న్యూయార్క్: అమెరికాలో విచ్చలవిడిగా తుపాకుల వాడుక సంస్కృతికి మరొకరు బలయ్యారు. ఓ ఐదేళ్ల బాలుడు ఏడేళ్ల బాలికను కాల్చిచంపాడు. ఈ విషాదకర సంఘటన బర్త్ డే పార్టీలో ప్రమాదవ శాత్తూ జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
సౌత్ కరోలినాలోని గాస్టన్లో ఓ ఇంటిలో అందరూ బర్త్ డే సంబరాల్లో మునిగితేలుతున్నారు. బాలుడు ఆడుకునేందుకు బొమ్మ తుపాకీ కోసం కారులో వెతికాడు. అయితే ఆ పిల్లాడికి తల్లి బాయ్ఫ్రెండ్కు చెందిన నిజమైన తుపాకీ దొరికింది. అందులో బుల్లెట్లు లోడ్ చేసి ఉన్నాయి. పాపం ఇవేమీ తెలియని ఆ పిల్లాడు తుపాకీ తీసుకుని సరదాగా కాల్చాడు. కారులోంచి బుల్లెట్లు దూసుకొచ్చి ఏడేళ్ల బాలికతో పాటు మరో ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించగా బాలుణ్ని మాత్రం బతికించగలిగారు. అమ్మాయి ఛాతీలో బుల్లెట్ దూసుకెళ్లడంతో చనిపోయింది. ఇదే నెలలో అమెరికాలో రెండేళ్ల బాలుడు తుపాకీతో ఆడుకుంటూ ఐదేళ్ల సోదరిని కాల్చిచంపాడు.
బాలికను కాల్చిచంపిన ఐదేళ్ల బాలుడు
Published Tue, Apr 15 2014 3:35 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement