వాహనం ఢీకొని తాత, మనవరాలికి గాయాలు | The vehicle will collide grandfather, manavaraliki injuries | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని తాత, మనవరాలికి గాయాలు

Published Sat, Oct 1 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

The vehicle will collide grandfather, manavaraliki injuries

హసన్పర్తి : తవేరా వా హనం ఢీకొని తాత, మ నవరాలికి గాయాలైన సంఘటన హన్మకొండ–కరీంనగర్‌ ప్రధాన ర హదారిలోని సీతంపేట క్రాస్‌ రోడ్డు వద్ద శుక్రవారం సాయంత్రం జరిగింది. కరీంనగర్‌ జిల్లా కమలాపూర్‌ మం డలం శంభునిపల్లికి చెందిన ప్రణీతారెడ్డి ఎ ర్రగట్టు క్రాస్‌ వద్ద ఉన్న ఓ ప్రైవేట్‌ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. దసరా సెలవులు ప్రకటించడంతో ఆమె తాత పెండ్యాల శ్రీనివాస్‌రెడ్డి పాఠశాలకు వచ్చాడు. తిరి గి ద్విచక్రవాహనంపై ప్రణీతారెడ్డిని తీసుకుని శంభునిపల్లికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న తవేరా వాహనం వారి ని ఢీకొంది. ఈ ఘటనలో శ్రీనివాస్‌రెడ్డి కాలి కింది భాగం నుజ్జునుజ్జయింది. ప్రణీతారెడ్డి తలకు బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 
 
గంట తర్వాత చేరుకున్న 108 వాహనం..
ప్రమాదం జరిగిన వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చినప్పటికీ గంట తర్వాత సంఘటన స్థలానికి చేరుకుంది. దీంతో స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. ఓ దశలో క్షతగాత్రులను ప్రైవేట్‌ వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లడానికి స్థానికులు ఉపక్రమించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement