హర్యానా ఫలితాలు: ‘ఎన్నికల కమిషన్‌ను కలుస్తాం’ | haryana: bhupinder hooda says We have lost many seats by small margin | Sakshi
Sakshi News home page

హర్యానా ఫలితాలు: ‘ఎన్నికల కమిషన్‌ను కలుస్తాం’

Published Tue, Oct 8 2024 8:11 PM | Last Updated on Tue, Oct 8 2024 8:11 PM

haryana: bhupinder hooda says We have lost many seats by small margin

చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మరోసారి ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో బీజేపీ  48 స్థానాలో గెలుపొందింది. కాంగ్రెస్‌ పార్టీ 36 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. హర్యానాలో వెలువడిన ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా స్పందించారు. 

‘‘ చాలా చోట్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు చాలా తక్కువ తేడాతో ఓడిపోయారు. హర్యానాలో ఈ ఇవాళ వెలువడిన ఫలితాలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అనేక చోట్ల నుంచి మాకు ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌ను కలుస్తాం.

కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత పోరుపై స్పందించారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ నేతలందరూ ఐక్యంగానే ఉన్నారు. అంతర్గత పోరు.. బీజేపీలోనే చూడొచ్చు. అనిల్‌ విజ్‌ ఇంటి నుంచి బయటకు రాలేదు. రామ్‌ బిలాస్‌ శర్మకు టికెట్‌ దక్కలేదు. కాంగ్రెస్‌ పార్టీ  వంటి ప్రజాస్వామ్య పార్టీలో  అభిప్రాయలు ఉంటాయి. కానీ ఆలోచనలో ఎటువంటి తేడా ఉండదు.


.. పొత్తు గురించి సమాజ్‌వాదీ పార్టీతో మేము ఎప్పుడూ మాట్లాడలేదు. సీపీఎం పార్టీ మమ్మల్ని అడిగారు. అందుకే  వారికి మేము భివానీ అసెంబ్లీ సీటు ఇచ్చాం. మేము ఆమ్ ఆద్మీ పార్టీకి సీట్లు ఇచ్చాం. ఆ పార్టీ పొత్తు పెట్టు​కోకుండా ఒంటరిగా బరిలోకి దిగింది’’ అని అన్నారు. ఇక.. ఎన్నికల ఫలితాల్లో ఆయన గర్హి సంప్లా-కిలోయ్ అసెంబ్లీ స్థానంలో 71,000 మెజార్టీతో సమీప బీజేపీ అభ్యర్థి మంజూపై విజయం సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement