రోడ్డుపై కూతురిని అలా చూసి ఒక్కటిచ్చింది.. | Angry mother slaps daughter for participating in a flash mob | Sakshi
Sakshi News home page

రోడ్డుపై కూతురిని అలా చూసి ఒక్కటిచ్చింది..

Published Sun, Mar 27 2016 7:50 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM

రోడ్డుపై కూతురిని అలా చూసి ఒక్కటిచ్చింది..

రోడ్డుపై కూతురిని అలా చూసి ఒక్కటిచ్చింది..

అది కేరళలోని కన్నూరు నగరంలో పయ్యనూరు బస్టాండ్ ప్రాంతం. కొంతమంది కాలేజీ విద్యార్థులు కలసి అక్కడికి వచ్చారు. అందరూ కలసి హుషారుగా డాన్స్ (ఫ్లాష్ మాబ్) చేస్తున్నారు. అక్కడున్న జనం గుమిగూడి వారిని ఆసక్తిగా చూస్తున్నారు. ఆ ప్రాంతంలో సందడి నెలకొనడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ఇంతలో ఓ మహిళ అక్కడికి వచ్చింది. విద్యార్థుల గ్రూపులోని ఓ అమ్మాయిని చూడగానే ఆగ్రహం చెందింది. వెంటనే వేగంగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి లాగి చెంపదెబ్బ కొట్టింది. దీంతో అక్కడున్న విద్యార్థులతో పాటు వారి డాన్స్ను చూస్తున్నవారందరూ షాక్ తిన్నారు. తక్షణం అక్కడ నుంచి రావాలంటూ ఆమె తిట్టింది. అక్కడున్న వారు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె కోపం చల్లారలేదు. మహిళ కొట్టిన అమ్మాయి ఎవరో కాదు. ఆమె కూతురు! సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.

ఇంతకీ కూతురును  ఎందుకు కొట్టిందనే విషయంపై సోషల్ మీడియాలో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఫ్లాష్ మాబ్తో తన కూతురు పాల్గొనడం ఇష్టంలేకనే అలా ప్రవర్తించిందన్నది ఓ వాదన కాగా, ట్రాఫిక్ అంతరాయం కలిగించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారన్న కోపంతో కూతురును కొట్టిందనేది మరో వాదన.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement