సిమ్స్‌లో ముగిసిన ఆర్థోపెడిక్ సదస్సు
Published Mon, Jul 25 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
పుట్టపర్తి అర్బన్: సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్(సిమ్స్) ప్రశాంతి గ్రాంలో రెండు రోజులు అంతర్జాతీయ ఆర్థోపెడిక్ సదస్సు ఆదివారం ఘనంగా ముగిసింది. సదస్సులో దేశ, విదేశాలకు చెందిన 100 మంది ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు పాల్గొన్నారు. తుంటె ఎముకల మార్పిడి, పిన్న వయస్కుల్లో వాటి పునర్నిర్మాణం, సత్యసాయి ఆదర్శాల మేరకు వైద్య విధానం, వైద్యరంగంలో మానవతా విలువలు, ఆధ్యాత్మికత అన్న అంశాలపై సదస్సు సాగింది. సదస్సులో ప్రత్యక్ష శస్త్రచికిత్సల ప్రదర్శన, విశ్లేషణ, వర్క్‌షాప్‌లు, మేధావుల ఉపన్యాసాలు సాగాయి. సదస్సులో ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్.జిమ్ సులివన్,చండీగఢ్‌కు చెందిన డాక్టర్ రమేష్‌సెన్, హర్యాణాకు చెందిన మగు, బెంగళూరుకు చెందిన మధుకేష్ ఉపన్యసించారు. సదస్సు ముగిసిన అనంతరం నిపుణులు ప్రశాంతి నిలయంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
Advertisement