యువతులపై ఆకతాయిల ఆగడాలు | Young people sexual abuse on womens | Sakshi
Sakshi News home page

యువతులపై ఆకతాయిల ఆగడాలు

Published Fri, Mar 24 2017 10:56 PM | Last Updated on Wed, Aug 1 2018 2:36 PM

యువతులపై ఆకతాయిల ఆగడాలు - Sakshi

యువతులపై ఆకతాయిల ఆగడాలు

ఆధారాల్లేని సిమ్‌లను ఉపయోగించి లైంగిక వేధింపులు

తోటపల్లిగూడూరు : గుర్తుతెలియని యువకులు ప్రూప్‌ లు లేని సిమ్‌లను వినియోగిస్తూ ఫోన్ల ద్వారా యువతులను, మహిళలను లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. మండలంలోని నరుకూరు, సాలిపేట, మహాలక్ష్మీపురం సెంటర్ల పరిధిలో ఇలాంటి ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని మొబైల్‌ షాపుల నిర్వాహుకులు అత్యాశకు పోతూ ఎలాంటి ప్రూప్‌లు లేకపోయినా అధిక ధరతో సిమ్‌ కార్డులను విక్రయిస్తున్నారు. అలా ప్రూప్‌లు లేని సిమ్‌లను తీసుకునే కొందరు ఆకతాయిలు ఫోన్లలో యువతలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ నెల 20న రాత్రి నరుకూరు సెంటర్‌కు చెందిన ఓ యువతి (19)కి కొందరు ఆకతాయిలు 8008702817, 9966541870, 9573306361 నంబర్ల నుంచి ఫోన్లు చేసి అసభ్యకరంగా ప్రవర్తించారు.

నీవెవరిని అడిగిన ఆ యువతి పెద్దలను సైతం ఆ గుర్తుతెలియని యువకుడు నానా దుర్భషలాడాడు. ఈ నెల 21న సాలిపేటకు చెందిన మరో మహిళకు ఓ ఆకతాయి రెండు వేరు వేరు నంబర్ల నుంచి ఫోన్లు చేసి పత్రికల్లో రాయలేని భాషలో మాట్లాడాడు. దీంతో తమకు ఫోన్లు వచ్చిన ఈ నంబర్ల వివరాలను సేకరించేందుకు వారు ప్రయత్నించినా అవి ప్రూప్‌లు లేని సిమ్‌లు కావడంతో వారి వివరాలు తెలియరాలేదు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుండటంతో కొత్త నంబర్ల నుంచి ఫోన్లు వస్తే తీసేందుకు మహిళలు భయాందోళలను గురికావాల్సి వస్తోంది. ఇలా ప్రూప్‌లు లేని సిమ్‌లను వినియోగించే ఆకతాయిలతో పాటు ఆ సిమ్‌లను విక్రయించే మొబైల్‌ షాపులపై చర్యలు తీసుకోవాల్సి స్థానికులు పోలీస్‌ శాఖను కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement