సోషల్ మీడియా వాడకం పెరగడంతో ప్రపంచ నలుమూలల జరిగేవి క్షణంలో నెట్టింట దర్శనమిస్తున్నాయి. అందులో కొన్ని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో కొందరు సామాన్యులు సెలబ్రిటీలుగా మారడం కూడా మనం బోలెడు చూశాం. అందుకే ఎక్కడ ఏం జరిగినా వాటిని వీడియోలు చిత్రీకరించడం ఆ వెంటనే నెట్టింట షేర్ చేయడం షరా మామూలుగా మారింది. తాజాగా ఓ జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
చదవండి: సింహాలతో సెల్ఫీ.. అట్లుంటది మనతోని!
ఓ నెటిజన్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో.. కేరళలోని పాతానంతిట్ట జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి దివ్య ఎస్ అయ్యర్‌ని చూడవచ్చు. మహాత్మా గాంధీ యూనివర్శిటీ ఆర్ట్ ఫెస్టివల్ నేపధ్యంలో ఆ జిల్లా స్టేడియంలో కళాశాల విద్యార్థులు ఫ్లాష్ మాబ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతుండగా కొందరు విద్యార్థులు తమతో పాటు డ్యాన్స్ చేయమని ఆమెను కోరారు. దీంతో విద్యార్థులతో పాటు కలెక్టర్ జాయిన్ అయ్యారు. విద్యార్థులతో కలిసి పుల్ జోష్‌తో ఆమె కూడా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment