అదిరే.. ఫ్లాష్‌మాబ్
అదిరే.. ఫ్లాష్‌మాబ్
Published Sat, Sep 24 2016 7:46 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
గుంటూరు (అరండల్‌పేట): ప్రపంచ ఫార్మసీ దినోత్సవం సందర్బంగా సిమ్స్ ఫార్మసీ కళాశాల విద్యార్థులు శనివారం స్థానిక బందావన్ గార్డెన్స్‌లోని ఎన్‌టీఆర్ స్టేడియం ఎదుట, నాజ్ సెంటర్ కూడలి వద్ద ఫ్లాష్‌మాబ్, లఘు నాటికలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.మనోహర్‌బాబు మాట్లాడుతూ రోగికి వచ్చిన జబ్బును వైద్యులు గుర్తిస్తారని, అయితే ఆ జబ్బుకు ఫార్మసిస్ట్ మాత్రమే మందు తయారుచేయగలరన్నారు. ఈ మందులపై సమాజంలో చాలామందికి అవగాహన తక్కువుగా ఉందన్నారు. రోగికి వచ్చిన జబ్బులో వైద్యుల ప్రాముఖ్యత కన్నా ఫార్మసిస్ట్ ప్రాముఖ్యతే అధికమన్నారు. ఒక మందు తయారీలో ఫార్మసిస్ట్ కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల పాటు కష్టపడాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్‌మాబ్, లఘు నాటికలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement