మా తాతగారు మాకెంతో స్ఫూర్తిదాయకం | Our Grandfather The Cherished Blessing To Our Family | Sakshi
Sakshi News home page

మా తాతగారు మాకెంతో స్ఫూర్తిదాయకం

Published Fri, Sep 11 2020 12:01 AM | Last Updated on Mon, Sep 14 2020 11:04 AM

Our Grandfather The Cherished Blessing To Our Family - Sakshi

శ్యామ్‌ కృష్ణ ప్రసాద్‌ మోటూరి

తాత, మీ గ్రేట్ సెన్సాఫ్ హ్యూమర్, పాజిటివ్ యాటిట్యూడ్, నాకు సులువుగా చెస్ నేర్పించిన తీరు, నన్ను ఎల్లప్పుడూ నవ్వించే విధానం నాకు చాలా ఇష్టం అందుకే మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. ఐ లవ్ యూ తాత. మీకు 67వ పుట్టినరోజు శుభాకాంక్షలు - శ్రేయస్ - మనుమడు.

శ్యామ్‌ కృష్ణ ప్రసాద్‌ మోటూరి, మా తాతగారు, 1953 సెప్టెంబర్‌ 11న ఆంధ్రప్రదేశ్‌లోని సికినాలలో రాఘవమ్మ - రామచంద్రయ్యగారి దంపతులకు జన్మించారు. వృత్తిపరంగా ఇంగ్లీష్‌ టీచర్‌ అయిన తనకు ఆంగ్ల భాష పట్ల, వ్యాకరణం పట్ల మక్కువ ఎక్కువ. విద్యార్థులు ఇంగ్లీష్‌ నేర్చుకోవడం కోసం ఇ‍బ్బంది పడకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా, సరళంగా వివరించేవారు. అందులో ఉన్న మెలుకువలను వారికి నేర్పించి ఇంగ్లీష్‌ భాష పట్ల వారిలో ఉన్న భయాలను తొలగించేవారు. కేవలం చదువు మాత్రమే చెప్పి చేతులు దులుపుకునే వ్యక్తిత్వం కాదు తనది. అందుకే పుస్తకంలో ఉన్న పాఠాలతో పాటు ఎన్నో జీవితపాఠాలను కూడా విద్యార్థులకు  నేర్పించేవారు. జీవితంలో ఎలా ఎదగాలి, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాటిని ఎదర్కొంటూ జీవితంలో పోరాడి ముందుకు ఎలా సాగాలి అనే విషయాలను కూడా చిన్ననాటి నుంచే తన విద్యార్థులకు చెప్పేవారు. తన బోధనలు కేవలం స్కూల్‌లో మార్కులు తెచ్చుకోవడానికే కాకుండా జీవితంలో ఎదురయ్యే పరీక్షలను జయించడంలో ఎంతో ఉపయోగపడతాయి. (Advertorial)

తను ఎన్నో విషయాలలో మాకు స్ఫూర్తిదాయకం. నాటకాలపట్ల తనకున్న ఆసక్తితో మహాభారతంలో శక్తిమంతుడైన భీముని పాత్రలు వేసి తన నటనతో అందరి మన్ననలు పొంది వారిచే, కళామతల్లి బిడ్డగా పేరు పొందిన ఓ గొప్ప కళాకారుడు. అంతేకాక, జిల్లా, డివిజినల్‌ స్థాయిలో అనేక క్రీడా టోర్నమెంట్లు నిర్వహించి శారీరక ధృఢత్వంపై తన ఆసక్తిని కనబరిచారు. గొప్ప నైపుణ్యాలు కలిగిన వ్యక్తిగా జీవితంలో అనుక్షణం కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవాలని తపన పడుతూ ఉంటారు. ఇప్పటికి 5 (తెలుగు, ఇంగ్లీష్, తమిళం, కన్నడ, హిందీ) భాషలలో తను నిష్ణాతులు అయినప్పటికీ, ఈ సంవత్సరం చివరిలోగా మొత్తం 10 భాషల్లోకి ప్రవేశించాలన్న లక్ష్యంతో ఎందరినో ఆశ్చర్యపరిచి, మరెందరికో ఆదర్శంగా నిలిచారు.

