శోకసంద్రంలో గుత్తా జ్వాల | Jwala Gutta bereaved | Sakshi
Sakshi News home page

శోకసంద్రంలో గుత్తా జ్వాల

Published Fri, Jan 2 2015 5:59 PM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

శోకసంద్రంలో గుత్తా జ్వాల

శోకసంద్రంలో గుత్తా జ్వాల

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. జ్వాల తాత, స్వాతంత్ర సమరయోధుడు గుత్తా సుబ్రమణ్యం మరణించారు. ఆయన వయసు 102 ఏళ్లు. డిసెంబర్ 30న ఆయన తుది శ్వాస విడిచారు.

సుబ్రమణ్యం కోరిక మేరకు ఆయన కళ్లు, శరీరం సాధన మెడికల్ కాలేజీకి అందజేశారు. సుబ్రమణ్యం గాంధేయవాది. ఆయన ఆశయాల మేరకు జ్వాల తండ్రి వార్దా ఆశ్రమంలో కొన్నాళ్లు గడిపారు. అక్కడే చైనా అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. జ్వాల తండ్రి తెలుగువారు కాగా, తల్లి చైనాకు చెందినవారు. జ్వాల తాత సంస్మరణ సభ శనివారం జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement