
మిచిగాన్: మనవరాలు పుట్టాడని తెలిసిన క్షణం నుంచీ ఆ పెద్దాయన మనసు మనసులో లేదు. ఎప్పుడెప్పుడు బుడ్డదాన్ని చేతుల్లోకి తీసుకుని ఆడించాలా అని తెగ ఉబలాటపడిపోతున్నాడు. కానీ కాలం బాగోలేదు.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా మహమ్మారి పట్టి పీడించేందుకు సిద్ధంగా ఉంటుంది. దీన్ని దష్టిలో పెట్టుకున్న ఆ పెద్దాయన నడక ప్రారంభించాడు. మితిమీరిన వయసును మర్చిపోయి హుషారుగా కొడుకింటికి చేరుకున్నాడు. ఈ లోకంలోకి కొత్తగా అడుగుపెట్టిన మనవరాలిని కళ్లారా చూసుకున్నాడు. కానీ తనివితీరా ఎత్తుకోలేకపోయాడు. బయట నుంచే చూసి అటునుంచి అటే వెనుదిరిగాడు హదయాలను హత్తుకున్న ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. మిచిగాన్‌లోని జోషువా గిల్లెట్‌కు కూతురు ఇలియానా జన్మించింది. (కోవిడ్ -19 విధ్వంసం : పేదరికం గుప్పిట్లోకి 40 కోట్ల మంది)
సరిగ్గా అదే సమయంలో కరోనా వ్యాప్తి నివారించేందుకు అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. కానీ ఆ తాతయ్యకు ప్రాణం అంతా చిన్నారిమీదే. అందుకే తరచూ నాలుగు మైళ్లు(ఆరు కి.మీ) నడిచి కొడుకింటికి రావడం, మనవరాలిని బయట అద్దంలో నుంచే చూసి సంతోషించడం పరిపాటైంది. దీనికి సంబంధించిన ఫొటోను జోషువా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. "నా కన్నతండ్రి, తన మనవరాలిని కనీసం తాకడానికి కూడా వీలు లేదు. ఇది నా మనసును చిత్రవధ చేస్తోంది" అని భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే ఎప్పటికప్పుడు శిశువు ఫొటోలను తన తండ్రికి పంపిస్తున్నానని చెప్పాడు. ఈ విపత్కర సమయంలో అందరూ తమతమ ఇళ్లలోనే ఉండాలని సూచించాడు. (భారత్‌కు పెరుగుతున్న డిమాండ్)
Comments
Please login to add a commentAdd a comment