Sims
-
ఈ-సిమ్ల తయారీ హబ్‌గా భారత్
న్యూఢిల్లీ: సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ (సిమ్) తయారీలో ఉన్న ఫ్రెంచ్ దిగ్గజం ఐడెమియా(IDEMIA) దేశీయ మార్కెట్‌పై ఫోకస్ చేసింది. తదుపరి తరం సాంకేతిక పరిజ్ఞానం అయిన ఎంబెడెడ్ సిమ్ల (ఈ-సిమ్) తయారీకి భారత్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీకి చెందిన అన్ని ప్లాంట్లు ఏటా 30 కోట్ల ఈ-సిమ్‌లు ఉత్పత్తి చేయగలవు. ఇందులో నోయిడా కేంద్రం వాటా 6 కోట్ల యూనిట్లు. ఈ ఫెసిలిటీని ఈ-సిమ్ల తయారీలో భారీ ప్లాంటుగా నిలపాలన్నది సంస్థ లక్ష్యం. ఈ-సిమ్ ప్రత్యేకత ఏంటంటే.. సాధారణ సిమ్‌కు బదులు మొబైల్ ఫోన్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ కార్డ్‌ను పొందుపరుస్తారు. కస్టమర్లు ఇతర నెట్‌వర్క్‌ను ఎంచుకోవాలంటే సిమ్‌ను మార్చాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కోడ్‌తో మరో ఆపరేటర్‌కు సింపుల్‌గా మారవచ్చు. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు స్థానిక సిమ్ వినియోగించే పని లేదు. వేరబుల్స్, వాచెస్ వంటి ఇంటర్నెట్ ఆధారిత ఉపకరణాల్లో ఈ-సిమ్ ద్వారా స్థలం ఆదా అవుతుంది. రూ.1,780 కోట్ల పెట్టుబడి పరిశోధన, అభవృద్ధికి భారత్‌లో సుమారు రూ.1,780 కోట్లు వెచ్చించనున్నట్టు ఐడెమియా ఇప్పటికే ప్రకటించింది. వచ్చే అయిదేళ్లపాటు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది. ‘ఈ-సిమ్ల తయారీలో అతిపెద్ద ప్లాంట్లలో ఒకటిగా భారత్ నిలవనుంది. దేశంలో ఐడెమియా మాత్రమే వీటిని ఉత్పత్తి చేస్తోంది. టెలికం రంగంలో ఇక్కడ కొన్నేళ్లుగా పాతుకుపోయిన కారణంగా వీటి తయారీకి భారత్‌ను ఎంచుకున్నాం’ అని ఐడెమియా ఇండియా రీజినల్ ప్రెసిడెంట్ మాథ్యూ ఫాక్స్టన్ తెలిపారు. కంపెనీ ఏటా 60 కోట్లకుపైగా సిమ్‌లను ఇక్కడ తయారు చేస్తోంది. సంస్థ అంతర్జాతీయంగా చేపడుతున్న ఉత్పత్తిలో ఇది 67 శాతం. భారత కస్టమర్లకు ఇప్పటి వరకు 100 కోట్లకుపైగా సిమ్‌లను అందించింది. దేశీయ సిమ్ల మార్కెట్లో ఐడెమియా వాటా 40 శాతంపైమాటే. ఆధార్ ప్రాజెక్టులో భాగంగా బయోమెట్రిక్ టెక్నాలజీని సైతం ఈ సంస్థ అందించింది. భవిష్యత్ ఈ-సిమ్లదే.. ప్రస్తుతం భారత్‌లో సుమారు 10 లక్షల మంది వినియోగదార్లు ఈ-సిమ్‌ను వాడుతున్నారు. యాపిల్, శామ్సంగ్, గూగుల్, మోటరోలా స్మార్ట్ఫోన్లలో ఈ సాంకేతికత అందుబాటులో ఉంది. అయితే టెలికం కంపెనీలు ఈ-సిమ్‌లను పెద్దగా ప్రోత్సహించడం లేదు. వీటితో వినియోగదార్లు సులువుగా ఆపరేటర్లను మారుస్తారు కాబట్టే కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. రాబోయే కొన్నేళ్లలో 30 శాతం స్మార్ట్ఫోన్లు ఈ-సిమ్ ఆధారంగా రూపుదిద్దుకుంటాయని ఐడెమియా అంచనా వేస్తోంది. ఏటా ఈ మార్కెట్ 30 శాతం వృద్ధి నమోదు చేస్తుందని భావిస్తోంది. ఈ-సిమ్‌లకు యూఎస్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, సింగపూర్ అతి పెద్ద మార్కెట్లు. చదవండి: నాలుగు రోజుల్లో భారీగా నష్టపోయిన గౌతమ్ అదానీ -
రివర్స్ మళ్లీ అదుర్స్
-
మీ ఆధార్ నంబర్‌పై ఎన్ని సిమ్‌లు ఉన్నాయి?
న్యూఢిల్లీ: సిమ్ కార్డుల అక్రమ వినియోగాన్ని అరికట్టే దిశగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ ఆధార్ నంబర్‌పై ఎన్ని సిమ్ కార్డులు జారీ అయ్యాయో తెలుసుకునే అవకాశాన్ని కస్టమర్లకు ఈ నెల 15 నాటికి కల్పించాలని అన్ని టెలికం కంపెనీలను ఆదేశించింది. ఇతరులు ఎవరైనా తమ పేరిట అక్రమంగా వినియోగిస్తుంటే దీని ద్వారా కస్టమర్లకు తెలుసుకునే అవకాశం లభించనుంది. కొంత మంది రిటైలర్లు, టెలికం ఆపరేటర్లు, కంపెనీల ఏజెంట్లు ఆధార్ ఆథెంటికేషన్‌ను దుర్వినియోగం చేస్తూ, వాస్తవ ఆధార్ కార్డుదారుడి పేరిట వేరొకరికి సిమ్ కార్డులు జారీ చేయడం, ధ్రువీకరణ చేస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో యూఐడీఏఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. -
సత్యసాయి వైద్య సేవలు భేష్
= ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పుట్టపర్తి టౌన్: సత్యసాయి వైద్య సంస్థల్లో రోగులకు అందుతున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య అభినందించారు. ఆదివారం ఆమె పుట్టపర్తిలోని సత్యసాయి జనరల్ , సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలను విభాగాల వారిగా పరిశీలించారు. అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య పరికరాలు, వాటి నిర్వహణ తీరుపై అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్తులో ప్రభుత్వ వైద్య సిబ్బంది నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇక్కడ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించేందుకు కృషి చేస్తామన్నారు. సత్యసాయి వైద్య సంస్థల్లో అత్యాధునిక వైద్య పరికరాలతో ఉచిత వైద్యాన్ని అందించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అనంతరం ఆమె కొత్తచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, సిమ్స్ డైరెక్టర్ డాక్టర్.గురుమూర్తి, వైద్యులు రమేశ్ నాథ్, జగన్నాథం, నాగరాజునాయక్, వైద్య సిబ్బంది కోటేశ్వర్రావు, లింగారామమోహన్, అజీజ్‌ఖాన్ పాల్గొన్నారు. -
యువతులపై ఆకతాయిల ఆగడాలు
ఆధారాల్లేని సిమ్‌లను ఉపయోగించి లైంగిక వేధింపులు తోటపల్లిగూడూరు : గుర్తుతెలియని యువకులు ప్రూప్ లు లేని సిమ్‌లను వినియోగిస్తూ ఫోన్ల ద్వారా యువతులను, మహిళలను లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. మండలంలోని నరుకూరు, సాలిపేట, మహాలక్ష్మీపురం సెంటర్ల పరిధిలో ఇలాంటి ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని మొబైల్ షాపుల నిర్వాహుకులు అత్యాశకు పోతూ ఎలాంటి ప్రూప్‌లు లేకపోయినా అధిక ధరతో సిమ్ కార్డులను విక్రయిస్తున్నారు. అలా ప్రూప్‌లు లేని సిమ్‌లను తీసుకునే కొందరు ఆకతాయిలు ఫోన్లలో యువతలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ నెల 20న రాత్రి నరుకూరు సెంటర్‌కు చెందిన ఓ యువతి (19)కి కొందరు ఆకతాయిలు 8008702817, 9966541870, 9573306361 నంబర్ల నుంచి ఫోన్లు చేసి అసభ్యకరంగా ప్రవర్తించారు. నీవెవరిని అడిగిన ఆ యువతి పెద్దలను సైతం ఆ గుర్తుతెలియని యువకుడు నానా దుర్భషలాడాడు. ఈ నెల 21న సాలిపేటకు చెందిన మరో మహిళకు ఓ ఆకతాయి రెండు వేరు వేరు నంబర్ల నుంచి ఫోన్లు చేసి పత్రికల్లో రాయలేని భాషలో మాట్లాడాడు. దీంతో తమకు ఫోన్లు వచ్చిన ఈ నంబర్ల వివరాలను సేకరించేందుకు వారు ప్రయత్నించినా అవి ప్రూప్‌లు లేని సిమ్‌లు కావడంతో వారి వివరాలు తెలియరాలేదు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుండటంతో కొత్త నంబర్ల నుంచి ఫోన్లు వస్తే తీసేందుకు మహిళలు భయాందోళలను గురికావాల్సి వస్తోంది. ఇలా ప్రూప్‌లు లేని సిమ్‌లను వినియోగించే ఆకతాయిలతో పాటు ఆ సిమ్‌లను విక్రయించే మొబైల్ షాపులపై చర్యలు తీసుకోవాల్సి స్థానికులు పోలీస్ శాఖను కోరుతున్నారు. -
సిమ్స్ విద్యార్థుల ప్లాష్ మాబ్
గుంటూరు మెడికల్: ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్ భూతాన్ని తరిమి వేసేందుకు ప్రజల్లో అవగాహన కలిగేలా సిమ్స్ విద్యార్థులు ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు. వరల్డ్ ఎయిడ్స్ డేను పురస్కరించుకుని గురువారం ఉదయం మార్కెట్ సెంటర్లో సిమ్స్ విద్యార్థుల ఫ్లాష్‌మాబ్ జరిగింది.హెచ్ఐవీ ఏవిధంగా సోకుతుంది, హెచ్ఐవీ సోకిన వారిని ఏవిధంగా ఆదరించాలి, ఆసుపత్రుల్లో హెచ్ఐవీ బాధితులకు ఏవిధంగా వైద్యం అందించాలి అనే విషయాలను ఫ్లాష్‌మాబ్ ద్వారా విద్యార్థులు వివరించారు. విద్యాసంస్థల డైరెక్టర్ భీమనాధం భరత్‌రెడ్డి, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ బి.శివశిరీష ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఎయిడ్స్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మార్కెట్ సెంటర్లో సుమారు 2గంటల సేపు విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్‌మాబ్‌ను అధిక సంఖ్యలో ప్రజలు వీక్షించారు. -
సిమ్స్‌లో ఫ్రెషర్స్ డే ఉత్సాహం
లక్ష్మీపురం: భవిష్యత్తులో మెడికల్ విభాగాలకు మంచి భవితవ్యం ఉంటుందని ఎన్.ఆర్.ఐ కళాశాల ప్రొఫెసర్, ఆర్డోపెడిక్ డాక్టర్ అమర్నాథ్ సూరత్ అన్నారు. మంగళ్దాస్నగర్లోని సిమ్స్ ఫార్మసీ కళాశాలలో శనివారం నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలో ఆయన మాట్లాడారు. విద్యతో పాటు అన్ని రంగాలలో రాణించేందుకు విద్యార్థులు కృషి చేయాలన్నారు. అనంతరం ఆర్థోపెడిక్ డాక్టర్ దక్షిణామూర్తి మాట్లాడారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో డైరెక్డర్ బి.భరత్‌రెడ్డి, డాక్టర్ బి.శివశిరీష, ప్రిన్సిపల్ డాక్టర్ యస్.మనోహర్‌బాబు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
అదిరే.. ఫ్లాష్‌మాబ్
గుంటూరు (అరండల్‌పేట): ప్రపంచ ఫార్మసీ దినోత్సవం సందర్బంగా సిమ్స్ ఫార్మసీ కళాశాల విద్యార్థులు శనివారం స్థానిక బందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియం ఎదుట, నాజ్ సెంటర్ కూడలి వద్ద ఫ్లాష్‌మాబ్, లఘు నాటికలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.మనోహర్‌బాబు మాట్లాడుతూ రోగికి వచ్చిన జబ్బును వైద్యులు గుర్తిస్తారని, అయితే ఆ జబ్బుకు ఫార్మసిస్ట్ మాత్రమే మందు తయారుచేయగలరన్నారు. ఈ మందులపై సమాజంలో చాలామందికి అవగాహన తక్కువుగా ఉందన్నారు. రోగికి వచ్చిన జబ్బులో వైద్యుల ప్రాముఖ్యత కన్నా ఫార్మసిస్ట్ ప్రాముఖ్యతే అధికమన్నారు. ఒక మందు తయారీలో ఫార్మసిస్ట్ కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల పాటు కష్టపడాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్‌మాబ్, లఘు నాటికలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. -
సిమ్స్‌లో ముగిసిన ఆర్థోపెడిక్ సదస్సు
పుట్టపర్తి అర్బన్: సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్(సిమ్స్) ప్రశాంతి గ్రాంలో రెండు రోజులు అంతర్జాతీయ ఆర్థోపెడిక్ సదస్సు ఆదివారం ఘనంగా ముగిసింది. సదస్సులో దేశ, విదేశాలకు చెందిన 100 మంది ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు పాల్గొన్నారు. తుంటె ఎముకల మార్పిడి, పిన్న వయస్కుల్లో వాటి పునర్నిర్మాణం, సత్యసాయి ఆదర్శాల మేరకు వైద్య విధానం, వైద్యరంగంలో మానవతా విలువలు, ఆధ్యాత్మికత అన్న అంశాలపై సదస్సు సాగింది. సదస్సులో ప్రత్యక్ష శస్త్రచికిత్సల ప్రదర్శన, విశ్లేషణ, వర్క్‌షాప్‌లు, మేధావుల ఉపన్యాసాలు సాగాయి. సదస్సులో ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్.జిమ్ సులివన్,చండీగఢ్‌కు చెందిన డాక్టర్ రమేష్‌సెన్, హర్యాణాకు చెందిన మగు, బెంగళూరుకు చెందిన మధుకేష్ ఉపన్యసించారు. సదస్సు ముగిసిన అనంతరం నిపుణులు ప్రశాంతి నిలయంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
బిల్లు కట్టాకే కరెంటు!
♦ ప్రీపెయిడ్ ‘స్మార్ట్’ మీటర్లు అమర్చేందుకు సిద్ధమైన డిస్కంలు ♦ మీటర్లలో సిమ్‌కార్డు.. నేరుగా ‘విద్యుత్’ రీచార్జి ♦ భారం వినియోగదారులపైనే.. వాయిదాల్లో వసూలు? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రీపెయిడ్ ‘స్మార్ట్’ విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇకపై ప్రతి నెలా ముందు(అడ్వాన్స్)గా బిల్లు చెల్లిస్తేనే, అదీ బిల్లు చెల్లించిన మేరకే విద్యుత్ సరఫరా చేసే విధానం రాబోతోంది. ప్రస్తుతానికి రాష్ట్రంలోని 48 వేల పైచిలుకు ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు ఈ ‘స్మార్ట్’ మీటర్లను బిగించనున్నారు. భవిష్యత్తులో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వినియోగదారులకు సైతం దీనిని వర్తింపజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. నాలుగు కంపెనీలతో.. ఈ స్మార్ట్ మీటర్ల సరఫరా, నిర్వహణకు సం బంధించి డిస్కంలు తాజాగా 4 ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌తో పాటు జైపూర్‌కు చెందిన జీనస్, గురుగ్రామ్‌కు చెందిన హెచ్పీఎల్, బెంగళూరుకు చెందిన ‘పవర్ వన్ డేటా’ కంపెనీల నుంచి ఆటోమేటిక్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల కొనుగోళ్లతో పాటు నిర్వహణ సేవల కోసం ఒప్పందా లు ఖరారయ్యాయి. సింగిల్ ఫేజ్ మీటర్‌ను సుమారు రూ.7వేలు, త్రీఫేజ్ మీటర్‌ను రూ.8 వేలకు కొనుగోలు చేస్తున్నామని అధికారవర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం మేరకు జూన్ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాల యాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించే కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. లో టెన్షన్ (ఎల్టీ) సింగిల్ ఫేజ్, త్రీఫేజ్ కేటగిరీల్లోని కార్యాలయాలకు మాత్రమే వీటిని అమరుస్తా రు. ఆ తర్వాత హైటెన్షన్(హెచ్‌టీ) విభాగంలోని కార్యాలయాలకు విస్తరింపజేస్తామని అధికారవర్గాలు తెలిపాయి. డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణకు కేంద్రం ప్రవేశపెట్టిన ఉజ్వల్ డిస్కం యోజన(ఉదయ్) పథకంలో రాష్ట్రం చేరితే.. గృహ, వాణిజ్య, పరిశ్రమలు తదితర అన్ని రంగాల వినియోగదారులకు ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాల్సి ఉంటుంది. మీటర్లో సిమ్‌కార్డు ఇప్పటివరకు ఎక్కడా వినియోగించని సరి కొత్త ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించనున్నామని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఉత్తరప్రదేశ్‌లో ‘కీ ప్యాడ్’తో పనిచేసే ప్రీపెయిడ్ మీటర్లను వినియోగించడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. రహస్య కోడ్ ఆధారంగా ప్రీపెయిడ్ సిమ్‌కార్డును రీచార్జి చేసినట్లే... ఈ విద్యుత్ మీటర్లను రీచార్జి చేయాలి. రహస్య కోడ్లు దుర్వినియోగమైతే నష్టాలు వస్తాయని భావించిన డిస్కంలు... కీప్యాడ్ మీటర్ల పట్ల విముఖత చూపాయి. ఆ మీటర్లను తక్కువ ధరకే సరఫరా చేస్తామని పలు ఎలక్ట్రానిక్ కంపెనీలు దాఖలు చేసిన టెండర్ బిడ్లను తిరస్కరించి... బిల్లు చెల్లించిన వెంటనే ఆటోమెటిగ్గా రీచార్జయ్యే మీటర్లను మాత్రమే ఎంపిక చేశాయి. ఈ మీటర్లలో ఒక సిమ్‌కార్డు/డాటా కార్డు ఉంటుంది. భవనానికి ఒకే మీటర్ ఉంటే సిమ్‌కార్డుతో, ఒకటికి మించిన సంఖ్యలో ఉంటే ఇంటర్నెట్ డాటా కార్డుతో వాటిని అనుసంధానం చేసి ఆపరేట్ చేస్తారు. బిల్లు చెల్లించిన వెంటనే ఆ మేరకు విద్యుత్ వినియోగించుకునేందుకు అనుమతిస్తూ సిమ్‌కార్డుకు సమాచారం చేరుతుంది. సిమ్‌కార్డు నెల అద్దె రూ.19. అయితే నిర్వహణ వ్యయం కింద ఈ మొత్తాన్ని మీటర్ల కంపెనీలు భరించనున్నాయి. మరెన్నో ప్రయోజనాలు కూడా.. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఏ ఇంట్లో/ఆఫీసులో కరెంటు ఉంది, ఎక్కడెక్కడ విద్యుత్ సరఫరా లేదన్న సమాచారం డిస్కంలకు వెంటనే తెలిసిపోతుంది. సాంకేతిక సమస్యలతో సరఫరా నిలిచిపోతే... వినియోగదారులు ఫిర్యాదు చేయకపోయినా డిస్కంలు స్పందించి సరఫరాను పునరుద్ధరించే వెసులుబాటు కలుగుతుంది. ఏ వినియోగదారుడు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నాడో తెలుస్తుం ది. తద్వారా విద్యుత్ డిమాండ్‌ను కచ్చితంగా అంచనా వేయవచ్చు. బిల్లు కట్టకపోతే అంతే.. ప్రభుత్వ కార్యాలయాలు సక్రమంగా విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల మొండి బకాయిలు రూ.2,020 కోట్లదాకా పేరుకుపోయాయి. దీనికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లను అమర్చాలని సీఎం కేసీఆర్ నాలుగు నెలల కింద డిస్కంలను ఆదేశించారు. ఈ మీటర్లను బిగించిన తర్వాత అడ్వాన్స్‌గా బిల్లులు చెల్లించకపోతే సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అయితే అత్యవసర సమయాల్లో ప్రీపెయిడ్ మీటర్‌పై ఉండే ఒక ప్రత్యేక బటన్‌ను నొక్కితే మరో 24 గంటల పాటు పూర్తి విద్యుత్ సరఫరా ఉంటుంది. అప్పటికీ బిల్లు చెల్లించకపోయినా మరో 72 గంటల పాటు 20శాతం విద్యుత్ మాత్రమే సరఫరా అవుతుంది. అంటే ఏసీల వంటి ఉపకరణాలను వినియోగించుకోలేరు. ఆ తర్వాత విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. ప్రీపెయిడ్ మీటర్ల వ్యయాన్ని సంబంధిత వినియోగదారుల నుంచే వసూలు చేయాలని డిస్కంలు భావిస్తున్నాయి. వాయిదాలుగా వసూలు చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. -
వేధించడానికి 30 ఫోన్లు మార్చాడు!
అదే సంఖ్యలో సిమ్‌కార్డులు వినియోగం ఎట్టకేలకు షీ-టీమ్‌కు చిక్కిన నిందితుడు మరో కేసులో ఓ విద్యార్థికీ అరదండాలు సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ ప్రబుద్ధుడు సంక్షిప్త సందేశాల ద్వారా ఓ వివాహితను వేధించడానికి ఏకంగా 30 సెల్ఫోన్లు మార్చాడు. అదే సంఖ్యలో సిమ్కార్డులూ వినియోగించాడు. చివరకు విషయం షీ-టీమ్స్‌కు చేరడంతో బుధవారం పట్టుబడి కటకటాల్లోకి చేరాడు. ఇతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు) స్వాతి లక్రా వెల్లడించారు. ఇదే తరహా నేరానికి పాల్పడిన మరో నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు ఓ మైనర్‌నూ అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ చేసినట్లు ఆమె వివరించారు. అంబర్పేట్ పరిధిలోని లాల్బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సాజిద్ హుస్సేన్ ఫైబర్ ఆప్టిక్స్ కంపెనీలో ఉద్యోగి. అదే ప్రాంతంలో నివసించే ఓ వివాహితను వేధించడం ప్రారంభించిన ఇతగాడు దీనికోసం వివాహితకు సంబంధించిన అసభ్య వ్యాఖ్యలు, పరుష పదజాలంతో ఆమె భర్త, అత్తమామల సెల్ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపాడు. దీనికోసం దాదాపు 30 సెకండ్ హ్యాండ్ సెల్ఫోన్లు, అదే సంఖ్యలో బోగస్ వివరాలతో తీసుకున్న సిమ్‌కార్డులు వాడాడు. ఓ సెల్ఫోన్లో సిమ్‌కార్డు వేసి ఈ చర్యలతో వివాహిత కుటుంబ జీవితం ఇబ్బందుల పాలైంది. విసిగిపోయిన బాధితురాలు షీ-టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన పోలీసులు బుధవారం సాజిద్ హుస్సేన్ ను బాధ్యుడిగా గుర్తించాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న షీ-టీమ్స్ అతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అంబర్పేట్ పోలీసులకు అప్పగించాయి. సాజిద్ వినియోగించిన ఫోన్లన్నీ వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైనవిగా గుర్తించిన పోలీసులు అవి అతడి దగ్గరకు ఎలా వచ్చాయనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్షాకోట్ ప్రాంతానికి చెందిన కె.శ్రీశైలం విద్యార్థి. ఓ యువతిపై వేధింపులు ప్రారంభించిన ఇతగాడు ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులకూ అసభ్యపదజాలంతో కూడిన ఎస్సెమ్మెస్‌లు పంపాడు. యువతిని బెదిరిస్తూ కొన్ని ఈ-మెయిల్స్ చేశాడు. ఈ కేసునూ పర్యవేక్షించిన షీ-టీమ్స్ బుధవారం శ్రీశైలాన్ని అరెస్టు చేసి పెట్టీ కేసు నమోదు చేశాయి. నగరానికి చెందిన ఓ మైనర్ పరిచయస్థురాలైన బాలిక ఫొటోలు ఫేజ్‌బుక్‌లో పెట్టడంతో పాటు ఆమె తండ్రికీ ఆన్లైన్లో పంపిస్తూ వేధించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మైనర్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్న షీ-టీమ్స్ అతడి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి, భవిష్యత్తులో పునరావృతం కాకూడదని హెచ్చరించి విడిచిపెట్టారు.