
మెగా కోడలు ఉపాసన ఇంట విషాదం నెలకొంది. ఆమె నానమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ఆమె చివరి వరకు ఎంతో కృతజ్ఞత, సానుభూతి, గౌరవం, ప్రేమతో నిండిన జీవితాన్ని గడిపారు. ఆమె ద్వారానే జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకున్నాను. ఆమె నన్ను పెంచి పెద్ద చేసింది. ఆమె ప్రేమను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.
నేను నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఎలాంటి ప్రేమానురాగాలను పొందానో.. ఆ అనుభూతులన్నింటిని నా పిల్లలకు అందేలా చూస్తానని మాటిస్తున్నాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఉపాసన ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం మథర్‌వుడ్‌ని ఆస్వాదిస్తూ సంతోషంగా గడుపుతున్న ఉపాసనకు ఇది నిజంగా తీరని లోటు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment