సత్యసాయి వైద్య సేవలు భేష్‌ | sims services bhesh | Sakshi
Sakshi News home page

సత్యసాయి వైద్య సేవలు భేష్‌

Published Mon, Jun 19 2017 12:29 AM | Last Updated on Tue, Sep 5 2017 1:56 PM

sims services bhesh

= ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
   ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య
పుట్టపర్తి టౌన్‌: సత్యసాయి వైద్య సంస్థల్లో రోగులకు అందుతున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య అభినందించారు. ఆదివారం ఆమె పుట్టపర్తిలోని సత్యసాయి జనరల్‌ , సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలను విభాగాల వారిగా పరిశీలించారు.  అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య పరికరాలు, వాటి నిర్వహణ తీరుపై అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.  

భవిష్యత్తులో ప్రభుత్వ వైద్య సిబ్బంది నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇక్కడ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించేందుకు కృషి చేస్తామన్నారు. సత్యసాయి వైద్య సంస్థల్లో అత్యాధునిక వైద్య పరికరాలతో ఉచిత వైద్యాన్ని అందించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అనంతరం ఆమె కొత్తచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, సిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌.గురుమూర్తి, వైద్యులు రమేశ్‌ నాథ్, జగన్నాథం, నాగరాజునాయక్, వైద్య సిబ్బంది కోటేశ్వర్‌రావు, లింగారామమోహన్, అజీజ్‌ఖాన్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement