గుర్గావ్: ర్యాపిడ్ మెట్రో సేవలను హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. సికందర్‌పూర్ మెట్రో స్టేషన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హుడాతో పాటు ఆ రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇందుకోసం ఉదయం పది నుంచి రెండు గంటల పాటు మెట్రో సేవలను నిలిపివేశారు. నవంబర్ 14నే అనధికారికంగా ర్యాపిడ్ రైళ్ల సేవలు అందుబాటులోకి వచ్చాయని మెట్రో అధికారులు తెలిపారు. కాగా, 5.1 కిలోమీటర్ల మేర ఆరు స్టేషన్‌లు ఉన్న మార్గంలో ఈ ర్యాపిడ్ మెట్రో రైళ్లు సేవలు అందిస్తున్నాయని చెప్పారు.