=రీమ్యాప్ చైర్మన్ కేసీ రెడ్డి
=న్యాక్‌లో ప్రారంభమైన స్కిల్స్-2013 అంతర్జాతీయ సదస్సు
సాక్షి, సిటీబ్యూరో: ‘‘గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాలను, వారి జీవనోపాధిని మెరుగు పరిచేందుకు నైపుణ్యాల ఆవశ్యకత ఎంతో ఉంది. వృత్తిపరమైన నైపుణ్యాల కోసం ఎంతోమంది పట్టణాలకు వలస వస్తున్నారు. అలాకాకుండా.. నైపుణ్యాలను వారి చెంతకు చేరుస్తూ.. దేశ నిర్మాణం కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని’’అని రాజీవ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ మిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్(రీమ్యాప్) చైర్మన్ కె.సి.రెడ్డి పిలుపునిచ్చారు.
‘లైఫ్ స్కిల్స్ అండ్ లైవ్‌లీ హుడ్ స్కిల్స్-చాలెంజెస్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్’అంశంపై రూరల్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ సొసైటీ (రీడ్స్) ఏర్పాటు చేసిన మూడు రోజుల ‘స్కిల్స్-2013’అంతర్జాతీయ సదస్సు గురువారం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(న్యాక్)లో ప్రారంభమైంది. సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సేవా సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అమెరికా.. తదితర దేశాలకు చెం దిన ప్రతినిధులు పెద ్ద సంఖ్యలో హాజరయ్యారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కె.సి.రెడ్డి మాట్లాడుతూ..
మరో పదేళ్లలో భారత దేశం ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తి వంతమైన దేశంగా మారనుందన్నారు. దేశ జనాభాలో యువత శాతం అధికంగా ఉండడమే కారణమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులకు డిమాండ్ పెరిగిందని, ఈ దిశగా దేశంలోనూ, రాష్ట్రంలోనూ అన్ని వర్గాల ప్రజల్లో స్కిల్స్‌ను పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృ షి చేస్తున్నాయన్నారు. దేశ నిర్మాణంలో ప్రభుత్వంతో పాటు సేవా సంస్థలు, పరిశ్రమలు భాగస్వాములు కావాలన్నా రు. ఇండస్ట్రీ ఆశిస్తున్న మేరకు వివిధ స్థాయిల్లో యువతకు రాజీవ్ యువకిరణాల కార్యక్రమం ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణను అందిస్తున్నామన్నారు.
నైపుణ్యాలను పెంపొందించి వారికి మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. ప్రజల జీవితాలను, జీవనోపాధిని పెంపొందించడంలో ఎదురవుతున్న సవాళ్లు అంశంపై రీడ్స్ సంస్థ అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. సదస్సు ద్వా రా ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లకు మేథావులు సరైన పరిష్కార మార్గాలు అన్వేషించాలని కోరారు. రీడ్స్ సంస్థ చైర్మన్ విక్రమ్ మాట్లాడు తూ.. కేంద్ర ప్రభుత్వం దశాబ్దాకాలం గా విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వలన ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో గణనీయమైన ప్రగతి కనిపిస్తుందన్నారు.
ఈ నేపథ్యంలోనే స్కిల్ డెవలప్‌మెంట్‌పై కూడా ఆయా వర్గాలకు అవగాహన పెరిగిందని చెప్పారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజల్లో నైపుణ్యాలను పెంపొందించే దిశగా రీడ్స్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆయన పే ర్కొన్నారు. అనంతరం నిర్వహించిన సెషన్‌లో.. స్కిల్లింగ్ 500 మిలియన్ అంశం పై వక్తల ఉపన్యాసాలను సభికులను ఆకట్టుకున్నాయి. ‘స్కిల్ ట్రైనింగ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఏ స్టడీ ఆన్ విమెన్ ఇన్ అగ్రికల్చర్’ అంశంపై విద్యావేత్త డాక్టర్ జయా ఇందిరేశన్,‘స్కిల్ డెవలప్‌మెంట్- సీఎస్‌ఆర్ ఇనిషియేటివ్స్’ అంశంపై అమృతా యూనివర్సిటీ ప్రొఫెసర్ భవానీ, ‘ఎవాల్యుయేషన్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ ఫర్ అర్బన్ పూర్’ ఆంశంపై సీఐఎస్‌సీ డీన్ ప్రొఫెసర్ రమణ ఉపన్యసించారు.
కార్యక్రమంలో కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్ చందర్ శర్మ, ఆస్ట్రేలియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిషనర్ కెయిలీ బెల్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ మాజీ డెరైక్టర్ ప్రొఫెసర్ ముఖోపాధ్యాయ్, ఎన్‌ఎస్‌డీసీ ప్రిన్సిపాల్ రాజన్ చౌదరి, రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్ శశిభూషణ్ కుమార్, ప్రొఫెసర్ సదానంద,రవిరెడ్డి పాల్గొన్నారు.
గ్రామీణుల చెంతకు నైపుణ్యం
Published Fri, Dec 13 2013 4:06 AM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM
Advertisement
Advertisement