![Armed Robbery In UP Shoot Shop Owner Escape With Cash And Gold - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/7/cash.jpg.webp?itok=uwQyN4Kt)
లక్నో: సినిమాలో విలన్ మాదిరి దోపిడికి చేసి డబ్బు నగలతో పరార్ అయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో బులందష్‌హర్‌లో చోటు చేసుకుంది. ఇద్దరు దుండగులు ఒక దుకాణంలోకి చొరబడి యజమానిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అక్కడ ఉన్న వారందర్నీ తుపాకితో బెదిరిస్తూ దర్జాగా కౌంటర్ దగ్గరికి వెళ్లి బ్యాగ్ నిండా డబ్బు, నగలు పెట్టుకుని పరారయ్యారు.
వెళ్తు వెళ్తూ అక్కడే ఉన్న ఒక మహిళా కస్టమర్ బ్యాగ్‌ని కూడా లాక్కుని పారిపోయారు. ఈ ఘటన మొత్తం సీసీఫఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అంతేగాదు పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment