
న్యూఢిల్లీ: సిమ్ కార్డుల అక్రమ వినియోగాన్ని అరికట్టే దిశగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ ఆధార్ నంబర్‌పై ఎన్ని సిమ్ కార్డులు జారీ అయ్యాయో తెలుసుకునే అవకాశాన్ని కస్టమర్లకు ఈ నెల 15 నాటికి కల్పించాలని అన్ని టెలికం కంపెనీలను ఆదేశించింది. ఇతరులు ఎవరైనా తమ పేరిట అక్రమంగా వినియోగిస్తుంటే దీని ద్వారా కస్టమర్లకు తెలుసుకునే అవకాశం లభించనుంది.
కొంత మంది రిటైలర్లు, టెలికం ఆపరేటర్లు, కంపెనీల ఏజెంట్లు ఆధార్ ఆథెంటికేషన్‌ను దుర్వినియోగం చేస్తూ, వాస్తవ ఆధార్ కార్డుదారుడి పేరిట వేరొకరికి సిమ్ కార్డులు జారీ చేయడం, ధ్రువీకరణ చేస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో యూఐడీఏఐ ఈ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment