30న ఫ్లాష్‌మాబ్‌ | Flash mob on 30th July | Sakshi
Sakshi News home page

30న ఫ్లాష్‌మాబ్‌

Published Wed, Jul 20 2016 8:21 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

30న ఫ్లాష్‌మాబ్‌

30న ఫ్లాష్‌మాబ్‌

 
నెల్లూరు(అర్బన్‌): బ్రెస్ట్‌ కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు గానూ ఈ నెల 30వ తేదీన ఎంజీబీ మాల్లో ఫ్లాష్‌ మాబ్‌ను నిర్వహించనున్నట్లు భార్గవ్‌ హెల్త్‌ప్లస్‌ అధినేత చంద్రశేఖర్‌రెడ్డి, నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ వినయ్‌కుమార్‌ తెలిపారు. ఫ్లాష్‌ మాబ్‌కు సంబంధించిన పోస్టర్లను నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాలలో బుధవారం ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. అక్టోబర్‌లో పింక్‌ రిబ్బన్‌ వాక్‌ను నిర్వహించనున్నామని చెప్పారు. 25 వేల మందితో నిర్వహించేందుకు భార్గవ్‌ హెల్త్‌ ప్లస్‌ ప్రణాళికను సిద్ధం చేస్తోందని చెప్పారు. ఎంజీబీ మాల్‌ డీజీఎం రవికిరణ్, నీరూస్‌ ఫ్రాంచైజ్‌ యజమాని నిఖిల్‌రెడ్డి, ఈవీఎస్‌ నాయుడు, భాస్కర్‌నాయుడు, కళాశాల ప్రిన్సిపల్‌ జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement