
కొట్టుకుంటూ.. పిల్లో ఫైట్ డే సెలబ్రేషన్స్
టొరంటో:
దిండ్లతో గ్రూపులు గ్రూపులుగా వచ్చి ఒకరిని ఒకరు చితకొట్టుకున్నారు. ఏడవ అంతర్జాతీయ పిల్లో ఫైట్ డే సందర్భంగా దిండ్లతో ఈ విధంగా కొట్టుకున్నారు. కెనడాలోని టొరంటోలో అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో వచ్చిన యువతీ యువకులు ఎవరు కనబడితే వారిని ఇష్టమోచ్చినట్టు కొడుతూ ఈ ఫైట్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు.
అంతర్జాతీయ పిల్లో ఫైట్ డేను లండన్లాంటి నగరాలతో పాటూ ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా నగరాల్లో జరుపుకున్నారు.