సాధారణంగా పెళ్లైన జంట తమ వివాహ జీవితం విజయవంతంగా పూర్తి అయినా కొన్నేళ్లకు లేదా 60 ఏళ్లకు షష్టి పూర్తి చేసుకుంటారు. ఆ సమయంలో తమ జీవిత భాగస్వామినే మరోసారి మనువాడటం చూస్తుంటాం. కానీ ఇక్కడోక జంట విచిత్రంగా తమ కూతుళ్ల ఆర్థిక భవిష్యత్తు కోసం మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈ మార్చి 8నే మళ్లీ వివాహం చేసుకోనుంది ఆ జంట. ఈ విచిత్ర ఘటన కేరళలోని కాసరగోడ్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..నటుడు, న్యాయవాది సి షుకుర్ మహాత్మ గాంధీ విశ్వవిద్యాలయంలో మాజీ వైస్‌ఛాన్సలర్ అయిన తన భార్య షీనాను మళ్లీ పెళ్లి చేసుకోనున్నారు. అది కూడా ప్రత్యేక వివాహ మార్గంలో ఈ జంట మరోసారి ఒక్కటి కానుంది. ఎందుకంటే ముస్లీం వారసత్వ చట్టాల ప్రకారం తండ్రి ఆస్తిలో మూడింట రెండొంతులు మాత్రేమే కుమార్తెలకు చెందుతుంది. అలాగే వారసుడు లేనిపక్షంలో మిగిలిని ఆస్తి మొత్తం సోదరులకు చెందుతుంది . దీంతో ఈ జంట ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం తమ వివాహాన్ని నమోదు చేసుకుని ఆ పరిస్థితిని మార్చుకోవాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో వారు చూసిన రెండు ఘటనలు కారణంగా తన కుమార్తెలకు అలా జరగకకూడదని భావించి ఇలా నిర్ణయం తీసుకున్నట్లు షుకూర్ చెబుతున్నాడు.
అలాగే షరియా చట్టం ప్రకారం వీలునామాను అలా వదిలేయడాన్ని అనుమతించదు కూడా. దీంతో ఆందోళన చెంది తాము ఇలా చేశామని చెప్పారు ఆ జంట. ఆడపిల్లలుగా పుట్టినందుకు తన కుమార్తెలు ఇలాంటి వివక్ష ఎదుర్కొనక తప్పదు. అందుకు దీని నుంచి బయటపడటానికి ఏకైక మార్గం ప్రత్యేక వివాహం చట్టం ద్వారా పెళ్లి చేసుకోవడమేనని చెప్పారు. ఇది కేవలం ముస్లీం కుటుంబాలలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న లింగ వివక్షతను అంతం చేయడానికేనని చెప్పారు. ఇది ఆడపిల్లలు ఆత్మవిశ్వాసం, గౌరవంతో బతికేలా చేసేందుకు దోహదపడుతుందని నమ్మకంగా చెప్పారు.
అలాగే షరియా చట్టాలను దిక్కరించేందుకు ఇలా నిర్ణయం తీసుకోలేదని నొక్కి చెప్పారు. చాలామంది కేవలం ఆడపిల్లలు ఉన్న ముస్లీం కుటుంబాలు ఈ విషయమై కలత చెందడమేగాక తాము పడుతున్న కష్టాన్ని వెళ్లబోసుకునే వారని అన్నారు షుకుమార్. కాగా, అక్టోబరు 6, 1994న నిఖా జరిగిన ఈ జంట ఈ ఏడాది మార్చి 8న కాసరగోడ్ జిల్లా హోస్‌దుర్గ్ తాలూకాలోని కన్హంగాడ్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ కుమార్తెల సమక్షంలో తిరిగి వివాహం చేసుకోనున్నట్లు షుకూర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
(చదవండి: మేఘాలయ, నాగాలాండ్ ముఖ్యమంత్రులు నేడు ప్రమాణ స్వీకారం)
Comments
Please login to add a commentAdd a comment