భార్య మిథాలీతో కలిసి ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ వచ్చారు. కేవలం సింగర్‌గానే కాకుండా.. గిటారిస్ట్‌గా హరే రామా హరే కృష్ణ చిత్రంలో ‘దమ్ మారో దమ్’, యాదోన్ కీ బారాత్ చిత్రంలో ‘చురా లియా హై’, ‘చింగారి కోయ్ భడ్కే’, షోలే చిత్రంలోని ‘మెహబూబా ఓ మెహబూబా’ లాంటి సూపర్ హిట్ సాంగ్స్‌కు పని చేశారు. ఈ పాటల్లో గిటార్ మ్యూజిక్‌లు ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. భూపీందర్ సింగ్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం చెబుతున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఈ మేరకు ఓ సంతాప ప్రకటన విడుదల చేశారు. -
'సుప్రీం' కమిటీ నుంచి తప్పుకున్న భూపీందర్ సింగ్
న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలు, కేంద్రం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత దేశపు అత్యున్నత న్యాయ స్థానం నియమించిన కమిటీ నుంచి భారతీయ కిసాన్ సంఘం (బీకేయూ) అధ్యక్షుడు భూపీందర్‌సింగ్ మాన్ స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు నియమించిన నలుగురు సభ్యుల కమిటీలో మాన్ ముఖ్యులు. కమిటీ సభ్యుడిగా తనను నామినేట్ చేసినందుకు, ఆయన అత్యున్నత న్యాయ స్థానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాన్ మాట్లాడుతూ.. రైతు ప్రయోజనాల విషయంలో తాను రాజీపడే ప్రసక్తే లేదని, రైతు శ్రేయస్సు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని మాసాలుగా రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గకపోవటంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని నలుగురు సభ్యుల మధ్యవర్తిత్వ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో అనిల్ ఘన్వాట్, అశోక్ గులాటి, భూపీందర్ సింగ్ మాన్, ప్రమోద్ కుమార్ జోషీల సభ్యులు. కాగా, కమిటీలోని నలుగురు సభ్యులూ నూతన చట్టాలకు అనుకూలంగా ఉన్నవారేనంటూ రైతు సంఘాలు ఆక్షేపించటంతో, భూపీందర్ సింగ్ మాన్ కమిటీ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. -
మడి చెక్కకు గ్లోబల్ ఉరితాళ్లు
భూమి లేక రూ. 4 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు నిలచిపోయాయంటున్న ప్రభుత్వం వాటి జాబితాను చూపడం లేదు. ఇప్పటికే సేకరించిన భూమిలో 45 శాతం ఐదు రాష్ట్రాల్లోనే ఖాళీగా పడి ఉందని అంచనా. టిస్కో స్టీల్ 1995లో సేకరించిన 3,799 ఎకరాలు అలాగే పడి ఉన్నాయి. ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన 17 లక్షల ఎకరాల మిగులు భూములపై ప్రభుత్వం కన్ను వేయనే వేసింది. ఇన్ని భూములు ఉండగా వాటిని ఉపయోగించకుండా కొత్తగా బలవంతపు భూసేకరణలు ఎందుకు? ఇదంతా ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లోనే జరుగుతోంది. 2015 నాటికి మన గ్రామీణ జనాభా నుంచి 40 కోట్ల మందిని పట్టణాలకు తరలించాలని అది 1996లోనే నిర్దేశించింది. ఈ బదలాయింపును వేగిరం చేయాలని 2008లో కోరింది. ఈ కారణంగానే మన పాలకులు వ్యవసాయరంగానికి వనరులు లేకుండా చేసి, రైతుల ఆదాయాలను అల్పస్థాయికి నెట్టి, వారు వ్యవసాయాన్ని వీడిపోయేలా చేస్తున్నారు. రానున్న రోజుల్లో రైతుల భూముల స్వాధీనంపై పార్ల మెంటులోనూ, వీధుల్లోనూ కూడా పోరాటాలు ముమ్మ రం కానున్నాయి. ఒకవంక రైతు సంఘాలు మార్చి 18న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ను ముంచెత్తడానికి సంసిద్ధమౌ తుంటే, మరోవంక అన్నాహజారే మార్చి 30 నుంచి పాదయాత్రకు సమాయత్తమవుతున్నారు. ఇక ప్రభు త్వం సంఖ్యాబలం లేని రాజ్యసభలో ఎదురు కానున్న గట్టి సవాలును ఎదుర్కొనడానికి కసరత్తు చేస్తోంది. భూసేకరణ బిల్లు పదకొండు స్వల్ప సవరణలతో లోక్‌సభ ఆమోదం పొందింది. ఆ సవరణల్లో అత్యధికం 2013 నాటి చట్టంలో ఉన్నవే. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి భూపిందర్ సింగ్ బిల్లును సమర్థించుకోడానికి నానా తంటాలు పడి సాధించిందేమీ లేదు. అరుపులు కేకలతో కూడిన చర్చలు, చెవులు చిల్లులు పడే రణగొణ ధ్వనులు బిల్లు ఆమోదానికి ముందూ తర్వాతా కూడా కొనసాగుతున్నాయి. వాటిలో పడి భూమిని బలవం తంగా స్వాధీనం చేసుకోవడం కోసం ప్రత్యేక చట్టాన్ని తేవలసిన అవసరం వెనుకనున్న అసలు కారణాలు ప్రజ లకు వెల్లడి కాకుండా మరుగున పడిపోయాయి. రైతు అంగీకారం లేకుండానే భూమిని సేకరించడానికి అను కూలంగా ముందుకు తెస్తున్న కొన్ని ముఖ్య వాదనలను విశ్లేషించడానికి ఈ వ్యాసంలో ప్రయత్నిస్తాను. భూమి అందుబాటులో లేకపోవడమనే సమస్య అభివృద్ధికి ఆటంకంగా మారిందనే వాదన పదే పదే వినిపిస్తోంది. భూమి అందుబాటులో లేక రూ.4,00, 000 కోట్ల ప్రాజెక్టులు నిలిచిపోయాయని అంటున్నారు. కానీ అలా నిలిచిపోయిన ప్రాజెక్టుల జాబితాను ఇవ్వ డంలో ప్రభుత్వం విఫలమైంది. మౌలిక సదుపాయాల రంగ ప్రాజెక్టుల అభివృద్ధిని పరిమితం చేస్తున్న అంశాల జాబితాలో భూమి సమస్య ఒకటని ‘ఆర్థిక సర్వే-2015’ పేర్కొనలేదు. పైగా మార్కెట్లోని అననుకూల పరిస్థితుల వల్ల, పెట్టుబడులు పెట్టేవారు ఆసక్తి చూపకపోవడం వల్ల అవి నిలిచిపోయాయని నిర్థారించింది. ఇకపోతే, భూమి అందుబాటులో లేకపోవడమే అందుకు కారణం అయ్యే ట్టయితే, 576కు పైగా ఎకనమిక్ జోన్స్ (ఆర్థిక మండ లాలు) పురోగతిని చూపడంలో ఎందుకు విఫల మయ్యాయనేది రెండో అంశం. కార్పొరేట్లకు గ్రామీణ ఆస్తుల బదలాయింపు ప్రత్యేక ఆర్థిక మండలాల (సెజ్‌ల) అభివృద్ధి కోసం నోటిఫై చేసిన 45,635.63 హెక్టార్ల భూమిలో వాస్తవంగా కార్యకలాపాలు సాగుతున్నది కేవలం 28,488.49 హెక్టా ర్లలో లేదా సేకరించిన దానిలో 62 శాతం. ఈ సెజ్‌లు ఉపాధిని కల్పించినదీ లేదు, వస్తుతయారీ లేదా పారిశ్రా మిక వృద్ధికి దారితీసిందీ లేదు. వీటికి పర్యావరణ అను మతులుగానీ, సామాజిక ప్రభావ అంచనాగానీ అవస రం లేదని గుర్తుంచుకోవాలి. ైపైగా వాటికి రూ.1.75 లక్షల కోట్ల విలువైన సకల రకాల ట్యాక్స్ హాలిడేలను ప్రకటించారు. అయినా సెజ్‌లు ఫలితాలను చూపడం లో విఫలమయ్యాయి. ‘‘ప్రభుత్వం ప్రజల నుంచి భూమిని సేకరించడం ప్రధానంగా గ్రామీణ జనాభా నుంచి కార్పొరేట్ రంగానికి జరుగుతున్న సంపద బద లాయింపని రుజువవుతోంది’’ అంటూ కాగ్ ఈ వ్యవ హారంపై అతి సునిశితమైన వ్యాఖ్య చేసింది. ఖాళీగా పడి ఉన్న భూములు పనికి రావా? ఇప్పటికే సేకరించిన భూమిలో ఎంత ఖాళీగా పడివుందో ప్రభుత్వానికి సైతం తెలుసని నేను అనుకోను. కేవలం ఐదు రాష్ట్రాలలోనే నిరుపయోగంగా పడివున్న సేకరిం చిన భూమే 45 శాతమని ఒక ప్రైవేటు టీవీ చానల్ వెల్లడించింది. ఉదాహరణకు, టిస్కో స్టీల్ ప్లాంట్ కోసం ఒడిశాలోని గోపాల్‌పూర్‌లో 1995లో సేకరించిన 3,799 ఎకరాల భూమి ఇప్పటికీ నిరుపయోగంగానే ఉంది. ఇకపోతే, ప్రభుత్వరంగ సంస్థల వద్ద ఉన్న 17,00,000 ఎకరాల మిగులు భూముల మీద ప్రభుత్వం కన్ను వేయనే వేసింది. ఇప్పటికే ఇంత భూమి అందుబాటులో ఉండగా, ముందు వాటిని తగు రీతిలో ఉపయోగించ కపోవడానికి కారణం ఏమిటో అంతుపట్టదు. పైగా, 2013 భూసేకరణ చట్టాన్ని మార్చాల్సిన అవ సరం ఉన్నదని ముఖ్యమంత్రులు కేంద్రానికి రాయడం వల్లనే దాన్ని మార్చాల్సివచ్చిందంటూ చేస్తున్న వాదన హాస్యాస్పదం. బొగ్గు గనులున్న రాష్ట్రాల ముఖ్య మంత్రు లు బొగ్గు బ్లాకుల బహిరంగ వేలం వేయడాన్ని కూడా వ్యతిరేకించారని విస్మరించరాదు. కానీ సుప్రీంకోర్టు 204 బొగ్గు బ్లాకులను రద్దు చేసింది. బొగ్గు బ్లాకుల బహిరంగ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.15,00,000 కోట్ల రాబడి వస్తుందని అంచనా. స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించే మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో... మార్కెట్టు ధరను ప్రాతిప దిక ధరగా నిర్ణయించి భూములను బహిరంగ వేలంలో కొనుక్కోమని ప్రైవేటు రంగాన్ని ఎందుకు అడగరాదో నాకు అర్థం కావడం లేదు. గత 50 ఏళ్లలో ‘‘అభివృద్ధి ప్రాజెక్టుల’’ వల్ల 5 కోట్ల మంది ప్రజలు నిర్వాసితులయ్యారని రూర్కీలోని ఐఐటీ చేసిన ఒక అధ్యయనం అంచనా వేసింది. బాక్రా డామ్, పోంగ్ డామ్ నిర్వాసితులకు ఇంకా పునరావాసం కల్పిం చలేదని, ‘‘ప్రజావసరాల’’ పేరిట ప్రభుత్వం బలవం తంగా భూములను స్వాధీనం చేసుకోవడం వల్లనే ప్రాథ మికంగా భూ సంఘర్షణలు తలెత్తుతున్నాయని ఆ అధ్యయనంలో తేలింది. సేకరించిన భూములు చివరికి రియల్ ఎస్టేట్ సంస్థల చేతుల్లోకి పోయాయని, అవి లాభపడ్డాయని పలు కాగ్ నివేదికలు నిర్ధారించాయి. ‘సేకరణ’ గ్లోబల్ కుట్ర 2013-14 మధ్య వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ‘రైట్స్ అండ్ రిసోర్సెస్ ఇనిషియేటివ్’ అనే సంస్థ జరిపిన అధ్య యనం భూసేకరణపై 252 సంఘర్షణలు తలెత్తినట్టు వెల్లడించింది. కాగా కొంతకాలం క్రితం ‘న్యూస్‌వీక్’ పత్రిక చైనాలో ఏటా దాదాపు 75,000 సంఘర్షణలు తలె త్తుతున్నట్టు, వాటిలో అత్యధికం రక్తపాతంతో కూడిన విగా ఉంటున్నాయని పేర్కొంది. గత పదేళ్లలో చైనాలో 28 లక్షల మంది గ్రామస్తులు ఆత్మహత్యలకు పాల్పడ్డా రని ఇటీవలి ఒక నివేదిక తెలిపింది. వీటిలో 80 శాతం ఆత్మహత్యలు బలవంతపు భూస్వాధీనం వల్ల జరిగినవే. అందువలన భారత శాసనకర్తలు బలవంతపు భూసేక రణ వల్ల ఉత్పన్నమయ్యే సామాజిక, ఆర్థిక అశాంతి విషయంలో రెట్టింపు జాగ్రత్త వహించాల్సి ఉంది. నిజానికి భూమిని సరుకుగా మార్చే ఈ ప్రక్రియ ప్రపంచవ్యాప్త పన్నాగంలో భాగం. చైనా, భారత్‌లలోని మొత్తం సాగుయోగ్యమైన భూమికి సమానమైన భూమి ని ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు పెట్టుబడి ఇప్పటికే వశం చేసుకుంది. భారత్ విషయానికి వస్తే... వచ్చే 20 ఏళ్లలో అంటే 2015 నాటికి 40 కోట్ల ప్రజలను అంటే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల మొత్తం జనాభాను గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు తరలించాలని ప్రపంచ బ్యాంకు 1996లోనే నిర్దేశించింది. ‘ప్రపంచ అభివృద్ధి నివేదిక’ 2008లో అది ఈ జనాభా బదలాయింపును వేగిరం చేయాలని కోరింది. ప్రధానంగా ఈ కారణంగానే మన పాలకులు ఉద్దేశపూర్వకంగా వ్యవసాయరంగానికి వన రులు లేకుండా చేసి, రైతుల ఆదాయాలను బలవం తంగా అల్పస్థాయికి నెడుతున్నారు. తద్వారా వారు వ్యవసాయాన్ని వీడి వలసలు పోయేలా చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధే శరణ్యం పారిశ్రామికాభివృద్ధిని వ్యవసాయాభివృద్ధికి పోటీ పెట్టి చేస్తున్న చర్చ లోపభూయిష్టమైనది. ప్రపంచ వ్యా ప్తంగా సర్వత్రా ఉద్యోగాలులేని వృద్ధే ప్రమాణంగా కనిపి స్తున్న నేటి పరిస్థితుల్లో మన పారిశ్రామిక రంగం పెరు గుతున్న మన శ్రామికశక్తిలోని ఒక చిన్న భాగాన్ని కూడా ఇముడ్చుకోలేదు. గత పదేళ్లలో, 2004 నుంచి 2014 వరకు, అధిక వృద్ధిరేట్లున్నాగానీ 1.5 కోట్ల ఉద్యోగాలను మాత్రమే సృష్టించగలిగారు. అందువలన గ్రామీణ పరి శ్రమల స్థాపనను ప్రోత్సహించడం, భూమిలేని పేదలకు భూమిని అందించడం మాత్రమే ఆర్థికవ్యవస్థను పునరు జ్జీవింపజేయడానికి అర్థవంతమైన మార్గమౌతుంది. మహారాష్ట్రలోని దుర్భిక్ష ప్రాంత గ్రామం హిబ్రె బజార్ తమ ఊళ్లో 60 మంది లక్షాధికారులున్నారని చెప్పు కోగలుగుతుంటే... అది మిగతా దేశానికి ప్రమాణం కాజాలదనడానికి నాకు కారణమేమీ కనబడదు. (వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు) email: hunger55@gmail.com -
పీఠం ఎక్కించిన ఓట్ల శాతం
హర్యానాలో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 4 నుంచి 47 సీట్లకు పెరిగిన బలం 9 శాతం నుంచి 33 శాతానికి పెరిగిన ఓట్లు చండీగఢ్: హర్యానా రాజకీయాల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది. పార్టీలో హేమాహేమీలు ఎవరూ లేకున్నా, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఐఎన్ఎల్డీలకుతోడు కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలు, స్వతంత్రులు బరిలో నిలిచినా ఒంటరి పోరుతో అఖండ విజయం సాధించి తొలిసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ చిన్న పార్టీగా ముద్రపడ్డ కాషాయ పార్టీ...మోదీ ప్రభంజనంతో అధికార కాంగ్రెస్‌ను మట్టికరిపించింది. 90 స్థానాలున్న హర్యానాలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 4 సీట్లకే పరిమితమైన స్థితి నుంచి ఏకంగా 47 సీట్లు గెలుచుకొని సత్తా చాటింది. 1966లో హర్యానా ఏర్పడినప్పటి నుంచీ బీజేపీ సాధించిన అత్యుత్తమ ఫలితాలు ఇవే కావడం విశేషం. 1987లో బీజేపీ 20 చోట్ల పోటీ చేసి 16 స్థానాల్లో గెలుపొందింది. ఈ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన సీట్లను సాధించడంతోపాటు భారీగా తన ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 9.05 శాతం ఓట్లతో సరిపెట్టుకున్న కమలదళం తాజా ఎన్నికల్లో అనూహ్యంగా 24.15 శాతం ఓట్లను పెంచుకొని మొత్తంమీద 33.2 శాతం ఓట్లు సాధించింది. బీజేపీ అన్ని చోట్లా ఒంటరిగానే పోటీ చేయాలంటూ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మోదీ చేపట్టిన సుడిగాలి ప్రచారానికితోడు స్థానిక నేతలు, సీఎం రేసులో ఉన్న నేతలైన కెప్టెన్ అభిమన్యు, పార్టీ హర్యానా చీఫ్ రామ్‌విలాస్ శర్మ, మోహన్‌లాల్ ఖట్టర్, ఓపీ ధన్కర్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్, ఐఎన్ఎల్డీలోని ప్రముఖ నేతలంతా బీజేపీ ప్రభావం ముందు నిలువలేకపోయారు. కాంగ్రెస్ నాయకురాలు, వ్యాపార దిగ్గజం నవీన్ జిందాల్ తల్లి సావిత్రి జిందాల్ (హిసార్), నిర్మలా సింగ్ (అంబాలా సిటీ), దివంగత మాజీ సీఎం బన్సీలాల్ కుమారుడు రణ్‌బీర్‌సింగ్ మహేంద్ర (బద్ఖల్) తదితర ప్రముఖులు ఓటమిపాలయ్యారు. అలాగే ఐఎన్ఎల్డీ చీఫ్ చౌతాలా మనవడు దుష్యంత్ (ఉచనా కలాన్) తదితరులు ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా 13 మంది మహిళలు గెలుపొందారు. కాంగ్రెస్, ఐఎన్ఎల్డీ ఓట్ల శాతం పతనం: హర్యానా ఓటర్లు బీజేపీకి బ్రహ్మరథం పట్టడంతో పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, ఈసారైనా అధికారం కోసం కలలుగన్న ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌ఘోర పరాజయం పాలయ్యాయి. కుంభకోణా ల ఆరోపణలు, ప్రజావ్యతిరేకత కాంగ్రెస్ ఓటమికి కారణమవగా అవినీతి కేసులో ఐఎన్ఎల్డీ చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలా జైలుపాలవడం ఆ పార్టీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపిం ది. కాంగ్రెస్ కేవలం 20.6 శాతం ఓట్లను సాధించగా ఐఎన్ఎల్డీ 2000 తర్వాత పోటీ చేసిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోకెల్లా అత్యల్పంగా 24.1 శాతం ఓట్లు పొందింది. 2009లో ఐఎన్ఎల్డీ 25.29ఓట్ల శాతంతో 31సీట్లను గెలుచుకుంది. 2009లో కాంగ్రెస్ 35.12శాతం ఓట్లను సాధించింది. కాగా, కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్‌సింగ్ హూడా తన పదవికి రాజీనామా చేశారు. -
లాంఛనంగా ర్యాపిడ్ మెట్రో ప్రారంభం
గుర్గావ్: ర్యాపిడ్ మెట్రో సేవలను హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. సికందర్పూర్ మెట్రో స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమంలో హుడాతో పాటు ఆ రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇందుకోసం ఉదయం పది నుంచి రెండు గంటల పాటు మెట్రో సేవలను నిలిపివేశారు. నవంబర్ 14నే అనధికారికంగా ర్యాపిడ్ రైళ్ల సేవలు అందుబాటులోకి వచ్చాయని మెట్రో అధికారులు తెలిపారు. కాగా, 5.1 కిలోమీటర్ల మేర ఆరు స్టేషన్లు ఉన్న మార్గంలో ఈ ర్యాపిడ్ మెట్రో రైళ్లు సేవలు అందిస్తున్నాయని చెప్పారు.