సాక్షి, హైదరాబాద్: మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతిరావు బుధవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఉపాసన ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. ‘మా తాత కె.ఉమాపతి రావు(జూన్ 15,1928- మే 27, 2020) గొప్ప విలువలు, నిస్వార్థం, మానవతామూర్తి గల వ్యక్తి. ఆయనకు హాస్య చతురత కూడా ఎక్కువే. ఉర్దూలో ఆయన రాసిన రచనల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీటీడీ తొలి ఈవోగా పనిచేశారు. అనేక గొప్ప సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి తాత’ అంటూ ఉపాసన భావోద్వేగ ట్వీట్ చేశారు. కాగా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని దోమకొండకు చెందిన ఉమాపతిరావు ఐఏఎస్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. టీటీడీ తొలి ఈవోగా సేవలందించారు.
our thatha, K.Umapathy Rao of Domakonda-IAS 15June 1928-27May 2020 was a man of great principles, selflessness, generosity & sense of humor. An Urdu Poet know for his Shayari & the first EO of TTD was a strong believer in the religion of kindness & generosity.#RestinPeace 🙏🏼 pic.twitter.com/hb4iLgDGwj
— Upasana Konidela (@upasanakonidela) May 27, 2020
Comments
Please login to add a commentAdd a comment