రెండేళ్ల తమ్ముడిని కాల్పి చంపిన మూడేళ్ల సోదరి!
Published Mon, Apr 21 2014 5:40 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
లాస్ ఎంజెలెస్: ప్రమాదవశాత్తు రెండు సంవత్సరాల తమ్ముడిని రైఫిల్ తో మూడేళ్ల అమ్మాయి కాల్చిన సంఘటన యూఎస్ లో సంచలనం రేపింది. ఇలాంటి హత్య ఘటనలో పిల్లలు కారణం కావడం ఈ నెలలో నాలుగవ ఘటన. ఈ ఘటన శుక్రవారం ఉటాలోని క్యాచే కౌంటీలో చోటు చేసుకుంది. రెండేళ్ల తమ్ముడిని పొట్టలో .22 కాలిబర్ రైఫిల్ తో కాల్చి చంపినట్టు తెలిసింది.
కాల్పుల శబ్దం విన్న తల్లి సహాయం కోసం కేకలేయడంతో బాలుడ్ని లోగన్ రిజినల్ ఆస్పత్రికి తరలించారు. ఆతర్వాత సర్జరీ సాల్ట్ లేక్ సిటీలోని ప్రైమరీ చిల్డ్రన్ ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు.
మరణాయుధాలు పిల్లలకు అందుబాటులో ఉంచకూడదని క్యాచే కౌంటీ షెరీఫ్ లెఫ్టినెంట్ మైక్ పీటర్సన్ స్థానిక మీడియాకిచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇది చాలా దారుణ సంఘటన. తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి దుర్ఘటనలను అరికట్టవచ్చని మైక్ తెలిపారు. ఇటీవల సౌత్ కారోలినాలో ఆరేళ్ల బాలుడు ఓ మహిళను కాల్చి చంపిన సంఘటన విషాదాన్ని నింపింది. తన తండ్రితో కారులో ప్రయాణిస్తున్న బాలుడు కాల్పులు జరపడంతో ఓ మహిళకు తగిలి అక్కడికక్కడే మరణించారు.
Advertisement
Advertisement