Marriage Act
-
మహిళల కనీస వివాహ వయసు 21 ఏళ్లు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఇకపై మహిళల కనీస వివాహ వయసు 21 ఏళ్లు. నిర్దేశిత వయసు కంటే తక్కువ వయసున్న మహిళలకు పెళ్లి చేస్తే నేరం అవుతుంది. మహిళ కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. ఈ మేరకు బాల్య వివాహాల నిషేధ చట్టం–2006 స్థానంలో బాల్య వివాహాల(హిమాచల్ ప్రదేశ్) నిషేధ సవరణ–2024 చట్టం తీసుకొచ్చారు. 2006 నాటి చట్టం ప్రకారం మహిళల కనీస వివాహ వయసు 18 ఏళ్లు కాగా, పురుషుల కనీస వివాహ వయసు 21 ఏళ్లుగా ఉంది -
పెళ్లీడు పెరిగింది.. తెలంగాణ అమ్మాయిల సగటు వయసు ఎంతంటే..?
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఒకప్పుడు ఎక్కువగా బాల్యవివాహాలు జరిగినా కొన్నేళ్లుగా సమాజంలో వచ్చిన మార్పులతోపాటు ప్రభుత్వాలు ఆడపిల్లల చదువులకు సైతం అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆ పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అమ్మాయిలు సైతం అబ్బాయిలతో సమానంగా ఉన్నత విద్యను అభ్యసిస్తుండటంతో దేశంలో అతివల సగటు పెళ్లిళ్ల వయసు పెరుగుతోంది. నేటికీ అక్కడక్కడా బాల్య వివాహాలు, నగరాల్లో లేటు వయసులో యువతుల పెళ్లిళ్లు జరుగుతున్నప్పటికీ రిజి్రస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం వివాహ వయసులపై జరిపిన జాతీయ నమూనా సర్వేలో దేశవ్యాప్తంగా మహిళల సగటు వివాహ వయసు 22.7 ఏళ్లుగా వెల్లడైంది. 2020లో ఈ సర్వే జరిగినప్పటికీ వాటి విశ్లేషణ ఆలస్యమైంది. అందుకు సంబంధించిన గణాంకాలను ఆ కార్యాలయం ఇటీవల విడుదల చేసింది. (బ్యూటీషియన్ మృతి.. చక్రవర్తి స్పృహలోకి వస్తేనే అసలు విషయం తెలిసేది?) దేశ సగటు కంటే తెలంగాణ మెరుగు... జాతీయ నమూనా సర్వే గణాంకాలను పరిశీలిస్తే 2017 నాటికి దేశంలో మహిళల వివాహ సగటు వయసు 22.1 ఏళ్లుకాగా 2020 నాటికి అది 22.7 ఏళ్లకు చేరింది. ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మహిళలు వివాహం చేసుకొనే వయసు ఆధారపడి ఉన్నందున వివిధ రాష్ట్రాల మధ్య సగటు వయసులో స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి. వివాహ సగటు వయసుకు సంబంధించి తెలంగాణ గణాంకాలను పరిశీలిస్తే పట్టణ ప్రాంతాల్లో 2020 నాటికి 24.3 ఏళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 22.8 ఏళ్లుగా తేలింది. సగటున 23.5 ఏళ్లకు తెలంగాణ మహిళలు వివాహాలు చేసుకుంటున్నారని జాతీయ నమూనా సర్వే వెల్లడించింది. దక్షిణ తెలంగాణతోపాటు తమిళనాడు మహిళలకు కొంత ఆలస్యంగా వివాహాలు జరుగుతున్నాయని ఈ సర్వేలో తేలింది. మరోవైపు దేశంలోనే అత్యధికంగా సగటున 26 ఏళ్లకు కశీ్మర్ మహిళలు వివాహాలు చేసుకుంటుండగా జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతులు మాత్రం సగటున 21 ఏళ్లలోపే మాంగల్య బంధంలోకి అడుగు పెడుతుండటం గమనార్హం. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో గ్రామీణ మహిళల కంటే పట్టణ ప్రాంతాల్లోని మహిళలు కొంత ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్నారని జాతీయ నమూనా సర్వే వెల్లడించింది. 21 ఏళ్లకు పెంచేందుకు బిల్లు దేశంలోని మహిళల చట్టబద్ధ కనీస వివాహ వయసు ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉండగా దాన్ని పురుషుల చట్టబద్ధ కనీస వివాహ వయసు అయిన 21 ఏళ్లకు సమానంగా పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి బాల్య వివాహాల నిషేధ సవరణ బిల్లును తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వద్ద పరిశీలనలో ఉంది. అయితే దేశంలో కనీస వివాహ వయసును మార్చాలంటే కేంద్రం 6 చట్టాలకు సవరణలు చేయాల్సి ఉంది. ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్–1872, ది పార్సీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్–1936, ద ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్–1937, ది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్–1954, ది హిందూ మ్యారేజ్ యాక్ట్–1955, ది ఫారిన్ మ్యారేజ్ యాక్ట్–1969లను సవరించాల్సి ఉంటుంది. చదవండి: 165 ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఎలా? -
కూతుళ్ల కోసం మళ్లీ పెళ్లి చేసుకుంటున్న జంట..ఓ తండ్రి గొప్ప నిర్ణయం..
సాధారణంగా పెళ్లైన జంట తమ వివాహ జీవితం విజయవంతంగా పూర్తి అయినా కొన్నేళ్లకు లేదా 60 ఏళ్లకు షష్టి పూర్తి చేసుకుంటారు. ఆ సమయంలో తమ జీవిత భాగస్వామినే మరోసారి మనువాడటం చూస్తుంటాం. కానీ ఇక్కడోక జంట విచిత్రంగా తమ కూతుళ్ల ఆర్థిక భవిష్యత్తు కోసం మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈ మార్చి 8నే మళ్లీ వివాహం చేసుకోనుంది ఆ జంట. ఈ విచిత్ర ఘటన కేరళలోని కాసరగోడ్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..నటుడు, న్యాయవాది సి షుకుర్ మహాత్మ గాంధీ విశ్వవిద్యాలయంలో మాజీ వైస్‌ఛాన్సలర్ అయిన తన భార్య షీనాను మళ్లీ పెళ్లి చేసుకోనున్నారు. అది కూడా ప్రత్యేక వివాహ మార్గంలో ఈ జంట మరోసారి ఒక్కటి కానుంది. ఎందుకంటే ముస్లీం వారసత్వ చట్టాల ప్రకారం తండ్రి ఆస్తిలో మూడింట రెండొంతులు మాత్రేమే కుమార్తెలకు చెందుతుంది. అలాగే వారసుడు లేనిపక్షంలో మిగిలిని ఆస్తి మొత్తం సోదరులకు చెందుతుంది . దీంతో ఈ జంట ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం తమ వివాహాన్ని నమోదు చేసుకుని ఆ పరిస్థితిని మార్చుకోవాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో వారు చూసిన రెండు ఘటనలు కారణంగా తన కుమార్తెలకు అలా జరగకకూడదని భావించి ఇలా నిర్ణయం తీసుకున్నట్లు షుకూర్ చెబుతున్నాడు. అలాగే షరియా చట్టం ప్రకారం వీలునామాను అలా వదిలేయడాన్ని అనుమతించదు కూడా. దీంతో ఆందోళన చెంది తాము ఇలా చేశామని చెప్పారు ఆ జంట. ఆడపిల్లలుగా పుట్టినందుకు తన కుమార్తెలు ఇలాంటి వివక్ష ఎదుర్కొనక తప్పదు. అందుకు దీని నుంచి బయటపడటానికి ఏకైక మార్గం ప్రత్యేక వివాహం చట్టం ద్వారా పెళ్లి చేసుకోవడమేనని చెప్పారు. ఇది కేవలం ముస్లీం కుటుంబాలలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న లింగ వివక్షతను అంతం చేయడానికేనని చెప్పారు. ఇది ఆడపిల్లలు ఆత్మవిశ్వాసం, గౌరవంతో బతికేలా చేసేందుకు దోహదపడుతుందని నమ్మకంగా చెప్పారు. అలాగే షరియా చట్టాలను దిక్కరించేందుకు ఇలా నిర్ణయం తీసుకోలేదని నొక్కి చెప్పారు. చాలామంది కేవలం ఆడపిల్లలు ఉన్న ముస్లీం కుటుంబాలు ఈ విషయమై కలత చెందడమేగాక తాము పడుతున్న కష్టాన్ని వెళ్లబోసుకునే వారని అన్నారు షుకుమార్. కాగా, అక్టోబరు 6, 1994న నిఖా జరిగిన ఈ జంట ఈ ఏడాది మార్చి 8న కాసరగోడ్ జిల్లా హోస్దుర్గ్ తాలూకాలోని కన్హంగాడ్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ కుమార్తెల సమక్షంలో తిరిగి వివాహం చేసుకోనున్నట్లు షుకూర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. (చదవండి: మేఘాలయ, నాగాలాండ్ ముఖ్యమంత్రులు నేడు ప్రమాణ స్వీకారం) -
'ప్రేమంటే ప్రేమే!' ఆ బిల్లుపై తక్షణమే గర్వంగా సంతకం చేస్తా: జో బైడెన్
అమెరికా సెనేట్ స్వలింగ, కులాంతర వివాహాలను రక్షించడానికి సంబంధించిన కీలక బిల్లును ఆమోదించింది. ఈ బిల్లుకు 12 మంది రిపబ్లికన్లతో సహా 61 మంది సభ్యుల్లో దాదాపు 36 మంది సభ్యుల ఆమోదం లభించింది. ఈ మేరకు సెనేట్ మెజారిటీ లీడర్ చక్ షుమేర్ మాట్లాడుతూ...ఈ చట్టం చాలా కాలంగా వస్తోంది కానీ ఇప్పుడే ఆమోదం లభించింది. స్వలింగ, వర్ణాంతర వివాహాలను సమాఖ్య చట్టంలో పొందుపరిచేలా చేసింది ఈ బిల్లు. అమెరికా నిష్కళంకమైన సమానత్వం వైపు అడుగులు వేసేలా కీలకమైన బిల్లును ఆమెదించిందని అన్నారు. ఈ బిల్లు ప్రకారం యూఎస్ ఫెడరల్ ప్రభుత్వం ఇద్దరు వ్యక్తుల వివాహం చేసుకుంటే అది ఆ రాష్ట్రంలో చెల్లుబాటు అయితే కచ్చితంగా దాన్ని గుర్తించాలి. అలాగే యూఎస్ రాజ్యంగా ఆయా రాష్ట్రాల్లో జరిగిన వివాహాల గుర్తింపుకు పూర్తి హామీ ఇస్తోంది. అంతేగాక యూఎస్ రాష్ట్రాలు తమ చట్టాలకు విరుద్ధంగా వివాహా లైసెన్స్‌ను జారీ చేయాల్సిన అవసరం ఈ బిల్లుకు లేదు. ద్వైపాక్షిక ఎన్నిక ద్వారా ఈ చట్టాన్ని రూపొందించారు. అంతేగాక స్వలింగ వివాహాలను జరుపుకోవడానికి అవసరమయ్యే వస్తువులు లేదా సేవలను అందించడానికి ఇష్టపడని సంస్థలకు మతపరమైన రక్షణను అందించే సవరణ కూడా ఉంది. ఈ బిల్లు మతస్వేచ్ఛ పునరుద్ధరణ చట్టం రక్షణను తగ్గించడం లేదా రద్దు చేయడం వంటివి చేయకుండా నిరోధించే నిబంధనను కలిగి ఉంది. జూలైలో ఆమోదించిన ఈ బిల్లుపై యూఎస్ అధ్యక్షుడు జోబైడెన్ సంతకం చేసే విధంగా ఈ చట్టాన్ని రూపొందించింది. సెనేట్ నవంబర్‌లో ఎన్నికల రోజు, జనవరిలో అధికారం చేపట్టే కొత్త చట్టసభల మధ్య ఈ బిల్లును ఆమోదించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ....ఈ ద్వైపాక్షిక ఓటును ప్రశంసించడమే కాకుండా సెనేట్ ఈ బిల్లును ఆమోందించనట్లయితే గర్వంగా ఆ బిల్లుపై సంతకం చేస్తాను. స్వలింగ సంపర్కులైన యువత తాము పూర్తి సంతోషకరమైన జీవితాలను గడిపి, స్వంత కుటుంబాలను రూపొందించుకునేలా ఈ బిల్లు చేస్తోంది. సెనేట్ రెస్పెక్ట్ ఫర్ మ్యారేజ్ యాక్ట్‌ని ఆమెదించడంతో అమెరికా ఒక ప్రాథమిక సత్యాన్ని పునరుద్ఘాటించే అంచున నిలబడి ఉంది. 'ప్రేమనేది ఎప్పటికే ప్రేమే' అమెరికన్లు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకునే హక్కును కలిగి ఉండాలి. అని బైడెన్ అన్నారు. (చదవండి: చిన్నారికి అత్యవసర శస్త్ర చికిత్స...ఆ రక్తం వద్దంటూ కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు) -
సవరణ బిల్లు ఆమోదం పొందే వరకు వివాహ వయసు 18 ఏళ్లే.
సాక్షిహైదరాబాద్: బాల్య వివాహాల నిషేధ సవరణ బిల్లు–2021 ఆమోదం పొందే వరకు ఆడపిల్లల వివాహ వయస్సు 18 సంవత్సరాలు మాత్రమే అమలులో ఉంటుందని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ మహ్మద్ సలీమ్ అన్నారు. హైదరాబాద్ హజ్‌హౌస్‌లో వక్ఫ్ ఖాజీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహాల నిషేధ సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశ పెట్టినా... ఇంకా ఆమోదం పొందలేదని, బిల్లు ఆమోదం పొందిన నాటి నుంచి రెండేళ్ల తర్వాత అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. బాలికల వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచడంతో ఆందోళనకు గురైన కొందరు తల్లిదండ్రులు హడావుడిగా ఆడపిల్లల పెళ్లిళ్లు చేస్తున్నారన్నారు. పార్లమెంటులో బిల్లును ఆమోదించవద్దని అందరూ అభ్యర్ధిస్తున్నారని, దీనిపై ఆందోళన చెందవద్దని సూచించారు. సమావేశంలో ఖాజీలు మహ్మద్ యూసుఫుద్దీన్,సయ్యద్ షా నూరుల్ అస్ఫియా,సయ్యద్ లతీఫ్ అలీ, సయ్యద్ అఫ్జల్ హుస్సేన్, సయ్యద్ నూరుల్లా ఫరూఖ్ తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి వయస్సు పెంపుదల మంచిదే కానీ..
బాల్య వివాహ నిషేధ చట్టం–2006 అమలులో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ తమకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేయవద్దని అమ్మాయిలు తమ తల్లిదండ్రులను నిలదీసి అడగడానికి ఈ చట్టం ఎంతో ప్రేరణనిచ్చిందన్నది వాస్తవం. అదే సమయంలో తమ ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తున్న పెళ్లిళ్లపై నిరసన తెలుపుతూ తమకు నచ్చిన వారితో వెళ్లిపోతున్న అమ్మాయిలను, వారు ఎంపిక చేసుకున్న వరులను శిక్షించడానికి ఈ చట్టం తల్లిదండ్రులకే ఎక్కువ అవకాశం ఇస్తోందన్నది కూడా వాస్తవమే. అంటే వివాహ వయస్సు పెంపుదలలో కంటే సమాజ వైఖరి, విధానాల్లోనే పరిష్కారం దాగుంది. మనుగడ కోసం పెళ్లి తప్పనిసరి అనే జంఝాటం నుంచి బాలికలకు విముక్తి కల్పించాలి. విద్య, ఉపాధి, భద్రతతోపాటు పెళ్లి ఎప్పుడు, ఎవరిని చేసుకోవాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛను వారికి అందించాలి. ఇవన్నీ సాధ్యమైతే పెళ్లాడే వయస్సు దానికదే ముందుకెళుతుంది. భారతీయ మహిళల వివాహ వయస్సును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. ప్రసూతి మరణాల సంఖ్యను, మహిళల్లో పోషకాహార లేమిని తగ్గించడమే తన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ చెప్పుకుంది. కానీ పెళ్లి వయస్సు పెంపుదల అనేది ప్రసూతి మరణాలు, పోషకాహార లేమికి సంబంధించిన సమస్యలను నిజంగానే పరిష్కరిస్తుందా అన్న సందేహం వస్తోంది. పైగా, ప్రసూతి మరణాల సమస్య అన్ని రాష్ట్రాల్లో సమానంగా లేదు. ఈ సమస్య.. చక్కగా పనిచేసే ప్రజారోగ్య మౌలిక వ్యవస్థ, కనీస దారిద్య్ర స్థాయిలు, మెరుగైన ఆహార భద్రత వంటి ఇతర అభివృద్ధి చర్యలతో అనివార్యంగా ముడిపడి ఉంటుంది. మహిళల్లో రక్తహీనత సమస్యను తొలగించేందుకు గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వం చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయని తాజా డేటా, పరిశోధనలు తెలుపుతున్నాయి. ప్రసవ సమయంలో స్త్రీలు మరణించడానికి సాధారణ కారణం ఏమిటంటే, బిడ్డను కన్నప్పుడు లేక ఆ తర్వాత అధికంగా రక్తస్రావం జరగడమే. దేశంలో 50 శాతం మంది మహిళలు రక్తహీనతతో గర్భం దాలుస్తున్నారని తాజా డేటా చెబుతోంది. మహిళలు త్వరగా గర్భం దాల్చడం వల్లే ప్రసవ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని చెప్పలేం. కుటుంబంలో ఆహార కేటాయింపుల విషయంలో బాలికలకంటే బాలురకు ప్రాధాన్యత ఇవ్వడం అనే బలమైన పితృస్వామిక సంప్రదాయాల ఆచరణ కూడా దీనికి దోహదం చేస్తోంది. శారదా చట్టానికి సవరణ చేసి తీసుకొచ్చిన ప్రస్తుత విధానం (బాల్యవివాహ నిరోధక చట్టం 1929 కూడా) అమ్మాయిలకు వివాహ వయస్సును 16 నుంచి 18 సంవత్సరాలకు, అబ్బాయిల వయస్సును 21 సంవత్సరాలకు పెంచుతూ 1978లో నిర్ణయించింది. నాలుగు దశాబ్దాలుగా ఇదే విధానం అమలువుతూ వస్తోంది. అయితే 18 ఏళ్లు దాటకముందే తమ కూతుర్లకు తల్లితండ్రులు పెళ్లిళ్లు చేయకుండా ఈ చట్టం నిరోధించలేకపోయిందన్నది స్పష్టం. అయితే కుటుంబాలు తమ కుమార్తెలకు ముందుగానే వివాహాలు చేస్తున్నందుకు కారణాలు ఎన్నో ఉన్నాయి. నగరప్రాంతాల్లోని పేదలు నివాసముండే ప్రాంతాల్లో తమ కుమార్తెల భద్రత గురించిన భీతి కారణంగా బాల్య వివాహాలు వ్యూహాత్మకంగా జరుగుతుండవచ్చు. అయితే పెళ్లి అనేది భద్రతకు హామీ ఇవ్వనప్పటికీ, అమ్మాయికి పెళ్లి చేశాక, ఆమె బాధ్యత తన భర్తది, అత్తామామలదే అవుతుంది. తర్వాత ఆమె భద్రత కానీ శీలం కానీ పుట్టింటివారికి సంబంధించిన సమస్యగా ఉండదు. వివాహ వయస్సు పెంపు నిర్ణయం సమయంలో ఇలాంటి సాధారణమైన అంశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు. ప్రత్యేకించి మహిళలకు సంబంధించిన సున్నితమైన సంబంధాలను నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వ విధానం చాలా కఠినంగా ఉంటోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని అక్కడి బీజేపీ ప్రభుత్వాలు ఆమోదించాయి. యూపీలో, మధ్యప్రదేశ్‌లో లవ్ జిహాద్‌కు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారు. ఇతర రాష్ట్రాల్లో కూడా వీటిని దూకుడుగా ప్రవేశపెట్టనున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమ్మాయిల పెళ్లి వయస్సును పెంచడం అంటే తమకిష్టమైన విధంగా పెళ్లిని ఎంపిక చేసుకోవడాన్ని వారికి లేకుండా చేయడమే అవుతుంది. వివాహ వయస్సు పెంపుదల మహిళలకు సాధికారత కల్పించి, వారి ప్రాతినిధ్యం పెంచడమే కాకుండా, గర్భధారణ శక్తిపై వారికి నియంత్రణను సాధ్యం చేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. బాల్య వివాహాలకు, బాలికల సాధికారతకు పరిష్కారం వివాహ వయస్సు పెంపుదలలో లేదని మన సమాజంలో చోటు చేసుకుం టున్న మార్పులు సూచిస్తున్నాయి. పైగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా డేటా ప్రకారం 18 సంవత్సరాలకు లోపు పెళ్లాడుతున్న అమ్మాయిల నిష్పత్తి వేగంగా తగ్గుముఖం పడుతోంది. ఇది ఇంకా తగ్గిపోతుందని కూడా సంకేతాలు ఉన్నాయి. బాల్య వివాహ నిషేధ చట్టం 2006 (పీసీఎంఏ) అమలులో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ తమకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేయవద్దని అమ్మాయిలు తల్లిదండ్రులను నిలదీసి అడగడానికి ఈ చట్టం ఎంతో ప్రేరణ నిచ్చిందన్నది వాస్తవం. అదేసమయంలో తమ ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తున్న పెళ్లిళ్లపై నిరసన తెలుపుతూ తమకు నచ్చిన వారితో వెళ్లిపోతున్న అమ్మాయిలను, వారు ఎంపిక చేసుకున్న వరులను శిక్షించడానికి ఈ చట్టం తల్లిదండ్రులకే ఎక్కువ అవకాశం ఇస్తోందన్నది కూడా వాస్తవమే. అంటే వివాహ వయస్సు పెంపుదలలో కంటే సమాజ వైఖరి, విధానాల్లోనే ఈ సమస్యకు పరిష్కారం దాగుందని స్పష్టమవుతోంది. బాలికల విద్యావకాశాలను మరింతగా పెంచడం, హింసకు తావులేని రక్షిత వాతావరణాన్ని, మెరుగైన ఆరోగ్య సేవలను వారికి కల్పించడం, భవిష్యత్తు కోసం వారికి మంచి అవకాశాలు అందించడం వంటి మౌలిక మార్పులకు దోహదం చేసే పరిస్థితులు మన సమాజంలో ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి. అదే సమయంలో మహిళల సామాజిక, ఆర్థిక హోదాను నిర్ణయించడంలో నేటికీ వివాహమే కేంద్రబిందువుగా ఉంటోంది. ఈనాటికీ మన కుటుంబాలు ఆడపిల్లలకు త్వరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించివేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అమ్మాయిలు సైతం పెళ్లి చేసుకోవడమే తమ విధి అనే భావజాలంలోనే పెరుగుతున్నారు. ఆడపిల్లల వయస్సు పెరిగితే, వారు ఎక్కువ చదివితే కట్నం ఎక్కువగా ఇచ్చుకోవలసి వస్తుందనే భీతి కూడా బలవంతపు పెళ్లిళ్లకు, బాల్య వివాహాలకు ప్రధాన కారణమవుతోంది. మహిళలు ఇప్పుడు 18 ఏళ్ల వయసులో పార్లమెంటు సభ్యులు కాగలుగుతున్నప్పుడు, తాము ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనే ఎంపికను వారు నిర్ణయించుకోలేరా అనేది ప్రశ్న. తనకు తగని వ్యక్తిని పెళ్లాడటం ద్వారా అమ్మాయిలు తప్పు చేసినప్పటికీ, ఈ తప్పులను చేసే హక్కు, వాటినుంచి నేర్చుకునే హక్కు వారికి ఉండకూడదా అనేది మరో ప్రశ్న. పెళ్లి అనేది బతికేందుకు ఉపయోగపడే వ్యూహంగా ఉండకూడదు. అయితే దేశంలోని చాలామంది మహిళలు సామాజిక భద్రత లేని దుర్భరపరిస్థితుల్లో ఉంటున్న అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. దేశంలో మహిళలకు ఉద్యోగావకాశాలు లభిస్తున్న దుస్తుల ఫ్యాక్టరీల్లో, పని, ఆరోగ్య రంగంలో కూడా పరిస్థితులు చాలా ప్రాధమిక స్థితిలో మాత్రమే ఉంటున్నాయి. మహిళలకు ఇప్పుడు ఉంటున్న ఉపాధి పరిస్థితులను మెరుగుపర్చి మౌలికంగా మార్పులను తీసుకురావడం, యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడం చేస్తే, మహిళల పెళ్లికి ప్రత్యామ్నాయాలు లభించి వారు ఉత్పాదక రంగంలో ప్రవేశించి అర్థవంతమైన జీవితాలు గడిపే అవకాశం ఉంటుంది. దీనికి బదులుగా ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు, చేసుకోవాలి అనే వ్యాపారంలోకి ఇప్పుడు ప్రభుత్వం నేరుగా దిగినట్లుగా కనిపిస్తోంది. – శ్రీపర్ణ ఛటోపాధ్యాయ్,అసోసియేట్ ప్రొఫెసర్, ఫ్లేమ్ యూనివర్సిటీ (‘ది వైర్’ సౌజన్యంతో) బాధితులనే శిక్షించే చట్టాలతో మార్పు ఎలా? కుటుంబాల్లో, సమాజంలో కొనసాగుతున్న లింగ వివక్ష,, భర్త వైపునుంచి హింస, ఆస్తిపై యాజమాన్యం, సమాన వేతనం వంటివి మహిళలు నేటికీ ఎదుర్కొంటున్న సవాళ్లుగా ఉంటున్నాయి. పైగా అమలవుతున్న చట్టాలు బాధితులను మరింతగా శిక్షించడానికే తప్ప సామాజిక మార్పునకు దారి తీయడం లేదు. బాలికలను చిన్నవయస్సులోనే పెళ్లి చేసుకునేలా ఒత్తిడి చేస్తున్న వ్యవస్థాగత అంశాలను చట్టాలు అసలు పట్టించుకోవు. అందుకే విభిన్న సామాజిక, ఆర్థిక బృందాలు ఉనికిలో ఉంటున్న సమాజంలో చట్టం అనేది ఇప్పటికే సాధికారత కోల్పోయి ఉన్నవారిని శిక్షించే కొలమానంగానే మారుతుండటం విచారకరం. పెళ్లి వయస్సును చట్టం ద్వారా పెంచితే అది బాల్యవివాహాలను నిరోధించడానికి బదులుగా బాధితులను శిక్షించడానికే ఉపయోగపడుతుంది. పైగా అమ్మాయిల పెళ్లి వయస్సును 21 సంవత్సరాలకు పెంచడం అనేది యువతీ యువకులు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే హక్కును తిరస్కరిస్తుంది. ఇష్టపడిన వారిని పెళ్లి చేసుకోవడం అనే యువత హక్కును చట్టం ఎంత భంగపరుస్తోందో మనందరికీ తెలుసు. ఏ సమాజానికైనా చట్టం అవసరమే. కానీ సామాజిక బృందాలను శిక్షించడం కాకుండా వారికి సహకారం అందించే చట్టాలు మనకు అవసరం. బాల్యవివాహాల సమస్యను పరిష్కరించడానికి చట్టం మాత్రమే ప్రధాన సాధనంగా ఉండరాదు. వివాహం విషయంలో యువతకు భద్రత, సాధికారత కలిగించే వాతావరణాన్ని సృష్టించడంపై యావత్ సమాజం దృష్టి పెట్టాలి. బాలబాలికలను అణిచిపెడుతున్న నిర్బంధపూరితమైన లైంగికత స్థానంలో బాధ్యతాయుతమైన లైంగిక ప్రవర్తనను పెంచాలి. బాలికల వివాహ వయస్సును పొడిగించడంతోనే సమస్యకు పరిష్కారం లభించదు. గ్రామీణ సమాజంలోని అననుకూలతల నుంచి బాలికలను బయటపడేసి, వారికి తగినన్ని వనరులు, అవకాశాల కల్పనతో సాధికారతవైపు నడిపించాలి. సామాజిక, ఆర్థికపరంగా మనుగడ కోసం పెళ్లి తప్పనిసరి అనే జంఝాటం నుంచి బాలికలకు విముక్తి కల్పించాలి. విద్య, ఉపాధి, భద్రత, చలనశీలతతోపాటు పెళ్లి ఎప్పుడు, ఎవరిని చేసుకోవాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛను వారికి అందించాలి. ఇవన్నీ సాధ్యపడినప్పుడు పెళ్లాడే వయస్సు దానికదే పెరుగుతూ పోతుంది. కానీ ఈ విషయాన్ని వినేదెవ్వరు? ప్రభుత్వం అయితే అసలు వినదనేది స్పష్టం. మనదేశంలో 18 ఏళ్ల వయస్సులో ఓటు వేయడం, కాంట్రాక్టు మీద సంతకం చేయడం, బతకడానికి పని ప్రారంభించడం సాధ్యపడుతున్నప్పుడు ఎవరిని పెళ్లిచేసుకోవాలో నిర్ణయించే శక్తి వారికి లేదని చెప్పడం వింతల్లోకెల్లా వింతే. – ఈనాక్షీ గంగూలీ, మానవహక్కుల కార్యకర్త -
మహిళా వివాహ వయసు పెంపు.?
-
Women's Legal Marriage Age: పెళ్లి వయసు పెంచితే సరిపోతుందా?
సాక్షి, హైదరాబాద్: దేశంలో అమ్మాయిల వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే చట్ట సవరణను తీసుకురానుంది. అయితే ఈ నిర్ణయంపై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది బాలికల ఉన్నత విద్యకు దోహదపడుతుందని, మహిళల ఆరోగ్యానికి, సంక్షేమానికి దారి తీస్తుందని భావిస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా మరికొంతమంది కూడా వాదిస్తున్నారు. భారతదేశంలో, చట్టబద్ధమైన వివాహ వయస్సు ప్రస్తుతం బాలికలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 సంవత్సరాలుగా ఉంది. అయితే చాలామంది అమ్మాయిలకు 18 ఏళ్ల కంటే ముందే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. చిన్న తనంలోనే గర్భం దాల్చడం, అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన వెంటనే లేదా అంతకుముందే ఆడబిడ్డలకు పెళ్లి చేస్తే చిన్నతనంలోనే బరువు బాధ్యతలను భుజాన కెత్తుకోవడంతో మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అభిప్రాయ పడింది. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుందనీ, తల్లి పిల్లల ఆరోగ్యానికి ఇదొక వరం అని పేర్కొంది. అలాగే తమ అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడం వలన ఉన్నత చదువులు చదువు కోవాలన్న తమ కల సాకారం కావడంలేదని వాపోతున్న బాలికలు చాలామందే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 15-19 సంవత్సరాల వయస్సు బాలికల మరణాలకు చిన్న వయసులోనే గర్భం, ప్రసవ సమస్యలు ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. 20-24 సంవత్సరాల వయస్సు గల స్త్రీల కంటే 10-19 సంవత్సరాల వయస్సు గల తల్లులు ఎక్లాంప్సియా, ప్రసవ ఎండోమెట్రిటిస్, ఇతర ఇన్ఫెక్షన్ల లాంటి ప్రమాదాలను ఎదుర్కొంటారు. వివాహం ఆలస్యం చేయడం వల్ల పిల్లలకు కూడా మేలు జరుగుతుందని, తక్కువ బరువుతో ఉన్న పిల్లలు పుట్టడం, తీవ్రమైన నియోనాటల్ ప్రమాదం తగ్గుతుందని చెబుతోంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వారు కూడా లేకపోలేదు. 21 ఏళ్ల లోపు అన్ని వివాహాలను చెల్లుబాటుకావు అని ప్రకటిస్తే మరింత ముప్పే అంటున్నారు. ఆడపిల్లల చదువుకు, అనారోగ్యానికి అసలు సమస్యల్ని గుర్తించి, వాటికి సరైన పరిష్కారాల్ని అన్వేషించకుండా చట్టబద్ధంగా పెళ్లిని వాయిదా వేయడంపై ఫెమినిస్టులు, ఇతర మహిళా ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేశారు. తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు ఇది మార్గం కాదని వాదిస్తున్నారు. సీపీఎం నాయకురాలు కవితా కృష్ణన్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇది మహిళల స్వయంప్రతిపత్తిని మరింత దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. ఆరోగ్య సంరక్షణ, విద్యకు సరైన ప్రాప్యత లేని గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ-ఆదాయ కుటుంబాలలో ముందస్తు వివాహాలు ఎక్కువగా జరుగుతాయని సెంటర్ ఫర్ ఉమెన్స్ డెవలప్మెంట్ స్టడీస్ పరిశోధకురాలు మేరీ ఇ. జాన్ చెప్పారు. పట్టణాలతో పోలిస్తే , గ్రామీణ స్త్రీలు, యువతులు ఎక్కువ పోషకాహార లోపంతో ఉన్నారని పేర్కొన్నారు. ఇక్కడ కీలక అంశం పేదరికమే తప్ప, వయస్సు కాదన్నారు. సంపద, విద్య వంటి సామాజిక-పర్యావరణ కారకాలు నియంత్రించ గలిగినపుడు కౌమారదశలోని తల్లులు మరణాల రేటు కూడా నియంత్రణలో ఉంటుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనం పేర్కొంది. 18 సంవత్సరాల వయస్సులో ఉన్న యువతి రక్తహీనతతో బాధపడితే, సరైన చికిత్స లేకపోతే, 21 సంవత్సరాల వయస్సులో కూడా అదే రక్తహీనతతో బాధపడతారన్నారు. పేదరికం, ఆరోగ్య రక్షణ లేనపుడు వివాహ వయస్సును కొన్ని సంవత్సరాలు పెంచడంవల్ల ప్రయోజనం అంతంతమాత్రమే అనేది వారి వాదన. అంతేకాదు ఈ నిర్ణయం కొత్త సమస్యలను సృష్టించవచ్చు. యువకులు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవడంలో మరిన్ని ఇబ్బందులు, యువతుల వ్యక్తిగత జీవితాల్లో తల్లిదండ్రుల పట్టును మరింత పెరుగుందనే మరో అభిప్రాయం. ముఖ్యంగా ప్రేమ కోసం వివాహం చేసుకునే కులాంతర, మతాంతర జంటలపై మరింత ఒత్తిడి పెరుగుతుందని, కుటుంబ సభ్యుల నుండి హింస బెదిరింపులు తప్పవని హెచ్చరిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుండి వేధింపులు, ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ నుండి తప్పించుకోవాలనే ఉద్దేశంతో వివాహం చేసుకోవడానికి 18 ఏళ్లు నిండకముందే ఇంటి నుండి పారిపోయే జంటలపై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు దారి తీస్తుంది. పెళ్ళి వయసు పెంచినంత మాత్రాన బాల్య వివాహాలు ఆగిపోతాయనేది భ్రమ మాత్రమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా సమాజంలో, కుటుంబంలో మహిళల పట్ల చులకన భావం పోవాలి. బాలికల మీద వివక్ష, ఆడ,మగ బిడ్డలమధ్య తారతమ్యాలు పూర్తిగా సమసిపోయేలా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. అలాగే అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నత విద్యను అభ్యసించేందుకు, ఆర్థిక స్వాతంత్ర్యంతో ఎదిగేలా తల్లితండ్రులు ప్రోత్సాహాన్నందించాలి. రెండవ తరగతి పౌరురాలిగా కాకుండా మహిళలకు, యువతులకు చట్టబద్ధమైన అన్ని హక్కులు అమలు అయినపుడు మాత్రమే మహిళా సాధికారత సాధ్యం అనేది పలువురి వాదన. -
ఆ లేఖలే అమ్మాయిల నుదుటి రాతల్ని మార్చాయి
‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక’ అన్నారు ప్రజాకవి కాళోజీ. కేంద్రం మహిళల వివాహ వయసును పెంచడానికి జయా జైట్లీ నేతృత్వంలో 2020 జూన్ నాలుగున టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అయితే, కేంద్రంలో కదలిక తీసుకొచ్చే ప్రయత్నానికి బీజం వేసింది మాత్రం కొందరు యువతుల పోస్ట్‌కార్డ్ రాతలే!. చదవండి: 21 ఏళ్లు వచ్చాకే అమ్మాయి పెళ్లి పాట్నా (బీహార్) వాసి సోనమ్ కుమారి, హిసార్(హరియాణా)కు చెందిన 16 ఏళ్ల పూనమ్ మిథర్వాల్ లాంటి అమ్మాయిలు చేపట్టిన పోస్ట్‌కార్డ్ ఉద్యమం కేంద్రం నిర్ణయాన్ని ప్రభావితం చేసిన అంశాల్లో ఒకటని చెప్పొచ్చు. 19 ఏళ్ల సోనమ్‌కు ఇంట్లో వాళ్లు పెళ్లిచేయబోయారు. చదువుతానని, ఇప్పుడే పెళ్లి వద్దని నచ్చజెప్పినా వారు ససేమిరా అన్నారు. ఒత్తిడిని తట్టుకోలేక సోనమ్ ఈ ఏడాది ఆగస్టులో ఇంటిని వదిలి ఢిల్లీకి వెళ్లింది. ఉద్యోగం చేస్తూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదువును కొనసాగిస్తోంది. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా వివాహ వయసు 21 ఏళ్లకు పెంచాలని ప్రధాని మోదీకి ఆగస్టులోనే లేఖ రాసింది. చదవండి: పెళ్లికి అమ్మాయి కనీస వయసు పెంపు! మన దగ్గరే ఇలాగనా? సోనమ్ సంధించిన లేఖ హరియాణాలో ఏంతోమంది బాలికలను ఆలోచింపజేసింది. నిశ్శబ్ద ఉద్యమం మొదలైంది. వందలాది మంది బాలికలు ప్రధానికి లేఖలు రాశారు. పూనమ్ ఆగస్టులో ఒకరోజు కాలేజీ ముగిశాక నేరుగా పోస్ట్ ఆఫీసుకు వెళ్లింది. ఆమెతో పాటే మరో ఆరుగురు స్నేహితురాళ్లు కూడా. ‘మోదీ జీ.. అమ్మాయిల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచండి’ అని పోస్ట్‌కార్డుపై హిందీలో చాలా క్లుప్తంగా తమ విజ్ఞప్తికి అక్షర రూపమిచ్చారు. ‘నా స్నేహితురాళ్లు, తెలిసిన వాళ్లలో చాలామందికి 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేసేసి పంపించి వేశారు వాళ్ల కుటుంబసభ్యులు. చదువు మాన్పించారు. వివాహ వయసు పెంచితే తల్లిదండ్రులను ఒప్పించి ఉన్నత చదువులు కొనసాగించడానికి వీలుంటుంది’ అని పూనమ్ వాదన. –నేషనల్ డెస్క్, సాక్షి -
21 ఏళ్లు వచ్చాకే అమ్మాయి పెళ్లి
న్యూఢిల్లీ: దేశంలో మహిళల కనీస వివాహ వయసును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో మహిళల కనీస వివాహ వయసు పురుషులతో సమానమవనుంది. స్త్రీ, పురుషుల కనీస వివాహ వయసును సమానం చేసి 21 ఏళ్లుగా నిర్ణయించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం అంగీకారం తెలిపిందని, ఈ శీతాకాల సమావేశాల్లో సంబంధిత సవరణ బిల్లు తేవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమ్మాయిల పెళ్లి వయసు పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, స్త్రీల ఆరోగ్య పరిరక్షణకు, శిశువులను పౌష్టికాహార లేమి నుంచి కాపాడేందుకు అమ్మాయిల పెళ్లి వయసును పెంచడం అవసరమని గత ఏడాది స్వాతంత్య్రదిన ప్రసంగంలో ప్రధాని మోదీ చెప్పారు. ఈ విషయంపై అధ్యయనానికి సమతా పార్టీ మాజీ చీఫ్ జయా జైట్లీ అధ్యక్షతన గత ఏడాదే నలుగురు సభ్యుల కమిటీని ప్రభుత్వం నియమించింది. డిసెంబర్లో ఈ కమిటీ సిఫార్సులను కేంద్రానికి సమర్పించగా, వీటి పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ప్రతి రంగంలో లింగ సమానత్వం, సాధికారత పెంచాలని భావించేటప్పుడు స్త్రీ కనీస వివాహ వయసును 18 ఏళ్లకు పరిమితం చేయడం సబబు కాదని జయా జైట్లీ అభిప్రాయపడ్డారు. 18 ఏళ్ల పరిమితి వల్ల పలువురు మహిళలు కాలేజీలకు వెళ్లే అవకాశం కోల్పోతున్నారని, పురుషులకు 21 ఏళ్ల వరకు స్వీయ సంసిద్ధత సాధించేందుకు అవకాశం ఉందన్నారు. పురుషుడితో సమానంగా స్త్రీలకు అవకాశాలు కల్పించాలంటే అమ్మాయిల కనీస వివాహ వయసును 21కి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై పలువురి అభిప్రాయాలు స్వీకరించామని, వివాహ వయసు పెంపు ప్రతిపాదనకు మతాలకతీతంగా స్త్రీ సమాజం నుంచి అధిక సానుకూలత వచ్చిందన్నారు. యూనివర్శిటీలు, కాలేజీలు, గ్రామీణ ప్రాంతాల్లోని అమ్మాయిలతో మాట్లాడామని వివరించారు. ఈ సంఘంలో నీతీ ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, విద్యావేత్తలు నజ్మా అఖ్తర్, వసుధా కామత్, దీప్తీ షా తదితరులున్నారు. నిపుణుల ఆందోళన వివాహ వయసు పెంచాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు అంటున్నారు. వయసు పెంపు ప్రతిపాదనను చట్టబద్ధం చేయడంతో 21 ఏళ్లకు లోపు చేసే వివాహాలు శిక్షార్హమవుతాయని, దీంతో కలిగే దుష్పరిణామాలు, 18 ఏళ్లకు పెళ్లి చేయడం వల్ల కలిగే నష్టాల కన్నా అధికమని ఆక్స్‌ఫామ్ ఇండియాకు చెందిన అమితా పిత్రే అన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ప్రకారం సమాజంలో చిన్న వయసులో చేసే వివాహాల శాతం 23 శాతానికి (27 నుంచి) తగ్గిందన్నారు. ఇటీవల కాలంలో పలు అగ్ర, మధ్యతరగతి కుటుంబాల్లో చాలామంది ఆడపిల్లలు 21 ఏళ్లు దాటిన చాన్నాళ్లకు పెళ్లాడుతున్నారన్నారు.అనేక సమాజాల్లో సగానికిపైగా వివాహాలు 21 ఏళ్లకు ముందే అవుతున్నాయని, దీన్ని ఒక్కమారుగా శిక్షార్హం చేయడం సమాజంలో అలజడకి కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. చట్ట సవరణ చేయడం.. మూలకారణాలను వదిలి లక్షణాలకు చికిత్స చేసినట్లని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. శతాబ్దాలుగా ఉన్న అలవాటు ఒక్కమారుగా పోదంది. అసమానత్వం, పేదరికం, విద్యా వైద్య లేమి, ఉపాధి అవకాశాల కొరత లాంటి పలు అంశాలు బాల్య, చిన్నవయసు వివాహాలకు కారణమని తెలిపింది. ఈ చట్టాలకు సవరణ! మహిళల కనీస వివాహ వయసును మార్చేందుకు ప్రభుత్వం బాల్య వివాహాల నిరోధ చట్టం (పీసీఎంఏ)– 2006కు సవరణలు తీసుకువస్తుంది. పీసీఎంఏలో స్త్రీ, పురుషుల కనీస వివాహ హక్కు వరుసగా 18, 21 ఏళ్లుగా నిర్ణయించారు. తాజా నిర్ణయంతో పీసీఎంఏతో పాటు స్పెషల్ మ్యారేజ్ (సివిల్) యాక్ట్–1954, హిందూ మ్యారేజ్ యాక్ట్–1955కు సైతం మార్పులు చేయాల్సి ఉంటుందని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో హిందువులు, బౌద్దులు, జైనులు, సిక్కుల వివాహల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నిబంధనలుంటాయి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మతంతో సంబంధం లేకుండా భారతీయులందరికీ వర్తించే నిబంధనలుంటాయి. –నేషనల్ డెస్క్, సాక్షి -
కలెక్టర్ వీరంగం : తప్పు చేశా నన్ను క్షమించండి !
అగర్తలా: ఓ పెళ్లి మంటపానికి వెళ్లి వీరంగం సృష్టించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న త్రిపుర పశ్చిమ జిల్లా కలెక్టర్ శైలేష్ కుమార్ తనను విధుల నుంచి వైదొలగించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి రతన్‌లాల్ నాథ్ మీడియాకు వెల్లడించారు. తనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు నిష్పక్షపాతంగాగా జరగాలంటే తనను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించాలని కలెక్టర్ శైలేష్ కుమార్ సీఎస్‌కు రాసిన లేఖలో పేర్కొన్నట్లు రతన్‌లాల్ తెలిపారు. త్రిపుర పశ్చిమ జిల్లా కలెక్టర్ శైలేష్‌కుమార్ యాదవ్ ఏప్రిల్ 26న అగర్తాలాలో ఓ వివాహం జరగాల్సి ఉండగా.. అక్కడకు వెళ్లి వీరంగం సృష్టించారు. వరుడు, వధువు, అతిథులతో పాటు, అక్కడే ఉన్న పురోహితులపై చేయిచేసుకున్నారు. కనిపించిన వారిపై చిర్రుబుర్రులాడారు. కలెక్టర్ చిందులు తొక్కుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై బ్రాహ్మణ సమాజ్ సంఘం నేతలు, వివిధ సామాజిక సంస్థలు, మానవ హక్కుల నేతలు, ప్రముఖ సింగర్ సోను నిగంలు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. శైలేష్ కుమార్ యాదవ్‌ను సస్పెండ్ చేయాలని సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. దీంతో త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్ ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. విచారణకు హాజరు కావాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో విచారణకు హాజరైన శైలేష్ కుమార్ మాట్లాడుతూ.. 'కరోనా నిబంధనల్ని ఉల్లంఘించినందుకే చర్యలు తీసుకున్నా. చట్టాన్ని అమలు చేయడం నా కర్తవ్యం. నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించండి’’ అంటూ యూటర్న్ తీసుకున్నారు. కాగా, ప్రస్తుతం త్రిపుర పశ్చిమ జిల్లా కలెక్టర్ గా ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డైరెక్టర్ రావెల్ హమేంద్ర కుమార్ డీఎమ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. వైరల్: అతిథిలా వచ్చిన కలెక్టర్.. వధూవరులపై కేసు నమోదు -
స్వలింగ వివాహాలపై మీ వైఖరేంటి?
న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలపై తమ స్పందనను తెలియజేయాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రంతోపాటు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక వివాహ చట్టం కింద తమ వివాహం చేసుకునేందుకు అనుమతించాలని ఒక జంట, అమెరికాలో జరిగిన తమ పెళ్లిని విదేశీ వివాహ చట్టం కింద భారత్‌లో నమోదు చేయాలని ఇంకో జంట వేర్వేరుగా వేసిన పిటిషన్లపై జస్టిస్ ఆర్.ఎస్. ఎండ్లా, జస్టిస్ ఆషా మీనన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహం చేసుకుంటామని ప్రతిపాదించిన మహిళలు ఇద్దరు ఆ చట్టంలో స్వలింగ వివాహాలకు తగిన నిబంధనలు లేకపోవడాన్ని సవాలు చేశారు. మరోవైపు అమెరికాలో వివాహం చేసుకుని రాగా విదేశీ వివాహ చట్టం కింద తమ వివాహాన్ని నమోదు చేయకపోవడాన్ని ఇద్దరు పురుషులు సవాలు చేశారు. కేసు తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 8వ తేదీకి వాయిదా పడింది. అయితే వివాహం చట్టాలు స్వలింగ వివాహాలకు అనుమతి ఇవ్వవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రత్యేక, విదేశీ వివాహ చట్టాలు రెండింటిలోనూ వివాహానికి నిర్వచనం లేకున్నా సంప్రదాయక చట్టాల ప్రకారం దాన్ని అర్థం చేసుకుంటారని వివరించింది. దీన్ని పిటిషన్‌దారులు సవాలు చేయాలని భావిసే,్త ఇప్పుడే చేయాలని స్పష్టం చేసింది. అయితే.. పిటిషన్‌దారులు సంప్రదాయ, మత చట్టాల కింద గుర్తింపు కావాలని కోరడం లేదని, కులాంతర, మతాంతర వివాహాలను గుర్తించే పౌర చట్టాల (ప్రత్యేక, విదేశీ వివాహ చట్టాలు) కింద మాత్రమే గుర్తింపు కోరుతున్నారని పిటిషన్‌దారుల తరఫు న్యాయవాది మేనక గురుస్వామి వాదించారు. ఇదే తొలిసారి.. ఐదు వేల ఏళ్ల సనాతన ధర్మ సంప్రదాయంలో ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం ఇదే తొలిసారి అని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన రాజ్‌కుమార్ యాదవ్ బెంచ్‌కు నివేదించారు. ఇందుకు బెంచ్ బదులిస్తూ... చట్టాల్లోని భాష ఏ ఒక్కరివైపో (పురుషులు, మహిళలు) సూచించడం లేదని, దేశ పౌరులందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చట్టాన్ని అర్థం చేసుకోవాలని చెప్పింది. పిటిషన్లు రెండూ ప్రకృతికి విరుద్ధమైనవి కావని అనగా కేంద్రం తరఫు మరో న్యాయవాది కీర్తిమాన్ సింగ్ అంగీకరించారు. తాము ఎనిమిదేళ్లుగా కలిసి జీవిస్తున్నామని, కష్టసుఖాలన్నింటినీ పంచుకుంటున్నామని.. కానీ ఇద్దరూ మహిళలమే (ఒకరి వయసు 47, ఇంకొరిది 36) అయినందున పెళ్లి మాత్రం చేసుకోలేకపోతున్నామని పిటిషన్‌దారులైన ఇద్దరు మహిళలు తమ పిటిషన్లో పేర్కొన్నారు. పెళ్లి కాని కారణంగా మిగిలిన జంటల్లాగా సొంతిల్లు, బ్యాంక్ అకౌంట్ తెరవడం, కుటుంబ బీమా తదితరాలను పొందలేకపోతున్నామని వాపోయారు. ఆర్టికల్ 21 ద్వారా పౌరులకు సంప్రదించే హక్కు స్వలింగ దంపతులకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు అమెరికాలో జరిగిన తమ వివాహాన్ని భారత కాన్సులేట్ విదేశీ వివాహ చట్టం కింద నమోదు చేయలేదని, ఇతర జంటల మాదిరిగానే తమ వివాహాన్ని కూడా భారత కాన్సులేట్ గుర్తించి ఉండాల్సిందని పురుష పిటిషన్‌దారులు ఇద్దరూ పేర్కొన్నారు. 2017లో జరిగిన తమ వివాహాన్ని గుర్తించకపోవడం కారణంగా కోవిడ్–19 కాలంలో దంపతులుగా కలిసి ప్రయాణించేందుకు, తమ కుటుంబాలతో కలిసి ఉండేందుకు ప్రతిబంధకంగా మారిందన్నారు. భారత కాన్సులేట్ నిర్ణయం ఆర్టికల్ 14, 15, 19, 21లను అతిక్రమించిందని ఆరోపించారు. -
మహిళల వివాహ వయసు పెంపుపై కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ : మహిళల చట్టబద్ధ వివాహానికి అర్హమైన వయసును పున:పరిశీలిస్తామని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మహిళల వివాహానికి కనీస వయసు 18 సంవత్సరాలు కాగా తాజా ప్రతిపాదనను సమీక్షించేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. బాలికల్లో తల్లయ్యే సామర్థ్యం, వివాహ వయసు- శిశు జనన సంబంధ మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్), సంతాన సాఫల్యం వంటి అంశాలను పరిశీలించేందుకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. వివాహానికి కనీస వయసును పొడిగిస్తే బాలికలు తమ విద్యాభ్యాసాన్ని పూర్తిచేయడంతో పాటు వివాహం, పిల్లల బాధ్యతలను తలకెత్తుకునేందుకు శారీరకంగా, మానసికంగా సంసిద్ధమయ్యే వెసులుబాటు లభిస్తుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సైతం యోచిస్తోంది. చదవండి : డిజిటల్ హెల్త్ మంచిదే కానీ.. ఇక ఈ నిర్ణయంతో జనాభా పెరుగుదలనూ కట్టడి చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది భవిష్యత్‌లో మహిళల ప్రసవంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. సంతాన ప్రాధాన్యాలను, గర్భవతిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల పెంపకంపై సాధికార నిర్ణయాలు తీసుకునే పరిణితి మహిళలకు సమకూరుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. చట్టబద్ధ వివాహ వయసును పెంచడం మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం, సాధికారతకు దారితీయడంతో పాటు సరైన జీవిత భాగస్వామిని ఎంచుకునే అవకాశం ఉంటుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఈ నిర్ణయం మహిళతో పాటు, పిల్లల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని, మహిళల సామాజికార్థిక ఎదుగుదలకు దోహదం చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
రిజిస్ట్రేషన్‌తో పెళ్లికి చట్టబద్ధత
సాక్షి, ఇందూరు(నిజామాబాద్ అర్బన్): వివాహం చేసుకున్న వారంతా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పెళ్లికి చట్టబద్ధత లభిస్తుందని కలెక్టర్ రామ్మోహన్రావు తెలిపారు. అందుకే గ్రామపంచాయతీలతో పాటు మున్సిపాలిటీల్లో వివాహ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు చెప్పారు. వివాహ చట్టం–2002 అమలుకు సంబంధించి ఆయన బుధవారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. వివాహం చేసుకునే వారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, తద్వారా చట్టబద్ధత లభిస్తుందని తెలిపారు. వివాహ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల పలు ప్రయోజనాలు కలుగుతాయని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలకు ఉపయోగపడుతుందన్నారు. బాల్య వివాహాలను అరికట్టవచ్చని, ఒక పెళ్లి తరువాత మరో పెళ్లి చేసుకునే వారిని గుర్తించి అడ్డుకోవచ్చని తెలిపారు. దంపతులు విడిపోతే భరణం పొందటానికి కీలకంగా మారుతుందని వివరించారు. ఒకవేళ తప్పుడు సమాచారంతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వారికి జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష పడుతుందన్నారు. వివాహ చట్టం–2002 ప్రకారం గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్లో మున్సిపల్ కమిషనర్, జిల్లా స్థాయిలో కలెక్టర్ రిజిస్ట్రేషన్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని గ్రామ పంచాయతీలకు వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలను, దరఖాస్తు ఫారాలను, రిజిస్టర్‌ను ప్రతి గ్రామ పంచాయతీకి పంపిస్తున్నట్లు చెప్పారు. వివాహాలు చేసుకున్న వివరాలు ఆ రిజిస్టర్లో నమోదు చేసి ప్రతి నెలా నివేదికలు పంపాలని అధికారులకు సూచించారు. పెళ్లి జరిగిన నెల రోజుల్లోగా దంపతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, నెల దాటి 60 రోజుల్లోగా రూ.100 ఫీజుతో రిజిస్ట్రేషన్ చేస్తారన్నారు. పెళ్లి సమయంలో కూడా రిజిస్టర్ చేయించడానికి ముందుగా సమాచారం అందిస్తే రిజిస్ట్రేషన్ అధికారి వచ్చి వివరాలు తీసుకుని రిజిస్టర్ చేస్తారని తెలిపారు. డీసీపీ ఉషా విశ్వనాథ్, ఐసీడీఎస్ అధికారిణి ఝాన్సీ, డీపీఓ జయసుధ, సంబంధిత శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
వివాహ చట్టంతో సమన్యాయం
సాక్షి, మహబూబ్‌నగర్ : వివాహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోవాలని జిల్లా లీగర్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. వివాహ నమోదు చట్టం–2002పై ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో డీడబ్ల్యూఓ జి.శంకరాచారి అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటి కార్యదర్శి చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేవాలయాలు, ప్రార్థన మందిరాలలో జరిగిన వివాహాలకు సంబంధించి వారు జారీ చేసిన వివాహ ధ్రువీకరణ పత్రాలు రిజిస్టేషన్ నిమిత్తం సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ చట్టం ద్వారా ఎవరు ఎవరిని మోసం చేసేందుకు అవకాశం లేకుండా ఉంటుందన్నారు. అమ్మాయికీ, అబ్బాయికి రెండో వివాహం చేసుకునేటప్పుడు మొదటి వివాహానికి సంబంధించి విడాకులు తీసుకున్నారా లేదా అన్న వివరాలు తెలుసుకునేందుకు వీలుకలుగుతుందని అన్నారు. ఎవరైనా మొదటి వివాహానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేకుండా రెండో వివాహం చేసుకుంటే ఈ చట్టం ద్వారా చర్య తీసుకోవచ్చని చెప్పారు. 30రోజుల్లోపు రిజిష్ట్రేషన్ చేసుకోవాలి డీడబ్ల్యూఓ శంకరాచారి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్, గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు రిజిస్ట్రేషన్ అధికారులుగా ఉంటారని వివాహ తేదీనుంచి 30 రోజులలోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. వరుడి, వధువులకు సంబంధించిన పూర్తి సమాచారం నమోదు చేయాల్సి ఉంటుందని అన్నారు. వివాహ చట్టం గురించి పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, వివాహం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ప్రభుత్వం చేపట్టిన పథకాలు పొందుటకు అవకాశం కలుగుతుందని అన్నారు. మహిళలకు భదత్ర ఈ చట్టం ద్వారా మహిళలకు వ్యక్తిగత భద్రత లభిస్తుందని, బహుభార్యత్వాన్ని నిలువరించడానికి, విడాకులు పొందకుండా రెండో వివాహం చేసుకునేందుకు, ఎవరిని మోసగించుటకు అవకాశం లేకుండా ఉంటుందని అన్నారు. మహిళా శక్తి కేంద్రం కోఆర్డినేటర్ అరుణ మాట్లాడుతూ వివాహం రిజిస్ట్రేషన్ చేయించునేటప్పుడు నిర్లక్ష్య ధోరణితో, ఉద్దేశ పూర్వకంగా, మోసపూరితంగా తప్పుడు సమాచారం అందిస్తే వారికి రూ.వెయ్యి జరిమానా, ఏడాది జైలుశిక్ష ఉంటుందని తెలిపారు. వివాహ రిజిస్ట్రేషన్ నిమిత్తం దరఖాస్తు వచ్చిన తర్వాత అధికారులు నిర్లక్ష్యం వహిస్తే రూ.వెయ్యి జరిమానా, మూడు నెలల జైలుశిక్ష ఉంటుందని సూచించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన దరఖాస్తులపై పంచాయతీ కార్యదర్శులు వారి స్థాయిలో ప్రాథమిక విచారణ జరిపించాలని అన్నారు. పథకాలు పొందే అవకాశం వివాహ రిజిస్ట్రేషన్ చట్టంపై వివిధ మత పెద్దలు మాట్లాడారు. ఈ చట్టం ద్వారా పేదలకు ప్రభుత్వం అందించే అన్ని పథకాలు పొందే అవకాశం ఉం టుందని, విదేశాలకు వెళ్లేందుకు జారీ చేసే పాస్‌పోర్టు పొందేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటుందని తెలిపారు. ఈ సదస్సులో మున్సిపల్ కమిషనర్ సురేందర్‌తో పాటు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, సీడీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
అమ్మాయి, అబ్బాయి ఇద్దరికీ 18 ఏళ్లు చాలు!!
సాక్షి, న్యూఢిల్లీ : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని పదే పదే చెబుతున్నా ఆ దురాచారం మాత్రం కనుమరుగవడం లేదు. పెళ్లి అంటే ఏమిటో కూడా తెలియని వయసులోనే బాల్యం ‘ముళ్ల’ బారిన పడుతోంది. ఈ నేపథ్యంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు, అసమానతలు తొలగించేందుకు లా కమిషన్ సరికొత్త ప్రతిపాదనలు రూపొందించింది. మతాలకతీతంగా యువతీ, యువకులిద్దరికీ కనీస వివాహ వయస్సును 18 సంవత్సరాలుగా నిర్ణయించాలని అభిప్రాయపడింది. ఈ మేరకు పర్సనల్ లాలో చేపట్టాల్సిన సంస్కరణల ఆవశ్యకతను వివరిస్తూ... కన్సల్టేషన్ పేపర్‌ను శుక్రవారం విడుదల చేసింది. ప్రజాప్రతినిధులను ఎన్నుకునే సామర్థ్యం ఉన్నపుడు... ‘ స్త్రీ పురుష భేదం లేకుండా.. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ పద్దెనిమిదేళ్లకే ఓటు హక్కు కల్పించింది. మరి ఆ వయసులో ప్రభుత్వాన్ని ఎన్నుకునే సామర్థ్యం ఉన్నపుడు జీవిత భాగస్వామిని ఎన్నుకునే సామర్థ్యం ఉన్నట్టేగా. లింగ భేదం లేకుండా అన్ని విషయాల్లో స్త్రీ పురుషులిద్దరికీ హక్కులు కల్పించినపుడే సమానత్వ హక్కు పరిపూర్ణం అవుతుందని’ లా కమిషన్ పేర్కొంది. ‘అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు వివాహ వయస్సుగా నిర్ణయించడం ద్వారా భర్తల కంటే భార్యలు ఎప్పుడూ చిన్న వయస్సులోనే ఉండాలనే భావన బలంగా నాటుకుపోయింది. తద్వారా స్త్రీ, పురుష సమానత్వానికి భంగం కలిగినట్లే కదా’ అని కమిషన్ నివేదించింది. బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నట్లే కదా... సమానత్వ భావన ఆవశ్యకతను వివరిస్తూ...‘ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్- 1954 ప్రకారం అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు ఉండాలి. కానీ ఈ చట్టంలోని 11, 12 సెక్షన్ల ప్రకారం భార్యాభర్తల్లో ఒకరికి వివాహానికి కనీస వయస్సు లేకపోయినా ఆ వివాహం చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. అదే విధంగా గార్డియన్షిప్ చట్టాల ప్రకారం భార్యకు గార్డియన్‌గా భర్తే ఉండాలి. మరి అటువంటి సమయంలో భర్త మైనర్ అయితే పరిస్థితి ఏంటి?. అలాగే గర్భవిచ్ఛిత్తి చట్టం- 1972లోని సెక్షన్ 3లో.. తప్పని పరిస్థితుల్లో గర్భవిచ్ఛిత్తి చేయవలసి వచ్చినపుడు భార్య మైనర్ అయితే భర్త అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు’ ... ఈ చట్టాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నారా అనే భావన కలుగుతోంది. కాబట్టి వీటన్నింటిలో సవరణలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని లా కమిషన్ పేర్కొంది. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా ఉమ్మడి పౌర స్మృతిలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కమిషన్ గుర్తుచేసింది. -
‘స్వేచ్ఛా ప్రతిమ’...
అమెరికా నిర్వచనం చెప్పమంటే స్వేచ్ఛ ‘ప్రతిమ’ రూపంలో ఉన్న ఒక దేశం అన్నారట ఎవరో. షెర్రీ జాన్సన్ వంటి వారి గాథలు వింటే ఆ మాట నిజమే అనిపిస్తుంది. నాగరికతకు మారుపేరుగా నిలిచిన అగ్రదేశంలో బాల్యవివాహాలకు చట్టబద్ధత ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. తల్లిదండ్రులు, జడ్జి సమ్మతి ఉంటే చాలు అక్కడి చట్టాల ప్రకారం మైనర్లు కూడా పెళ్లి చేసుకోవచ్చు. అయితే ఇలాంటి చట్టాల వల్ల కొంతమంది అమ్మాయిలు తాము కలలోనైనా ఊహించలేని పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది. ఆ కోవకు చెందిన వారే షెర్రీ జాన్సన్. ఎనిమిదేళ్ల ప్రాయం మొదలు పలుమార్లు అత్యాచారానికి గురై, తల్లిగా మారి, పదకొండేళ్ల వయస్సులో అత్యాచారం చేసినవాడినే పెళ్లిచేసుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నారు. తల్లి కోసం కన్నీళ్లను దిగమింగారు. కష్టాలను మౌనంగా భరించారు. కానీ ఇక అలా ఉండటం ఆమెకు నచ్చలేదు. తనకు జరిగిన అన్యాయం మరే ఆడపిల్లకు జరగకూడదని, బాల్య వివాహాలను నిషేధించాలని పోరాటం చేస్తున్నారు. ఈ న్యాయపోరాటంలో ఆమెకు ఎంతో మంది తోడ్పాటునందిస్తున్నారు. వారిలో దక్షిణ ఫ్లోరిడా సెనేటర్లు లారెన్ బుక్, లిజ్బెత్ బెనాక్విస్తో(సెనేట్‌లో బాల్య వివాహాలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టారు) ముందున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన మీ టూ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, లైంగిక హింసకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఇక్కడ విశేషమేమిటంటే వారు కూడా షెర్రీ మాదిరిగానే బాల్యాన్ని కోల్పోయి, వేధింపులకు గురైనవారే. ఆమె బాల్యం... అంతులేని విషాదం షెర్రీ కథ వింటే కళ్లు చెమర్చకమానవు. ఫ్లోరిడాలోని టంపా సిటీలో తల్లితో పాటు చర్చ్ ఆవరణలోని గదిలో నివసించేది. వారిద్దరూ వారానికి ఆరు రోజులపాటు చర్చిలో సేవ చేసేవారు. చర్చి పెద్దలు చెప్పినట్లుగా నడుచుకువాలనే ఎన్నో నిబంధనల నడుమ ఆమె బాల్యం మొదలైంది. బాల్యానికి సంబంధించి తల్లి చేసే బిస్కెట్లు తింటూ, కలర్ పెన్సిళ్లతో డ్రాయింగ్ చేయడం వంటి అతికొన్ని ఙ్ఞాపకాలు మాత్రమే ఆమెకు మిగిలాయి. మిగతాదంతా అసలు ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలుసుకోలేని పసిప్రాయంలో ఆమె గోడు వినేవారే కరువయ్యారు. వల వేసి.. వంచించి భోజనం చేయాలంటే చర్చ్ బిషప్ ఇంటిలో నివసించే తన ఆంటీ ఇంటికి ప్రతిరోజూ వెళ్లాల్సిందే. ఈ క్రమంలో షెర్రీపై కన్నేసిన బిషప్ ఆమె ఆంటీ లేని సమయం చూసి అత్యాచారం చేసాడు. అప్పుడు ఆమె వయస్సు ఎనిమిదేళ్లు. అసలు అతను ఎందుకు అలా ప్రవర్తించాడో అర్థం చేసుకోలేని పసిప్రాయం. క్రూర మృగాళ్లు.. బిషప్తో పాటు, అతని సహాయకుడు కూడా షెర్రీని బలాత్కారం చేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని తల్లికి చెప్పాలని షెర్రీ ఎన్నోసార్లు ప్రయత్నించినా అరణ్యరోదనగానే మిగిలింది. తన మాటలు తల్లి పట్టించుకోకపోవడంతో ఎదిగే క్రమంలో అత్యాచారానికి గురౌవడం కూడా ఒక భాగమనే నిర్ణయానికి వచ్చింది పాలబుగ్గల షెర్రీ. తోటి విద్యార్థులంతా నీ దగ్గర చేపల వాసన వస్తుందంటూ గేలి చేస్తుంటే కుమిలి కుమిలి ఏడ్వడం కూడా ఆమెకు అలవాటయింది. బడిలో బయటపడిన నిజం.. విద్యార్థుల సాధారణ చెకప్‌లో భాగంగా షెర్రీని కూడా పరీక్షించి బయటకు వెళ్లమని చెప్పింది నర్స్. కాసేపటి తర్వాత వస్తువులన్నీ తీసుకుని బయటకు రావాల్సిందిగా షెర్రీని ఆదేశించింది స్కూలు యాజమాన్యం. ఆమె తల్లికి ఫోన్ చేసి, ఇంటికి తీసుకువెళ్లాలని కోరారు. కూతురు ఏం తప్పు చేసిందోనని కంగారుగా స్కూలుకు చేరిన తల్లికి తాను చేసిన తప్పేమిటో అప్పుడు అర్థమయింది. పదేళ్ల షెర్రీ ఏడు నెలల గర్భవతి అని తెలుసుకుని నిర్ఘాంతపోయింది, కూతురిని నిందించింది. పేగు బంధం.. కనుమరుగైన వేళ కూతురు గర్భానికి కారణం బిషప్ అనుచరుడని చర్చిలో ఉన్నవారందరికీ తెలిసేలా చేసి, ప్రసవం కోసం మరో మృగాడు బిషప్తో షెర్రీని దూరంగా పంపివేసింది ఆమె తల్లి. అమ్మతనానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది. బాల్యానికి సంకెళ్లు.. ఆదరించి, ఆలనాపాలనా చూసుకునే తల్లి పక్కనలేక, శరీరంలో వస్తున్న మార్పులకు కారణం చెప్పేవారు లేక హాస్పిటల్ బెడ్‌పై నరకయాతన అనుభవించింది షెర్రీ. 1970లో పదేళ్ల పసిప్రాయంలో తన మొదటి బిడ్డకి జన్మనివ్వడంతో చదువుకోవాలనే ఆమె ఆశకు సంకెళ్లు పడ్డాయి. అక్కున చేర్చుకోవాల్సింది పోయి.. కూతురుకి ఈ గతి పట్టించిన మగాళ్లకు శిక్ష పడేలా చేయాల్సిన షెర్రీ తల్లి, ఆమె బాల్యాన్ని వివాహమనే బందీఖానాలో పడేసేందుకు ప్రయత్నాలు చేసింది. అత్యాచారం చేసిన వాడినే పెళ్లి చేసుకోవాలని బలవంతపెట్టింది. కోర్టు ఇందుకు నిరాకరించినా చట్టాన్ని అడ్డు పెట్టుకుని కూతురి బాల్యాన్ని, బతుకుని చిదిమేసింది. అలా పదకొండేళ్ల ప్రాయంలో 20 ఏళ్ల వ్యక్తికి భార్యగా మారింది షెర్రీ. ఆనాడు కోర్టులో తల్లికి, జడ్జికి జరిగిన సంభాషణ ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతుందని 58 ఏళ్ల షెర్రీ చెప్తుందంటే ఆమె ఎంత క్షోభ అనుభవించిందో అర్థం చేసుకోవచ్చు. అంతటితో ఆగలేదు.. కూతురి పెంపకంలో షెర్రీకి, ఆమె తల్లి సాయం చేస్తుండటం వల్ల మళ్లీ స్కూలుకు వెళ్లే అవకాశం దక్కింది. కానీ ఆమె భర్త నుంచి విముక్తి మాత్రం లభించలేదు. ఒకరి తర్వాత ఒకరికి జన్మనివ్వడమే షెర్రీ నిరంతర కర్తవ్యంగా మారింది. ఏ ప్రేమకు నోచుకోలేదు.. పదేళ్ల ప్రాయం నుంచే పిల్లల డైపర్లు వాష్ చేస్తూ, వారి ఆలనా పాలనా చూస్తూ గొడ్డు చాకిరీ చేసేది. తన పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూంటే తాను వారితో ఆడుకుంటూ కోల్పోయిన బాల్యాన్ని వెదుక్కునేది. భర్తకు మాత్రం ఆమె శరీరంతో తప్ప, మనసుతో సంబంధం ఉండేది కాదు. ప్రేమగా మాట్లాడేవాడు కూడా కాదు. కేవలం తన కోరికల్ని తీర్చే సాధనంగా భావించి చిత్ర హింసలకు గురిచేసేవాడు. ఆ విధంగా 17 ఏళ్లకే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది షెర్రీ. అతనితో విసిగిపోయిన షెర్రీ విడాకులకు దరఖాస్తు చేసి 19 ఏళ్ల వయసులో ఆ నరకం నుంచి బయటపడింది. రెండో‘సారీ’... మోడువారిన జీవితం చిగురిస్తుందనే ఆశతో.. విడాకులు తీసుకున్న తర్వాత 37 ఏళ్ల వయసున్న మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ ఆమె ఆశ ఆవిరైంది. అతను కూడా మొదటి భర్త మాదిరిగానే శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. పిల్లల కోసం అదంతా మౌనంగా భరించింది. 27 ఏళ్ల వయసుకే ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిల బాధ్యత ఆమెకు అనేక కష్టాలను తెచ్చిపెట్టింది. మౌనం వీడి.. పోరాటానికి సిద్ధపడి తనకు అన్యాయం జరగటానికి ఒక విధంగా తన మౌనమే కారణమని భావించిన షెర్రీ.. ఇకనైనా పోరాట పంథా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. గత ఐదేళ్లుగా అందుకోసం శ్రమిస్తూనే ఉంది. ఆమె ప్రయత్నాలు ఫలించినట్లయితే ఎంతో మంది చిన్నారులు వివాహమనే చెర నుంచి విముక్తులవుతారు. ఫ్లోరిడా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. మైనర్ వివాహాలను అరికట్టేందుకు చట్టం చేసే మొదటి రాష్ట్రంగా నిలవబోతోంది. ఆత్మకథతో ప్రయాణం... బిల్లు ఆమోదం పొందినట్లయితే తన ఆత్మకథ..‘ఫర్గివింగ్ ద అన్ఫర్గివబుల్ ’ను నాటక రూపంలో ప్రదర్శించాలనే యోచనలో ఉన్నారు. అలాగే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బస్ టూర్ ప్లాన్ చేసి, బడ్జెట్‌ను కూడా నిర్ణయించేశారు. ఇందుకోసం తన స్నేహితురాలు లారెన్ బుక్ సహాయం తీసుకుంటున్నారు. - సుష్మారెడ్డి యాళ్ళ -
నచ్చిన వ్యక్తిని పెళ్లాడే స్వేచ్ఛ మహిళకు ఉంది
న్యూఢిల్లీ: నచ్చిన వ్యక్తిని వివాహమాడటంతో పాటు ఇష్టమున్న చోట నివసించే స్వేచ్ఛ వయోజన మహిళకు ఉంటుందని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. తమ సోదరి దయవంతిని గుజరాత్ నుంచి అపహరించారని, ప్రస్తుతం ఆమె హరియాణాలో జగదీశ్ అనే వ్యక్తితో బలవంతంగా ఉంటోందని యువతి కుటుంబ సభ్యులు సుప్రీంను ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏంఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం.. దయవంతికి సమన్లు జారీచేసింది. దీంతో సోమవారం విచారణకు హాజరైన దయవంతి.. తాను ఇష్టపూర్వకంగానే జగదీశ్‌తో ఉంటున్నట్లు స్పష్టం చేశారు. దయవంతి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టేసింది. ఎవరితో, ఎక్కడ ఉండాలో నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ ఓ మహిళకు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘సీసీటీవీ’ల ఏర్పాటుపై కేంద్రానిది నిర్లక్ష్యం.. న్యూఢిల్లీ: కోర్టులు, ట్రిబ్యునళ్లలో కేసుల విచారణను వీడియో రూపంలో రికార్డు చేసేందుకు సీసీటీవీల్ని ఏర్పాటుచేసే విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సుప్రీంకోర్టు విమర్శించింది. ట్రయల్ కోర్టులు, ట్రిబ్యునళ్లలో పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటుచేసిన సీసీటీవీల పనితీరును సమీక్షించిన తర్వాత మిగతా కోర్టుల్లో వీటిని వినియోగించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ‘ఈ విషయంలో మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ట్రయల్ కోర్టులు, ట్రిబ్యునళ్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీలపై స్థితి నివేదికను మాముందు ఉంచండి’ అని జస్టిస్ ఆదర్శ్ గోయల్, జస్టిస్ యు.యు.లలిత్‌ల ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కేసు విచారణలో సాయపడేందుకు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రాను అమికస్ క్యూరీగా నియమించింది. -
నా భర్తకు ఇష్టం లేకుండా.....
లీగల్ కౌన్సెలింగ్ జైపూర్ చుట్టూ తిప్పుతున్నాడు... ఏం చేయాలి... నాకు, నా భార్యకు చెప్పుకోదగ్గ పెద్ద గొడవలేమీ లేవు గానీ... తరచూ పుట్టింటికి వెళ్లిపోతుంటుంది. నేను ఎన్నిసార్లు వారించినా, హెచ్చరించినా వినిపించుకోలేదు. పెపైచ్చూ ఆమె ఎన్నాళ్లు అక్కడ ఉండాలనుకుంటే అన్నాళ్లు అక్కడ ఉండి సావకాశంగా తిరిగి వస్తుంటుంది. దీనివల్ల పిల్లల చదువులు పాడవుతున్నాయి. నాకు చెప్పలేనంత చిరాగ్గా, కోపంగా ఉంటోంది. నాకు ఈ కారణం వల్ల విడాకులు మంజూరవుతాయా? - సూర్యకుమార్, విజయవాడ మీ ప్రశ్నలో డిసర్షన్ గురించి ప్రస్తావించారు. హిందూ వివాహచట్టం 13 (1)లో దీని గురించి కూలంకషంగా వివరించడం జరిగింది. మీ ఇద్దరి మధ్య ఉన్నవి సరిదిద్దుకోలేనంత పెద్ద సమస్యలు, పొరబాట్లు కాదని, విడాకులకు అప్లై చేయాల్సినంత పెద్ద గొడవలు లేవని మీరు చెబుతున్న దాన్నిబట్టి తెలుస్తోంది. 13(1) ప్రకారం విడాకులకు అప్లై చేసేనాటికి కంటిన్యువస్‌గా రెండు సంవత్సరాలు భర్తను భార్యగానీ, భార్యను భర్తగాని విడిచి విడిగా జీవిస్తుంటే దాన్ని డిసర్షన్గా పరిగణిస్తూ డైవోర్సు అడగవచ్చు. కానీ మీ కేసులో ఆమె వస్తూపోతూ ఉంది. మీతో సంసారం చేస్తూ మీ మీ కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉంటోంది. కాబట్టి మీరు విడాకులు అడగటానికి సరైన కారణం లేదు. మీరు మీ అత్తమామలను పిలిపించి, ఆమెను కూర్చోబెట్టి మీకు నచ్చని విషయాలు ప్రస్తావించి ఆమె ప్రవర్తనను మార్చుకొమ్మని చెప్పండి. చిన్న చిన్న విషయాలకు విడాకుల కోసం కోర్టులకెక్కి సంసారాన్ని పాడుచేసుకోవద్దు. మంచిగా మాట్లాడుకుని సయోధ్యతో సమస్యను పరిష్కరించుకుని ఆనందంగా జీవించండి. నాకు పెళ్లయి పదేళ్లు అయ్యింది. నా భర్తకు ఇష్టం లేకుండా ఆయన తల్లిదండ్రులు నన్ను ఆయనకిచ్చి వివాహం చేశారు. నాకు పెళ్లిలో పెట్టిన డబ్బు, నగలు, వెండి మొదలైన విలువైన వస్తువులు నాకు తెలియకుండా తీసుకుని నా భర్త ఎనిమిదేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఇప్పటివరకు తిరిగిరాలేదు. నిజానికి మా అత్తమామలు ఎంతో మంచివాళ్లు. ఒక్కటే సంతానం కావడం వల్ల అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కానరాకపోవడంతో వారూ తల్లడిల్లిపోయారు. ఇప్పుడు విసిగిపోయి ఎదురుచూడటం వృథా అని అర్థం చేసుకున్నాం. విలువలేని ఈ బంధానికి ముగింపు ఇచ్చి నా తల్లిదండ్రులు, అత్తమామ నిశ్చయించారు. నేనెలా ప్రొసీడ్ అవ్వాలి? - రాణీరెడ్డి, నిజామాబాద్ మీ జీవితంలో మీరు చిన్నవయసులోనే దురదృష్టవశాత్తు చే దు అనుభవాలను చవిచూశారు. ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నారు. ‘‘నాట్ హర్డ్ ఫర్ సెవన్ ఇయర్స్’’ అనేది విడాకులకు గ్రౌండ్‌గా చూపిస్తూ, మీకు... ఆయనకు మధ్య సంసారం జరగలేదని, పెళ్లైన ఎన్ని రోజులకు మిమ్మల్ని విడిచి వెళ్లిపోయారో కూలంకషంగా వివరిస్తూ మీరు మీ లాయర్ ద్వారా విడాకులకు పిటీషన్ ఫైల్ చేయండి. కొద్దికాలంలోనే విడాకులు గ్రాంట్ అయ్యక, మీరు పునర్వివాహం చేసుకుని ఆనందంగా జీవించండి. ఇదొక విచిత్రమైన సమస్య. నా కూతుర్ని మా బంధువులకు దత్తతకు ఇచ్చాను. మాది ఆర్థికంగా ఉన్నత కుటుంబం కాదనీ... మా బంధువులు కోటీశ్వరులని, పిల్లలు లేక బాధపడుతున్నారని మా బంధుమిత్రుల ప్రోద్బలంతో వారి మాటలు విని నా కూతుర్ని పెంపకానికి ఇచ్చాను. నా కూతురు ఇంకా మైనరు. వారు లీగల్‌గా అడాప్షన్ తీసుకుని రెండేళ్లు పెంచుకున్నాక వారికి సంతానం కలగడం వల్ల నా కూతుర్ని తెచ్చి మళ్లీ నా దగ్గరే వదిలివెళ్లారు. అప్పుడే అనుకోని పరిస్థితుల్లో నా భర్త చనిపోయారు. నా ముగ్గురి పిల్లలతో పాటు నేను పెంపకానికి ఇచ్చిన ఈ పాప బాధ్యత కూడా నామీదే పడింది. నేనెక్కువ చదువుకోలేదు. ఉద్యోగం, ఆస్తీపాస్తీ లేవు. నా ముగ్గురు పిల్లల్ని చూసుకోవడమే కష్టమంటే ఈ పాప బాధ్యత కూడా ఇప్పుడు నాపైనే ఉంది. లీగల్‌గా నేనేమీ చేయలేనా? నేను దత్తత ఇచ్చిన కూతురికి, ఆ దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఆస్తిపాస్తుల మీద ఏమీ హక్కులు లేవా? - శాంతకుమారి, విజయవాడ మీ బాధ అర్థమైంది. లీగల్‌గా అడాప్షన్ తీసుకుని ముచ్చట తీరేదాకా ఉంచుకుని, తీరా వారికి సంతానం కలిగేసరికి పాపను తిరిగి మీ ఇంట్లో దింపి వెళ్లడం ఏమీ బాగోలేదు. అడాప్టెడ్ పేరెంట్స్ పాపను అలా వదిలివేయలేరు. వారికి ఆ హక్కు లేదు. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ సెక్షన్ 20 కింద మీరు మీ పాపకోసం మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయవచ్చు. ఆ పాపకు తప్పక మెయింటెనెన్స్ వచ్చి తీరుతుంది. లీగల్‌గా అడాప్షన్ తీసుకున్నారు కాబట్టి ఆ పాపకు మెయింటెనెన్స్ మాత్రమే గాక, పెరిగి పెద్దయ్యే వరకు చదువుల ఖర్చులు పెంపకానికి తీసుకున్న తల్లిదండ్రులే చూసుకోవాల్సి ఉంటుంది. ఆ పాప పెళ్లి ఖర్చులు కూడా వాళ్లే భరించాల్సి ఉంటుంది. పెంపకానికి పోయిన పాపకు అందరు న్యాచురల్ డాటర్స్‌కు ఉండే హక్కులే ఉంటాయి. మీరు మెయింటెనెన్స్ కేసు వేసి ఆ కేసు డిస్పోజ్ అయ్యేవరకు ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇవ్వమని ఒక ఐ.ఏ. వేసుకుంటే... కేసు తేలేవరకు జడ్జీగారు ఇంటరిమ్ మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తారు. పాప చదువుసంధ్యలు, మెయింటెనెన్స్‌కు ఇబ్బంది ఉండదు. తల్లిదండ్రుల ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఈ మెయింటెనెన్స్ డిసైడ్ చేస్తారు. వారు ఎలాగూ కలిగిన వారంటున్నారు. కాబట్టి పాపకు మంచి మెయింటెనెన్స్ వస్తుంది. దిగులు పడకండి. నా భర్త కారణం లేకుండా నాకు వ్యతిరేకంగా ఉన్నవీ లేనివీ కల్పించి నన్ను పుట్టింటికి తరిమేసి ఇప్పుడు జైపూర్ కోర్టులో (ఆయన ఉద్యోగం చేస్తున్న ప్రదేశం) డైవోర్సు కేసు ఫైల్ చేశాడు. నేను ప్రతిసారీ జైపూర్ కోర్టుకు అటెండ్ అవ్వలేను. పైగా భాషా సమస్య. నా కాపురాన్ని నిలబెట్టుకోడానికి నేనేం చేయాలి? నాకు విడాకులు వద్దు. నా పిల్లల కోసమైనా నేను నా భర్తతో కలిసి ఉండాల్సిన పరిస్థితిన నాది. నేనేం చేయాలి? - పి. లత, ఆదిలాబాద్ మీరు వెంటనే మీరుంటున్న ప్రదేశంలోని కోర్టుకు మీ కేసును ట్రాన్స్ఫర్ చేయమని కోరుతూ సుప్రీం కోర్టులో ట్రాన్స్ఫర్ పిటీషన్ దాఖలు చేయండి. మీ అడ్వకేటు ద్వారా మీరిప్పుడు నాకు చెప్పిన కారణాలన్నీ వివరిస్తూ ట్రాన్స్ఫర్ పిటీషన్ అప్లై చేయండి. మీ పిటీషన్ తప్పక ఆమోదం పొంది, మీరు ప్రస్తుతం నివసిస్తున్న ప్రదేశానికి కేసు ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు ఆ కోర్టులో మీ అడ్వకేటు ద్వారా కౌంటర్ దాఖలు చేస్తూ విడాకుల పిటిషన్ డిస్మిస్ చేయమని కోర్టువారిని కోరండి. -
అక్కడ హిందూ మహిళలకు నరకం
కరాచి: పాకిస్తాన్లో హిందువులు, ముఖ్యంగా మహిళలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. వారిపై కొనసాగుతున్న అత్యాచారాలను అంతులేకుండా పోతోంది. బలవంతపు మత మార్పిడులకు, అత్యాచారాలకు, కిడ్నాప్‌లకు గురవుతున్నారు. జీవితాంతం సెక్స్ బానిసలుగా బతుకీడుస్తున్నారు. దీనికి ప్రధాన కారణం... పాకిస్తాన్లో హిందువుల వివాహానికి చట్టమంటూ లేకపోవడమే. అక్కడి హిందూ మహిళలెవరూ తమకు పెళ్లయిందని నిరూపించుకోలేరు. ఈ కారణంగా భర్త మరణిస్తే అతని పేరిట ఉన్న ఆస్తులేవీ భార్యకు దక్కవు. భర్తపోతే రోడ్డున పడాల్సిందే. లేదా మత మార్పిడి చేసుకొని ఓ ముస్లిం వద్ద నాలుగో భార్యగానో, ఐదో భార్యగానో బానిస బతుకు బతకాల్సిందే. స్వాతంత్య్రానంతరం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా పాక్‌లో హిందువుల వివాహ చట్టం కోసం అటు పాకిస్తాన్ ప్రభుత్వంగానీ, ఆ దేశంతో ప్రజా సంబంధాలను బలంగా కోరుకుంటున్నామని పదే పదే చెప్పే భారత ప్రభుత్వంగానీ చిత్త శుద్ధిగా ఎలాంటి చ ర్యలు తీసుకోలేదు. 2008, 2011, 2012లలో హిందూ వివాహ చట్టం కోసం పాకిస్తాన్ పార్లమెంట్ బిల్లులు తీసుకొచ్చింది. అయితే సంకుచిత రాజకీయాల కారణంగా ఆ బిల్లులు పార్లమెంట్ ఆమోదానికి నోచుకోలేదు. ఈ ఏడాది గత జూలై నెలలో మరోసారి బిల్లును పాకిస్తాన్ పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చినా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే మూలన పడేసింది. పాకిస్తాన్‌తో చర్చలకు అవకాశం వచ్చినప్పుడల్లా భారత ప్రభుత్వం రాజకీయ ఎజెండాకే ప్రాధాన్యత ఇచ్చింది తప్పా పాక్‌లోని హిందువుల పరిస్థితికి ఏనాడు ప్రాధాన్యత ఇవ్వలేదు. అక్కడ అరాచకాలను తట్టుకోలేక భారత్ శరణుజొచ్చిన హిందువుల కుటుంబాలకు కాందిశీకుల కింద ఢిల్లీలో ఆశ్రయం ఇచ్చిందేతప్పా వారికి పౌరసత్వం కూడా ఇవ్వలేదు. హిందువులు ఎక్కువగా ఉంటున్న సింధు రాష్ట్రంలో కూడా వివాహ చట్టం లేకపోవడం వల్ల హిందూ మహిళలు దారుణ పరిస్థితులను ఎదొర్కుంటున్నారని ప్రముఖ చరిత్రకారుడు సురేందర్ కొచ్చార్ తెలియజేశారు. కనీసం హిందువులకు పాకిస్తాన్‌లోని ‘నేషనల్ డేటాబేస్ రెగ్యులేషన్ అథారిటీ’ కింద గుర్తింపు కార్డులు పొందే అవకాశం కూడా లేదని రహీం యార్ ఖాన్ సిటీలోని హైకోర్టు అడ్వకేట్ అమర్ నదీమ్ తెలిపారు. నదీప్ పాకిస్తాన్‌లోని మైనారిటీల పట్ల ప్రభుత్వ న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. -
నా భర్త ఓ అపరిచితుడు
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తో, వేరేవేరే కారణాల వల్లో గొడవలు వస్తే... రాజీపడి, సర్దుబాటు చేసుకుని, సరిదిద్దుకుని, వాటిని పరిష్కరించుకోవచ్చు. కానీ కాంప్రమైజ్‌కు కూడా అవకాశం ఇవ్వని దురదృష్టకర సంఘటనలు జరిగితే మాత్రం అవి దారుణమైన పర్యవసానాలకు దారితీస్తాయి. జీవితాన్నే తలకిందులు చేస్తాయి. ఇలాంటప్పుడు విడిపోవడమే ఆరోగ్యకరమైన పరిష్కారమేమో ననిపిస్తుంది. ప్రశ్న - జవాబు మా పెళ్లయ్యి ఏడు సంవత్సరాలయింది. మాది ఎంతో అన్యోన్యమైన దాంపత్యం. మంచి ఉద్యోగాలు. నా భర్త నన్నూ, పాపనూ ఎంతో ప్రేమగా చూసుకునేవారు. కానీ నా జీవితంలో దిగ్భ్రాంతికి లోనయ్యే సంఘటన జరిగింది. నా నమ్మకం, విశ్వాసం దెబ్బతిన్నాయి. నేను తీవ్రమైన మానసిక వేదనకు గురై, ప్రస్తుతం మానసిక వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స తీసుకుంటున్నాను. మనుషుల మీద అంటే మగవాళ్ల మీద నమ్మకం పోయింది. విషయం ఏమిటంటే మా పక్కింట్లో ఉండే దంపతులకు ఒక చిన్న పాప ఉంది.వయసు ఎనిమిదేళ్లుంటాయి. అంకుల్ అంకుల్ అంటూ మా వారికి బాగా చేరిక అయింది. రోజూ మా ఇంటికి వస్తూ పోతూ ఉండేది. ఒకరోజు నేను ఇంట్లోలేని సమయంలో పాప వచ్చిందట. మా వారిలో మృగాడు మేల్కొన్నాడు. కూతురులాంటి పాపను పాశవికంగా చిదిమి వేశాడు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ప్రస్తుతం జైలులో ఉన్నాడు. నాకు వాడి ముఖం చూడ టం కూడా ఇష్టం లేదు. నా పాపపై వాడి నీడ కూడా పడకూడదు. ఆ పశువు చేతుల్లో నా పాపకు కూడా రక్షణ ఉండదు. నేను వైద్యశాలలో ఇన్‌పేషెంట్‌గా ఉండి లెటర్ రాస్తున్నాను. దయచేసి మార్గం సూచించండి. - ఒక సోదరి, హైదరాబాద్ మీకు నా సానుభూతి తెల్పుతున్నాను. పొదరిల్లు లాంటి మీ జీవితం ఒక్క సంఘటనతో ఎలా కూలిపోయిందో తెలుస్తుంది. మీ భర్త పైశాచికానికి మీ మనసెంతగా విలపిస్తున్నదో అర్థమవుతోంది. మీరు నిశ్చింతగా విడాకులు తీసుకోండి. దానితోపాటు పాప కష్టడీ కూడా. హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 13(2) (జీఠి) భార్య మాత్రమే విడాకులు పొందడానికి గల అదనపు గ్రౌండ్స్ గురించి వివరిస్తుంది. భర్త ఇతర స్త్రీల మీద అత్యాచారం చేసినా, పశువులతో సంపర్కం చేసినా, అసహజ లైంగిక చర్యలకు పాల్పడినా (సొడోమి) భార్య విడాకులు పొందవచ్చు. దీనితోపాటు మిమ్ములను తీవ్రమైన వేదనకు గురి చేశారు కనుక క్రూయల్టీ కూడా ఒక కారణమవుతుంది. వెంటనే విడాకులకు అప్లై చేయండి. నా వివాహమై పది సంవత్సరాలు అయింది. నా భర్త హుసేన్. మాకిద్దరు సంతానం. ఇద్దరూ ఆడపిల్లలే, వాళ్లు పుట్టినప్పటినుంచి మావారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇద్దరూ ఆడపిల్లల్ని కన్నానని నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం మాది. పిల్లలను చక్కగా పోషించే స్తోమత ఉంది. కాని నా భర్త చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఎన్నోసార్లు నాపై చేయి చేసుకున్నారు. నేను టీచర్‌గా పని చేస్తున్నాను. రెండేళ్లనుంచి పైసా కూడా ఖర్చుపెట్టడం మానేశారు. అదేమంటే నీ జీతంతో సర్దుకుపో అంటున్నారు. ఏమిటా అని ఎంక్వయిరీ చేయిస్తే, అతను మరో వివాహం చేసుకున్నాడని తెలిసింది. అదేమంటే తను నాలుగు వివాహాలు చేసుకోవచ్చని వాదిస్తున్నారు. నాపై, పిల్లలపై వేధింపులు ఎక్కువైనాయి. తాగివచ్చి విపరీతంగా కొడుతున్నారు. పిల్లలు తండ్రంటేనే భయపడుతున్నారు. నాకు అతనితో ఉండాలని లేదు. విడాకులిమ్మంటే ఇవ్వడు. ప్రవర్తన మార్చుకోమంటే మార్చుకోడు. నన్నేం చేయమంటారు? మార్గం చెప్పండి. - రజియా, హైదరాబాద్ మీరు మానసికంగా, శారీరకంగా ఎంతో ఆవేదనకు లోనై ఈ నిర్ణయం తీసుకున్నారని అర్థమౌతోంది. ముస్లిం వివాహాలు, విడాకులు చాలా సంక్లిష్టమైనవి. మగవారికి ఎన్నో రకాల తలాక్‌లు ఉన్నాయి. కానీ ముస్లిం మహిళలు విడాకులు కావాలంటే కోర్టును ఆశ్రయించి పొందడానికి ఉన్న చట్టమే డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1939. కేవలం వివాహిత ముస్లిం మహిళలు మాత్రమే ఈ చట్టం ద్వారా విడాకులు పొందవచ్చు. ఈ చట్టాన్ని అనుసరించి విడాకులు పొందాలంటే, కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి. కుటుంబాన్ని పోషించకుండా ఉంటే, అది కూడా విడాకులకు సహేతుక కారణమవుతుంది. మీ విషయంలో మీ భర్త గత రెండు సంవత్సరాలనుండి మిమ్మల్ని పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. చట్టంలో కూడా రెండు సంవత్సరాలనుండి భార్యాపిల్లల పోషణ బాధ్యత వహించకుండా నిర్లక్ష్యం చేస్తే అది విడాకులకు కారణమవుతుందని చెప్పారు. అంతేకాకుండా తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులకు గురి చేసినా అది కూడా విడాకులకు సహేతుకమైన కారణమవుతుందని చట్టంలో చెప్పారు కనుక మీరు ఈ చట్టాన్ని అనుసరించి రెండు కారణాలతో విడాకులకు అప్లై చేసుకోవచ్చు. ధైర్యంగా ఉండండి. ఒకవేళ మీ భర్త ఒప్పుకుంటే, కోర్టుకు వెళ్లకుండా మీ మతచట్టాన్ని అనుసరించి మీరిరువురూ కన్సెంట్ డైవర్స్ అంటే పరస్పర అంగీకారపూర్వకమైన విడాకులు పొందవచ్చు. మీ భర్త అంగీకరించట్లేదంటున్నారు కనక మీరు కోర్టుకు వెళ్లవలసిందే. నాకు 40 సంవత్సరాలు. నేను అవివాహితురాలిని. మా పుట్టింట్లో అన్నదమ్ముల కుటుంబాలతో కలసి ఉంటున్నాను. మేముండే ఇల్లు చాలా పాతబడి పోయింది. దానికి రిపేర్లు చేయించుకుందామంటే నా సోదరులు ఒప్పుకోవడం లేదు. నాన్నగారు వీలునామా రాయకుండా మరణించారు. నాకైతే నా పోర్షన్ నాకిస్తే దాన్ని ఆధునీకరించుకోవాలని ఉంది. నా వాటా నాకు పంచమని అడిగే హక్కు నాకు లేదా? - ఒక సోదరి, అనకాపల్లి ఉమ్మడి నివాస గృహాన్ని విభజించమని అడిగే హక్కు మీకు ఉంది. ఈ హక్కు హిందూ వారసత్వ చట్టం 2005 కేంద్ర సవరణను అనుసరించి వచ్చింది. పాత చట్టం ప్రకారం, అంటే హిందూ వారసత్వ చట్టం 1986 ఉమ్మడి ఆస్తిలో మహిళలకు సమాన హక్కులున్నప్పటికీ ఉమ్మడి నివాస గృహంలో విభజన కోరే హక్కు వారికి లేదు. కొడుకులు ఆస్తి విభజన కోరే వరకు కూతుళ్లు ఆగవలసి వచ్చేది. కేంద్ర సవరణ చట్టం దీన్ని రద్దు చేసింది. దీని ప్రకారం ఆ గృహాన్ని విభజించమని కోరి, మీ భాగంలో మీ ఇష్టం వచ్చినట్లు మార్పు చేర్పులు చేయించుకోవచ్చు. ముందు మీ సోదరులను మంచిమాటలతో అడగండి. వినకుంటే కోర్టును ఆశ్రయించి, పార్టిషన్ సూట్ వేసుకోండి. కేస్ స్టడీ లాజిక్ మేజిక్ అనిత, అక్బర్లు గత 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురూ ఉన్నత విద్యావంతులు, ఆధునిక భావాలు కలవారు. మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఏ బాధ్యతలూ లేని జీవితం గడుపుతున్నవారు. ఇటీవలే వారి ప్రేమ విషయం పెద్దలకు చెప్పి, వివాహానికి అనుమతి కోరారు. ఇరువురి తలిదండ్రులూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. మతాంతర వివాహానికి ససేమిరా అన్నారు. ఎన్నో రకాలుగా నచ్చచెప్పే ప్రయత్నం చేశారు అనిత, అక్బర్లు. అనిత తలిదండ్రులు దిగి రాలేదు. బెదిరించినా, ప్రాధేయపడినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు. అక్బర్ తలిదండ్రులు కాస్త మెత్తబడ్డారు. కానీ ఒక బాంబ్ పేల్చారు. అదేమంటే ఒక ముస్లిమ్ యువకుడు హిందూ మహిళను వివాహమాడాలంటే ఆమె తప్పనిసరిగా ముస్లిం మతాన్ని స్వీకరించాలని చెప్పారు. అంతేకాకుండా వారి ‘లా’ మతాంతర వివాహాలను అంగీకరించదని, హిందువులను వివాహమాడాలంటే మతమార్పిడి తప్పనిసరి అని చెప్పారు. ఇప్పుడు విషయం అనిత నుండి సానుకూల పడాలి. ఎంత ఆధునిక భావాలున్నా, ఆమె సనాతన కుటుంబం నుండి వచ్చింది. మతమార్పిడి ఆమెకు ససేమిరా ఇష్టం లేదు. ఇరువురూ బుర్రబద్దలు కొట్టుకుని ఆలోచించి, పరిష్కారం కనిపించక, చివరకు స్నేహితుల సలహాతో న్యాయవాదిని సంప్రదించారు. న్యాయవాది వారికి ప్రత్యేక వివాహ చట్టం 1954 గురించి వివరించారు. దానినే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటారనీ, దీనిననుసరించి జరిగే వివాహాలను రిజిస్టర్ వివాహాలని సామాన్య పరిభాషలో అంటారని వివరించారు. ఈ చట్టాన్ననుసరించి భిన్నమతాలకు చెందిన వారు వివాహాలు చేసుకోవచ్చనీ, వివాహాలకు లౌకిక లక్షణం కల్పించడం ఈ చట్టం ముఖ్యోద్దేశ్యమనీ, కులం, మతం, ఆచారాలతో సంబంధం లేకుండా వివాహం చేసుకోవచ్చనీ, ఈ వివాహాలకు చట్టబద్ధత ఉందని, అంతేగాక న్యాయపరంగా కూడా అన్ని హక్కులు, రక్షణలూ లభిస్తాయని చెప్పారు. ఈ వివాహాలు రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిపిస్తారని చెప్పారు. అనిత, అక్బర్లు ఊపిరి పీల్చుకున్నారు. తమ ప్రేమను సుసంసన్నం చేసుకునేందుకు రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. వారి ప్రేమ కథ ఆ విధంగా సుఖాంతం అయింది. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్