పెద్దల అక్షరాస్యత (వయోజన విద్య) కార్యక్రమంలో భాగమై, చిన్నతనంలో చదుకోవాలని ఉన్నా, పరిస్థితుల కారణంగా విద్యకు దూరమై అజ్ఞాన తిమిరంలో కొట్టుమిట్టాడుతున్న నిరక్షరాశ్యుల జీవితాలలో జ్ఞాన జ్యోతి నింపారు. జీవితంలో ఎదుగుదలకు అడ్డుతగులుతున్న విషయాలను అధిగమించడానికి విద్యావంతులుగా ఉండటం ఎంత అవసరమో వారికి వివరిస్తూ, విద్య పట్ల వారిలో ఆసక్తిని కలిగించి, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దడం అను ఈ కార్యక్రమ లక్ష్యాన్ని సాధించటానికి ఎనలేని కృషి చేసారు. కేవలం తన దగ్గరకు విధ్యాభ్యాసముకు వచ్చిన వారికి మాత్రమే కాకుండా, ఎందరో పట్టణ-పల్లెల్లో ఉన్న నిరక్షరాశ్యులకు అక్షర జ్ఞానం చేస్తున్న గొప్ప వ్యక్తి. ఎందరో ఉన్నత శిఖరాలకు చేరడానికి నిచ్చెనలా నిలిచిన మహోన్నత వ్యక్తి మా తాతగారు. తాను చేసిన కృషిని గుర్తించి విద్యా శాఖతోపాటు అనేక స్థానిక పాలక మండలి నిపుణులు తనను ప్రశంసించారు. (Advertorial)

వీటిని మించి ముఖ్యంగా తన దాతృత్వం, పాజిటివ్‌ యాటిట్యూడ్‌, పట్టుదల, కొత్త విషయాల పట్ల తనకుండే ఆసక్తి, గెలుపు-ఓటములలో సమంగా వ్యవహరించడం వంటి లక్షణాలు తనను గొప్ప వ్యక్తిగా, మా అందరికి ఆదర్శంగా నిలిచేలా చేసాయి. తానొక గుప్త రచయిత, నిస్వార్థపరులు, మంచి పేరున్న కబడ్డీ ఛాంపియన్‌, తన ఇద్దరి కుమారులకు ఆప్యాయతను పంచే ఒక గొప్ప తండ్రి, నాన్నమ్మకు అన్నింటిలో అండగా-కష్టకాలంలో కొండంత బలంగా నిలిచే తోడు, అన్ని తెలిసిన ఎంతో వినయంతో ఒదిగి ఉండే మంచి మనస్తత్వం తన సొంతం; తానే మా తాతగారు. (Advertorial)

నేను ఎదిగే కొద్ది, తను ఏర్పరుచుకున్న వారసత్వం యొక్క అంతర్భాగం మా కుటుంబం అని తెలుసుకున్నాను. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా తను ప్రేమ, ఆప్యాయతలను పంచుతారు. ఏదేమైనా, చెప్పిన ఈ కారణాలు, చెప్పలేని అనేక కారణాల ద్వారా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే…
వి లవ్‌ యూ తాతగారు.  

చెరగని చిరునవ్వే తరగని ఆభరణంగా ధరించి, అందరి మంచిని ఆకాంక్షించే వ్యక్తిత్వంతో వారి అభివృద్ధికై శ్రమించే ఉపాధ్యాయుడు మా తాతగారు శ్యామ్ కృష్ణ ప్రసాద్ మోటూరి గారికి 67వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. (Advertorial)

ఇట్లు, 
ఆశ్చర్య చకిత - మనుమరాలు, 
శ్రేయస్ - మనుమడు,
యోచన్ కుమార్ - మనుమడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement